తీవ్రమైన పరిణామాలను నివారించడానికి ప్రతి పాలసీదారు గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ పాలసీని సకాలంలో రెన్యూ చేసుకోవాలి. గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ పాలసీతో కారును నడపడం ద్వారా మీరు చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా, ప్రమాదం జరిగిన సందర్భంలో మీ కారు కోసం ఇన్సూరెన్స్ రక్షణను కూడా కోల్పోతారు. భారతీయ రోడ్లపై ప్రతి సంవత్సరం సుమారుగా అర మిలియన్ రోడ్ల ప్రమాదాలు జరుగుతాయి, ఫలితంగా వాహనాలకు గణనీయమైన నష్టం జరుగుతుంది. చెల్లుబాటు అయ్యే కారు ఇన్సూరెన్స్ పాలసీ లేకపోవడం వలన, ఒక ఊహించని సంఘటన కారణంగా అది దెబ్బతిన్నట్లయితే మీరు వాహనం మరమ్మత్తు కోసం భారీ ఖర్చులను భరించాలి. అలాగే, మీరు గడువు ముగిసిన కారు ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేయకపోతే, మీరు రెన్యూవల్ డిస్కౌంట్లు మరియు నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాలను కోల్పోవచ్చు. అందువల్ల, అంతరాయం లేని కవరేజీలు మరియు ప్రయోజనాలను ఆనందించడానికి కారు ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో రెన్యూ చేయడం తెలివైన నిర్ణయం.
అందుకే, కార్ ఇన్సూరెన్స్ పాలసీని సకాలంలో రెన్యూవల్ చేయాల్సిన ప్రాముఖ్యతను హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోలో మేము అర్థం చేసుకున్నాము. అందుకే గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ కోసం సులభమైన మరియు అవాంతరాలు-లేని రెన్యూవల్‌ను అనుమతించడం ద్వారా మీ ఇన్సూరెన్స్ అవసరాలు తీర్చడంలో మేము మీకు సహాయపడతాము.
ప్రయోజనం | వివరణ |
థర్డ్ పార్టీ కవరేజ్ | ఇన్సూర్ చేయబడిన వ్యక్తి వాహనానికి సంబంధించిన ప్రమాదం సంభవించినప్పుడు, మీరు గడువు ముగిసిన కారు ఇన్సూరెన్స్ పాలసీని సకాలంలో రెన్యూ చేస్తే థర్డ్ పార్టీ నష్టాలకు సంబంధించిన ఖర్చులను ఇన్సూరర్ భరిస్తుంది. దీనిలో ఆస్తులు లేదా భవనాలకు నష్టం మరియు వైకల్యానికి దారితీసే గాయాలు లేదా ఒక వ్యక్తికి (థర్డ్-పార్టీ) మరణం లాంటివి ఉండవచ్చు. |
సమగ్ర కవరేజ్ | గడువు ముగిసిన కారు బీమాను ఆన్‌లైన్‌లో పునరుద్ధరించడం ద్వారా, మీరు కొండచరియలు విరిగిపడటం, భూకంపం, వరదలు, తుఫాను మొదలైన ప్రకృతి వైపరీత్యాల నుండి కవరేజీని పొందడం కొనసాగిస్తారు. దీనితో పాటు దొంగతనం, విధ్వంసం, దోపిడీ, అల్లర్లు మొదలైన మానవ నిర్మిత విషాదాలకు కూడా మీరు కవరేజీని పొందుతారు. |
నో క్లెయిమ్ బోనస్ (NCB) | మీరు పాలసీ వ్యవధిలో క్లెయిమ్ చేయకుండా గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసినప్పుడు, మీరు NCB ప్రయోజనం కోసం అర్హత పొందుతారు. ఇది ఇన్సూరెన్స్ ప్రీమియంపై డిస్కౌంట్, పాలసీ రెన్యూవల్ సమయంలో మీరు ఉపయోగించవచ్చు. డిస్కౌంట్ మొదటి సంవత్సరానికి కనీసం 20% నుండి ప్రారంభమవుతుంది మరియు వరుసగా ఐదవ నో క్లెయిమ్ సంవత్సరం కోసం 50% వరకు వెళ్తుంది. |
