మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం ప్రీమియంను తెలుసుకోవడం చాలా ముఖ్యం, తద్వారా మీరు కవర్ సంబంధిత ఊహించిన ఖర్చు గురించి తెలుసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితిలోనే కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్లు ఉపయోగపడతాయి. మీరు పాలసీని కొనుగోలు చేయడానికి లేదా రెన్యూవల్ చేయడానికి ముందు మీరు మీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించడానికి మిమ్మల్ని అనుమతించే ఆన్‌లైన్ సాధనాలుగా ఈ క్యాలిక్యులేటర్లు ఉపయోగపడతాయి. ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు మరియు వారి కస్టమర్లు ఇద్దరికీ ఒక ఉపయోగకరమైన సాధనంగా పరిగణించబడే ఈ క్యాలిక్యులేటర్ అనేది ఇన్సూరెన్స్ ప్రీమియంలను నిర్ణయించే సంక్లిష్టమైన ప్రక్రియను సులభతరం చేస్తుంది. మీ కారును కవర్ చేసే కారు ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం మీరు ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు చెల్లించే డబ్బును కారు ఇన్సూరెన్స్ ప్రీమియంగా సూచిస్తారు. కారు రకం, దాని తయారీ, మోడల్ మరియు వేరియంట్, IDV మరియు కవరేజ్ ప్రాధాన్యతలు లాంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ప్రీమియం లెక్కించబడుతుంది.
ఈ క్యాలిక్యులేటర్‌ను ఉచితంగా ఉపయోగించవచ్చు మరియు అనేక ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన ప్రీమియంను కనుగొనడానికి ఉపయోగించవచ్చు. తద్వారా, అత్యంత పోటీకరమైన ప్రీమియం రేటును అందించే సరైన ప్లాన్‌ను మీరు ఎంచుకోవచ్చు. కాబట్టి, మీరు తెలివైన నిర్ణయం తీసుకోవడానికి ఇది అనుమతిస్తుంది, మీ అవసరాలు మరియు బడ్జెట్‌కు సరిపోయే సరైన కవరేజీని ఎంచుకోవడానికి ఇది మీకు వీలు కల్పిస్తుంది. కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం గురించి మనం చర్చించే సమయంలో, అది ఎలా నిర్ణయించబడుతుంది మరియు మీకోసం ఉత్తమ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కనుగొనడంలో కార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ ఎలాంటి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో చదవండి.
మీ కారును కవర్ చేసే కారు ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం మీరు ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు చెల్లించే డబ్బును కారు ఇన్సూరెన్స్ ప్రీమియంగా సూచిస్తారు. ప్రీమియం అనేది మీరు ఎంచుకునే ఇన్సూరెన్స్ రకం, మీరు ఇన్సూరెన్స్ చేస్తున్న కారు, మీ డ్రైవింగ్ చరిత్ర లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
కారు ఇన్సూరెన్స్ లెక్కింపు ఈ కింది వివిధ అంశాల ఆధారంగా నిర్ణయించబడుతుంది,
● మీరు ఎంచుకునే ఇన్సూరెన్స్ రకం
● మోడల్, ఇంజిన్ సామర్థ్యం, కారు వయస్సు, ఇంధన రకం, రిజిస్ట్రేషన్ స్థానం మొదలైన వాటితో సహా కారు మోడల్.
● కారు ధర
● యాడ్-ఆన్ కవర్ మీ కారును అన్నివిధాలా రక్షిస్తుంది. అయితే, ఎంత ఎక్కువగా యాడ్ చేస్తే ప్రీమియం అంత ఎక్కువగా ఉంటుంది.
