హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో గురించి

మా ఆశయం

ఎల్లవేళలా కస్టమర్ల అవసరాలను తీరుస్తూ, వారి నిరంతర పురోగతికి దోహదపడే ఒక ఆదర్శవంతమైన ఇన్సూరెన్స్ కంపెనీగా నిలవడం.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది గతంలో రాణించిన ప్రముఖ భారతీయ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌డిఎఫ్‌సి) మరియు మ్యూనిచ్ రీ గ్రూప్ యొక్క ప్రాథమిక ఇన్సూరెన్స్ సంస్థ అయిన ఎర్గో ఇంటర్నేషనల్ AG ద్వారా ప్రోత్సహించబడింది. భారతదేశంలోని ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకు (బ్యాంక్)లో ఒకటైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లిమిటెడ్‌‌తో మరియు దానిలో హెచ్‌డిఎఫ్‌సిని విలీనం చేసిన ఫలితంగా, కంపెనీ అనేది బ్యాంకుకు ఒక అనుబంధ సంస్థగా మారింది. కంపెనీ రిటైల్ రంగంలో మోటార్, హెల్త్, ట్రావెల్, హోమ్ మరియు పర్సనల్ యాక్సిడెంట్ లాంటి జనరల్ ఇన్సూరెన్స్ ప్రోడక్టుల పూర్తి శ్రేణిని మరియు కార్పొరేట్ రంగంలో ప్రాపర్టీ, మెరైన్ మరియు లయబిలిటీ ఇన్సూరెన్స్ లాంటి ప్రోడక్టులను అందిస్తుంది. విస్తృతమైన పంపిణీ నెట్‌వర్క్‌లో విస్తరించి ఉన్న శాఖల నెట్‌వర్క్ మరియు 24x7 సపోర్ట్ టీమ్తో కంపెనీ, దాని వినియోగదారులకు అవాంతరాలు లేని కస్టమర్ సేవలను మరియు వినూత్నమైన ప్రోడక్టులను అందిస్తోంది.

శాఖలు

200+

నగరాలు

170+

ఉద్యోగులు

9700+

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో+హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో
iAAA రేటింగ్

ICRA ద్వారా 'iAAA' రేటింగ్ కేటాయించబడింది, ఇది అత్యధిక క్లెయిమ్ చెల్లింపు సామర్థ్యాన్ని సూచిస్తుంది.

ISO సర్టిఫికేషన్

మా అన్ని క్లెయిమ్ సేవలు, పాలసీ జారీ, కస్టమర్ సర్వీసింగ్ మరియు అన్ని బ్రాంచీలు, లొకేషన్లలో అనుసరించబడుతున్న ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ప్రాసెస్‌లలో ప్రామాణీకరణ, ఏకరీతి కోసం ISO సర్టిఫికేషన్.

మా విలువలు

 

మా విజన్‌ను వాస్తవం చేసుకోవడానికి మా విలువలకు అంకురార్పణ చేసి వాటిని ప్రతిరోజూ పెంచి పోషించేందుకు కట్టుబడి ఉన్నాము. మా నైతిక విధానం మరియు ఉన్నత స్థాయి సమగ్రతతో మా మాతృ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ నుండి వారసత్వంగా పొందిన 'విశ్వాసం అనే సంప్రదాయాన్ని' యథాతతంగా కొనసాగిస్తాము.

మేము చేసే ప్రతి పనిలో, తీసుకునే ప్రతి నిర్ణయంలో ఇది ప్రతిబింబించేలా చూస్తాము. మా వాటాదారులందరికీ అనగా, కస్టమర్లు, వ్యాపార భాగస్వాములు, రీ-ఇన్సూరర్లు, షేర్ హోల్డర్లు, ముఖ్యంగా ఉద్యోగుల కోసం విలువను సృష్టించి మరియు దానిని కొనసాగించేందుకు ఒక బృందంగా కృషి చేయడంలో ఇది మాకు దోహదపడుతుంది.