కార్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ | గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్‌ను ఆన్‌లైన్‌లో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్ ద్వారా చేయవచ్చు. మీరు మీ వాహనం, మునుపటి పాలసీ గురించిన కొన్ని వివరాలను నమోదు చేయవచ్చు మరియు కొన్ని నిమిషాల్లోనే ఆన్‌లైన్‌లో పాలసీని కొనండి. |
భద్రత | గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేయడం ద్వారా, మీరు భద్రతను పొందుతారు. ఇది మనశ్శాంతిగా డ్రైవ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు ప్రమాదం యొక్క ఆర్థిక పరిణామాల గురించి ఆందోళన చెందకుండా చేస్తుంది. |
ఫీచర్ | వివరణ |
థర్డ్ పార్టీ నష్టం | ఇన్సూర్ చేయబడిన వ్యక్తి యొక్క వాహనంతో జరిగిన ప్రమాదం కారణంగా థర్డ్ పార్టీలకు సంభవించే గాయాలు లేదా మరణాలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజ్ డబ్బు రూపంలో పరిహారం చెల్లిస్తుంది. ఇది వారి ఆస్తి నష్టాన్ని కూడా కవర్ చేస్తుంది. |
ఓన్ డ్యామేజ్ కవర్ | ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు, మానవ నిర్మిత విపత్తులు, అగ్నిప్రమాదం మరియు ఢీకొనడం కారణంగా వాహనం యొక్క నష్టాన్ని ఈ పాలసీ కవర్ చేస్తుంది. |
నో క్లెయిమ్ బోనస్ | NCB ప్రయోజనాలను పొందడం ద్వారా మీరు మీ ఇన్సూరెన్స్ ప్రీమియంను 20% నుండి 50% వరకు తగ్గించుకోవచ్చు. పాలసీ వ్యవధిలో క్లెయిమ్ చేయకపోవడం ద్వారా మీరు నో క్లెయిమ్ బోనస్‌ను ఉపయోగించవచ్చు. |
చవకైన ప్రీమియంలు | హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కార్ ఇన్సూరెన్స్ ధర ₹2,094 నుండి ప్రారంభమవుతుంది. |
నగదు రహిత గ్యారేజీలు | హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 8700+ కంటే ఎక్కువ నెట్‌వర్క్ గ్యారేజీలను కలిగి ఉంది, ఇది ఉచిత మరమ్మత్తులు మరియు భర్తీ సేవలను అందిస్తుంది. |
రైడర్స్ | మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేస్తే, మీరు 8+ రైడర్ల నుండి ఎంచుకోవచ్చు. దీనిలో నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్ కవర్ ఉంటుంది, జీరో డిప్రిసియేషన్, ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ రక్షణ మొదలైనవి ఉంటాయి. |
మీరు మీ కారు ఇన్సూరెన్స్‌ను సకాలంలో రెన్యూ చేసుకోవడం మిస్ అయినప్పటికీ, ఈ 3 కారణాలతో గడువు ముగిసిన కారు ఇన్సూరెన్స్ రెన్యూవల్ ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకుంటారు.
