నాలెడ్జ్ సెంటర్
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో #1.6+ కోట్ల హ్యాపీ కస్టమర్లు
#1.6 కోట్లు

హ్యాపీ కస్టమర్లు

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 1లక్ష+ నగదురహిత ఆసుపత్రులు
1 లక్ష+

నగదు రహిత ఆసుపత్రులు

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 24x7 అంతర్గత క్లెయిమ్ సహాయం
24x7 అంతర్గత

క్లెయిమ్ సహాయం

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఆరోగ్య పరీక్షలు లేవు
ఎలాంటి హెల్త్

చెక్-అప్‌లు లేవు

హోమ్ / ట్రావెల్ ఇన్సూరెన్స్ / భారతదేశం నుండి మలేషియా ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి

ట్రావెల్ ఇన్సూరెన్స్ మలేషియా

ఆగ్నేయాసియాలో అందమైన మలేషియా దేశం వైవిధ్యమైన సంస్కృతితో, ఆకర్షించే ప్రకృతి సౌందర్యంతో, మరియు సందడిగా ఉండే నగరాలతో ప్రయాణికులను ఆకర్షిస్తుంది. ప్రఖ్యాత పెట్రోనాస్ ట్విన్ టవర్లు ఉన్న కౌలాలంపూర్ నుండి లాంగ్‌కవి లోని ప్రశాంతమైన బీచ్‌లు మరియు బోర్నియో రెయిన్‌ఫారెస్ట్ యొక్క విస్తృతమైన జీవవైవిధ్యం వరకు ఈ దేశం అనేక రకాల అనుభవాలను అందిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ ఎంపికలు మెడికల్ కవరేజ్, ట్రిప్ రద్దు, మరియు లగేజ్ రక్షణ వంటి అంశాల ద్వారా మీ అన్వేషణలో మనశ్శాంతిని అందిస్తుంది. మలేషియా కోసం ఉత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో ప్రముఖ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ల నుండి సమగ్ర కవరేజ్ అందుతుంది, ఇందులో ఊహించని వైద్య ఖర్చులు నుండి ప్రయాణికులకు రక్షణను అందించే ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ మలేషియా పై ప్రధానంగా దృష్టి ఉంటుంది. ఆన్‌లైన్‌లో మలేషియా కోసం అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే సౌలభ్యంతో సాహసవీరులు మలేషియా విహారానికి వెళ్లే ముందు అవసరమైన కవరేజ్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు మరియు పొందవచ్చు.

ట్రావెల్ ఇన్సూరెన్స్ మలేషియా కీలక ఫీచర్లు

ముఖ్యమైన ఫీచర్లు వివరాలు
విస్తృతమైన కవరేజీ వైద్యం, ప్రయాణం మరియు సామాను సంబంధిత సమస్యలను కవర్ చేస్తుంది.
నగదురహిత ప్రయోజనాలు అనేక నెట్‌వర్క్ ఆసుపత్రుల ద్వారా నగదురహిత ప్రయోజనాలను అందిస్తుంది.
కోవిడ్-19 కవరేజ్ కోవిడ్-19-సంబంధిత హాస్పిటలైజేషన్‌ను కవర్ చేస్తుంది.
24x7 కస్టమర్ సపోర్ట్ అన్నివేళలా ఖచ్చితమైన కస్టమర్ సపోర్ట్.
త్వరిత క్లెయిమ్ సెటిల్‌మెంట్లు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్ల కోసం ప్రత్యేకమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందం.
విస్తృత కవరేజీ మొత్తం $40K నుండి $1000K వరకు పూర్తి కవరేజ్ మొత్తాలు.

మలేషియా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ రకాలు

మీ ట్రిప్ అవసరాలకు అనుగుణంగా మలేషియా కోసం వివిధ రకాల ట్రావెల్ ఇన్సూరెన్స్‌ల నుండి మీరు ఎంచుకోవచ్చు. ప్రధాన ఎంపికలు ఇలా ఉన్నాయి ;

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి వ్యక్తుల కోసం ట్రావెల్ ప్లాన్

వ్యక్తి కోసం ట్రావెల్ ప్లాన్లు

ఒంటరి ప్రయాణీకులు మరియు థ్రిల్ కోరుకునేవారి కోసం

ప్రయాణ సమయంలో సోలో ట్రావెలర్లు ఎదుర్కొనే అవకాశం ఉన్న అనిశ్చిత పరిస్థితుల నుండి ఈ రకమైన పాలసీ రక్షణ అందిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వ్యక్తిగత మలేషియా ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది వైద్య మరియు వైద్యేతర అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణీకులను ఆర్థికంగా కవర్ చేయడానికి అనేక ఫీచర్లు మరియు ప్రయోజనాలతో వస్తుంది.