సెన్సిటివిటీ
మేము మా అంతర్గత మరియు బాహ్య కస్టమర్ల అవసరాలపై లోతైన విశ్లేషణ మరియు అవగాహనతో మా వ్యాపారాన్ని రూపొందిస్తాము.
ఎక్సలెన్స్
మేము ఎల్లప్పుడూ వినూత్న ఉత్పత్తులు మరియు సేవలను అందించడానికి ప్రయత్నిస్తాము మరియు ప్రతిసారీ మరింత మెరుగైన సేవలను అందించడానికి నూతన ప్రమాణాలను ఏర్పాటు చేసుకోవడానికి కృషి చేస్తాము.
ఎథిక్స్
మేము మా నిబద్ధతను గౌరవిస్తాము మరియు మా భాగస్వాములతో పారదర్శకంగా వ్యవహరిస్తాము.
డైనమిజం
మేము ప్రోయాక్టివ్‌గా ఉంటాము మరియు "చేయగలము" అనే భావనతో ముందుకు వెళతాము.
SEED

SEED

సెన్సిటివిటీ

మా అంతర్గత మరియు బాహ్య కస్టమర్ల అవసరాల గురించి సహానుభూతి మరియు లోతైన అవగాహనతో మేము మా వ్యాపారాన్ని నిర్మిస్తాము.

ఎక్సలెన్స్

మేము ఎల్లప్పుడూ వినూత్న ఉత్పత్తులు మరియు సేవలను అందించడానికి ప్రయత్నిస్తాము మరియు ప్రతిసారీ మరింత మెరుగైన సేవలను అందించడానికి నూతన ప్రమాణాలను ఏర్పాటు చేసుకోవడానికి కృషి చేస్తాము.

ఎథిక్స్

మేము మా నిబద్ధతను గౌరవిస్తాము మరియు మా భాగస్వాములతో పారదర్శకంగా వ్యవహరిస్తాము.

డైనమిజం

మేము ప్రోయాక్టివ్‌గా ఉంటాము మరియు "చేయగలము" అనే భావనతో ముందుకు వెళతాము.

మా నాయకత్వం

శ్రీ కేకి ఎం మిస్ట్రీ

Mr. Keki M MistryChairman
శ్రీ కేకి ఎం. మిస్త్రీ (DIN: 00008886) కంపెనీ యొక్క నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్. . అతను ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో సహచరుడు. అతను 1981 లో హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌డిఎఫ్‌సి) లో చేరారు మరియు 1999 లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా మరియు 2000 లో మేనేజింగ్ డైరెక్టర్‌గా 1993 లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించబడ్డారు. అక్టోబర్ 2007 లో అతను హెచ్‌డిఎఫ్‌సి యొక్క వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా మరియు జనవరి 1, 2010 నుండి వైస్ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా తిరిగి నియమించబడ్డారు. అతను ప్రస్తుతం కార్పొరేట్ గవర్నెన్స్ పై సిఐఐ నేషనల్ కౌన్సిల్ చైర్మన్ మరియు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎస్ఇబిఐ) ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రాథమిక మార్కెట్స్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు. అతను సెబీ ద్వారా ఏర్పాటు చేయబడిన కార్పొరేట్ గవర్నెన్స్ కమిటీ సభ్యుడుగా కూడా ఉన్నారు.

శ్రీమతి రేణు సూద్ కర్నాడ్

Ms. Renu Sud KarnadNon-Executive Director
మిస్. రేణు సూద్ కర్నాడ్ (DIN: 00008064) కంపెనీ యొక్క నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. శ్రీ కర్నాడ్ హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌డిఎఫ్‌సి) యొక్క మేనేజింగ్ డైరెక్టర్. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ మరియు ముంబై విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీని కలిగి ఉన్నారు. ఆమె వుడ్రో విల్సన్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్, ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ, U.S.A నుండి ఒక పర్విన్ ఫెలో. ఆమె 1978 లో హెచ్‌డిఎఫ్‌సి లో చేరారు మరియు 2000 లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించబడ్డారు, అక్టోబర్ 2007 లో హెచ్‌డిఎఫ్‌సి యొక్క జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తిరిగి నియమించబడ్డారు. శ్రీ కర్నాడ్ హెచ్‌డిఎఫ్‌సి యొక్క మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు,‌. జనవరి 1, 2010. శ్రీ కర్నాడ్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ హౌసింగ్ ఫైనాన్స్ (IUHF) యొక్క అధ్యక్షురాలు, ఇది గ్లోబల్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల అసోసియేషన్.

