ఆల్టో F8D ఇంజిన్‌తో రెండు ఇంధన వేరియంట్లు - పెట్రోల్ మరియు CNGతో వస్తుంది, 796cc పరిమాణంతో, 6000RPM వద్ద గరిష్టంగా 35.3kW శక్తిని ఉత్పత్తి చేస్తుంది. స్టాండర్డ్, LXi, VXi మరియు VXi ప్లస్ అనే ట్రిమ్‌లు అందుబాటులో ఉండగా, ఇందులో LXi (O) CNG ఎంపిక టాప్-స్పెక్ వేరియంట్‌గా ఉంటోంది. ఈ లైన్-అప్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లేనప్పటికీ, సింగిల్ మరియు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్‌ల ఎంపిక లభిస్తుంది.
పెట్రోల్ | CNG |
ఆల్టో STD (O) | ఆల్టో LXi CNG |
ఆల్టో LXi (O) | ఆల్టో LXi (O) CNG |
ఆల్టో VXi ప్లస్ | |
ఆల్టో VXi |
మారుతి నమ్మకమైన, సరసమైన మరియు అధిక-మైలేజీతో కూడిన కార్ల కోసం ప్రసిద్ధి చెందింది మరియు ఇది విశ్వసనీయమైనది. ఆల్టో అనేది భిన్నంగా ఉండదు, ఇది మొదటిసారి కారు యజమానులకు గొప్ప ఎంపికను అందిస్తుంది. కారును కొనుగోలు చేసేటప్పుడు, మీరు ఒక కార్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండాలి, ఇది తప్పనిసరి మాత్రమే కాదు, ముఖ్యంగా ప్రమాదం జరిగినప్పుడు ఇది మిమ్మల్ని రక్షించే ఒక ఆర్థిక భద్రతా కవచం. మీరు ఎంచుకోవాల్సిన ఆప్షన్లు ఇక్కడ ఉన్నాయి:
పేరుకు తగ్గట్టుగానే సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రకృతి మరియు మానవ జోక్యంతో జరిగే విపత్తుల కారణంగా వాటిల్లే నష్టం మొదలుకొని దొంగతనం వరకు సాధారణ సంభావ్య ప్రమాదాలకు సంబంధించిన అన్ని అంశాలను కవర్ చేసే ఒక పాలసీగా ఉంటుంది. తప్పనిసరి థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ మరియు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అనేవి ఇందులో భాగంగా ఉండడమే కాకుండా, మీ స్వంత వాహనానికి జరిగిన నష్టానికి కూడా ఇది కవరేజీ అందిస్తుంది.
ప్రమాదం
పర్సనల్ యాక్సిడెంట్ కవర్
ప్రకృతి వైపరీత్యాలు
థర్డ్-పార్టీ లయబిలిటీ
యాడ్-ఆన్‌ల ఎంపిక
దొంగతనం
రోడ్డు మీద ప్రయాణించే ప్రతి వాహనానికి థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఇది థర్డ్-పార్టీ వ్యక్తికి కలిగే గాయం, వైకల్యం లేదా మరణానికి మరియు వారి ఆస్తికి జరిగిన నష్టానికి కవరేజీ అందిస్తుంది. అన్ని చికిత్సలు మరియు చట్టపరమైన ఫీజులు లాంటివి ఏవైనా ఉంటే, వాటిని ఇది చూసుకుంటుంది కాబట్టి, ప్రమాదానికి మీరే కారణమైనప్పటికీ, మీ ఆర్థిక పొదుపులకు ఎలాంటి నష్టం వాటిల్లదు. అదేవిధంగా, ఏదైనా యాక్సిిడెంట్‌లో మీరు బాధితులైతే, యాక్సిడెంట్‌కి కారణం అయిన వారి థర్డ్-పార్టీ లయబిలిటీ పాలసీ నుండి ప్రయోజనాలు అందుకోవడానికి మీరు అర్హులవుతారు.
