ఈ వర్షాకాలంలో మీ ఇంటి రక్షణ గురించి చింతిస్తున్నారా? మీతో పాటు గొడుగు తీసుకెళ్లడం ద్వారా, మీ భద్రతను నిర్ధారించుకోవడానికి మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లుగానే, ప్రతి సంవత్సరం వరుసగా వచ్చే ప్రకృతి వైపరీత్యాల నుండి మీ ఇంటిని రక్షించడానికి దానికి ఒక గొడుగు అవసరం. వరదలు, తుపానులు, సైక్లోన్‌లు, భూకంపాలు మరియు సాధారణ భారీ వర్షాల నుండి కూడా మీ ఇంటికి రక్షణ అవసరం. ఈ విపత్తులు అన్నింటి నుండి మిమ్మల్ని రక్షించే మీ ఇంటికి రక్షణ ఉందని నిర్ధారించుకోవడానికి, వర్షాకాలంలో ఎదురయ్యే వివిధ ప్రమాదాల నుండి రక్షణ కోసం ఒక హోమ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయండి.
మీ ఇంట్లోకి నీళ్లు రావడం వల్ల ఫ్లోరింగ్‌కు నష్టం జరగడం
నీటి లీకేజీ వల్ల జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించే ఏదైనా నష్టం
ఫర్నిచర్‌కు డ్యామేజీ, మీ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది వ్యక్తిగత వస్తువులను పేర్కొంటే
నిర్మాణం నుండి పెయింట్ వరకు గోడలకు జరిగిన డ్యామేజీ
రూఫ్ నుండి నీళ్లు లీక్ కావడం. అలాగే, పగుళ్లు మరియు జాయింట్‌ల ద్వారా లీకేజీ మాత్రమే కాకుండా, పైకప్పు మీద నీళ్లు నిలవడం వల్ల కూడా నిర్మాణానికి డ్యామేజీ ఏర్పడుతుంది
ఇంటి లోపల విలువైన వస్తువులకు జరిగిన నష్టానికి కవరేజీ
వరదల కారణంగా జరిగిన నష్టం దాని క్రింద కవర్ చేయబడుతుంది
ఎలక్ట్రానిక్ మరియు గృహోపకరణాల మరమ్మత్తు మరియు మార్చడానికి అయ్యే ఖర్చు
పిడుగుపాటు తర్వాత, మీ ఇంటి పునర్నిర్మాణ సమయంలో మీకు ప్రత్యామ్నాయ వసతి
ఇంటి నిర్మాణంతో పాటు ఎలక్ట్రికల్ పరికరాలు మరియు ఇతర ఫిక్సర్లు మరియు ఫిట్టింగ్స్ కోసం కవరేజీ
విద్యుత్ హెచ్చుతగ్గులు, షార్ట్ సర్క్యూట్ లేదా పిడుగుపాటు కారణంగా అగ్నిప్రమాదం వల్ల జరిగిన నష్టం
వస్తువును ఇన్సూర్ చేసామనే ధైర్యంతో యజమానులు నిర్లక్ష్యం వహించడం కారణంగా జరిగిన నష్టాలను ఇన్సూరెన్స్ కవర్ చేయదు. తప్పుగా నిర్వహించడం లేదా దుర్వినియోగం చేయడం లాంటి యజమానుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన నష్టాలు కవర్ చేయబడవు
బులియన్లు, నాణేలు, కళాఖండాలు మొదలైనవి
పాలసీ అనేది వస్తువు కొనుగోలు చేసిన ఏడాది లోపల తీసుకోవాలి కాబట్టి, కొనుగోలు తేదీ నుండి 365 రోజుల కంటే ఎక్కువ పాతవైన టెలివిజన్‌ల కోసం ఇన్సూరెన్స్ చెల్లదు
పిడుగుపాటుతో కాకుండా, ఇంకేదైనా కారణంతో అగ్నిప్రమాదం జరిగితే
పాలసీ తీసుకునే సమయంలో, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి పారదర్శక పద్ధతిలో ఉత్పత్తి గురించిన సరైన సమాచారం అందించాలి. ఏదైనా ముఖ్యమైన సమాచారం అందించబడకపోతే లేదా ఉద్దేశపూర్వకంగా దానిని దాచిపెడితే, అది ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడదు
యజమానుల ఉద్దేశపూర్వక ప్రవర్తనతో జరిగిన డ్యామేజీలు ఈ పాలసీ క్రింద కవర్ చేయబడవు. విడిభాగాలు ప్రమాదవశాత్తూ విరిగిపోవడం లేదా డ్యామేజ్ కావడం, వాటిని నేల మీద పడేయడం లాంటివి కవర్ చేయబడవు
హోమ్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం క్యాలిక్యులేటర్ అనేది అండర్‌రైటింగ్ బృందం ద్వారా నిర్దేశించబడిన అనేక అంశాలు మరియు మార్గదర్శకాల ఆధారంగా పనిచేస్తుంది. మీరు మీ పాత ఇంటి కోసం మరియు కొత్తగా కొనుగోలు చేసిన ఇంటి కోసం కూడా హోమ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయవచ్చు. హోమ్ లోన్‌తో పాటు హోమ్ ఇన్సూరెన్స్ కూడా ఉండడాన్ని హోమ్ లోన్ ఇచ్చే చాలామంది తప్పనిసరి చేశారు. ఈ సందర్భంలో, ఇన్సూర్ చేయబడిన మొత్తం అనేది లోన్ మొత్తం లేదా ఇంటి పునరుద్ధరణ విలువ కావచ్చు. సాధారణంగా, ఇన్సూర్ చేసిన మొత్తం అనేది పునరుద్ధరణ విలువ (ఇంటి పునర్నిర్మాణం ఖర్చు) కోసం తీసుకోబడుతుంది. అయితే, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వంటి సంస్థలు మార్కెట్‌లో కొన్ని ఉత్పత్తులను అందుబాటులో ఉంచాయి, ఇవి మార్కెట్ విలువకు కూడా కవరేజీ అందిస్తాయి.