శ్రీ బెర్న్‌హార్డ్ స్టీన్‌రూక్‌

Mr. Bernhard SteinrueckeIndependent DIrector
మిస్టర్ బెర్న్‌హార్డ్ స్టీన్‌రూకే (DIN: 01122939) 2003 నుండి 2021 వరకు ఇండో-జర్మన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. అతను వియన్నా, బాన్, జెనీవా మరియు హైడెల్‌బర్గ్‌లలో లా అండ్ ఎకనామిక్స్ చదివారు మరియు 1980 (ఆనర్స్ డిగ్రీ)లో హైడెల్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుండి న్యాయ పట్టా పొందారు మరియు 1983లోని హాంబర్గ్ హైకోర్టులో తన బార్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. మిస్టర్ స్టీన్ రూకే డాయిచే బ్యాంక్ ఇండియా యొక్క మాజీ కో-CEO మరియు ABC ప్రైవేట్‌కుండేన్-బ్యాంక్, బెర్లిన్ బోర్డు యొక్క సహ యజమాని మరియు స్పీకర్. మిస్టర్ స్టీన్ రూకే 5 సంవత్సరాల వ్యవధి కోసం కంపెనీ యొక్క స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించబడ్డారు. సెప్టెంబర్ 9, 2016 నుండి కంపెనీ యొక్క స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించబడ్డారు మరియు సెప్టెంబర్ 9, 2021 నుండి వరుసగా 5 సంవత్సరాల అవధి కోసం స్వతంత్ర డైరెక్టర్‌గా తిరిగి నియమించబడ్డారు

శ్రీ మెహర్నోష్ బి. కపాడియా

Mr. Mehernosh B. Kapadia Independent Director
మిస్టర్ మెహర్‌నోష్ బి. కపాడియా (DIN: 00046612) కామర్స్‌లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్నారు (ఆనర్స్) మరియు ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా మరియు ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో సభ్యుడు. అతని 34 సంవత్సరాల కార్పొరేట్ కెరీర్‌లో ఎక్కువ భాగం గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (GSK)లో ఉంది, అక్కడ అతను 27 సంవత్సరాలకు పైగా పనిచేశారు. అతను డిసెంబర్ 1, 2014 నుండి GSK యొక్క సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ పదవి నుండి రిటైర్ అయ్యారు. డిసెంబర్ 1, 2014 నుండి GSK యొక్క సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ పదవి నుండి రిటైర్ అయ్యారు.. సంవత్సరాలుగా, అతను విస్తృత శ్రేణి ఫైనాన్స్ మరియు కంపెనీ సెక్రటేరియల్ విషయాలకు బాధ్యత వహిస్తున్నారు. పెట్టుబడిదారు సంబంధాలు, లీగల్ మరియు కాంప్లియెన్స్, కార్పొరేట్ వ్యవహారాలు, కార్పొరేట్ కమ్యూనికేషన్లు, అడ్మినిస్ట్రేషన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సహా అతను GSKతో తన అవధిలో ఇతర విధులకు నిర్వహణ బాధ్యతను కూడా నిర్వహించారు మరియు అనేక సంవత్సరాలపాటు కంపెనీ సెక్రటరీగా పనిచేసారు. శ్రీ కపాడియా 5 సంవత్సరాల వ్యవధి కోసం. సెప్టెంబర్ 9, 2016 నుండి కంపెనీ యొక్క స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించబడ్డారు మరియు సెప్టెంబర్ 9, 2021 నుండి వరుసగా 5 సంవత్సరాల అవధి కోసం స్వతంత్ర డైరెక్టర్‌గా తిరిగి నియమించబడ్డారు.

