మహిళలు జీవితంలో ఏ దశలోనైనా క్యాన్సర్ బారిన పడవచ్చు. నేడు, మహిళలు కూడా సమాన బాధ్యతలు మోస్తున్న నేపథ్యంలో, మహిళకు ఈ భయంకర వ్యాధి సోకినప్పుడు దాని మీద పోరాటం కోసం ఆర్థికపరమైన ఒక అండ ఉండేలా చూసుకోవడం ముఖ్యం. క్యాన్సర్ చికిత్స కోసం రక్షణ మరియు పూర్తి కవర్ నిర్ధారించడంలో భాగంగా, నాణ్యమైన వైద్య చికిత్స మరియు అత్యంత సంరక్షణతో ఆ వ్యాధిని ఎదుర్కోవడం కోసం మీకు ఒక ఆర్థిక రక్షణ సిద్ధంగా ఉండేలా నిర్ధారించడానికి మై:హెల్త్ విమెన్ సురక్ష క్రింద క్యాన్సర్ ప్లాన్‌తో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మీ ముందుకు వచ్చింది. క్యాన్సర్ అనేది మీ మానసిక, శారీరక మరియు భావోద్వేగ స్థితి మీద తీవ్రమైన ప్రభావం చూపినప్పటికీ, ఈ ఇన్సూరెన్స్ కవర్‌తో కనీసం మీ ఆర్థిక పొదుపులు జాగ్రత్తగా ఉంటాయి.
క్యాన్సర్ కణాలు విపరీతంగా పెరుగుతూ, మీ శరీరంలోని ఇతర కణజాలాలకు వ్యాపిస్తుంటే, దానినే మాలిగ్నెంట్ క్యాన్సర్ అంటారు. అలాంటి మహిళల నిర్థిష్ట అన్ని క్యాన్సర్‌ల కోసం మేము 100% ఇన్సూర్ చేయబడిన మొత్తం అందిస్తాము. మరింత తెలుసుకోండి...
కణాల అసాధారణ వృద్ధి అనేది ఒకే ప్రదేశానికి పరిమితం కావడంతో పాటు శరీరంలోని ఇతర అవయవాలు లేదా కణజాలాలకు అది వ్యాప్తించకపోతే, దానిని సాధారణంగా కార్సినోమా అని పిలుస్తారు. ఈ స్థితిని మందులు మరియు చికిత్సతో సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఈ దశలో కూడా మేము మీకు కవర్ అందిస్తాము.మరింత తెలుసుకోండి ...
ఒకే ప్లాన్ క్రింద క్యాన్సర్ కోసం సమగ్ర కవర్ అందించే విమెన్ సురక్ష క్యాన్సర్ ప్లాన్ అనేది మీకు నాణ్యమైన వైద్య సేవలు లభించడంతో పాటు మీరు వేగంగా కోలుకోవడానికి మీ ఆర్థిక స్థితి సమర్థంగా ఉండేలా నిర్థారించడం కోసం మహిళల నిర్దిష్ట క్యాన్సర్ కాకుండా ఇతర ప్రధాన క్యాన్సర్‌ల కోసం ఇన్సూర్ చేయబడిన మొత్తంలో 100% అందిస్తుంది.
సాహస క్రీడలు మీకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తాయి, కానీ, కొన్ని ప్రమాదాలు ఎదురైనపుడు అవి హానికరంగా మారతాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పాల్గొన్నప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.
మీరు మీ విలువైన ప్రాణానికి హాని తలపెట్టాలనుకోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు గాయపరచుకోవడం మేము కోరుకోము. మా పాలసీ స్వతహాగా-చేసుకున్న గాయాలను కవర్ చేయదు.
యుద్ధం వినాశకరమైనది మరియు దురదృష్టకరమైనది కావచ్చు. అయితే, మా పాలసీ యుద్ధాల కారణంగా సంభవించే ఏ క్లెయిమ్‌ను కవర్ చేయదు.
మీరు డిఫెన్స్ (ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్) కార్యకలాపాలలో పాల్గొన్నప్పుడు సంభవించే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.
మీ వ్యాధి తీవ్రతను మేము అర్థం చేసుకున్నాము. అయితే, మా పాలసీ సుఖవ్యాధులు లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధులను కవర్ చేయదు.
ఊబకాయం కోసం చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ వంటివి మీ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడవు.
చేర్పులు మరియు మినహాయింపు సంబంధిత పూర్తి వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/ పాలసీ వివరాలు చూడండి
"మేజర్"గా వర్గీకరించబడిన అన్ని అనారోగ్యాలు/చికిత్సా విధానాల మీద 90 రోజుల నిరీక్షణ కాలవ్యవధి వర్తిస్తుంది.
