నేటి కాలం మరియు తరానికి చెందిన చాలామంది వ్యక్తులు వారి సొంత కారుతో పట్టణంలో తిరగాలని కోరుకుంటున్నారు. కార్లు అనేవి రవాణా కోసం సౌకర్యవంతమైన రూపాల్లో ఉండడం వల్ల, వ్యక్తులు సరైన సమయంలో ఒకచోటు నుండి మరొక చోటుకు ప్రయాణించగలుగుతారు. కారు యజమానిని రక్షించడానికి కారు ఇన్సూరెన్స్ పాలసీ అందుబాటులో ఉండడం అనేది ఈరోజు కారును సొంతం చేసుకోవడంలో ముఖ్యమైన అంశం.
కారు ఇన్సూరెన్స్ విలువ అనేది ఏదైనా ప్రమాదం లేదా ప్రకృతి వైపరీత్యంలో పాలసీదారు కారు దెబ్బతిన్న పక్షంలో లేదా దొంగతనం లేదా విధ్వంసానికి గురైనప్పుడు ఆ కారుకు కవరేజ్ అందిస్తుంది. వాహనానికి ఇలాంటి నష్టం ఏదైనా జరిగినప్పుడు స్వంత డబ్బును చెల్లించడానికి బదులుగా, పాలసీహోల్డర్లు తమ కార్ ఇన్సూరెన్స్ కంపెనీకి కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను చెల్లించవచ్చు. ఈ చెల్లింపు ఫలితంగాా, కారు ఇన్సూరెన్స్ ప్రదాతలు కారు మొత్తం కోసం చెల్లించకపోయినప్పటికీ, కొంత మొత్తం చెల్లించడం వల్ల, సంబంధిత కార్ల పాలసీదారులు ఆ డ్యామేజీ సరిచేసుకోవడానికి ఆ మొత్తం ఉపయోగపడుతుంది.
కార్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత మోటారు వాహనాల చట్టం 1988 లో స్పష్టంగా పేర్కొనబడింది, ఇది కార్ ఇన్సూరెన్స్ అనేది కారు యజమానులు అందరికీ చట్టపరమైన అవసరం అని నిర్దేశిస్తుంది. థర్డ్-పార్టీ బాధ్యతా ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి మరియు అత్యంత ప్రాథమిక కారు ఇన్సూరెన్స్ ప్లాన్లు సైతం ఈ రకం కవరేజీని అందించాల్సిన అవసరం ఉంది.
నేడు మార్కెట్లో విస్తృతమైన, విభిన్న రకాల కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి, అందుబాటులో ఉన్న వివిధ కారు ఇన్సూరెన్స్ ప్లాన్లను మీరు సరిపోల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంటర్నెట్లో దీనికి సంబంధించి మరింత సమాచారం అందుబాటులో ఉంటుంది కాబట్టి, వీటిని ఆన్‌లైన్‌లో ఉత్తమంగా సరిపోల్చవచ్చు మరియు వేర్వేరు వర్గాల వారీగా వీటిని పోల్చడం కూడా చాలా సులభం. తక్కువ ధరలో అనేక ప్రయోజనాలు అందించే ఉత్తమ కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఖచ్చితంగా నిర్ణయించడానికి ఈ పోలికలు మిమ్మల్ని అనుమతిస్తాయి. ఈ పోలికలతో సంబంధం ఉన్న కింది ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకోండి.
వివిధ కార్ ఇన్సూరెన్స్ పాలసీల ధరలను పరిగణిస్తూ వాటిని సరిపోల్చడం ద్వారా, అవి మీ బడ్జెట్‌కి సరిపోతాయో లేదో మీరు నిర్ణయించుకోవచ్చు. థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీలు తరచుగా సమగ్ర కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ల కంటే ఎక్కువ సరసమైనవి. అయితే, సమగ్ర ఇన్సూరెన్స్‌తో పోలిస్తే, ఈ పాలసీ అనేది ఎక్కువ కవరేజీ అందించదు. సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీలు అదనపు కవరేజీని అందిస్తాయి ఎందుకంటే అవి జీరో డిప్రిసియేషన్ కవర్ నుండి రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ వరకు యాడ్-ఆన్‌లను అందిస్తాయి
వివిధ కారు ఇన్సూరెన్స్ పాలసీలను పోల్చి చూడడం ద్వారా, ఏ పాలసీ మీకు అత్యంత తగిన కవరేజీ అందిస్తుందో మీరు అర్థం చేసుకోగలుగుతారు. థర్డ్-పార్టీ కారు ఇన్సూరెన్స్ ప్లాన్లు మొదలుకొని సమగ్ర పాలసీల వరకు కవరేజీ ఎంపికలు. థర్డ్-పార్టీ కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌ల విషయంలో, పాలసీదారులకు అత్యంత కనీస కవరేజీ మాత్రమే లభిస్తుంది. దీనితో పోలిస్తే, సమగ్ర పాలసీలో అనేక ఆప్షనల్ యాడ్-ఆన్‌లు అందుబాటులో ఉంటాయి.