శ్రీ అరవింద్ మహాజన్

Mr. Arvind MahajanIndependent Director

శ్రీ అరవింద్ మహాజన్ (DIN: 07553144) కంపెనీ యొక్క స్వతంత్ర డైరెక్టర్. అతను గ్రాడ్యుయేట్ (B.Com. నుండి గ్రాడ్యుయేట్ (బి.కామ్. హాన్స్) డిగ్రీ పొందారు మరియు ఐఐఎం, అహ్మదాబాద్ నుండి మేనేజ్మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కలిగి ఉన్నారు.

శ్రీ మహాజన్‌కు మేనేజ్మెంట్ కన్సల్టింగ్ మరియు పరిశ్రమలో 35 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది. ఏఎఫ్ ఫెర్గుసన్ అండ్ కో, ప్రెస్ వాటర్‌హౌస్ కూపర్స్, ఐబిఎం గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ మరియు ఇటీవల కెపిఎంజి సహా ఈయనకి 22 సంవత్సరాల కంటే ఎక్కువ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ అనుభవం ఉంది. ప్రోక్టర్ అండ్ గాంబిల్ లో ఈయనికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మరియు మేనేజ్మెంట్ రిపోర్టింగ్ లో పారిశ్రామిక అనుభవం ఉంది.

నవంబర్ 14, 2016 నుండి 5 సంవత్సరాల వ్యవధిలో రెండవ సారి కంపెనీకి స్వతంత్ర డైరెక్టర్‌గా శ్రీ మహాజన్ నియమితులయ్యారు మరియు నవంబర్ 14, 2021 నుండి వరుసగా 5 సంవత్సరాల పాటు స్వతంత్ర డైరెక్టర్‌గా తిరిగి నియమించబడ్డారు

శ్రీ అమీత్ పి. హరియాని

Mr. Ameet P. HarianiIndependent Director
శ్రీ అమీత్ పి. హరియాణి (DIN:00087866) కార్పొరేట్ మరియు వాణిజ్య చట్టం, విలీనాలు మరియు స్వాధీనాలు, రియల్ ఎస్టేట్ మరియు రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్లపై క్లయింట్లకు సలహా ఇవ్వడంలో 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. అతను అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్లు, మధ్యవర్తిత్వాలు మరియు ప్రముఖ లిటిగేషన్లలో పెద్ద సంస్థలకు ప్రాతినిధ్యం వహించారు. అతను అంబుభాయ్ మరియు దివాంజీ, ముంబై, ఆండర్సెన్ లీగల్ ఇండియా, ముంబై మరియు హరియాణి అండ్ కో యొక్క వ్యవస్థాపకులు మరియు నిర్వహణ భాగస్వామిగా ఉన్నారు. అతను ఇప్పుడు వ్యూహాత్మక చట్టపరమైన సలహా పని చేస్తూ ఒక సీనియర్ లీగల్ కౌన్సిల్‌గా ప్రాక్టీస్ చేయడానికి మార్చబడ్డారు. అతను మధ్యవర్తిగా కూడా పనిచేస్తారు. అతను ప్రభుత్వ న్యాయ కళాశాల, ముంబై నుండి చట్టపరమైన డిగ్రీని కలిగి ఉన్నారు మరియు ముంబై విశ్వవిద్యాలయం నుండి చట్టపరమైన డిగ్రీని కలిగి ఉన్నారు. అతను బాంబే ఇన్కార్పొరేటెడ్ లా సొసైటీ మరియు ఇంగ్లాండ్ మరియు వేల్స్ లా సొసైటీ వద్ద నమోదు చేయబడిన ఒక సొలిసిటర్. ఈయన సింగపూర్ లా సొసైటీ, మహారాష్ట్ర బార్ కౌన్సిల్ మరియు బాంబే బార్ అసోసియేషన్ యొక్క సభ్యుడు. శ్రీ హరియానీ జూలై 16, 2018 నుండి 5 సంవత్సరాల వ్యవధిపాటు కంపెనీ యొక్క స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించబడ్డారు.

