భారతదేశంలో, వాతావరణ మార్పుల కారణంగా వ్యవసాయ వర్గాలు ఏటా అధిక నష్టాలను చవిచూస్తున్నాయి. సాగునీటి సౌకర్యాలు లేకపోవడం మరియు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు అందుబాటులో లేకపోవడం లాంటివి ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. గ్రామీణ క్రెడిట్ అందుబాటును సైతం ఇది బలహీనపరుస్తుంది. కరువు ఎదురైన సంవత్సరంలో రైతులు వారి పంట రుణాల మీద వడ్డీ చెల్లించే పరిస్థితి లేక ప్రిన్సిపల్ రీపేమెంట్ రీషెడ్యూల్ చేయాలని కోరుతుంటారు. వాతావరణ ప్రమాదం ఇన్‌పుట్ ప్రొవైడర్‌లను వారి వ్యాపార వాల్యూమ్‌లలో అస్థిరతను పెంచడం ద్వారా ప్రభావితం చేస్తుంది మరియు తత్ఫలితంగా వ్యాపారం యొక్క లాభాలను ప్రభావితం చేస్తుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఒక సమగ్ర రెయిన్‌ఫాల్ ఇండెక్స్ ఇన్సూరెన్స్ పాలసీను అందిస్తుంది. ఇది ప్రతికూల వర్షపాతం వల్ల ప్రభావితమయ్యే వ్యక్తులు మరియు సంస్థలకు సమర్థవంతమైన రిస్క్ మేనేజ్‌మెంట్ సహాయాన్ని సరసమైన ఖర్చుతో అందించడానికి ఒక యంత్రాంగం.
వ్యవసాయ అనుకూల ప్రాంతాల నుండి వ్యవసాయ సంబంధిత ఆదాయాలు పొందే రైతు సమాజాలు మరియు వర్షపాతంలో అస్థిరత కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యే వారికి ఈ పాలసీ అందుబాటులో ఉంటుంది. వాళ్లు తప్పనిసరిగా గ్రామీణ మరియు సామాజిక సెక్టార్లలోని మైక్రో ఫైనాన్స్ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, ప్రభుత్వ ప్రాయోజిత సంస్థలు మరియు అలాంటి అనుబంధ గ్రూపులు / సంస్థల్లో సభ్యులు (గ్రూపుల్లో)గా ఉండాలి.
వ్యవసాయ సంబంధిత అవుట్‍పుట్/దిగుబడి తగ్గడం: ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రదేశం మరియు నిర్దిష్ట కాల వ్యవధిలో ఊహించబడిన సాధారణ వర్షపాతంలో లోటు కారణంగా వ్యవసాయ ఔట్‍పుట్ / దిగుబడిలో తగ్గుదలను కవర్ చేస్తుంది.
రెయిన్‌ఫాల్ ఇండెక్స్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన అత్యంత ముఖ్యమైన ప్రయోజనాలు:
రెయిన్‌ఫాల్ ఇన్సూరెన్స్ అనేది ఆహార ధాన్యాలు మరియు తోట పంటలకు సంబంధించి భారతీయ వ్యవసాయ సమాజం ఎదుర్కొంటున్న వర్షపాత సంబంధిత నష్టాలను పోటీ నిబంధనలపై ప్రపంచ వాతావరణ మార్కెట్‌లకు బదిలీ చేస్తుంది. భౌగోళికంగా వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోతో అంతర్జాతీయ వాతావరణ రీ-ఇన్సూరర్లకు అందుబాటులోకి రావడం వల్ల ఖర్చు తగ్గింపునకు అవకాశం కల్పించడాన్ని గమనించవచ్చు
రెయిన్‌ఫాల్ ఇన్సూరెన్స్ అనేది ఇన్సూర్ చేయబడిన వ్యవసాయ సమాజాలకు తక్షణ మరియు పారదర్శక క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను సులభతరం చేయగలదు.