వివిధ కారు ఇన్సూరెన్స్ పాలసీలను మీరు సరిపోల్చినప్పుడు ప్రతి ప్లాన్ ద్వారా అందించబడే సేవల రకాలను మీరు మెరుగ్గా నిర్ధారించుకోగలుగుతారు. కార్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అందించే ఆఫ్టర్-సేల్స్ సర్వీసులను గమనించడం అనేది విలువైన ఎంపికగా ఉంటుంది. ఉదాహరణకు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అనేక అదనపు సేవలు అందిస్తుంది, ఇందులో ఓవర్‌నైట్ కార్ మరమ్మత్తు సేవలు భాగంగా ఉంటాయి. ఇందుకోసం, దేశవ్యాప్తంగా విస్తరించబడిన నగదు రహిత గ్యారేజీల భారీ నెట్‌వర్క్ అందుబాటులో ఉంది.
చెల్లుబాటు అయ్యే కారు ఇన్సూరెన్స్ కలిగి ఉండడం అనేది ఒక చట్టపరమైన అవసరం మాత్రమే కాకుండా దీనివల్ల కారు యజమానులకు సౌలభ్యం కూడా లభిస్తుంది. కార్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది ఇంటి నుండి సౌకర్యవంతంగా పూర్తి చేయగల ఒక సరళమైన మరియు సులభమైన ప్రక్రియగా ఉంటుంది. ఆసక్తిగల దరఖాస్తుదారులు తక్షణ కోట్ పొందడం కోసం అవసరమైన వివరాలు పూరించాల్సి ఉంటుంది.
సరిపోల్చాల్సిన అంశాలు | థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ | సమగ్ర కారు ఇన్సూరెన్స్ |
అందించబడే కవరేజ్ | పేరులో స్పష్టంగా సూచించినట్లుగానే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఏదైనా థర్డ్ పార్టీ బాధ్యత నుండి మాత్రమే మిమ్మల్ని కవర్ చేస్తుంది. ఇది భారతదేశంలో అత్యంత ప్రాథమిక ఇన్సూరెన్స్ కవర్ మరియు ఇది తప్పనిసరిగా ఉండాలి. | మరోవైపు ఒక సమగ్ర కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది రిస్క్‌ను తగ్గిస్తుంది ఇది స్వంత నష్టం మరియు థర్డ్ పార్టీ బాధ్యతలు రెండింటినీ కవర్ చేస్తుంది కాబట్టి, అర్థవంతమైన ఎంపికగా ఉంటుంది. |
యాడ్-ఆన్ల లభ్యత | లేదు, ఈ పాలసీ క్రింద మీరు ఏదైనా యాడ్-ఆన్ కవర్‌లు ఎంచుకోలేరు. | అవును, పేర్కొన్న వాటికోసం యాడ్-ఆన్ కవర్‌లు ఎంచుకునే స్వేచ్ఛ మీకు ఉంది మీ ప్రస్తుత కార్ ఇన్సూరెన్స్ పాలసీ విలువను మరింత పెంచుకోండి |
వ్యక్తిగతీకరణ | లేదు, వ్యక్తిగతీకరణ సాధ్యం కాదు. ఒక స్టాండర్డ్ పాలసీ అన్నింటికీ వర్తిస్తుంది. | అవును, IDV లేదా ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ కస్టమైజేషన్‌ను ఇది అనుమతిస్తుంది మీ అవసరాలకు అనుగుణంగా మీ ప్రీమియం మొత్తాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. |
ప్రయోజనాలు | ఈ సందర్భంలో మీకు కవర్ లభిస్తుందని మీరు నిశ్చింతగా ఉండవచ్చు: వ్యక్తి లేదా ఆస్తి రూపంలోని థర్డ్ పార్టీకి జరిగిన ఏదైనా నష్టం. | భూకంపాలు, తుఫాన్లు, సైక్లోన్లు మొదలైన ప్రకృతి వైపరీత్యాలకు ఇది మీకు కవరేజీని అందిస్తుంది, దొంగతనం, విధ్వంసం, అగ్నిప్రమాదం లాంటి మానవ జోక్యంతో సంభవించే ప్రమాదాలు ఈ కవరేజీలో భాగంగా ఉంటుంది. దీనికి అదనంగా, మీరు ఎటువంటి క్లెయిమ్‌లు దాఖలు చేయకపోతే మీరు వార్షిక రెన్యూవల్ సమయంలో NCB లేదా నో క్లెయిమ్స్ బోనస్ నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు. |