శ్రీ సంజీబ్ చౌధురీ

Mr. Sanjib ChaudhuriIndependent Director
శ్రీ సంజీబ్ చౌధురీ (DIN: 09565962) భారతీయ నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ మరియు రీఇన్సూరెన్స్ పరిశ్రమలో నాల్గవ సంవత్సరాలకు పైగా గొప్ప అనుభవాన్ని కలిగి ఉన్నారు. అతను 1979 నుండి 1997 వరకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో ఉన్నారు మరియు 1997 నుండి 2014 వరకు మ్యూనిచ్ రీఇన్సూరెన్స్ కంపెనీ కోసం భారతదేశానికి చీఫ్ రిప్రెజెంటేటివ్‌‌గా ఉన్నారు. 2015 నుండి 2018 వరకు, అతను పాలసీదారుల ప్రతినిధిగా IRDAI ద్వారా నామినేట్ చేయబడిన ఎగ్జిక్యూటివ్ కమిటీ, జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్‌లో సభ్యునిగా సేవలు అందించారు. శ్రీ చౌధురీ 2018 నుండి వినియోగదారు ప్రతినిధిగా IRDAI ద్వారా నామినేట్ చేయబడిన మరియు రీఇన్సూరెన్స్, పెట్టుబడి, ఎఫ్‌‌ఆర్‌బిలు మరియు Lloyd’s India గురించి నిబంధనలకు సవరణలను సిఫార్సు చేయడానికి IRDAI ద్వారా ఏర్పాటు చేయబడిన కమిటీ సభ్యుడిగా ఉన్నారు.

డాక్టర్. రాజ్‌గోపాల్ తిరుమళై

Dr. Rajgopal ThirumalaiIndependent Director
డాక్టర్ రాజ్‌గోపాల్ తిరుమళై (DIN:02253615) మూడు దశాబ్దాలకు పైగా ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్, ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ హెల్త్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్టులు, బ్రోకర్లు మరియు ప్రొవైడర్‌లతో వ్యవహరించడంలో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ నిపుణుడు. అతను యూనిలివర్ గ్రూప్‌తో దాదాపు ముప్పై సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు, చివరిగా గ్లోబల్ మెడికల్ అండ్ ఆక్యుపేషనల్ హెల్త్ ఆఫ్ యూనిలివర్ Plc కి వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసి ప్రపంచవ్యాప్తంగా 155,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగుల కోసం పాండమిక్ మేనేజ్‌మెంట్, గ్లోబల్ హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్ మరియు ఆక్యుపేషనల్ హెల్త్‌ సర్వీసులు (శారీరక మరియు మానసిక ఆరోగ్యం)తో సహా సమగ్ర ఆరోగ్య సంరక్షణలో వ్యూహాత్మక ఇన్‌పుట్‌లు మరియు నాయకత్వం అందించడానికి బాధ్యత వహిస్తారు. డాక్టర్ రాజ్‌గోపాల్ ప్రపంచ ఆర్థిక ఫోరమ్ యొక్క వర్క్‌ప్లేస్ వెల్‌నెస్ అలయన్స్ యొక్క నాయకత్వ బోర్డు సభ్యునిగా యూనిలివర్‌కు ప్రాతినిధ్యం వహించారు. అతని నాయకత్వంలో 2016 లో యూనిలివర్ గ్లోబల్ హెల్తీ వర్క్‌ప్లేస్ అవార్డును గెలుచుకుంది. ఆయన ఆగస్ట్ 2017 నుండి మార్చి 2021 వరకు అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ మరియు అపోలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లిమిటెడ్ స్వతంత్ర డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. అతను ఏప్రిల్ 2021 నుండి మార్చి 2022 వరకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్స్ కోసం COO గా కూడా పనిచేసారు. డాక్టర్ రాజ్‌గోపాల్‌కు డాక్టర్ బి సి రాయ్ నేషనల్ అవార్డ్ (మెడికల్ ఫీల్డ్) 2016 లో భారతదేశ రాష్ట్రపతి ద్వారా అందించబడింది.