మీరు ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి లేదా రెన్యూ చేయడానికి ముందు, కారు ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్‌ను ఉపయోగించాలని, కవరేజ్ ధరను అంచనా వేయాలని సిఫార్సు చేయబడుతుంది. అందుకు గల కొన్ని కారణాలు ఇలా ఉన్నాయి –
కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్‌లను ఉపయోగించడంతో మీరు పొందగల కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి –
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ ఉపయోగించేటప్పుడు ఈ కింది సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోండి:
● మీ వాహనం తయారీ, మోడల్, వేరియంట్ మరియు ఇంధన రకం
● ఎక్స్-షోరూమ్ ధర
● రిజిస్ట్రేషన్ వివరాలు- నగరం మరియు కొనుగోలు సంవత్సరం
● మునుపటి పాలసీ వివరాలు (రెన్యూవల్ విషయంలో).
కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్‌ను ఉపయోగించడం చాలా సులభం. దిగువ పేర్కొన్న దశలను అనుసరించండి మరియు మీ ప్రీమియంను తక్షణమే లెక్కించండి –
• కారు ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్‌ను ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయండి
• మీ కారు మేక్, మోడల్, వేరియంట్, రిజిస్ట్రేషన్ సంవత్సరం మరియు లొకేషన్ వంటి వివరాలను అందించండి
• మీరు ఇప్పటికే ఉన్న మీ పాలసీని రెన్యూ చేస్తున్నట్లయితే, మునుపటి క్లెయిముల వివరాలను పేర్కొనండి. అలాగే, మునుపటి ఇన్సూరెన్స్ సంస్థ, పాలసీ నంబర్‌ను పేర్కొనండి
• మీకు కావలసిన పాలసీ రకాన్ని ఎంచుకోండి - థర్డ్ పార్టీ లేదా కాంప్రిహెన్సివ్
• 'సమర్పించు' లేదా 'లెక్కించు'పై క్లిక్ చేయండి, వెంటనే ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువ మరియు ప్రీమియం అమౌంట్ చూపబడుతుంది
• మీరు దీనిని సవరించవచ్చు IDV మరియు యాడ్-ఆన్‌లను ఎంచుకోవచ్చు
• చేసిన మార్పులను బట్టి ప్రీమియం అప్‌డేట్ చేయబడుతుంది
• మీరు యాడ్-ఆన్‌లను జోడించినట్లయితే ప్రీమియం పెరుగుతుంది. మీరు అందుబాటులో ఉన్న డిస్కౌంట్లను కూడా ఎంచుకోవచ్చు, ఇది ప్రీమియం అమౌంటును తగ్గిస్తుంది
మీరు కవరేజీని ఫైనలైజ్ చేసిన తర్వాత, GSTతో సహా చివరి ప్రీమియం మొత్తం చూపబడుతుంది. మీరు ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లించి, తక్షణమే పాలసీని కొనుగోలు చేయవచ్చు.
మీరు చెల్లించే కారు ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేసే అనేక అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఈ అంశాలు ప్రీమియంను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. అలాంటి కారకాలు క్రింద చర్చించబడ్డాయి –
మీరు మీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించుకోవడానికి గల మార్గాలు ఇక్కడ ఉన్నాయి. ఈ మార్గాలు కింది విధంగా ఉన్నాయి –
కారు ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ అనేది ఒక ఉచిత సాధనం. ఇది మీ కొత్త కార్ల కోసం ఒక ప్లాన్‌ను ఎంచుకునే సమయంలో ఇన్సూరెన్స్ ప్రీమియంను నిర్ధారించడంలో మీకు సహాయపడుతుంది. కారు ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్ ఒక వేగవంతమైన మరియు ఖచ్చితమైన లెక్కింపులను అందిస్తుంది, తద్వారా మీరు మీ బడ్జెట్‌కు అనుగుణంగా మీ కారు కోసం అత్యంత సముచితమైన పాలసీ మరియు యాడ్-ఆన్‌లను ఎంచుకోవచ్చు.