ప్లాన్లను చూడండి మరింత తెలుసుకోండి
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి కుటుంబాల కోసం ట్రావెల్ ప్లాన్

కుటుంబాల కోసం ట్రావెల్ ప్లాన్

కలిసి ప్రయాణిస్తున్న కుటుంబాల కోసం

మీ కుటుంబంతో విదేశీ ప్రయాణం చేస్తున్నప్పుడు, మీరు వారి భద్రత మరియు శ్రేయస్సు కోసం అనేక అంశాలను పరిగణించాలి. కుటుంబాల కోసం మలేషియా ట్రావెల్ ఇన్సూరెన్స్ వారి ప్రయాణ సమయంలో ఒకే ప్లాన్ కింద కుటుంబంలోని అనేక సభ్యులకు కవరేజ్ అందిస్తుంది.

ప్లాన్లను చూడండి మరింత తెలుసుకోండి
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా విద్యార్థులకు ట్రావెల్ ప్లాన్

విద్యార్థుల కోసం ట్రావెల్ ప్లాన్

తమ కలలను సాకారం చేసుకునే వ్యక్తుల కోసం

ఈ రకమైన ప్లాన్ చదువు/విద్యా సంబంధిత ప్రయోజనాల కోసం మలేషియాను సందర్శించే విద్యార్థుల కోసం. బెయిల్ బాండ్లు, కంపాషనేట్ సందర్శనలు, స్పాన్సర్ రక్షణ మొదలైన వాటితో సహా అనేక అనిశ్చిత పరిస్థితుల నుండి ఇది మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది, ఈ విధంగా మీరు విదేశాలలో బస చేస్తున్నప్పుడు మీ చదువు పై దృష్టి పెట్టవచ్చు.

ప్లాన్లను చూడండి మరింత తెలుసుకోండి
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా తరచుగా విమానయానం చేసే వారికి ట్రావెల్ ప్లాన్

తరచుగా విమానయానం చేసేవారి కోసం ట్రావెల్ ప్లాన్

తరచుగా విమానయానం చేసేవారి కోసం

ఈ రకమైన ప్లాన్ తరచుగా విమానయానం చేసేవారి కోసం రూపొందించబడింది, ఒక సమగ్ర పాలసీ క్రింద అనేక ట్రిప్‌లకు కవరేజ్ అందిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో, మీరు పేర్కొన్న పాలసీ అవధిలో ప్రతి ట్రిప్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

ప్లాన్లను చూడండి మరింత తెలుసుకోండి
సీనియర్ సిటిజన్స్ కోసం ట్రావెల్ ప్లాన్

సీనియర్ సిటిజన్స్ కోసం ట్రావెల్ ప్లాన్

ఎప్పటికీ యవ్వనంగా ఉండే వారి కోసం

ఒక అంతర్జాతీయ ప్రయాణంలో సీనియర్ సిటిజెన్లు ఎదుర్కొనే అవకాశం ఉన్న వివిధ సంక్లిష్టతల కోసం వారికి కవరేజ్ అందించడానికి ఈ రకమైన ప్లాన్ ప్రత్యేకంగా రూపొందించబడింది. మలేషియా కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో సీనియర్ సిటిజన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ట్రిప్ సమయంలో వైద్య మరియు వైద్యేతర అనిశ్చిత పరిస్థితుల విషయంలో మీరు కవర్ చేయబడతారని నిర్ధారిస్తుంది.

ప్లాన్లను చూడండి మరింత తెలుసుకోండి

ట్రావెల్ ఇన్సూరెన్స్ మలేషియా ప్లాన్‌ను కొనుగోలు చేయడం వలన కలిగే ప్రయోజనాలు

ప్రయాణంలో మనశ్శాంతి కోసం మీరు మలేషియా పర్యటనకు వెళ్లే ముందు మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ మలేషియాను కొనుగోలు చేయడం అవసరం. కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

1

24x7 కస్టమర్ సపోర్ట్

ఒక విదేశీ ట్రిప్ సమయంలో ఊహించని పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే, మలేషియా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు ఆ కష్టమైన పరిస్థితులను సులభంగా పరిష్కరించవచ్చు. సంక్షోభ సమయంలో మీకు సహాయం చేయడానికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అన్నివేళలా కస్టమర్ కేర్ సపోర్ట్ మరియు ప్రత్యేకమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో మలేషియా ట్రావెల్ ఇన్సూరెన్స్ అందిస్తుంది.

2

మెడికల్ కవరేజ్

అంతర్జాతీయంగా ప్రయాణించేటప్పుడు వైద్య మరియు దంత సంబంధిత అత్యవసర పరిస్థితులు తలెత్తడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి, మీ మలేషియా సెలవు సమయంలో అటువంటి ఊహించని సంఘటనల నుండి మిమ్మల్ని ఆర్థికంగా రక్షించుకోవడానికి, మలేషియా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందడాన్ని పరిగణించండి. ఈ పాలసీ కింద వైద్య కవరేజీలో అత్యవసర వైద్య మరియు దంత ఖర్చులు, వైద్యం మరియు శరీరాన్ని స్వదేశానికి తీసుకురావడం, ప్రమాదం కారణంగా మరణం మొదలైనటువంటి విషయాలు ఉంటాయి.