శ్రీ వినయ్ సాంఘి

Mr. Vinay Sanghi Independent Director
శ్రీ వినయ్ సాంఘి (DIN: 00309085) ఆటో పరిశ్రమలో మూడు దశాబ్దాల కంటే ఎక్కువ అనుభవం కలిగి ఉన్నారు. శ్రీ సాంఘీ కార్‌ట్రేడ్ టెక్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్, ఇంకా కార్‌వాలే, బైక్‌వాలే, ఆడ్రాయిట్ ఆటో మరియు శ్రీరామ్ ఆటోమాల్‌లను కొనుగోలు చేయడం ద్వారా మార్కెట్ నాయకత్వాన్ని స్థాపించడంలో మరియు కన్సాలిడేషన్‌ను ప్రభావితం చేయడంలో కీలకపాత్ర పోషించారు. దీనికి ముందు అతను మహేంద్రా ఫస్ట్ ఛాయిస్ వీల్స్ లిమిటెడ్ యొక్క సిఇఒ గా ఉన్నారు, మరియు యూజ్డ్-కార్ విభాగంలో భారతదేశం యొక్క ప్రముఖ కంపెనీలలో ఒకటిగా మారడంలో ఇది కీలకమైనది. అతను షాహ్ అండ్ సాంఘి గ్రూప్ ఆఫ్ కంపెనీలలో కూడా భాగస్వామిగా ఉన్నారు.

శ్రీ ఎడ్వర్డ్ లేర్

Mr. Edward Ler Non-Executive Director
శ్రీ ఎడ్వర్డ్ లేర్ (DIN: 10426805) కంపెనీ యొక్క నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అతను UK లోని గ్లాస్‌గో కాలెడోనియన్ విశ్వవిద్యాలయంలో రిస్క్ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (డిస్టింక్షన్‌తో) తో గ్రాడ్యుయేట్ చేసారు మరియు U.K లోని చార్టర్డ్ ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ నుండి చార్టర్డ్ ఇన్సూరర్ హోదాను కలిగి ఉన్నారు. అతను ప్రస్తుతం ముఖ్య అండర్‌రైటింగ్ అధికారి మరియు ఎర్గో గ్రూప్ AG ("ERGO") యొక్క మేనేజ్‌మెంట్ బోర్డులో సభ్యుడు, ఎర్గో కన్జ్యూమర్ ఇన్సూరెన్స్ పోర్ట్‌ఫోలియోలు మరియు కమర్షియల్ ప్రాపర్టీ/సాధారణ పోర్ట్‌ఫోలియోలు, లైఫ్, హెల్త్ మరియు ట్రావెల్ కోసం గ్లోబల్ కాంపిటెన్స్ సెంటర్లు, ఆస్తి/సాధారణ ప్రాడక్ట్ మేనేజ్‌మెంట్, క్లెయిములు మరియు రీఇన్సూరెన్స్ కోసం బాధ్యత వహిస్తారు.

శ్రీ సమీర్ హెచ్. షా

Dr. Oliver Martin Willmes Non Executive Director
డాక్టర్ విల్మ్స్ (DIN: 08876420) కంపెనీ యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అతను కోలోన్ విశ్వవిద్యాలయంలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌ను అధ్యయనం చేశారు. డాక్టర్ విల్మ్స్ ఈస్టర్న్ ఇల్లినోయిస్ యూనివర్సిటీ, యుఎస్ఎ నుండి ఎంబిఎ పూర్తి చేశారు. డాక్టర్ విల్మ్స్ ప్రస్తుతం ఎర్గో ఇంటర్నేషనల్ AG వద్ద మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్.

