బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్ అనేది ఒక ఆన్‌లైన్ లెక్కింపు సాధనం. ఇది పాలసీదారుని వాహనం యొక్క తయారీ, మోడల్/ వేరియంట్, వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్, RTO లొకేషన్ మరియు టూ వీలర్ కొనుగోలు చేసిన సంవత్సరం వంటి కొన్ని ప్రాథమిక వివరాలను అందించడం ద్వారా టూ వీలర్ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించడానికి సహాయపడుతుంది. టూ వీలర్ పాలసీని కొనుగోలు చేయడానికి ముందుగా ప్రీమియం లెక్కించడం వలన, వివిధ ఇన్సూరెన్స్ సంస్థల నుండి పాలసీ కోట్‌లను పొందడానికి, వాటిలో సరసమైనది ఎంచుకోవడానికి మెరుగైన అవగాహనను అందిస్తుంది, తద్వారా సరైన కొనుగోలు నిర్ణయం తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది.
బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి ముందు టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్లను సరిపోల్చడం చాలా ముఖ్యం మరియు పాలసీకి సంబంధించి మీరు చెల్లించే ప్రీమియం మొత్తాన్ని చెక్ చేయడం చాలా ముఖ్యం. బైక్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించడం ఎందుకు ముఖ్యమో అని మీకు అర్థమయ్యేలా కొన్ని కారణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
• ఇది మీరు కొనుగోలు చేయడానికి ముందు, మీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించుకోవడంలో సహాయపడుతుంది.
• మీ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం ఒక మంచి నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుంది.
• మీ సొమ్ము ఆదా చేస్తుంది మరియు ఖర్చుకు తగ్గ ఫలితం అందిస్తుంది
• ఏదైనా ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ మోసం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.
బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించడం చాలా సులభం. మీరు బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ పేజీలోకి ప్రవేశించిన తర్వాత, మీ టూ వీలర్ మరియు ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ రకానికి (సమగ్ర/ లయబిలిటీ) చెందిన తప్పనిసరి వివరాలను పేర్కొనండి, బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను అర్థం చేసుకోవడానికి, లెక్కించడానికి క్రింది దశలను పరిశీలించండి.
• తయారీ మరియు మోడల్ వంటి మీ టూ వీలర్ వెహికల్ ఇన్సూరెన్స్ వివరాలను పూరించండి
• వాహనం ఎక్స్-షోరూమ్ ధర, నగరం మరియు కొనుగోలు సంవత్సరం నమోదు చేయండి
• మీ బైక్‌పై గత సంవత్సరం చేసిన ఏదైనా క్లెయిమ్ వివరాలను ఎంచుకుని దానిని సబ్మిట్ చేయండి
• బైక్ ఇన్సూరెన్స్‌లో ఐడివి మరియు మీ టూ వీలర్ వాహనం ప్రీమియం కోట్ చూపబడుతుంది
• మీ అవసరానికి అనుగుణమైన ప్లాన్ (సమగ్ర/మూడవ పార్టీ) ఎంచుకోండి
• మీ బైక్ ఇన్సూరెన్స్ కోసం యాడ్-ఆన్ కవర్లను ఎంచుకోండి