3

నాన్-మెడికల్ కవరేజ్

ఊహించని వైద్య సమస్యలకు అదనంగా, ట్రావెల్ ఇన్సూరెన్స్ మలేషియా ప్లాన్ ట్రిప్ సమయంలో జరగగల అనేక వైద్యేతర ఆకస్మిక పరిస్థితులకు వ్యతిరేకంగా ఆర్థిక కవరేజీని అందిస్తుంది. ఇందులో పర్సనల్ లయబిలిటీ, హైజాక్ డిస్ట్రెస్ అలవెన్స్, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అసిస్టెన్స్, బ్యాగేజ్ మరియు పర్సనల్ డాక్యుమెంట్లను కోల్పోవడం మొదలైనటువంటి అనేక సాధారణ ప్రయాణం మరియు బ్యాగేజ్ సంబంధిత అసౌకర్యాలు ఉంటాయి.

4

ఒత్తిడి-లేని సెలవులు

అంతర్జాతీయ పర్యటనలో దురదృష్టకర సంఘటనలు ఎదురవ్వడం ఆర్థికంగా మరియు మానసికంగా సవాలును విసురుతుంది. ఇటువంటి సమస్యలు మీకు చాలా ఒత్తిడిని కలిగిస్తాయి, ప్రత్యేకించి మీరు వాటిని పరిష్కరించడానికి సిద్ధంగా లేకుంటే. అయితే, మలేషియా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీ సెలవును ఆనందించడానికి మిమ్మల్ని అనుమతించే ఒక ఆర్థిక భద్రతగా పనిచేస్తుంది. పాలసీ ద్వారా అందించబడే వేగవంతమైన మరియు విస్తృతమైన కవరేజ్ మీ ఆందోళనలను తగ్గిస్తుంది.

5

మీకు ఎక్కువ ఖర్చు అవ్వదు

కొన్ని పరిస్థితులలో మీకు ఆర్థిక సహాయం అందించే భారతదేశం నుండి మలేషియా వరకు మీరు సరసమైన ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను పొందవచ్చు. ఈ విధంగా, ఒక ఊహించని సంఘటన సమయంలో మీరు మీ స్వంతంగా అదనపు నగదును ఖర్చు చేయవలసిన అవసరం లేదు, ఇది మీ నిర్ణీత ప్రయాణ బడ్జెట్ దాటకుండా ఉండటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం అయ్యే ఖర్చు కంటే దాని వలన ఏర్పడే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.

6

నగదురహిత ప్రయోజనాలు

మలేషియా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి దాని నగదురహిత క్లెయిమ్ ఫీచర్. అంటే రీయింబర్స్‌మెంట్‌లతో పాటు, విదేశంలో వైద్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు వ్యక్తులు నగదురహిత చికిత్సను ఎంచుకోవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రపంచవ్యాప్తంగా దాని నెట్‌వర్క్ కింద 1 లక్షలకు పైగా భాగస్వామ్య ఆసుపత్రులను కలిగి ఉంది, ఇది వ్యక్తులకు వేగవంతమైన వైద్య సేవను అందిస్తుంది.

మీ మలేషియా ట్రిప్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం చూస్తున్నారా? ఇంకా చూడవలసిన అవసరం లేదు.

భారతదేశం నుండి మలేషియా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద ఏమి కవర్ చేయబడుతుంది

భారతదేశం నుండి మలేషియా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద సాధారణంగా కవర్ చేయబడే కొన్ని విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి ;

ఎమర్జెన్సీ వైద్య ఖర్చులు

ఎమర్జెన్సీ వైద్య ఖర్చులు

ఈ ప్రయోజనం హాస్పిటలైజేషన్, గది అద్దె, OPD చికిత్స మరియు రోడ్ అంబులెన్స్ ఖర్చులను కవర్ చేస్తుంది. ఇది అత్యవసర వైద్య తరలింపు, భౌతికదేహాన్ని స్వదేశానికి తీసుకురావడం మరియు అవశేషాలను స్వదేశానికి తీసుకురావడంపై అయ్యే ఖర్చులను కూడా తిరిగి చెల్లిస్తుంది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా అత్యవసర డెంటల్ ఖర్చులకు కవరేజ్

డెంటల్ ఖర్చులు

శారీరక అనారోగ్యం లేదా గాయం కారణంగా ఆసుపత్రిలో చేరడం ఎంత ముఖ్యమో దంత ఆరోగ్య సంరక్షణ కూడా అంతే ముఖ్యమని మేము నమ్ముతున్నాము; అందువలన, పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి మీ ప్రయాణ సమయంలో మీకు ఎదురయ్యే దంత వైద్య సంబంధిత ఖర్చులను కవర్ చేస్తాము.

పర్సనల్ యాక్సిడెంట్

పర్సనల్ యాక్సిడెంట్

అన్ని పరిస్థితులలో మేము మీకు అండగా ఉంటాము. విదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగిన సందర్భంలో, శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తు మరణం కారణంగా సంభవించే ఏవైనా ఆర్థిక భారాలకు సహాయపడటానికి మా ఇన్సూరెన్స్ ప్లాన్ మీ కుటుంబానికి ఏకమొత్తం చెల్లింపును అందిస్తుంది.