అవును, మీరు చేయవచ్చు. ఒక దురదృష్టకరమైన పరిస్థితిలో, మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీని గడువు ముగిసేలోపు రెన్యూ చేయడం మర్చిపోయినా లేదా మిస్ అయినా మీరు దాని వలన కలిగే నష్టం నుండి తప్పించుకోవచ్చు. గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్‌ను ఎలా రెన్యూ చేయాలి అని ఆలోచిస్తున్నారా?? మీ కార్ ఇన్సూరెన్స్ గడువు ముగిసినట్లయితే మరియు దానిని రెన్యూ చేసుకోవాలని అనుకుంటే మీకు రెండు రకాల పరిస్థితులు ఉంటాయి-
గడువు ముగిసేలోపు లేదా గ్రేస్ పీరియడ్ ముగిసేలోపు కారు ఇన్సూరెన్స్‌ను కారు యజమాని రెన్యూ చేయకపోతే ఏమి జరుగుతుంది?? పరిణామాలు ఏమిటి?? కార్ ఇన్సూరెన్స్ పాలసీ లేకపోతే మీరు ఏ పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందో అర్థం చేసుకోవడానికి క్రింది వివరాలను చదవండి-
భారతదేశ రహదారులపై మోటార్ వాహనాన్ని నడపడానికి ఉన్న ప్రాథమిక అవసరాలలో ఇన్సూరెన్స్ పాలసీ (థర్డ్ పార్టీకి కనీసం) ఒకటి. మీ పాలసీ గడువు ముగిసినట్లయితే, రోడ్లపై డ్రైవ్ చేయడానికి మీరు చట్టపరంగా అర్హులు కారు. పాలసీ లేకుండా మీరు డ్రైవ్ చేసినప్పుడు మిమ్మల్ని ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటే, మీరు చట్టపరంగా తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుంది, వీటిలో జరిమానా మరియు కారాగార శిక్ష కూడా ఉండవచ్చు. కాబట్టి, మీరు గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్‌ను వీలైనంత త్వరగా రెన్యూ చేసుకోవడం అవసరం
నో క్లెయిమ్ బోనస్ వలన మీ పాలసీ రెన్యూవల్ పై డిస్కౌంట్లు మరియు ఆఫర్లను మీరు పొందవచ్చు. మీరు ఒక పాలసీ సంవత్సరం అంతటా ఎటువంటి క్లెయిమ్ చేయనప్పుడు ఇది జమ చేయబడుతుంది. కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ గ్రేస్ వ్యవధిలో కూడా మీరు సకాలంలో పాలసీని రెన్యూ చేయకపోతే ఈ కష్టపడి సంపాదించిన బోనస్ కోల్పోతారు
పాలసీ లేకపోతే కవరేజ్ కూడా ఉండదు. కాబట్టి, మీ వద్ద చెల్లుబాటు అయ్యే కారు ఇన్సూరెన్స్ పాలసీ లేకపోతే మీ కారును రోడ్డు పైకి తీసుకురాకపోవడం మంచిది. లేకపోతే, మీరు ప్రమాదానికి గురైతే మరియు అది మీ స్వంత నష్టం లేదా థర్డ్-పార్టీ నష్టాన్ని కలిగించినట్లయితే, అన్ని మరమ్మత్తు ఖర్చులు మీరు భరించవలసి ఉంటుంది. పాలసీ ఏదీ లేనందున, మీ ఇన్సూరెన్స్ సంస్థ నుండి మీరు ఎటువంటి పరిహారం మరియు సహాయం అందుకోరు
చివరిలో, మీ కార్ ఇన్సూరెన్స్ గడువు ముగిసినట్లయితే మీరు పూర్తిగా కొత్త పాలసీని కొనుగోలు చేయాలి. ఈ సారి, ఈ ప్రక్రియ చాలా సుదీర్ఘంగా మరియు సమయం తీసుకునేదిగా ఉండవచ్చు. ఇన్సూరెన్స్ ప్రొవైడర్ తనిఖీని కూడా నిర్వహించవచ్చు. ఎందుకంటే, పాలసీ ఎక్కువ కాలం పాటు రెన్యూ చేయబడనందున పాలసీని ఆమోదించడానికి ముందు కంపెనీ మీ కారును తనిఖీ చేయాలని భావించవచ్చు. కాబట్టి, కారు పరిస్థితి బాగుంది అని నిర్ధారించడానికి, వారు తనిఖీని నిర్వహించవచ్చు. ఆ విధంగా, ఈ చర్యలు అన్నీ చివరికి పాలసీ కొనుగోలు ప్రక్రియ నెమ్మదిగా సాగేటట్లు చేస్తాయి.