శ్రీ సమీర్ హెచ్. షా

Mr. Samir H. ShahExecutive Director & CFO
శ్రీ సమీర్ హెచ్. షా (డిఐఎన్: 08114828) గారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (FCA) యొక్క ఒక ఫెలో మెంబర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ACS) మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ACMA) యొక్క సభ్యుడు. అతను 2006 లో కంపెనీలో చేరారు మరియు దాదాపుగా 31 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉన్నారు, ఇందులో జనరల్ ఇన్సూరెన్స్ రంగంలో 15 సంవత్సరాలకు పైగా ఉన్నారు. జూన్ 1, 2018 నుండి 5 సంవత్సరాల కాలానికి శ్రీ షా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సిఎఫ్ఒ గా నియమించబడ్డారు మరియు ప్రస్తుతం కంపెనీ యొక్క ఫైనాన్స్, అకౌంట్లు, పన్ను, సెక్రటేరియల్, లీగల్ మరియు కాంప్లియెన్స్, రిస్క్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్లకు బాధ్యత వహిస్తారు.

శ్రీ అనుజ్ త్యాగి

Mr. Anuj TyagiManaging Director & CEO
శ్రీ అనుజ్ త్యాగి (DIN: 07505313) 2008 లో కమర్షియల్ బిజినెస్ డిపార్ట్‌మెంట్ హెడ్‌‌గా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోలో బాధ్యతలు స్వీకరించారు మరియు అప్పటి నుండి అన్ని బిజినెస్, అండర్‌రైటింగ్, రీఇన్సూరెన్స్, టెక్నాలజీ మరియు పీపుల్ ఫంక్షన్స్ వ్యాప్తంగా ఉన్న ఫ్రంట్ ఎండ్ మరియు బ్యాక్ ఎండ్ కార్యకలాపాలలో సేవలు అందించారు. శ్రీ అనుజ్ 2016 నుండి మేనేజ్‌మెంట్ బోర్డులో సభ్యునిగా ఉన్నారు మరియు జులై 1, 2024 నుండి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO గా నియమించబడ్డారు. శ్రీ అనుజ్ దేశంలో ప్రముఖ ఆర్థిక సంస్థలు మరియు ఇన్సూరెన్స్ గ్రూప్‌లలో 26 సంవత్సరాలకు పైగా బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ సేవలను అందించారు.
దేశంలోని ప్రతి పౌరునికి ఇన్సూరెన్స్ రూపంలో ఒక ఆర్థిక భద్రతా కవచాన్ని అందించడమే శ్రీ అనుజ్ లక్ష్యం మరియు సామర్థ్యాన్ని పెంచడానికి మరియు ముఖ్యంగా వ్యక్తులకు విభిన్నమైన అనుభవాన్ని అందించడానికి వ్యాపారం/జీవితంలోని ప్రతి అంశంలో డిజిటల్ టెక్నాలజీని తీసుకురావడానికి ఆయన ఉత్సాహంగా పని చేస్తున్నారు.

శ్రీ అనుజ్ త్యాగి

Mr. Anuj TyagiManaging Director & CEO

శ్రీ సమీర్ హెచ్. షా

Mr. Samir H. ShahExecutive Director and CFO

శ్రీ పార్థ్అనిల్ ఘోష్

Mr. Parthanil GhoshDirector & Chief Business Officer

శ్రీ అంకుర్ బహోరే

Mr. Ankur BahoreyDirector & Chief Operating Officer

శ్రీమతి సుదక్షిణ భట్టాచార్య

Ms. Sudakshina BhattacharyaChief Human Resources Officer

శ్రీ నీరజ్ నాయక్

Mr. Niraj NaikChief Underwriting Officer

శ్రీ చిరాగ్ షేత్

Mr. Chirag ShethChief Risk Officer

శ్రీ సంజయ్ కులశ్రేష్ఠ

Mr. Sanjay KulshresthaChief Investment Officer

శ్రీమతి వ్యోమా మానేక్

శ్రీమతి వ్యోమా మానేక్కంపెనీ సెక్రటరీ మరియు చీఫ్ కాంప్లియెన్స్ ఆఫీసర్

శ్రీ శ్రీరామ్ నాగనాథన్

Mr. Sriram NaganathanChief Technology Officer

శ్రీ అన్షుల్ మిట్టల్

Mr. Anshul MittalAppointed Actuary

అవార్డులు మరియు గుర్తింపు
x