పర్సనల్ యాక్సిడెంట్: కామన్ క్యారియర్

పర్సనల్ యాక్సిడెంట్: కామన్ క్యారియర్

అన్ని సమయాల్లో మేము మీ పక్కనే ఉంటాము. కాబట్టి, దురదృష్టకర పరిస్థితులలో, ఒక సాధారణ క్యారియర్‌లో గాయం కారణంగా ఉత్పన్నమయ్యే ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం సందర్భంలో మేము ఏకమొత్తంలో చెల్లింపును అందిస్తాము.

హాస్పిటల్ క్యాష్ - యాక్సిడెంట్ మరియు అనారోగ్యం

హాస్పిటల్ క్యాష్ - యాక్సిడెంట్ మరియు అనారోగ్యం

గాయం లేదా అనారోగ్యం కారణంగా ఒక వ్యక్తిని హాస్పిటలైజ్ చేసినట్లయితే, పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న గరిష్ట రోజుల వరకు, హాస్పిటలైజేషన్ యొక్క ప్రతి పూర్తి రోజుకు ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తాన్ని మేము చెల్లిస్తాము.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా విమాన ఆలస్యం కవరేజ్

విమాన ఆలస్యం మరియు రద్దు

విమాన ఆలస్యాలు లేదా రద్దులు అనేవి మన నియంత్రణలో ఉండవు కనుక చింతించకండి, ఇలాంటి వాటి కారణంగా తలెత్తే ఏవైనా అవసరమైన ఖర్చులకు మా రీయింబర్స్‌మెంట్ ఫీచర్ ద్వారా పరిహారం పొందవచ్చు.

ట్రిప్ ఆలస్యం మరియు రద్దు

ట్రిప్ ఆలస్యం మరియు రద్దు

ట్రిప్ ఆలస్యం లేదా రద్దు విషయంలో, మీ ప్రీ-బుక్ చేయబడిన వసతి మరియు కార్యకలాపాల తిరిగి చెల్లించబడని భాగాన్ని మేము రీఫండ్ చేస్తాము. పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా బ్యాగేజీ మరియు పర్సనల్ డాక్యుమెంట్ల నష్టానికి కవర్

పాస్‌పోర్ట్ మరియు అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోల్పోవడం

ముఖ్యమైన డాక్యుమెంట్లను కోల్పోవడం వలన మీరు విదేశంలో చిక్కుకుపోయే అవకాశం ఉంది. కావున, మేము కొత్త లేదా నకిలీ పాస్‌పోర్ట్ మరియు/లేదా అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అయ్యే ఖర్చులను తిరిగి చెల్లిస్తాము.

ట్రిప్ తగ్గింపు

ట్రిప్ తగ్గింపు

ఊహించని పరిస్థితుల కారణంగా మీరు మీ ట్రిప్‌‌లో తక్కువ సమయం ఉండవలసి వస్తే చింతించకండి. పాలసీ షెడ్యూల్ ప్రకారం మీ నాన్-రీఫండబుల్ వసతి మరియు ప్రీ-బుక్డ్ కార్యకలాపాల కోసం మేము మీకు రీయింబర్స్ చేస్తాము.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా పర్సనల్ లయబిలిటీ కవరేజ్

వ్యక్తిగత బాధ్యత

మీరు ఎప్పుడైనా పర దేశంలో థర్డ్-పార్టీ నష్టానికి బాధ్యులుగా నిలిస్తే, మా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ నిబంధనలు మరియు షరతులకు లోబడి. మీ ఎదురయ్యే దంత ఖర్చులను కవర్ చేస్తాము.

ట్రిప్ తగ్గింపు

ఇన్సూర్ చేయబడిన వ్యక్తి కోసం అత్యవసర హోటల్ వసతి

వైద్య అత్యవసర పరిస్థితుల అర్థం మీరు మరికొన్ని రోజుల కోసం మీ హోటల్ బుకింగ్‌ను పొడిగించవలసి ఉంటుంది. అదనపు ఖర్చు గురించి ఆందోళన చెందుతున్నారా? మీరు రికవర్ అయ్యేటప్పుడు దానిని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి

మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్ విమానం

మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్

మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్ల కారణంగా ఊహించని ఖర్చుల గురించి ఆందోళన చెందకండి; మీ గమ్యస్థానానికి చేరుకోవడానికి వసతి మరియు ప్రత్యామ్నాయ విమాన బుకింగ్ ఖర్చుల కోసం మేము మీకు రీయింబర్స్ చేస్తాము.

పాస్‌పోర్ట్ మరియు అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోల్పోవడం :

హైజాక్ డిస్ట్రెస్ అలవెన్స్

ఫ్లైట్ హైజాక్‌లు అనేవి బాధాకరమైన అనుభవం. మరియు అధికారులు సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతున్నప్పటికీ, మేము మా వంతు సహాయం చేస్తాము మరియు దాని వలన కలిగే ఇబ్బందులకు పరిహారం చెల్లిస్తాము.