గడువు ముగిసిన తర్వాత మోటార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ వీలైనంత త్వరగా చేయబడాలి. మీరు గ్రేస్ వ్యవధిలో అలా చేస్తే, ప్రీమియంను తగ్గించడానికి మీ NCB మరియు ఇతర ప్రయోజనాలను ఉపయోగించే అవకాశం మీకు ఇప్పటికీ ఉంటుంది. కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను తగ్గించడంలో మీకు సహాయపడే కొన్ని సులభమైన మరియు ప్రాక్టికల్ చిట్కాలు క్రింద ఇవ్వబడ్డాయి-
ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ప్రక్రియ మధ్య కొన్ని భేదాలు ఉన్నాయి. మెరుగ్గా అర్థం చేసుకోవడానికి క్రింద ఉన్న పట్టికను చూడండి-
గడువు ముగిసిన కారు ఇన్సూరెన్స్ రెన్యూవల్ ఆన్‌లైన్ | గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ఆఫ్‌లైన్ |
ఆన్‌లైన్ ప్రక్రియకు సమయ పరిమితి లేదు. మీరు మీ సౌలభ్యం ప్రకారం ఎప్పుడైనా దాన్ని చేయవచ్చు. పోర్టల్ 24*7 అందుబాటులో ఉంటుంది | మీ పాలసీని ఆఫ్‌లైన్‌లో రెన్యూ చేసుకోవడానికి, మీరు ఇన్సూరెన్స్ కంపెనీ కార్యాలయాన్ని సందర్శించాలి. నిర్ణీత పని రోజులు మరియు సమయాలు ఉంటాయి |
ఆన్‌లైన్ ప్రక్రియ మరింత పారదర్శకమైనది మరియు వేగవంతమైనది | ఆఫ్‌లైన్ ప్రక్రియ పారదర్శకంగా ఉండకపోవచ్చు మరియు ఆన్‌లైన్ కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది |
ఆన్‌లైన్ ప్రక్రియలో, మీరు ఏకైక నిర్ణయం తీసుకునేవారు మరియు థర్డ్ పార్టీ ప్రభావం ఏదీ ఉండదు | ఆఫ్‌లైన్ ప్రక్రియలో, ఆఫీసులో ఉన్న థర్డ్-పార్టీ ఉద్యోగులు మీ నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చు |
ఇన్సూరెన్స్ సంస్థ వెబ్‌సైట్‌లో కొన్ని క్లిక్‌లలో, మీరు మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసుకోవచ్చు | గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఆఫ్‌లైన్‌లో రెన్యూ చేయడానికి, మీరు శాఖను సందర్శించి డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి, దీని కోసం సమయం వెచ్చించవలసి ఉంటుంది మరియు శ్రమ పడవలసి ఉంటుంది |
పాలసీ రెన్యూవల్ సమయంలో, మీరు త్వరగా తనిఖీ చేయవచ్చు మరియు కారు ఇన్సూరెన్స్ ప్లాన్లను సరిపోల్చవచ్చు | ఆన్‌లైన్ పోలికతో పోలిస్తే వివిధ ప్లాన్లను ఆఫ్‌లైన్‌లో పోల్చడం సవాలుగా ఉండవచ్చు |
కార్ ఇన్సూరెన్స్ గడువు తేదీని ఆన్‌లైన్‌లో ఎలా తనిఖీ చేయాలి అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఈ ప్రక్రియ చాలా సులభం. IIB (ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) అనే పోర్టల్‌ను IRDAI ప్రవేశపెట్టింది. ఇది 1 ఏప్రిల్ 2010 తర్వాత కొనుగోలు చేసిన పాలసీల వివరాలను మీకు అందిస్తుంది.
దశ 1
IIB పోర్టల్‌ను సందర్శించండి మరియు 'త్వరిత లింకులు' పై క్లిక్ చేయండి
దశ 2
కోరిన విధంగా కారు మరియు యజమాని యొక్క వివరాలను నమోదు చేయండి. ఇన్సూరెన్స్ వివరాలను చూడటానికి సబ్మిట్ చేయండి.
దశ 1
వాహన్ ఇ-సర్వీసులకు లాగిన్ అవ్వండి. 'మీ వాహనం వివరాలను తెలుసుకోండి' పై క్లిక్ చేయండి
దశ 2
కారు యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ వంటి అడిగిన వివరాలను నమోదు చేయండి
దశ 3
ఇప్పుడు, 'వాహనాన్ని శోధించండి' ఎంపికపై క్లిక్ చేయండి
దశ 4
మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు తేదీతో సహా అన్ని వివరాలు మీ స్క్రీన్ పై ప్రదర్శింపబడతాయి
మేము మీ సమయం విలువను అర్థం చేసుకున్నాము. అందుకే, ఒక సులభమైన మరియు అవాంతరాలు-లేని ప్రక్రియను అందించడం ద్వారా, గడువు ముగిసిన మీ కార్ ఇన్సూరెన్స్‌ను హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో రెన్యూవల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాము.