పర్సనల్ యాక్సిడెంట్ కవర్
థర్డ్-పార్టీ ఆస్తి నష్టం
థర్డ్-పార్టీ వ్యక్తికి ఏర్పడిన గాయాలు
స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ కవర్ అనేది ఒక సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీలో సగంగా ఉంటుంది, ఇది మీ స్వంత వాహనానికి జరిగిన నష్టానికి కవరేజ్ అందిస్తుంది. వరదలు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు, తుఫానులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు లాంటివి దీనికి కారణం కావచ్చు. అల్లర్లు మరియు విధ్వంసం వంటి మానవ జోక్యంతో జరిగే విపత్తులకు కూడా ఇది బాధ్యత వహిస్తుంది. యాక్సిడెంట్ నష్టాన్ని కూడా కవర్ చేస్తుంది. చివరగా, వాహనం దొంగతనాన్ని కూడా ఇది కవర్ చేస్తుంది. మీ ఆల్టో కోసం సమగ్ర కవరేజీ పొందడానికి ఒక థర్డ్-పార్టీ లయబిలిటీ పాలసీతో ఈ ప్లాన్ ఉత్తమంగా ఉంటుంది.
ప్రమాదం
ప్రకృతి వైపరీత్యాలు
అగ్ని
యాడ్-ఆన్‌ల ఎంపిక
దొంగతనం
కొత్త కారు యజమానులు తరచూ కార్ ఇన్సూరెన్స్ గురించి సరైన వివరాలు తెలియకుండానే ఒక కారుకి యజమాని అవుతారు. ఒక దీర్ఘకాలిక థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్‌ను కలపడం ద్వారా మీ అన్ని ఆందోళనలను పక్కన పెట్టే లక్ష్యంగా ఈ ప్లాన్ రూపొందింది కాబట్టి, సమగ్ర కవరేజీ నిర్ధారించడానికి వార్షికంగా రెన్యూ చేయదగిన ఓన్ డ్యామేజ్ భాగాన్ని జోడించే సమయంలో, పొడిగించబడిన వ్యవధి కోసం మీరు నిరంతరం కవర్ చేయబడతారు.
ప్రమాదం
ప్రకృతి వైపరీత్యాలు
పర్సనల్ యాక్సిడెంట్
థర్డ్-పార్టీ లయబిలిటీ
యాడ్-ఆన్‌ల ఎంపిక
దొంగతనం
మీ మారుతీ సుజుకి ఆల్టో కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది మీ వాహనాన్ని సమగ్రంగా కవర్ చేస్తుంది, సర్వసాధారణ ప్రమాదాల నుండి మీకు పూర్తి రక్షణ లభిస్తుందని ఇది నిర్ధారిస్తుంది. మీ సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింది వాటిని కవర్ చేస్తుంది:
మీరు రోడ్ మీద వాహనం నడుపుతున్నప్పుడు యాక్సిడెంట్ అనే భయం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. అది బాధాకర అనుభవం మాత్రమే కాకుండా, ఆ తర్వాత, కారును మరమ్మత్తు చేయడానికి ఆర్థికంగానూ మీకు ఇబ్బంది తప్పదు. సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీతో, మరమ్మత్తు ఖర్చులు కవర్ చేయబడతాయి.
తుఫానులు మరియు వరదలు సర్వసాధారణంగా మారడమే కాకుండా, అవి తీవ్రమైనవిగా కూడా మారాయి, మరియు వాటి కారణంగా మీ కారుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నష్టం కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా, అల్లర్లు మరియు విధ్వంసం లాంటివి కూడా మీ కారు మీద ప్రతికూల ప్రభావం చూపగలవు. అదృష్టవశాత్తూ, ఇవన్నీ మీ పాలసీ ద్వారా కవర్ చేయబడతాయి.
మీ కారు దొంగిలించబడి మరియు తిరిగి పొందలేని పక్షంలో, పాలసీ రెన్యూవల్ సమయంలో నిర్ణయించబడిన వాహనపు ఇన్సూర్ చేయబడిన డిక్లేర్డ్ వాల్యూ (IDV) మీకు లభిస్తుంది.