హాస్పిటల్ క్యాష్ - యాక్సిడెంట్ మరియు అనారోగ్యం

ఎమర్జెన్సీ క్యాష్ అసిస్టెన్స్ సర్వీస్

ప్రయాణిస్తున్నప్పుడు, దొంగతనం లేదా దోపిడీ నగదు కొరతకు దారితీయవచ్చు. కానీ చింతించకండి ; హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అనేది భారతదేశంలో నివసించే ఇన్సూర్ చేయబడిన వ్యక్తి కుటుంబం నుండి నగదు బదిలీని సులభతరం చేస్తుంది. షరతులు మరియు నిబంధనలకు లోబడి.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా చెక్-ఇన్ బ్యాగేజీ నష్టానికి కవర్

చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ నష్టం

మీరు చెక్-ఇన్ చేయబడిన లగేజీని పోగొట్టుకున్నారా? ఆందోళన పడకండి; నష్టానికి మేము పరిహారం చెల్లిస్తాము, కాబట్టి వెకేషన్ కోసం ముఖ్యమైనవి మరియు ప్రాథమిక అవసరాలతో వెళ్ళవచ్చు. షరతులు మరియు నిబంధనలకు లోబడి.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా చెక్-ఇన్ బ్యాగేజీ ఆలస్యం

చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ యొక్క ఆలస్యం

వేచి ఉండటం అనేది ఎప్పుడూ సరదాగా ఉండదు. మీ లగేజీ రాకలో ఆలస్యం జరిగితే మేము దుస్తులు, టాయిలెట్రీలు, మెడిసిన్ లాంటి అవసరాల కోసం మీకు రీయింబర్స్‌ చేస్తాము, ఈ విధంగా మీరు మీ పర్యటన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

పాస్‌పోర్ట్ మరియు అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోల్పోవడం :

బ్యాగేజ్ మరియు అందులోని వస్తువుల దొంగతనం

లగేజ్ దొంగతనం అనేది మీ ప్రయాణానికి ఆటంకం కలిగించవచ్చు. అయితే, మీ పర్యటన సజావుగా సాగేలా చూసేందుకు మేము లగేజ్ దొంగతనం సందర్భంలో డబ్బులు రీయంబర్స్ చేస్తాము. షరతులు మరియు నిబంధనలకు లోబడి.

పైన పేర్కొన్న కవరేజ్ మా కొన్ని ట్రావెల్ ప్లాన్లలో అందుబాటులో ఉండకపోవచ్చు. మా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి మరింత తెలుసుకోవడానికి దయచేసి పాలసీ వివరాలు, బ్రోచర్ మరియు ప్రాస్పెక్టస్‌ను చదవండి.

భారతదేశం నుండి మలేషియా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద ఏవి కవర్ చేయబడవు

భారతదేశం నుండి మలేషియా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో మీరు వీటి కోసం కవరేజ్ పొందకపోవచ్చు ;

చట్టం ఉల్లంఘన

చట్టం ఉల్లంఘన

యుద్ధం లేదా చట్టం ఉల్లంఘన కారణంగా ఏర్పడే అనారోగ్యం లేదా ఆరోగ్య సమస్యలు ప్లాన్ పరిధిలోకి రావు.

మాదకద్రవ్యాల వినియోగం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో కవర్ చేయబడదు

మత్తు పదార్థాల వినియోగం

మీరు ఏవైనా మత్తు పదార్థాలు లేదా నిషేధిత పదార్థాలను తీసుకుంటే, పాలసీ ఎలాంటి క్లెయిమ్‌లను స్వీకరించదు.

ముందుగా ఉన్న వ్యాధులు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడవు

ముందుగా ఉన్న వ్యాధులు

మీరు ఇన్సూర్ చేసిన ప్రయాణానికి ముందు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే, ఇప్పటికే ఉన్న అనారోగ్యానికి మీరు ఏదైనా చికిత్స చేయించుకుంటే, ఈ సంఘటనలకు సంబంధించిన ఖర్చులను పాలసీ కవర్ చేయదు.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ కాస్మెటిక్ సర్జరీలు, ఓబెసిటీ చికిత్సలను కవర్ చేయదు

సౌందర్య మరియు ఊబకాయం చికిత్స

మీరు ఇన్సూర్ చేసిన కాలవ్యవధిలో మీరు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సౌందర్యం లేదా ఊబకాయం చికిత్సను ఎంచుకుంటే, అలాంటి ఖర్చులు కవర్ చేయబడవు.

స్వతహా చేసుకున్న గాయాలు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో పరిధిలోకి రావు

స్వతహా చేసుకున్న గాయం

స్వతహా-చేసుకున్న గాయాల కారణంగా ఉత్పన్నయమయ్యే హాస్పిటలైజెషన్ ఖర్చులు లేదా వైద్య ఖర్చులు మా ఇన్సూరెన్స్ ప్లాన్‌లో పరిధిలోకి రావు.

మలేషియా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో ఎలా కొనుగోలు చేయాలి?

• ఇక్కడ క్లిక్ చేయండి లింక్, లేదా మా పాలసీని కొనుగోలు చేయడానికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ వెబ్‌పేజీని సందర్శించండి.

• ప్రయాణీకుల వివరాలు, గమ్యస్థాన సమాచారం మరియు ట్రిప్ ప్రారంభం మరియు ముగింపు తేదీలను నమోదు చేయండి.