మీరు చేయవలసిందల్లా ఈ సులభమైన దశలను అనుసరించండి:
కారు ఇన్సూరెన్స్ ప్రీమియంలను లెక్కించడం చాలా సులభం మరియు వేగవంతం. కారు ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్ అని పిలువబడే ఆన్‌లైన్ డిజిటల్ టూల్, మీకు అవసరమైనది. చాలామంది ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు వారి అధికారిక వెబ్‌సైట్‌లో ఉచిత ప్రీమియం కాలిక్యులేటర్‌ను అందిస్తారు. వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వండి మరియు దానిని ఉపయోగించడానికి ప్రీమియం కాలిక్యులేటర్‌పై క్లిక్ చేయండి. మీరు చేయవలసిందల్లా కొన్ని వివరాలను సమర్పించడం మరియు మీరు చెల్లించవలసిన ప్రీమియంను కాలిక్యులేటర్ మీకు చూపుతుంది.
• గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసేటప్పుడు మీరు ఇన్సూరర్‌ను మార్చవచ్చు. కొత్త ఇన్సూరర్‌ను ఎంచుకునేటప్పుడు మీరు ప్రాథమిక పరిశోధనను నిర్వహించాలి. మీరు వారి క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి, నెట్‌వర్క్ గ్యారేజీలు మొదలైనవాటిని తనిఖీ చేయవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 100% క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి రికార్డును కలిగి ఉంది.
• ప్రస్తుత కార్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగియడానికి సమీపంలో ఉన్నప్పుడు మీరు కార్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను కూడా మార్చవచ్చు. ఇది కాకుండా, ప్రస్తుత ఇన్సూరర్‌తో చెడు క్లెయిమ్ అనుభవం సందర్భంలో మీరు మరొక పాలసీ మిడ్-కవరేజ్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు.
• మీరు గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసినప్పుడు, ఇన్సూరర్ మీ లొకేషన్‌ను సందర్శించి వాహనాన్ని తనిఖీ చేయమని ఒక సర్వేయర్‌ను అడుగుతారు. వారి రిపోర్ట్ ఆధారంగా, ఇన్సూరర్ మీ కొత్త కార్ ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం ప్రీమియం రేటును నిర్ణయిస్తారు. అయితే, ఈ ప్రాసెస్ చాలా కాలం మరియు సమయం తీసుకుంటుంది. అందువల్ల, మీరు స్వీయ-తనిఖీని ఎంచుకోవచ్చు.
• కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ సమయంలో స్వీయ తనిఖీ ప్రాసెస్‌లో, మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి వాహనం వీడియోను తీసి, దానిని మా యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. మేము వీడియోను మూల్యాంకన చేస్తాము మరియు కొత్త కార్ ఇన్సూరెన్స్ ధర గురించి మీకు తెలియజేస్తాము. మీరు దానితో సంతృప్తి చెందినట్లయితే, మీరు మీ పేరుతో పాలసీని కొనుగోలు చేయవచ్చు.
మీ గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత మరియు మీరు ఇప్పటికీ మీ కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయకపోతే, గడువు ముగిసిన పాలసీ కోసం మీరు కొత్త కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయాలి. మీ కార్ ఇన్సూరెన్స్ గడువు ముగిసినట్లయితే, మీరు చేయవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి -
మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ ల్యాప్స్ అయితే, మీరు RTO నుండి చట్టపరమైన సమస్యను ఎదుర్కోవాలి. గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ పాలసీతో డ్రైవింగ్ చేసినందుకు మీకు ₹4000 వరకు జరిమానా విధించబడవచ్చు. అంతేకాకుండా, మీ వాహనం ఓన్ డ్యామేజ్ మరియు థర్డ్ పార్టీ నష్టాల కోసం మీరు స్వంత ఖర్చులను కూడా భరించాలి. అందువల్ల, అంతరాయం లేని కవరేజీని పొందడానికి మరియు వర్తించే డిస్కౌంట్లను కూడా పొందడానికి గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్‌ను సకాలంలో ఆన్‌లైన్‌లో రెన్యూ చేయడం తెలివైన నిర్ణయం.
