ఏ రవాణా వ్యవస్థలోనైనా ట్రాక్టర్లు మరియు దృఢమైన ఇతర వాణిజ్య వాహనాలనేవి కీలకంగా ఉంటాయి. రోడ్ల మీద సత్తా చాటడానికి ఈ దృఢమైన, ఆధారపడదగిన వాహనాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో అత్యంత చౌక ధరలో, సకాలంలో మరియు ప్రొఫెషనల్ సంరక్షణ నిర్ధారించుకోండి.
ఆర్థిక భారం తగ్గించడం కోసం ప్రమాదం కారణంగా ఏర్పడిన నష్టాలను మేము కవర్ చేస్తాము.
ఈ సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది దొంగతనం కారణంగా మీ ట్రాక్టర్‌కు ఏర్పడిన నష్టం లేదా డ్యామేజీని కవర్ చేస్తుంది.
మీ వద్ద సమగ్ర కవరేజ్ ఉంటే, వరదలు, భూకంపం మరియు కొండచరియలు విరిగిపడడం లాంటి వైపరీత్యాల కారణంగా మీ వాహనాన్ని ఏర్పడే డ్యామేజీలు కవర్ చేయబడుతాయి. అల్లర్లు వంటి మానవ ప్రమేయ ప్రమాదాల నుండి కూడా మేము మీ వాహనాన్ని కవర్ చేస్తాము.
డ్రైవర్‌కు చికిత్స కోసం ఖర్చును కవర్ చేస్తుంది. కొంచెం ఎక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా ప్రయాణీకులకు కూడా కవర్ లభిస్తుంది.
పాలసీదారు కారణంగా మూడవ పార్టీ వ్యక్తికి ఎదురయ్యే ప్రమాదవశాత్తు మరణం లేదా శారీరక గాయాలు.
థర్డ్ పార్టీ ఆస్తికి లేదా మరేదైనా ఆస్తికి జరిగిన అన్ని నష్టాలను కూడా ఈ పాలసీ కవర్ చేస్తుంది.
కాలం గడిచే కొద్దీ, ట్రాక్టర్ విలువలో తరుగుదలను మేము కవర్ చేయము.
మా మిస్-డి ట్రాక్టర్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద ఏదైనా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ బ్రేక్ డౌన్‌లు కవర్ చేయబడవు.
మీకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మీ మిస్ డి ట్రాక్టర్ ఇన్సూరెన్స్ ద్వారా ఎలాంటి ప్రయోజనం లభించదు. డ్రగ్స్/ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం మరింత చదవండి...
1.6+ కోట్ల చిరునవ్వులు సురక్షితం చేయబడ్డాయి!@
మీకు అవసరమైన సపోర్ట్ 24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
#1.6+ కోట్ల చిరునవ్వులు సెక్యూర్ చేయబడ్డాయి
మీకు అవసరమైన సపోర్ట్-24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
చాలా సులభంగా, క్లెయిమ్-రహిత సంవత్సరం తర్వాత మీ పాలసీని రెన్యూ చేసేటప్పుడు చెల్లించవలసిన స్వంత డ్యామేజ్ ప్రీమియంలో ఇది ఒక డిస్కౌంట్. ఇది జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడానికి, ప్రమాదాలను నివారించడానికి ఒక ప్రోత్సాహకం.
అన్ని రకాల వాహనాలు | ఓన్ డ్యామేజ్ ప్రీమియంపై % తగ్గింపు |
---|---|
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి పూర్తి సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు | 20% |
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 2 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు | 25% |
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 3 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు | 35% |
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 4 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు | 45% |
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 5 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు | 50% |
వాహనం యొక్క ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువ (IDV) 'ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం'గా పరిగణించబడుతుంది, ప్రతి ఇన్సూరెన్స్ చేయబడిన వాహనానికి ప్రతి పాలసీ వ్యవధి ప్రారంభంలో ఇది నిర్ణయించబడుతుంది.
వాహనం IDV అనేది బ్రాండ్ తయారీదారు జాబితా చేసిన అమ్మకం ధర మరియు ఇన్సూరెన్స్/రెన్యూవల్ ప్రారంభంలో ఇన్సూరెన్స్ కోసం ప్రతిపాదించిన వెహికల్ మోడల్ ఆధారంగా నిర్ణయించబడుతుంది, అలాగే డిప్రిసియేషన్ కోసం సర్దుబాటు చేయబడుతుంది (క్రింద పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం). సైడ్ కార్(లు)
వాహనం యొక్క వయస్సు | IDV నిర్ణయించడానికి % లో డిప్రిసియేషన్ |
---|---|
6 నెలలకు మించనిది | 5% |
6 నెలలకు మించి కానీ 1 సంవత్సరం మించనిది | 15% |
1 సంవత్సరం మించి కానీ 2 సంవత్సరాలు మించనిది | 20% |
2 సంవత్సరాలు మించి కానీ 3 సంవత్సరాలు మించనిది | 30% |
3 సంవత్సరాలు మించి కానీ 4 సంవత్సరాలు మించనిది | 40% |
4 సంవత్సరాలు మించి కానీ 5 సంవత్సరాలు మించనిది | 50% |