• మా మూడు ప్రత్యేకమైన ఎంపికల నుండి మీకు ఇష్టమైన ప్లాన్‌ను ఎంచుకోండి.

• మీ వ్యక్తిగత వివరాలను అందించండి.

• ప్రయాణీకుల గురించి అదనపు వివరాలను పూరించండి మరియు ఆన్‌లైన్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించి చెల్లించడానికి కొనసాగండి.

• ఇక మిగిలింది ఒక్కటే- మీ పాలసీని తక్షణమే డౌన్‌లోడ్ చేసుకోండి!

విదేశాల్లో వైద్య అత్యవసర పరిస్థితుల కోసం అయ్యే ఖర్చు అనేది మీ ప్రయాణ బడ్జెట్‌కి భారంగా మారడాన్ని అనుమతించకండి. ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో అత్యవసర వైద్య మరియు డెంటల్ ఖర్చుల నుండి మిమ్మల్ని మీరు ఆర్థికంగా కవర్ చేసుకోండి.

మలేషియా గురించి ఆసక్తికరమైన వాస్తవాలు

మలేషియా గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

కేటగిరీలు నిర్దేశం
జీవవైవిధ్యంఒరంగుటన్లు మరియు మలయన్ పులులు వంటి అంతరించిపోతున్న జాతులతో సహా ప్రపంచంలోని 20% జంతు జాతులకి నిలయం.
వంటమలయ్, చైనీస్, భారతీయ మరియు స్థానిక రుచులు కలగలసిన విభిన్నమైన మరియు రుచికరమైన వంటకాల కోసం ప్రసిద్ధి చెందింది.
సాంస్కృతిక వైవిధ్యంమలేషియా విభిన్న సంస్కృతులను కలిగి ఉంది: మలయ్, చైనీస్, భారతీయ మరియు స్థానిక తెగలతో విభిన్నమైన సంస్కృతిని కలిగి ఉంటుంది.
ట్విన్ టవర్స్ఐకానిక్ పెట్రోనాస్ ట్విన్ టవర్స్ 1998 నుండి 2004 వరకు ప్రపంచంలోని అతిపెద్ద భవనాల టైటిల్‌ను కలిగి ఉన్నాయి.
పండుగలుహరి రాయ, చైనీస్ నూతన సంవత్సరం మరియు దీపావళి పండుగలను వేడుకగా జరుపుకొని దేశవ్యాప్తంగా సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది.
రెయిన్‌ఫారెస్ట్‌లుప్రపంచంలోనే అతి పురాతనమైన రెయిన్‌ఫారెస్ట్‌లు ఈ దేశంలో ఉన్నాయి, ఇవి సాటిలేని జీవవైవిధ్యాన్ని మరియు పర్యావరణ ప్రాముఖ్యతను అందిస్తాయి.
సముద్రతీరాలులాంగ్‌కవి మరియు పెర్హెన్షియన్ ద్వీపాలతో అందమైన కోస్తాతీరాలు మరియు సుందరమైన సముద్రతీరాలు సేద తీరుస్తాయి.
టెక్ హబ్ఆగ్నేయాసియాలో ఒక సాంకేతిక కేంద్రంగా ఎదుగుతూ ఆవిష్కరణ మరియు డిజిటల్ పురోగతితో ముందుకు సాగుతుంది.

మలేషియా టూరిస్ట్ వీసా కోసం అవసరమైన డాక్యుమెంట్లు

మలేషియాకు ప్రయాణించడానికి, మీకు మలేషియా టూరిస్ట్ వీసా అవసరం, దాని కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

• పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు మరియు పూర్తి చేయబడిన, సంతకం చేయబడిన వీసా అప్లికేషన్ ఫారంను తీసుకువెళ్ళండి.

• ప్రయాణం చేయడానికి ముందు కనీసం ఆరు నెలల చెల్లుబాటుతో చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్‌ను చేయించుకోండి.

• మీ ట్రిప్ సమయంలో సమగ్ర కవరేజ్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందండి.

• టూర్ టిక్కెట్లు మరియు ఏవైనా అవసరమైన నిర్ధారణ డాక్యుమెంట్ల కాపీలను ఉంచుకోండి.

• హోటల్ మరియు విమాన బుకింగ్‌లతో సహా మీ ప్రయాణ వివరాలను నిర్వహించండి.

• అవసరమైన ప్రయాణ వివరాలను కలిగి ఉన్న ఒక కవర్ లెటర్‌ను సిద్ధం చేయండి.

• వీసా అప్లికేషన్ల కోసం హోటల్ బుకింగ్స్ రుజువు మరియు విమాన రిజర్వేషన్లకు ప్రాధాన్యత ఇవ్వండి.