ఒక పాలసీ సంవత్సరంలో కారు యజమాని ఎటువంటి క్లెయిమ్లు చేయకపోతే కారు యజమానికి అందించబడే బోనస్/ రివార్డును నో క్లెయిమ్ బోనస్ అని పేర్కొంటారు. రాబోయే పాలసీ రెన్యువల్ కోసం నో క్లెయిమ్ బోనస్‌ను డిస్కౌంట్లు పొందడానికి ఉపయోగించవచ్చు. ఒక కారు యజమాని కార్ ఇన్సూరెన్స్‌ను సకాలంలో రెన్యూ చేయకపోతే, ఇది జమ అయిన NCB పై ప్రభావం చూపుతుంది. గ్రేస్ వ్యవధి సమయంలో యజమాని NCB ని ఉపయోగించవచ్చు లేదా కాపాడుకోవచ్చు. అయితే, గడువు ముగిసిన తరువాత పాలసీ రద్దు అయినట్లయితే, జమ చేయబడిన NCB ని కోల్పోతారు.
ఒకవేళ కారు యజమాని రెన్యూవల్ వ్యవధిలో కొత్త కారు ఇన్సూరెన్స్ పాలసీకి మారాలనుకుంటే, జమ అయినా NCB ప్రభావితం కాదు. కారు లేదా ఇన్సూరెన్స్ పాలసీకి కాకుండా వ్యక్తికి NCB ఇవ్వబడుతుంది కాబట్టి, కొత్త కారు ఇన్సూరెన్స్ కొనుగోళ్లపై డిస్కౌంట్లను కూడా పొందడానికి దీనిని ఉపయోగించవచ్చు.
• చట్టపరమైన సమస్య – గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ పాలసీతో డ్రైవింగ్ చేయడం చట్టవిరుద్ధం మరియు మీకు 1వ నేరం కోసం ₹2000 మరియు 2వ నేరం కోసం ₹4000 వరకు జరిమానా విధించబడవచ్చు.
• థర్డ్ పార్టీ బాధ్యతలు - మీరు ప్రమాదవశాత్తు మీ వాహనంతో థర్డ్ పార్టీ ఆస్తి/వ్యక్తికి నష్టం జరిగితే మరియు ఆ సమయంలో చెల్లుబాటు అయ్యే కార్ ఇన్సూరెన్స్ పాలసీ లేకపోతే, నష్టాల కోసం మీరు మీ స్వంతంగా ఖర్చులను భరించాలి. అదనంగా, మీరు చట్టపరమైన పరిణామాలను కూడా ఎదుర్కోవాలి.
• స్వంత ఖర్చుల నుండి – ల్యాప్స్ అయిన కార్ ఇన్సూరెన్స్ పాలసీతో, అగ్నిప్రమాదం, భూకంపం, వరద, దొంగతనం మొదలైనటువంటి ఏవైనా ఊహించని సంఘటనల కారణంగా వాహన నష్టానికి మీకు కవరేజ్ లభించదు.
• NCB ప్రయోజనాలు – గడువు ముగిసిన 90 రోజుల్లోపు మీరు గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయకపోతే, మీరు నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాలను కోల్పోతారు మరియు తద్వారా పాలసీ రెన్యూవల్‌పై డిస్కౌంట్ పొందలేరు.
1. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లేదా పాస్‌పోర్ట్ వంటి ప్రభుత్వ ID రుజువు
2. చిరునామా రుజువు
3. డ్రైవింగ్ లైసెన్సు
4. ఇటీవలి ఫొటోగ్రాఫ్
5. కార్ రిజిస్ట్రేషన్ నంబర్
6. కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
7. కాలుష్యం తనిఖీ సర్టిఫికెట్
8. పాత మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ నంబర్
లేదు, గత సంవత్సరం మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగిసినట్లయితే, మీరు నో క్లెయిమ్ బోనస్ (NCB) ప్రయోజనాలను పొందలేరు. గడువు ముగిసిన 90 రోజుల్లోపు మీరు గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేయకపోతే, మీ NCB రద్దు చేయబడుతుంది మరియు మీరు ఇకపై నో క్లెయిమ్ బోనస్ నుండి ప్రయోజనం పొందరు.