అగ్నిప్రమాదం లేదా దొంగతనం కారణంగా మీ ఇంటికి ఏదైనా నష్టం లేదా ప్రమాదం జరిగిన సందర్భంలో మీ హోమ్ ఇన్సూరర్‌లు మీకు మీ ఇంటిని తిరిగి అందిస్తారు. అయితే, హోమ్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియంను నిర్ణయించే అంశాలు అనేకం ఉన్నాయి. ప్రీమియంను నిర్ణయించడంలో క్రింద కొన్ని అంశాలు నిర్ణయాత్మకంగా ఉంటాయి.
1. కవరేజీ మొత్తం: కవరేజీ లేదా ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం అధికమయ్యే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది. ఇదే పరిస్థితి ప్రీమియం విషయంలోనూ వర్తిస్తుంది. 5 కోట్ల విలువైన ఒక ఫ్లాట్ కోసం హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది 1 కోటి ఇన్సూరెన్స్ ప్రీమియంతో పోలిస్తే, ఖచ్చితంగా అధికంగానే ఉంటుంది.
2. స్థానం: మీరు పల్లపు ప్రాంతంలో నివాసం ఉండడంతో పాటు మీ ప్రాంతానికి వరద ప్రమాదం పొంచి ఉంటే, మీ ప్రీమియం కొంత ఎక్కువగా ఉండవచ్చు. మీ నివాస స్థానం అనేది ప్రీమియంను నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ నివాసం ప్రైమ్ లొకేషన్‌లో ఉంటే, అప్పుడు మీ నిర్మాణ విలువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అధిక ప్రీమియంకు దారితీస్తుంది.
3. భద్రతా ఏర్పాట్లు: మీ ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ సురక్షితమైన ప్రదేశంలో ఉంటే లేదా ఆధునిక భద్రతా పరికరాలు కలిగి ఉంటే, దొంగతనం జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే, మీ ఇంట్లో గృహ భద్రతా గాడ్జెట్‌లు ఇన్‌స్టాల్ చేసి ఉంటే, అప్పుడు మీ ఇంట్లో దోపిడీ లేదా దొంగతనం జరిగే అవకాశాలు తగ్గుతాయి. ఇలా ప్రమాద అవకాశాలు తగ్గించిన కారణంగా, మీ ఇంటి కోసం ఇన్సూరెన్స్ యొక్క ప్రీమియం కూడా తగ్గుతుంది.
4. వస్తువుల విలువ: మీ ఇంట్లో విస్తృత శ్రేణిలో ఖరీదైన ఫర్నిచర్ మరియు ఎలక్ట్రానిక్స్ ఉంటే, అప్పుడు మీ ప్రీమియం కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు. వీటికి అదనంగా, ఆభరణాలు మరియు విలువైన వస్తువులు కవర్ చేయడానికి కూడా మీరు ఎంచుకుంటే, మీరు అదనపు ప్రీమియంతో వాటిని కూడా కవర్ చేయవచ్చు.
మీ హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కవర్ చేయని అదనపు అంశాలలో మీకు సహాయం అందించడానికి యాడ్ ఆన్ కవర్‌లు రూపొందించబడ్డాయి. మీరు ఎంచుకున్న ఏదైనా హోమ్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్ అనేది మీ అవసరాలు మరియు పరిస్థితులకు వర్తించేలా ఉండాలి. మీరు అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉన్నప్పటికీ, అది ఖచ్చితంగా ఖర్చుకు తగ్గ ఫలితం అందిస్తుంది. ఒక హోమ్ కవర్ కొనుగోలు చేసే సమయంలో మీరు పరిగణనలోకి తీసుకోవాల్సిన కొన్ని హోమ్-ఇన్సూరెన్స్ యాడ్-ఆన్‌లు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
1. పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరాల కవర్: మీకు గాడ్జెట్‌లు అంటే చాలా ఇష్టంతో పాటు మీ వద్ద ఖరీదైన గాడ్జెట్‌లు లేదా ఉపకరణాలు ఉన్నాయా? అయితే, మీ హోమ్ ఇన్సూరెన్స్ పోర్ట్‌ఫోలియోలో ఈ కవర్ అవసరం. ఈ యాడ్ ఆన్ కవర్‌తో మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా మీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను సురక్షితం చేసుకోవచ్చు. వివరంగా చెప్పాలంటే మీ ల్యాప్‌టాప్, కెమెరా, సంగీత పరికరాలు, క్రీడా పరికరాలు మొదలైన పోర్టబుల్ ఎలక్ట్రానిక్ వస్తువులు ఈ యాడ్ ఆన్ కవర్ కింద కవర్ చేయబడతాయి.
2. ఆభరణాలు మరియు విలువైన వస్తువుల కోసం కవర్: మీకు విలువైన ఆభరణాలు లేదా విలువైన వస్తువులు ఉండడంతో పాటు మరీ ముఖ్యంగా మీరు వాటిని ఇంటి వద్ద ఉంచుతుంటే, మీకు ప్రమాదం పొంచి ఉన్నట్లే! మీ ఇంటి పరిసరాలు తగినంతగా సురక్షితమైనవి కానప్పుడు, దొంగతనం లేదా దోపిడీ కారణంగా మీకు భారీ నష్టం వాటిల్లవచ్చు. అయితే, ఈ కారణంతో మీరు నిద్ర మానుకోవాల్సిన అవసరం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా ఆభరణాలు మరియు విలువైన వస్తువుల యాడ్ ఆన్ కవర్ ఉంది.
3. పెడల్ సైకిల్ కవర్: మీకు సైకిల్ తొక్కడమంటే ఇష్టమా, సైకిల్ తొక్కడం ద్వారా చెమటలు చిందించడమనేది మీ వ్యాయామంలో భాగంగా ఉంటోందా? అలాగైతే, మీ ప్రియమైన పెడల్ సైకిల్‌కు సంబంధించిన ఏవైనా థర్డ్ పార్టీ లయబిలిటీ లేదా మీ విశ్వసనీయ ఎక్సర్‌సైజ్ సైకిల్‌కు జరిగే నష్టాలు గురించిన ఆందోళనలు లేకుండా మీ సైక్లింగ్ కొనసాగించడానికి ఈ యాడ్ ఆన్ కవర్ ఉపయోగపడుతుంది. కాబట్టి, ప్రశాంతంగా మీ సైక్లింగ్ కొనసాగించండి.
4. తీవ్రవాదం కవర్:తీవ్రవాదం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక అతిపెద్ద ప్రమాదంగా మారుతోంది. తీవ్రవాద దాడుల కారణంగా అనేక ఇళ్లు ధ్వంసమైనప్పుడు, ఎవరైనా దురదృష్టకర పరిస్థితులో చిక్కుకుంటే, వాళ్ల కష్టం ఎలా ఉంటుందో మేము అర్థం చేసుకున్నాము. ఈ యాడ్-ఆన్ కవర్ అనేది అలాంటి నష్టాలను తగ్గించగలదు మరియు తీవ్రవాద చర్య లేదా దాడి కారణంగా మీ ఇంటి నిర్మాణం లేదా వస్తువులు నాశనమైతే, వాటి కోసం కవర్ అందిస్తుంది.
వర్షాకాలం కోసం సిద్ధంగా ఉండడంలో భాగంగా పైకప్పులు మరియు టెర్రస్‌లను నిరంతరం తనిఖీ చేయండి మరియు ఏవైనా పగుళ్లు ఉంటే, వాటిని మరమ్మత్తు చేయండి.
మీ ఇల్లు సురక్షితంగా మరియు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే, టెర్రస్‌లను వాటర్‌ప్రూఫింగ్ చేయించండి.
వర్షాకాలంలో చెక్క తలుపులు మరియు చెక్క నేలలు ఉబ్బే అవకాశం ఉంటుంది కాబట్టి, వాటిని బాగా పాలిష్ చేయండి మరియు పొడిగా ఉంచండి.
5. వర్షాకాలంలో ఇనుప గేట్‌లు తుప్పు పడుతాయి. అందుకే, వర్షాలు ప్రారంభం కావడానికి ముందే వాటికి పెయింట్ చేసినట్లు మరియు వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేస్తున్నట్లు నిర్ధారించుకోండి.
4. ఇంటిలో తేమ చేరడం వల్ల ఒక ఇబ్బందికర వాసన రావడంతో పాటు వస్త్రాలు మరియు తోలు ఉత్పత్తులు కూడా పాడైపోతాయి. అల్మారాల్లో కర్పూరం, వేపాకులు లేదా తేమను నిర్మూలించే ఉత్పత్తులు ఉంచే ప్రయత్నం చేయండి. అది మీ దుస్తులను రక్షిస్తుంది మరియు బ్యాగులు, పాదరక్షలు పాడు కాకుండా రక్షిస్తుంది. తేమ పీల్చే ఉత్పత్తులను ఇంట్లో ఉంచడం వల్ల అవి తేమను పీల్చేసుకుంటాయి మరియు ఇల్లు తాజాగా ఉంటుంది.