మలేషియాను సందర్శించడానికి ఉత్తమ సమయం

మలేషియాను సందర్శించడానికి ఉత్తమ సమయం మీకు కావలసిన అనుభవాలు మరియు చూడాలని అనుకుంటున్న ప్రాంతాల ఆధారంగా ఉంటుంది. రెండు ప్రత్యేక వర్షాకాలాలతో ఈ దేశంలో ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. నవంబర్ మరియు ఏప్రిల్ మధ్య పశ్చిమ తీరంలో పొడి వాతావరణం ఉంటుంది, లాంగ్‌కవి లేదా పెనాంగ్ వంటి ప్రదేశాలను చూడటానికి ఇది అనువైన సమయం. పెర్హెన్షియన్ ద్వీపాలు లేదా తియోమాన్ ద్వీపం సహా తూర్పు తీరంలో పర్యటించడానికి వర్షాకాలం కాని మార్చ్ నుండి అక్టోబర్ వరకు ఉత్తమ సమయం. అయితే, దేశవ్యాప్తంగా ఉత్తమ వాతావరణం కోసం ఏప్రిల్, మే, మరియు అక్టోబర్ నెలలు అనుకూలంగా ఉంటాయి, ఈ సమయంలో వర్షపాతం తక్కువగా ఉంటుంది మరియు పర్యాటకులు కూడా తక్కువగా ఉంటారు.

సందర్శన కోసం వెళ్లే ముందు చైనీస్ నూతన సంవత్సరం లేదా హరి రాయ ఐదిల్‌ఫిత్రి వంటి పండుగలను దృష్టిలో పెట్టుకోవడం ముఖ్యం, ఎందుకంటే ఇవి విభిన్నమైన సాంస్కృతిక అనుభవాన్ని అందిస్తుంది కానీ ఈ సమయంలో పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది మరియు వసతి ధరలు ఎక్కువగా ఉంటాయి. మీ ట్రిప్‌కు ముందు మలేషియా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను పొందడం వలన మనశ్శాంతి లభిస్తుంది, ముఖ్యంగా ఊహించని వాతావరణ హెచ్చుతగ్గులు లేదా ప్రయాణ సంబంధిత సమస్యలు ఏర్పడిన సమయంలో.

మలేషియాను సందర్శించడానికి ముందు ఉత్తమ సమయం, వాతావరణం, ఉష్ణోగ్రత మరియు ఇతర అంశాల గురించి మరింత తెలుసుకోవడానికి. మలేషియాను సందర్శించడానికి ఉత్తమ సమయం గురించి మా బ్లాగ్ చదవండి.

మలేషియా పర్యటనలో తీసుకోవలసిన భద్రతా మరియు జాగ్రత్త చర్యలు

మలేషియాలో ప్రయాణిస్తున్నప్పుడు, తీసుకోవలసిన కొన్ని భద్రత మరియు జాగ్రత్త చర్యలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

వాతావరణ సంసిద్ధత: ముఖ్యంగా నవంబర్ నుండి మార్చి వరకు ఉండే వర్షాకాలంలో, ఒక గొడుగు లేదా వాటర్ ప్రూఫ్ జాకెట్ వెంట ఉంచుకొని ఆకస్మిక వర్షాల కోసం సిద్ధంగా ఉండండి.

ఎమర్జెన్సీ కాంటాక్ట్స్: స్థానిక ఎమర్జెన్సీ నంబర్లను సేవ్ చేసుకోండి మరియు మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ సహా ముఖ్యమైన డాక్యుమెంట్లను సులభంగా యాక్సెస్ చేసే విధంగా ఉంచుకోండి. భారతదేశం నుండి మలేషియా ట్రావెల్ ఇన్సూరెన్స్ అత్యవసర సమయాల్లో సహకారాన్ని అందిస్తుంది, అనూహ్యమైన పరిస్థితులలో ఇది తగిన వైద్య సదుపాయం మరియు మార్గనిర్దేశం అందిస్తుంది.

వన్యప్రాణులు: రెయిన్‌ఫారెస్ట్ లేదా న్యాచురల్ రిజర్వ్‌లను సందర్శించేటప్పుడు ప్రమాదాలు లేదా గాయాలను నివారించడానికి వన్యప్రాణుల నుండి సురక్షితమైన దూరంలో ఉండండి.

ఆరోగ్య జాగ్రత్తలు: ఉష్ణమండల దేశం అయిన మలేషియాలో డెంగ్యూ జ్వరం బారిన పడకుండా ఉండడానికి మస్కిటో రిపెల్లెంట్ ఉపయోగించండి. ఉదర సంబంధిత సమస్యలను నివారించడానికి బాటిల్డ్ వాటర్ లేదా మరగబెట్టిన నీటిని తాగండి.

సాంస్కృతిక మర్యాదలను గౌరవించండి: స్థానిక సంస్కృతికి గౌరవం ఇవ్వండి, మతపరమైన ప్రదేశాలలో తగిన విధంగా దుస్తులను ధరించండి, ఇళ్లు లేదా ఆలయాల లోపలికి వెళ్లే ముందు షూలను తొలగించండి మరియు సంప్రదాయ దుస్తుల నియమాల గురించి తెలుసుకోండి.

ట్రాఫిక్ అవగాహన: ట్రాఫిక్ రద్దీ సమయంలో రోడ్లను దాటే సమయంలో జాగ్రత్తగా ఉండండి. పెడెస్ట్రియన్ క్రాసింగ్లు ఉపయోగించండి మరియు మోటార్‌బైక్స్ ని గమనిస్తుండండి.