హోమ్‌పేజీలోని డ్రాప్‌డౌన్ మెనూ నుండి మా పాలసీ ట్యాబ్‌ను తెలుసుకోండి పై క్లిక్ చేయడం ద్వారా మీరు మా వెబ్‌సైట్‌లో మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ స్థితిని తనిఖీ చేయవచ్చు. ఇక్కడ, మీరు కేవలం మీ పాలసీ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి, మీరు మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ స్థితిని పొందుతారు.
అవును, మీరు కొన్ని నిమిషాల్లోనే మా వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసుకోవచ్చు. మీరు నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా UPI ద్వారా చెల్లింపు చేయవచ్చు. పాలసీ మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ IDకి మెయిల్ చేయబడుతుంది లేదా మీ వాట్సాప్ నంబర్‌కు పంపబడుతుంది.
అప్‌డేట్ చేయబడిన మోటార్ వాహనాల చట్టం 2019 ప్రకారం, మీరు గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ పాలసీతో డ్రైవ్ చేస్తే, మొదటి నేరం కోసం జరిమానా ₹2,000 మరియు రెండవ నేరం కోసం ₹4,000.
గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్‌తో డ్రైవింగ్ చేయడం అనేది RTO నుండి ట్రాఫిక్ జరిమానాలు లేదా చలాన్‌లను దారితీయవచ్చు. గడువు ముగియడానికి ముందు మీరు కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయడంలో విఫలమైతే మరియు అది ల్యాప్స్ అయిన తర్వాత దానిని మళ్లీ రెన్యూ చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నట్లయితే, మీ వాహనం మోటార్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మరలా పరిశీలన చేయడంపై లోబడి ఉంటుంది. అలాగే, గడువు ముగిసిన 90 రోజుల్లోపు మీరు గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయకపోతే, మీరు NCB ప్రయోజనాలను కోల్పోతారు.
గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్‌ను ఆన్‌లైన్‌లో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్ ద్వారా చేయవచ్చు. మీరు మా కార్ ఇన్సూరెన్స్ పేజీని సందర్శించాలి, మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి, చూపిన విధంగా దశలను అనుసరించాలి.
గడువు ముగిసిన తేదీ నుండి 90 రోజుల్లోపు మీరు గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయకపోతే, మీరు ఇప్పటివరకు సంపాదించిన అన్ని నో క్లెయిమ్ బోనస్‌ను కోల్పోతారు. అలాగే, గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ పాలసీతో డ్రైవింగ్ చేసినందుకు ట్రాఫిక్ పోలీస్ మీకు ₹4000 వరకు జరిమానా విధించవచ్చు.
అవును, మీరు గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ పాలసీతో డ్రైవ్ చేస్తే, మీకు RTO ద్వారా జరిమానా విధించబడుతుంది. మొదటి నేరం కోసం జరిమానా ₹2,000 మరియు రెండవ నేరం కోసం ₹4,000
పాలసీ కోసం చెల్లుబాటు ఒక సంవత్సరం అయితే గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ప్రతి సంవత్సరం చేయబడాలి. స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక సంవత్సరం తర్వాత గడువు ముగుస్తుంది.
గడువు ముగిసిన పాలసీ అని మేము చెప్పినప్పుడు, పాలసీ నిర్దిష్ట తేదీలో ముగిసిందని మరియు పేర్కొన్న వ్యవధి వరకు పాలసీదారు కవరేజీకి అర్హులని అర్థం. అయితే, మేము ల్యాప్స్ అయిన పాలసీ అని చెప్పినప్పుడు, పాలసీదారు షెడ్యూల్ చేయబడిన తేదీన కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయలేదని మరియు అతను/ఆమె ఇకపై కవర్ చేయబడరని అర్థం.
గడువు ముగిసిన తేదీ తర్వాత మీరు ల్యాప్స్ అయిన కార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేస్తే, మీరు అధిక ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. పాలసీ ల్యాప్స్ అయిన తర్వాత, మీరు 90 రోజుల్లోపు రెన్యూ చేయకపోతే, నో-క్లెయిమ్ బోనస్‌ను కోల్పోతారు. మీరు ఇతర డిస్కౌంట్లను కూడా కోల్పోవచ్చు. ఈ రెండు అంశాలు అధిక ప్రీమియంలకు దారితీస్తాయి.