మీ కారు ఇన్సూరెన్స్ ప్రీమియం ముఖ్యంగా కారు వయస్సు పై ఆధారపడి ఉంటుంది. కారు పాతది అయితే, ప్రీమియం తక్కువగా ఉంటుంది మరియు ఇన్సూరెన్స్ మొత్తం తక్కువగా ఉంటుంది. 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల వాహనాల కోసం కొన్ని యాడ్ ఆన్ కవర్లు అందుబాటులో ఉండకపోవచ్చు. పాత కారు ఇన్సూరెన్స్ కోసం ఆన్‌లైన్‌లో ప్రీమియం లెక్కించడానికి దశలు ఈ కింది విధంగా ఉన్నాయి.
పాత కారు ఇన్సూరెన్స్ ప్రీమియంతో పోలిస్తే కొత్త కారు కోసం ప్రీమియం మరియు ఇన్సూరెన్స్ మొత్తం కూడా ఎక్కువగా ఉంటుంది. కొత్త కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించి కొత్త కార్ల కోసం కారు ఇన్సూరెన్స్ ప్రీమియంలను లెక్కించడానికి దశలు క్రింద ఇవ్వబడ్డాయి
● ఒకవేళ మీ వద్ద రిజిస్ట్రేషన్ నంబర్ లేకపోతే, మీరు రిజిస్ట్రేషన్ లొకేషన్‌ను పేర్కొనవచ్చు
● పాలసీ రకం మరియు అవసరమైతే ఏవైనా యాడ్-ఆన్‌లను ఎంచుకోండి
● తక్షణమే ప్రీమియం అమౌంటు స్క్రీన్ పై ప్రదర్శించబడుతుంది.
అన్ని రకాల కార్ల కోసం కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ ఉపయోగించవచ్చు. కాబట్టి, సెకండ్-హ్యాండ్ లేదా గతంలో వేరొకరి యాజమాన్యంలోని కారుని మీరు కొనుగోలు చేస్తుంటే, కార్ ఇన్సూరెన్స్ ఖర్చు క్యాలిక్యులేటర్‌ను మీరు సులభంగా ఉపయోగించవచ్చు. ఈ ప్రాసెస్ అనేది కొత్త కార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్‌కు సమానంగా ఉంటుంది. మీరు అనుసరించాల్సిన దశలు చూడండి:
సాధారణంగా, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా నాలుగు రకాల కారు ఇన్సూరెన్స్ పాలసీలు అందించబడుతున్నాయి
కాంప్రిహెన్సివ్ కారు ఇన్సూరెన్స్ అనేది థర్డ్-పార్టీ నష్టం, ఓన్ డ్యామేజ్ మరియు వివిధ యాడ్-ఆన్‌లతో సహా విస్తృత కవరేజీని అందిస్తుంది. ఇది మీకు నచ్చిన విధంగా ప్లాన్‌ను కస్టమైజ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఇది సుదీర్ఘమైన లెక్కింపులు మరియు వివిధ యాడ్-ఆన్‌ల ప్రభావాలను కూడా తెలియజేస్తుంది. కానీ చింతించకండి. ఇప్పుడు మీరు కారు ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీ కాంప్రిహెన్సివ్ కారు ఇన్సూరెన్స్ ప్రీమియంను సులభంగా లెక్కించవచ్చు. కారు ఇన్సూరెన్స్ ఎలా లెక్కించబడుతుంది మరియు వివిధ రైడర్లు పాలసీ ప్రీమియంను ఎలా ప్రభావితం చేస్తాయి అనేది అర్థం చేసుకోవడంలో ఇది మీకు సహాయపడుతుంది, అదేవిధంగా ఇది మీకు తెలివైన నిర్ణయం తీసుకోవడంలో, ఉత్తమ ప్లాన్‌ను ఎంచుకోవడంలో సహాయపడుతుంది.
మీ కారు కోసం అత్యంత ప్రాథమిక మరియు తప్పనిసరి ఇన్సూరెన్స్ ఒక థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్. ఇది థర్డ్-పార్టీ వ్యక్తికి లేదా ఆస్తికి సంబంధించిన నష్టాలను మాత్రమే కవర్ చేస్తుంది. మీ బడ్జెట్‌లో ఒక కేటాయింపు కోసం ప్రీమియం అమౌంటును నిర్ణయించడానికి మీరు కారు ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు.