ప్రతికూలతలు | ఇది మిమ్మల్ని అనేక ప్రమాదాలకు గురిచేయవచ్చు మరియు స్వంత నష్టం సందర్భంలో మీ స్వంతంగా డబ్బును ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు బాధను మిగుల్చుతుంది. | ప్రీమియం మొత్తం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్ కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, అది అందించే మిగులు కవరేజీని సమర్థిస్తుంది. |
ఆన్‌లైన్‌లో మీరు కార్ ఇన్సూరెన్స్‌ను సరిపోల్చడానికి ముందు, వివిధ పాలసీ రకాల గురించి మీరు తెలుసుకోవాలి. మీరు ఎంచుకోగల వివిధ కార్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్: ఒక థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మీ ఇన్సూర్ చేయబడిన కారును డ్రైవ్ చేసేటప్పుడు వేరొకరి ఆస్తి/వాహనం లేదా వారికి సంభవించే గాయాలు లాంటి ఏదైనా థర్డ్ పార్టీ బాధ్యతల నుండి మిమ్మల్ని కవర్ చేస్తుంది. అయితే, ఈ కవర్‌తో మీరు మీ వాహన స్వంత నష్టం కోసం క్లెయిమ్ చేయలేరు. 1988 మోటార్ వాహనాల చట్టం ప్రకారం, థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడం తప్పనిసరి.
సమగ్ర కార్ ఇన్సూరెన్స్: థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీతో పోలిస్తే, ఒక సమగ్ర పాలసీ అనేది థర్డ్ పార్టీకి జరిగే నష్టాలు/గాయాలను మరియు స్వంత నష్టాలను కూడా కవర్ చేస్తుంది. అంటే యాక్సిడెంట్, అగ్నిప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, మానవ జోక్యంతో జరిగే విపత్తులు, దొంగతనం మరియు ఇన్సూర్ చేయదగిన ఏదైనా ప్రమాద సందర్భంలో మీ కారుకి జరిగిన నష్టాలకు సమగ్ర కవరేజీ అందిస్తుంది.
స్టాండ్‌అలోన్ ఓన్ డ్యామేజ్ కవర్: ఒక స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ పాలసీ అనేది యాక్సిడెంట్, ప్రకృతి వైపరీత్యం, భూకంపం, అగ్నిప్రమాదం, దొంగతనం మొదలైన వాటి కారణంగా కలిగే నష్టం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. స్టాండర్డ్ థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్‌కు విరుద్ధంగా ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ అనేది ఆప్షనల్‌గా ఉంటుంది. మీకు తప్పనిసరిగా ఉండాల్సిన థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు ఇప్పటికే ఉంటే, ఓన్ డ్యామేజీ కవరేజీని జోడించడం వల్ల మీ వాహనానికి ఎల్లప్పుడూ పూర్తిగా ఇన్సూరెన్స్ ఉందనే హామీ లభిస్తుంది.
వివిధ కారు ఇన్సూరెన్స్ పాలసీలను ఒకదానితో ఒకటి పోల్చినప్పుడు అనేక అంశాలు పరిగణనలోకి వస్తాయి. ఇందులో అత్యంత ముఖ్యమైనవి క్రింద వివరించబడ్డాయి.
కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో సరిపోల్చడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని ప్రయోజనాలను క్రింద చూద్దాం:
ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్‌ను మీరు సరిపోల్చిన తర్వాత, ఈ క్రింది దశలను అనుసరించడం ద్వారా మీరు దానిని కొనుగోలు చేయవచ్చు:
దశ 1 - ఇన్సూరర్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
దశ 2 - ఆ వెబ్‌సైట్ నుండి కార్ ఇన్సూరెన్స్ పేజీకి నావిగేట్ చేయండి.
దశ 3 - మేక్ మోడల్ వివరాలతో పాటు మీ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
దశ 4 - సమగ్ర లేదా థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ఒక దానిని ఎంచుకోండి.
దశ 5 - మీరు సమగ్ర కవర్ ఎంచుకుంటే, జీరో డిప్రిసియేషన్, నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్ వంటి యాడ్-ఆన్ కవర్‌లు ఎంచుకోండి.
దశ 6 - కోట్‌ను చూడండి, ప్రీమియంను ఆన్‌లైన్‌లో చెల్లించండి మరియు మీరు మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ID ద్వారా వెంటనే కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో అందుకుంటారు.
• ఖర్చు: అందుబాటులోని ధరలో గరిష్ట కవరేజ్ అందించే కార్ ఇన్సూరెన్స్ పాలసీలో పెట్టుబడి పెట్టడం ముఖ్యం. ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్‌ను సరిపోల్చేటప్పుడు ఉత్తమ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం అన్వేషించడాన్ని పరిగణనలోకి తీసుకోండి.
• రివ్యూలు: మీరు ఆన్‌లైన్‌లో చూసినప్పుడు, కార్ ఇన్సూరెన్స్ ఎంత ముఖ్యమైనది మరియు అది మీ అవసరాలను అది ఎంత బాగా తీర్చగలదనే అవగాహనను మీకు అందించే అనేక రివ్యూలను కనుగొంటారు. ఉత్తమ కార్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం వెతికే సమయంలో, కొనుగోలు బటన్ నొక్కడానికి ముందు కస్టమర్ రివ్యూలను పరిశీలించండి.
• కవరేజ్: మీరు కార్ ఇన్సూరెన్స్ పాలసీలను సరిపోల్చినప్పుడు, ఎల్లప్పుడూ అందించబడే కవరేజీని పరిగణించండి. సమగ్ర కవర్‌తో అందుబాటులో ఉన్న యాడ్-ఆన్ కవర్‌లను కూడా తనిఖీ చేయండి, ఇది ప్రీమియం ఖర్చును పెంచినప్పటికీ, కార్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ సమయంలో ప్రయోజనాలు పొందడంలో మీకు సహాయపడుతుంది.
• కార్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి క్షుణ్ణంగా చదవండి: కార్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్‌లోని వివరాలు చూడటం చాలా ముఖ్యం. లేని పక్షంలో క్లెయిమ్ సమయంలో ఇన్సూరెన్స్ సంస్థ గురించి మీరు తప్పుగా భావించవచ్చు. కాబట్టి, క్లెయిమ్ తిరస్కరణను నివారించడానికి కాంట్రాక్ట్‌ను క్షుణ్ణంగా చదవండి.
• నెట్‌వర్క్‌లో భాగంగా ఉండే గ్యారేజీలు: మీరు కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో సరిపోల్చినప్పుడు ఇన్సూరర్‌కి సంబంధించిన క్యాష్‌లెస్ గ్యారేజీల నెట్‌వర్క్ సంఖ్యను తనిఖీ చేయాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.
• ఇన్సూరెన్స్ కంపెనీ చరిత్ర: ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్‌ను సరిపోల్చేటప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ చరిత్రను పరిగణనలోకి తీసుకోవాలి. అధిక క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ నిష్పత్తి కలిగిన కంపెనీని ఎంచుకోండి.
• నో-క్లెయిమ్ బోనస్: మీరు కారు ఇన్సూరెన్స్ కోట్‌లను పోల్చినప్పుడు, NCB లేకుండానే కొటేషన్ జారీ చేయబడవచ్చు కాబట్టి NCB పరిగణించబడుతుందని తనిఖీ చేసుకోండి. ఈ డిస్కౌంట్ అనేది వరుసగా క్లెయిమ్-ఫ్రీ సంవత్సరాల సంఖ్యతో పెరుగుతుంది మరియు 50% వరకు చేరుకోగలదు.