ముందస్తు హెచ్చరిక లేకుండానే యాక్సిడెంట్‌లు జరుగుతుంటాయి, మరియు ఇవి భౌతికంగా మరియు ఆర్థికంగా గణనీయమైన నష్టం కలిగిస్తాయి. వ్యక్తిగత యాక్సిడెంట్ కవర్‌తో, మీ చికిత్స ఖర్చులు వైద్య ప్రక్రియల ఖర్చు మొదలుకొని రోజువారీ ఖర్చుల వరకు కవర్ లభిస్తుంది.
ఏదైనా యాక్సిడెంట్‌కు మీరు కారణమైన పక్షంలో, మీ థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ అనేది బాధితునికి జరిగిన నష్టాల కోసం చెల్లించడానికి సహాయపడుతుంది, దీనికి విపర్యయంగా దిశలోనూ ఇదే సహాయం లభిస్తుంది.
మొత్తం సర్వీసుల శ్రేణిని ఆన్‌లైన్‌లోనే అందించే ఇన్సూరర్ నుండి మీ మారుతీ సుజుకీ ఆల్టో కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం లేదా రెన్యూవల్ చేయడం ఎప్పుడూ లేనంత సులభంగా ఉంటుంది. మీరు ఇప్పుడు కేవలం కొన్ని నిమిషాల్లోనే, మీ ఇంటి నుండి సౌకర్యవంతంగా మీ పాలసీని కొనుగోలు చేయవచ్చు లేదా రెన్యూవల్ చేసుకోవచ్చు.
చౌకైన, విశ్వసనీయమైన, తగిన ధరకి డ్రైవ్ అందించే కార్ యాజమాన్య అనుభవం లాంటి మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండాల్సిన విలక్షణతలన్నీ ఆల్టోకు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో వినియోగదాలను కలిగి ఉండడం, మరియు అధిక సెటిల్‌మెంట్ నిష్పత్తితో విశ్వసనీయంగా క్లెయిమ్‌లు ప్రాసెస్ చేయడం లాంటి అంశాలతో ప్రఖ్యాతి గాంచిన ఒక ఇన్సూరర్‌ను ఎంచుకోండి. ఈ విషయంలో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు తగినదో ఇక్కడ ఇవ్వబడింది:
ఏదైనా యాక్సిడెంట్ లేదా దుర్ఘటన కారణంగా మీ కారును తక్షణం మరమ్మత్తు చేయాల్సి రావచ్చు. మరమ్మత్తుల కోసం చెల్లించడానికి మీ వద్ద ఎల్లప్పుడూ నగదు ఉండకపోవచ్చు, ఇలాంటి సమయంలో నగదురహిత మరమ్మత్తు సౌకర్యం సహాయపడుతుంది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోకు భారతదేశ వ్యాప్తంగా 8700 నగదురహిత గ్యారేజీలు ఉన్నాయి, తద్వారా, మీ పై ఆర్థిక భారం పడకుండానే మీ కారు మరమ్మత్తు చేయబడుతుందని నిర్ధారించుకోండి.
దాదాపుగా 80% కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు అదే రోజు ప్రాసెస్ చేయబడుతాయి కాబట్టి, మీరు క్లెయిమ్ చేయడానికి మరియు కారు మరమ్మత్తు పూర్తి కావడానికి మధ్య చాలా తక్కువ సమయం మాత్రమే వృధా అవుతుంది.
ఏదైనా యాక్సిడెంట్ కారణంగా సంభవించిన చిన్నపాటి కారు మరమ్మత్తులు అదే రోజు రాత్రి పూర్తి చేయబడుతాయి కాబట్టి, మీరు రాత్రి బాగా నిద్రపోవచ్చు మరియు మర్నాడు ఉదయానికి మీ కారు సిద్ధంగా ఉంటుంది.
మా 24x7 రోడ్‌సైడ్ సహాయంతో, మీకోసం సహాయం అనేది కేవలం ఒక కాల్ దూరంలో ఉంటుంది.