ప్రైవేట్ కార్లు | ప్రీమియం మొత్తం | పాలసీ టర్మ్ |
1000cc ఉన్న కార్లు | INR 2,094 | 1 సంవత్సరం |
1000cc-1500cc కలిగిన కార్లు | INR 3,416 | 1 సంవత్సరం |
1500cc పైగా ఉన్న కార్లు | INR 7,897 | 1 సంవత్సరం |
ప్రైవేట్ కార్లు | ప్రీమియం మొత్తం | పాలసీ టర్మ్ |
1000cc ఉన్న కార్లు | INR 6,521 | 3 సంవత్సరం |
1000cc-1500cc కలిగిన కార్లు | INR 10,640 | 3 సంవత్సరం |
1500cc పైగా ఉన్న కార్లు | INR 24,596 | 3 సంవత్సరం |
కొత్త ప్రైవేట్ ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రీమియం రేట్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
ప్రైవేట్ కార్లు | 1 సంవత్సరం పాలసీ వ్యవధి కోసం ప్రీమియం మొత్తం | 3 సంవత్సరాల పాలసీ వ్యవధి కోసం ప్రీమియం మొత్తం |
30KW లోపు ఉండే కార్లు | INR 1,780 | INR 5,543 |
30KW-65KW మధ్యన ఉండే కార్లు | INR 2,904 | INR 9,044 |
65KW కు పైగా ఉండే కార్లు | INR 6,712 | INR 20,907 |
రెన్యూవల్ సందర్భంలో ప్రీమియం మొత్తాన్ని లెక్కించడానికి కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ అవసరం. ముఖ్యంగా ఇది వేగవంతమైనది, ఎక్కువ సమయాన్ని ఆదా చేస్తుంది. దీని కోసం మీరు ఎంతో సమయాన్ని వెచ్చించి ఉంటారు మరియు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు, ఎందుకనగా, రెన్యూవల్ ప్రీమియం లెక్కింపు కోసం అనేక అంశాలు పరిగణలోకి తీసుకోబడతాయి. ఈ సుదీర్ఘవంతమైన లెక్కింపులు చేయడం అనేది గందరగోళానికి గురిచేస్తుంది. మరోవైపు, కారు ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్, రెన్యూవల్ ప్రీమియంలు మరియు యాడ్-ఆన్‌లను ఖచ్చితంగా లెక్కించడంలో మీకు ఎల్లవేళలా సహాయపడుతుంది.
మీరు ఒక కారును కొనుగోలు చేసిన వెంటనే, దానిని రోడ్డు పైకి తీసుకెళ్లడానికి ముందుగా ఇన్సూరెన్స్‌ను పొందవలసి ఉంటుంది. మీ కారు కోసం విస్తృత కవరేజీని పొందడం ముఖ్యం అయినప్పటికీ, దిగువ ఇవ్వబడిన చిట్కాలు కారు ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని తగ్గించడంలో మీకు సహాయపడగలవు:
ఒక కార్ యజమానిగా మీ కార్ ఇన్సూరెన్స్ అవసరాలు ఇతరుల నుండి భిన్నంగా ఉండవచ్చు. అందువల్ల, మేము వివిధ రకాల ప్లాన్లను తీసుకువస్తాము, తద్వారా మీరు మీ అవసరాలు మరియు మీ బడ్జెట్‌కు ఉత్తమంగా సరిపోయేది ఎంచుకోవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి కారు ఇన్సూరెన్స్ పాలసీలలో ఉండేవి:
మీ ప్రియమైన కారును అన్ని రకాల సహజ మరియు మానవ నిర్మిత నష్టాల నుండి రక్షిస్తుంది. కవరేజీని మరింత మెరుగుపరచడానికి మీరు యాడ్-ఆన్‌లను కూడా చేర్చవచ్చు.