తక్కువ అడ్మినిస్ట్రేటివ్ ధరల కారణంగా, రెయిన్‌ఫాల్ ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరర్‌కి కూడా కాస్ట్ ఎఫెక్టివ్‌గా ఉంటుంది. తద్వారా, సంప్రదాయ పంట ఇన్సూరెన్స్‌తో పోలిస్తే తక్కువ ప్రీమియం స్థాయిలు కలిగి ఉంటుంది
పాలసీలో పేర్కొన్న విధంగా, ప్రయోజనాలన్నీ గరిష్ట మొత్తానికి లోబడి ఉంటాయని దయచేసి గమనించండి. ఏదైనా కొటేషన్ విడుదల చేయబడినప్పుడు లేదా ఏదైనా పాలసీ జారీచేయబడినప్పుడు ఇవి స్పష్టంగా పేర్కొనబడి ఉంటాయి.
పాలసీ క్రింద ఏదైనా చెల్లింపు చేయడానికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో బాధ్యత వహించదు:
పేర్కొన్న విస్తీర్ణంలో సాగు చేసిన నిర్దిష్ట పంటకు సంబంధించి వర్షపాతం లోటు కారణంగా కాకుండా వ్యవసాయ ఉత్పత్తి/దిగుబడి తగ్గిపోయినప్పుడు, ఏవైనా ఖర్చులను తిరిగి చెల్లించడం లేదా ఏదైనా నష్టాన్ని భర్తీ చేయడం.
వాస్తవ మొత్తం రెయిన్‌ఫాల్ ఇండెక్స్ అనేది సాధారణ రెయిన్‌ఫాల్ ఇండెక్స్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు.
వర్షపాతం లోటు ఏర్పడిన సందర్భంలో, పేర్కొన్న రైతు గుర్తించబడిన నిర్దిష్ట ప్రాంతంలో సాగునీరు అందుబాటులో ఉంటే లేదా నదులు, చెరువులు, బావులు, నీటి ప్రవాహాలు, సరస్సులు, ట్యాంకులు, కాలువలు మొదలైన వాటితో సహా సహజ లేదా మానవ నిర్మిత వనరుల నుండి సాగునీరు అందుకుంటే.
ఇది మినహాయింపులకు సంబంధించిన ఒక ఉదాహరణగా చెప్పబడిన జాబితా. ఉదాహరణగా చెప్పబడిన జాబితా కోసం, దయచేసి పాలసీ వివరాలు చూడండి.
కంపెనీకి సమర్పించిన డాక్యుమెంట్‌ల ఆధారంగా క్లెయిమ్‌లు అంచనా వేయబడతాయి మరియు చెల్లించబడతాయి. నిర్దిష్ట భౌగోళిక ప్రదేశంలో మరియు ఈ పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న సమయ వ్యవధిలో, వాస్తవ మొత్తం రెయిన్‌ఫాల్ ఇండెక్స్ అనేది సాధారణ రెయిన్‌ఫాల్ ఇండెక్స్ కంటే తక్కువగా ఉంటే, బీమా చేసిన వ్యక్తికి చెల్లించాల్సిన ప్రయోజనం అనేది ప్రామాణిక నష్టం రేటుతో గుణించబడుతుంది, సాధారణ రెయిన్‌ఫాల్ ఇండెక్స్ మరియు వాస్తవ మొత్తం రెయిన్‌ఫాల్ ఇండెక్స్‌లో వ్యత్యాసం అనేది గరిష్టంగా బీమా చేయబడిన మొత్తానికి లోబడి ఉంటుంది.
ఈ సమాచారం వివరణ కోసం మాత్రమే. వాస్తవ కవరేజ్ అనేది జారీ చేసిన పాలసీల్లోని భాషకు లోబడి ఉంటుంది.
1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్ 24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
1 కోటి+ చిరునవ్వులు సురక్షితం
మీకు అవసరమైన సపోర్ట్-24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards