మల్టీ-ఇయర్ బైక్ ఇన్సూరెన్స్ అనేది దీర్ఘకాలిక నష్టం, దొంగతనం లేదా థర్డ్-పార్టీ లయబిలిటీ నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. సాధారణ సింగిల్-ఇయర్ ప్లాన్లకు వార్షిక రెన్యూవల్ అవసరం, కానీ, మల్టీ-ఇయర్ పాలసీలు మిమ్మల్ని కొన్ని సంవత్సరాల పాటు రెన్యూవల్‌కు దూరంగా ఉంచుతాయి మరియు మీ వాహనాన్ని ఇన్సూర్ చేస్తాయి. చెల్లుబాటు అయ్యే పాలసీ లేకుండా రైడింగ్ చేయడం వలన కలిగే పరిణామాల నుండి ఇది మిమ్మల్ని రక్షిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే మల్టీ-ఇయర్ బైక్ ఇన్సూరెన్స్‌తో, మీరు ప్రతి సంవత్సరం పాలసీని రెన్యూ చేయడం గురించి మర్చిపోవచ్చు మరియు మూడు సంవత్సరాల వరకు పూర్తి రక్షణతో మీ రైడ్‌ను ఆనందించవచ్చు.
మల్టీ-ఇయర్ ఇన్సూరెన్స్ మీకు వన్-టైమ్ ప్రీమియం చెల్లింపుతో ఒక ప్లాన్‌లో దీర్ఘకాలిక కవరేజీని అందిస్తుంది. వార్షిక రెన్యూవల్ గురించి చింతించకుండా ఈ సింగిల్ పాలసీ కొన్ని సంవత్సరాలపాటు అలాగే కొనసాగుతుంది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మీకు మల్టీ-ఇయర్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం ధరలపై ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తుంది. మీరు ఇటీవల కొత్త టూ వీలర్ వాహనాన్ని కొనుగోలు చేసినట్లయితే లేదా మీకు నచ్చిన బైక్‌ను చాలా సంవత్సరాల పాటు నడపాలని ప్లాన్ చేసుకున్నట్లయితే, మల్టీ-ఇయర్ పాలసీ తప్పనిసరిగా మీరు ఎంచుకోవలసిన ఇన్సూరెన్స్ ప్లాన్ అయి ఉండాలి, తద్వారా మీరు ఎక్కువ కాలం పాటు ఒత్తిడి లేని ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.
సమగ్ర టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ మీ బైక్/ స్కూటర్‌కు పూర్తి సంరక్షణను అందిస్తుంది. అగ్నిప్రమాదం, దొంగతనం, ప్రకృతి వైపరీత్యాలు, మానవ నిర్మిత ప్రమాదాలు మరియు ఇతర ఊహించని సంఘటనల కారణంగా తలెత్తే నష్టాల కోసం ఇది మీ వాహనానికి కవరేజీని అందిస్తుంది. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం, థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం తప్పనిసరి, అయితే, ఏవైనా బాహ్య నష్టాల నుండి మీ బైక్‌కు పూర్తి ఆర్థిక భద్రతను అందించే సమగ్ర టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం ఒక తెలివైన నిర్ణయం. అలాగే, భారతదేశంలో ఎక్కువగా వరదలు మరియు రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, ఇది మీ వాహనానికి తీరని నష్టాన్ని కలిగిస్తుంది. కావున, భారీ ఆర్థిక ఖర్చులను నివారించడానికి, మీ టూ వీలర్ కోసం సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ఒక తెలివైన నిర్ణయం. .
పర్సనల్ యాక్సిడెంట్ కవర్
థర్డ్-పార్టీ వ్యక్తికి ఏర్పడిన గాయాలు
థర్డ్ పార్టీ లయబిలిటీ
పాలసీ చెల్లుబాటు అయితే, ఎలాంటి జరిమానాలు విధించబడవు
ప్రయోజనకరమైన యాడ్-ఆన్‌ల ఎంపిక
ఈ పాలసీ థర్డ్ పార్టీ ఆస్తికి లేదా వాహనానికి జరిగిన నష్టాన్ని మరియు మూడు సంవత్సరాల వరకు థర్డ్ పార్టీ గాయం లేదా మరణం వంటి అన్ని థర్డ్ పార్టీ లయబిలిటీల నుండి దీర్ఘకాలిక కవరేజీని అందిస్తుంది. మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం, చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం తప్పనిసరి. అయితే, ఈ పాలసీ మీ టూ-వీలర్‌కు జరిగిన నష్టాలను లేదా దొంగతనాన్ని కవర్ చేయదు.
యాక్సిడెంట్, దొంగతనం, అగ్నిప్రమాదం మొదలైనవి.
పర్సనల్ యాక్సిడెంట్ కవర్
ప్రకృతి వైపరీత్యాలు
థర్డ్-పార్టీ లయబిలిటీ
యాడ్-ఆన్‌ల ఎంపిక
థర్డ్-పార్టీ పాలసీ కవర్ చేసే దాంతో పాటు, ఈ పాలసీ మీకు 5 సంవత్సరాల పాటు మీ టూ వీలర్ యొక్క సంపూర్ణ రక్షణ కోసం పూర్తి ప్యాకేజీని అందిస్తుంది. మీరు మీ అవసరాల ఆధారంగా ఈ పాలసీ అవధిని ఎంచుకోవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద మీరు, కాలక్రమేణా మీ కారు విలువ తగ్గకుండా దానిని రక్షించుకోవడానికి 'జీరో-డిప్రిసియేషన్ కవర్' లేదా 24x7 ఆన్-రోడ్ అసిస్టెన్స్‌ను పొందడానికి 'ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కవర్' లాంటి మీకు నచ్చిన కవర్లను ఎంచుకోవచ్చు.
పర్సనల్ యాక్సిడెంట్ కవర్
థర్డ్-పార్టీ ఆస్తి నష్టం
థర్డ్-పార్టీ వ్యక్తికి ఏర్పడిన గాయాలు
కిరాణా సరుకులను కొనుగోలు చేసేటప్పుడు మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తారు, కొన్ని రోజుల పాటు అవి నిల్వ ఉండేలా చూసుకుంటారా లేదా ప్రతిరోజూ సూపర్ మార్కెట్‌కు వెళ్లి కొనుగోలు చేస్తుంటారా? మీకు ఎంచుకునే అవకాశం ఇస్తే, మీకు కొంత కాలం తరువాత ఖచ్చితంగా అవసరం అని మీరు భావిస్తే మీరు కొన్ని రోజుల పాటు నిల్వ చేసుకోవడానికే ఎంచుకుంటారు. మీ టూ వీలర్ వాహనాన్ని ఖచ్చితంగా మూడు సంవత్సరాల పాటు ఉపయోగిస్తున్నట్లయితే, ఒక సింగిల్ ఇయర్ పాలసీ కంటే మల్టీ ఇయర్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంచుకోవడం కూడా అదే విధంగా ఉంటుంది. ఒక మల్టీ ఇయర్ ప్లాన్ కొనుగోలు చేయడం వలన ప్రతి సంవత్సరం రెన్యూ చేసే ఇబ్బంది తొలగిపోతుంది మరియు ప్రీమియం పై డిస్కౌంటుతో మీ డబ్బు కూడా ఆదా అవుతుంది.
పారామీటర్లు | సింగిల్ ఇయర్ | మల్టీ-ఇయర్ |
రెన్యూవల్ | ప్రతి సంవత్సరం | 3-5 సంవత్సరాలకి ఒకసారి |
ఇన్సూరెన్స్ వార్షిక ఖర్చు | ఎక్కువ | తక్కువ |
ప్రీమియం పై డిస్కౌంట్ | అందుబాటులో లేదు | అందుబాటులో లేదు |
సౌలభ్యం | ఎక్కువ | తక్కువ |
NCB డిస్కౌంట్ | తక్కువ NCB డిస్కౌంట్‌ను క్లెయిమ్ చేయవచ్చు మోటార్ టారిఫ్ ప్రకారం | అధిక NCB డిస్కౌంట్‌ను క్లెయిమ్ చేయవచ్చు మోటార్ టారిఫ్ ప్రకారం |
ఇది ఎవరి కోసం? | 3 సంవత్సరాల కన్నా తక్కువ వినియోగం గల వాహనాలను కలిగిన యజమానుల కోసం | 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు వాహనాలను వినియోగించే యాజమానుల కోసం |
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మల్టీ ఇయర్ బైక్ ఇన్సూరెన్స్‌ను దీర్ఘకాలిక బైక్ ఇన్సూరెన్స్ అని కూడా పిలుస్తారు, ఇది మీకు రెండు రకాల పాలసీ ప్లాన్లను అందిస్తుంది. దీర్ఘకాలిక థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఐదు సంవత్సరాల వరకు ఆస్తి లేదా వాహనానికి నష్టం, వ్యక్తిగత గాయం లేదా మరణం క్లెయిమ్‌లతో సహా అన్ని థర్డ్ పార్టీ బాధ్యతల నుండి దీర్ఘకాలిక రక్షణను అందిస్తుంది. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం, ప్రతి టూవీలర్ మోటారు వాహనానికి, కనీసం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కవరేజీని ఉండాలి. అయితే, ఈ పాలసీ మీ టూ-వీలర్‌ను దొంగతనం లేదా వాహన నష్టం నుండి రక్షించదు.
మరోవైపు, ప్రైవేట్ బండిల్డ్ కవర్ పాలసీ, థర్డ్-పార్టీ పాలసీ కవర్ చేసే దాంతో పాటు, మీ టూ వీలర్ వాహనానికి ఐదు సంవత్సరాల వరకు సమగ్ర రక్షణ యొక్క సమగ్ర ప్యాకేజీని అందిస్తుంది. మీ అవసరాలను బట్టి మీరు ఈ పాలసీ నిబంధనలను ఎంచుకోవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద మీరు ఎంచుకున్న యాడ్-ఆన్ కవర్లను కొనుగోలు చేసే అవకాశం కూడా మీకు ఉంటుంది, అంటే, కాలక్రమేణా మీ టూ వీలర్ విలువ తగ్గకుండా ఉండటానికి జీరో డిప్రిసియేషన్ బైక్ ఇన్సూరెన్స్ కవర్ లేదా రౌండ్-ది-క్లాక్ ఆన్-రోడ్ అసిస్టెన్స్ కవర్ లాంటి వాటిని ఎంచుకోవచ్చు.
దీర్ఘకాలిక బైక్ ఇన్సూరెన్స్ ఫీచర్లలో ఇవి ఉంటాయి-
ఇప్పుడు మీ టూ వీలర్ వాహనానికి మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా రక్షణ కలిపించవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి మల్టీ-ఇయర్ ఇన్సూరెన్స్ పాలసీని 4 సులభమైన దశల్లో కొనుగోలు చేయండి.
మీ మల్టీ ఇయర్ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రీమియంలను ప్రభావితం చేయగల కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి-
మీరు బైకును వినియోగిస్తున్నప్పుడు అది అరుగుదల మరియు తరుగుదలకు లోనవుతుంది, దీంతో మార్కెట్ విలువ తగ్గుతుంది. ఇది మార్కెట్ విలువలో తగ్గుదలకు దారితీస్తుంది. ఆటో ఇన్సూరెన్స్ కంపెనీలు డిప్రిసియేషన్‌ను భిన్నంగా లెక్కిస్తాయి. మీ బైక్ విలువ తగ్గితే మీ ఇన్సూరెన్స్ రేటు కూడా తగ్గుతుందని గుర్తుంచుకోండి. ఇది టూ వీలర్ ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువతో కలిసి పనిచేస్తుంది.
ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ లేదా IDV లేదా మీ బైక్ ప్రస్తుత మార్కెట్ విలువను నిర్ణయిస్తుంది. ఒక క్లెయిమ్ సందర్భంలో ఇన్సూరెన్స్ ప్రొవైడర్ మీకు అందించే గరిష్ట మొత్తాన్ని ఇది సూచిస్తుంది. IDV ప్రాతిపదికన ఇది మీ ప్రీమియంను నేరుగా లెక్కిస్తుంది. మంచి విషయం ఏమిటంటే, ఇది ముందుగా నిర్ణయించిన IDV యొక్క నిర్దిష్ట పరిధిలో ఉన్నంత వరకు ఇన్సూరెన్స్ కంపెనీలు మీ స్వంత IDVని ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. మీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీరు ఎంచుకున్న IDV మొత్తానికి నేరుగా అనులోమానుపాతంలో పెరుగుతుంది మరియు విరుద్ధంగా ఉంటుంది.
NCB అనేది సురక్షితమైన డ్రైవింగ్ మరియు సాధారణ ఇన్సూరెన్స్ రెన్యూవల్‌ను ప్రోత్సహించడానికి పాలసీ ప్రీమియంపై ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే ప్రత్యేక తగ్గింపు. మీరు ఐదు సంవత్సరాల పాటు ఎటువంటి క్లెయిమ్ ఫైల్ చేయకుండా ఉన్నట్లయితే, క్లెయిమ్ రహిత మొదటి సంవత్సరంలో డిస్కౌంట్ 20% నుండి 50% కు పెరుగుతుంది. అయితే, దీనిని సాధించడానికి, ఇన్సూరెన్స్ నిరంతరం రెన్యూ చేయబడుతుందని మరియు గడువు ముగియకుండా ఉండే విధంగా మీరు నిర్ధారించుకోవాలి.
రక్షణ పరిధి మరియు రక్షణ స్వభావాన్ని విస్తరించడానికి, బైక్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు మీ ఇన్సూరెన్స్ పాలసీ పై మీకు అనేక యాడ్-ఆన్‌లను అందిస్తారు. అయితే, మీరు ఎంచుకునే యాడ్-ఆన్‌లు పెరిగినట్లయితే మీ బైక్ ఇన్సూరెన్స్ ధర కూడా పెరుగుతుంది, ఎందుకంటే ఈ యాడ్-ఆన్‌లు అనేవి అదనం.
మీరు దీర్ఘకాలిక బైక్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవడానికి ముందు, కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి-
బైక్ వయస్సు | డిప్రిసియేషన్ |
6 నెలల కన్నా తక్కువ | 5% |
6 నెలల నుండి 1 సంవత్సరం వరకు | 15% |
1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు | 20% |
2 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు | 30% |
3 సంవత్సరం నుండి 4 సంవత్సరాల వరకు | 40% |
4 సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు | 50% |