వివిధ కారు ఇన్సూరెన్స్ పాలసీలను పోల్చి చూడడం ద్వారా, వాటిలో ప్రతిఒక్క దానితో ముడిపడిన ప్రీమియంల ఆధారంగా ప్రతి ప్లాన్ అందించే ప్రయోజనాలను మీరు నిర్ణయించవచ్చు. మీ బడ్జెట్‌కు ఏ ప్లాన్ ఉత్తమంగా సరిపోతుందో కూడా మీరు నిర్ణయించవచ్చు. మీ వద్ద ఒక మోస్తరు బడ్జెట్ ఉంటే, అప్పుడు సమగ్ర కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌లతో ముడిపడిన ప్రీమియంలతో పోలిస్తే, ఒక థర్డ్-పార్టీ కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌తో ముడిపడిన ప్రీమియంలు చాలా తక్కువగా ఉండడం వల్ల, ఆ ప్లాన్ మీకు ఆదర్శవంతంగా ఉంటుంది.
మీ ఇంటి నుండి సౌకర్యవంతంగా కారు ఇన్సూరెన్స్ ప్లాన్లను ఆన్‌లైన్‌లో సరిపోల్చవచ్చు. ఈ ప్లాన్లను ఆన్‌లైన్‌లో పోల్చడంతో సంబంధం ఉన్న ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
● ప్రారంభకుల కోసం, ఆన్‌లైన్‌లో ఎక్కువ సమాచారం అందుబాటులో ఉండడం వల్ల అక్కడ పోల్చి చూడడం సులభంగా ఉంటుంది.
● ఆ తరువాత, ఏ ప్లాన్ ఎంచుకోవాలి అనే ప్రశ్న ఎదురైనప్పుడు, వివిధ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లకు సంబంధించి ఆన్‌లైన్‌లోని అనేక సమీక్షలు చదవడం సాధ్యమవుతుంది.
● అందుబాటులో ఉన్న వివిధ పాలసీల గురించి మీరు అవగాహన సాధించవచ్చు మరియు ఆర్థికంగా మీరు మంచి నిర్ణయం తీసుకోవడానికి మీకు సహాయపడే ప్రీమియంలు ఏవో తెలుసుకోవచ్చు.
● మీరు ఏ సమయంలోనైనా ఈ పోలికలు చేయవచ్చు మరియు ఏదైనా ఇన్సూరెన్స్ ప్లాన్‌కు అనుకూలంగా ఒక సేల్స్‌మెన్ మీ మీద తీసుకొచ్చే ఒత్తిడిని మీరు ఎదుర్కొనే అవసరం ఉండదు.
పాలసీలకు సంబంధించిన ఈ క్రింది అంశాలు పరిశీలించడం ద్వారా, కారు ఇన్సూరెన్స్ పాలసీలను ఆన్‌లైన్‌లోనే సమర్థవంతంగా సరిపోల్చవచ్చు. అందులో క్రింది అంశాలు భాగంగా ఉంటాయి.
● ఛార్జ్ చేయబడిన ప్రీమియం – వివిధ పాలసీలు వివిధ ప్రీమియంలు కలిగి ఉంటాయి, మీ బడ్జెట్‌కు అనుగుణంగా వీటిని పరిగణనలోకి తీసుకోవాలి.
● అందించబడిన కవరేజీ – చాలావరకు సమగ్ర పాలసీలు ఎక్కువ కవరేజ్ అందిస్తున్నప్పటికీ, థర్డ్-పార్టీ కారు ఇన్సూరెన్స్ పాలసీలు వాటి పరిధిలో పరిమిత కవరేజీ అందిస్తాయి.
● క్లెయిమ్ రికార్డులు – వివిధ కారు ఇన్సూరెన్స్ ప్రదాతలు కవరేజీ అందించే అవకాశం నిర్ణయించడానికి వారి కారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తులు పోల్చి చూడడం ముఖ్యం.
● నగదురహిత గ్యారేజీల నెట్‌వర్క్ – కారు ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నెట్‌వర్క్‌లో నగదు రహిత గ్యారేజీలు ఎంత ఎక్కువగా ఉంటే, అది అంత ఉత్తమమైన కారు ఇన్సూరెన్స్ పాలసీగా ఉంటుంది.