చట్టం ప్రకారం తప్పనిసరి, థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు తలెత్తే బాధ్యతల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. చట్టపరమైన బాధ్యతల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కూడా ఈ కవర్ ఉందని నిర్ధారించుకోండి.
మీకు ఇప్పటికే థర్డ్-పార్టీ కవరేజ్ ఉండి, కానీ మీ స్వంత వాహనం కోసం అదనపు కవరేజ్ కోసం చూస్తున్నప్పుడు ఒక స్టాండ్అలోన్ పాలసీని ఎంచుకోండి.
పాత కారుకు సమాన రక్షణ అవసరం. సరైన రకమైన కార్ ఇన్సూరెన్స్‌తో దానిని సురక్షితం చేసుకోండి.
మీ కారు విలువ తరుగుదలలో జరిగిన నష్టం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మీరు ఒక క్లెయిమ్ చేసినప్పుడు మీ స్వంత ఖర్చులను తగ్గించుకోండి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కారు ఇన్సూరెన్స్ పాలసీల కోసం ఈ కింది విభిన్న రకాల యాడ్-ఆన్‌లను అందిస్తుంది
ఈ యాడ్-ఆన్ కింద, కిలోమీటర్ స్లాబ్ ఆధారంగా నిర్ణయించిన మీ వినియోగం ఆధారంగా మీరు ప్రీమియం చెల్లిస్తారు.
జీరో డిప్రిసియేషన్ యాడ్-ఆన్ కవర్ కింద ఇన్సూరెన్స్ ప్రొవైడర్, మీకు డిప్రిసియేషన్ మినహాయించకుండా పూర్తి క్లెయిమ్ మొత్తాన్ని చెల్లిస్తారు.
ఈ యాడ్-ఆన్ కింద, యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో కారు ఇంజిన్ లేదా గేర్‌బాక్స్‌కు జరిగిన ఏదైనా నష్టం మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ద్వారా కవర్ చేయబడుతుంది.
పేరు సూచిస్తున్నట్లుగా, టైర్ సెక్యూర్ కవర్ యాడ్-ఆన్ మీ కారు టైర్లకు ప్రమాదవశాత్తు జరిగిన నష్టం లేదా డ్యామేజీని కవర్ చేస్తుంది. కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో టైర్ల పరిహారం మరియు/లేదా భర్తీని యాడ్-ఆన్ అనుమతిస్తుంది.
రోడ్ అసిస్టెన్స్ కవర్‌తో కారు బ్రేక్‌డౌన్ సందర్భంలో మీరు 24*7 రీఫ్యూయలింగ్ సర్వీస్, రిపేర్ సర్వీస్, టోయింగ్ మొదలైన సేవలను పొందుతారు.
ఒకవేళ దొంగతనం కారణంగా మీరు మీ కారును పోగొట్టుకున్నట్లయితే లేదా రిపేరింగ్ చేయలేనంతగా మీ కారు దెబ్బతిన్నట్లయితే, రిటర్న్-టు-ఇన్వాయిస్ కవర్‌ను కలిగి ఉండటం వలన పన్నులు మరియు రిజిస్ట్రేషన్ ఖర్చుతో పాటు మీ ఇన్‌వాయిస్ అసలు విలువకు సమానమైన పరిహారాన్ని మీరు పొందవచ్చు.
మీ కారు నట్లు, బోల్టులు మొదలైనటువంటి అనేక చిన్న మరియు ముఖ్యమైన భాగాల నుండి తయారు చేయబడింది. ప్రమాదవశాత్తు నష్టం జరిగిన సందర్భంలో, ఈ చిన్న వస్తువులు కలిసి మీ ఖర్చులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి, ఎందుకంటే అవి సాధారణ కవర్ కింద కవర్ చేయబడవు. కన్జ్యూమబుల్ కవర్ యాడ్-ఆన్ అటువంటి ఖర్చులపై తిరిగి తగ్గించవచ్చు.