"మైనర్"గా వర్గీకరించబడిన అన్ని అనారోగ్యాలు/వైద్య చికిత్సా విధానాల మీద 180 రోజుల నిరీక్షణ కాలవ్యవధి వర్తిస్తుంది
గర్భధారణ మరియు నవజాత శిశువు సమస్యల కవర్ క్రింద చేసే అన్ని క్లెయిమ్‌ల కోసం 1 సంవత్సరం నిరీక్షణ కాలవ్యవధి వర్తిస్తుంది.
ప్రసూతి సమస్యలతో సహా అనారోగ్యాలు/వైద్య చికిత్సా విధానాల కోసం 7 రోజుల సర్వైవల్ వ్యవధి
నవజాత శిశువు సమస్యల కోసం డెలివరీ తేదీ నుండి 30 రోజుల వరకు సర్వైవల్ వ్యవధి వర్తిస్తుంది మరియు శిశువు జన్మించిన రోజు నుండి రెండు సంవత్సరాల లోపల రోగనిర్ధారణ చేసి ఉండాలి
వ్యాధుల సంక్లిష్టత మరియు ఆర్థిక సహాయం అవసరం అర్థం చేసుకున్నాం కాబట్టి, మేము తక్షణ మరియు ఏకమొత్తంలో చెల్లింపును అందిస్తాము అంటే, మీ ఇన్సూర్ చేయబడిన మొత్తం ఒకే ట్రాన్సాక్షన్ ద్వారా చెల్లించబడుతుంది.
మీ ఆరోగ్య చరిత్రతో పాటు ప్రీమియం చెల్లించగల స్థోమతను అనుసరించి, 3 లక్షల నుండి 1 కోటి వరకు ఇన్సూర్ చేయబడిన మొత్తాన్ని ఎంచుకోండి.
ఆన్‌లైన్ పాలసీ కోసం 5% వరకు డిస్కౌంట్ పొందండి. 2 సంవత్సరాల పాలసీ మీద 7.5% డిస్కౌంట్ మరియు 3 సంవత్సరాల పాలసీ కాలవ్యవధి కోసం 12.5% డిస్కౌంట్ కూడా పొందుతారు.
ఈ ఫీచర్ అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో విమెన్ హెల్త్ సురక్షను మీ ఆరోగ్య సంరక్షణ భాగస్వామిగా చేస్తుంది మరియు మీకు ఆంక్షలు లేని కవరేజీ అందిస్తుంది.
ఏదైనా అనారోగ్యాన్ని ముందుగానే గుర్తించడం కోసం ప్రతి రెన్యూవల్ సమయంలో ఉచిత ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్ అందుకోండి.
సెక్షన్ 80 D క్రింద పన్ను ప్రయోజనం అందుకోండి.
వెల్‌నెస్ కోచ్ అనేది మీ వ్యాయామం మరియు క్యాలరీ లెక్కింపును అవాంతరాలు లేకుండా ట్రాక్ చేయడానికి మీకు వీలు కల్పిస్తుంది. మీకు సరిపోయే జీవనశైలిని కొనసాగించడానికి ఇది సహాయపడుతుంది.
తప్పనిసరి కాదు. పాలసీ మీకు తగినది కాదని మీరు భావిస్తే, పాలసీ డాక్యుమెంట్ అందుకున్న తేదీ నుండి 15 రోజుల లోపు పాలసీని రద్దు చేసే స్వేచ్ఛ మీకు ఉంటుంది.
1.6 కోటి పైగా ప్రజల ముఖాలలో చిరునవ్వు!
మీకు అవసరమైన సపోర్ట్-24x7
ప్రతి దశలోనూ పారదర్శకత!
వెల్‌నెస్ యాప్.
కాగితరహితంగా ఉండండి!
1.6 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.
కాగితరహితంగా ఉండండి!
తరచుగా అడిగే ప్రశ్నలు
పాలసీ జీవితకాలంలో, క్రింద ఇవ్వబడిన ప్రతి దశలోనూ ఒక క్లెయిమ్ మాత్రమే చెల్లించబడుతుంది.
మైనర్ స్థితి : పాలసీ కింద మైనర్ దశ పరిస్థితిలో క్లెయిమ్ అనుమతించబడిన తర్వాత, ఇతర అన్ని మైనర్ దశ పరిస్థితుల కోసం కవరేజీ ఉనికిలో ఉండదు. మిగిలిన ఇన్సూర్ చేయబడిన మొత్తం అనేది పాలసీలోని మేజర్ దశ పరిస్థితిని కవర్ చేయడం కోసం కొనసాగుతుంది.
మేజర్ దశ: మేజర్ దశ పరిస్థితి కోసం క్లెయిమ్ అనుమతించబడిన తర్వాత, ఈ పాలసీ క్రింద కవరేజీ ఉనికిలో ఉండదు.