కోవిడ్-19 నిర్దిష్ట మార్గదర్శకాలు

• మీ స్వంత ఆరోగ్యం మరియు భద్రత కోసం పబ్లిక్ ప్రాంతాల్లో ఫేస్ మాస్కులను ధరించండి.

• రద్దీగా ఉండే ప్రదేశాలలో సురక్షితమైన దూరం పాటించండి.

• వ్యక్తిగత పరిశుభ్రతను పాటించండి.

• మలేషియాలో కోవిడ్-19 కు సంబంధించిన స్థానిక నియమాలు మరియు మార్గదర్శకాలను అనుసరించండి.

• మీకు కోవిడ్-19 లక్షణాలు కనిపించినట్లయితే స్థానిక అధికారులకు తెలియజేయండి మరియు సహకరించండి

మలేషియాలో అంతర్జాతీయ విమానాశ్రయాల జాబితా

మలేషియా చుట్టూ ఉన్న కొన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఇక్కడ ఉన్నాయి:

నగరం విమానాశ్రయం పేరు
కౌలాలంపూర్కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (KUL)
పెనాంగ్పెనంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (PEN)
కోటా కినబాలుకోటా కినబాలు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (BKI)
లాంగ్‌కవిలంగ్‌కావి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (LGK)
సేనైసేనై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (JHB)
కుచింగ్కుచింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (KCH)
మిరిమిరి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (MYY)
లబువాన్లాబువాన్ విమానాశ్రయం (LBU)
సందకన్సందకన్ ఎయిర్‌పోర్ట్ (SDK)
సబాహ్తవావు ఎయిర్‌పోర్ట్ (TWU)
సుబంగ్సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా విమానాశ్రయం (SZB)
టెరెంగ్గానుసుల్తాన్ మహమూద్ విమానాశ్రయం (TGG)
ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయండి

మనశ్శాంతి మరియు భద్రత కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో మీరు కలలుగన్న మలేషియా సెలవును ప్రారంభించండి.

మలేషియాలో ప్రముఖ గమ్యస్థానాలు

మలేషియాలో ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి, మలేషియాలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి, మనశ్శాంతితో ఈ పర్యటనను ఆనందించడానికి ఆన్‌లైన్‌లో మలేషియా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనడం మరచిపోకండి:

1

కౌలాలంపూర్

పెట్రోనాస్ ట్విన్ టవర్స్ చూసిన తరువాత బాటు కేవ్స్ హిందూ మందిరాలను చూడండి, నేషనల్ మాస్క్‌ను సందర్శించండి, లేదా బుకిట్ బిన్టాంగ్ యొక్క విలాసవంతమైన షాపింగ్ ప్రదేశాన్ని అన్వేషించండి. రుచికరమైన స్ట్రీట్ ఫుడ్‌తో నగరం యొక్క వైవిధ్యభరితమైన వంటకాలను ఆస్వాదించండి. బర్డ్ పార్కు లేదా ఇస్లామిక్ ఆర్ట్స్ మ్యూజియంను సందర్శించడం మరచిపోకండి.

2

లాంగ్‌కవి

శుభ్రమైన సముద్రతీరాలు మాత్రమే కాకుండా లాంగ్‌కవిలో లాంగ్‌కవి స్కై బ్రిడ్జ్, కేబుల్ కార్ మరియు ఒక డ్యూటీ ఫ్రీ షాపింగ్ డిస్ట్రిక్ట్ వంటి ఆకర్షణలు ఉన్నాయి. మడఅడవుల్లో విహరించండి, ఈగల్ స్క్వేర్‌ని సందర్శించండి లేదా జెట్ స్కీయింగ్ నుండి స్నార్కెలింగ్ వరకు సాహసభరితమైన అనుభవం కోసం వాటర్ స్పోర్ట్‌లో పాల్గొనండి. మడ అడవులు, ఆకర్షించే లైమ్‌స్టోన్ శిలలు మరియు విభిన్నమైన పర్యావరణ అనుభవాలతో మైమరచిపోండి.

3

మలక్కా

ఎ ఫమోసా ఫోర్ట్ చూడండి, బాబా అండ్ న్యోన్యా హెరిటేజ్ మ్యూజియంలో పెరానాకన్ సంస్కృతి గురించి తెలుసుకోండి మరియు జోంకర్ స్ట్రీట్‌లో న్యోనా వంటకాలను ఆస్వాదించండి. మేరీటైమ్ మ్యూజియం లేదా మలక్కా నదిలో క్రూయిజ్‌కి వెళ్లి నగరాన్ని ప్రత్యేక దృష్టికోణంతో వీక్షించండి.

4

పెనాంగ్

స్ట్రీట్ ఆర్ట్ మరియు వారసత్వ ప్రదేశాలతో జార్జ్ టౌన్ ఆకర్షిస్తుంది, మలయ్, చైనీస్ మరియు భారతీయ వంటకాల మేళవింపుతో ఆహార ప్రియులను అతి తక్కువ ధరలతో పెనాంగ్ ఆకర్షిస్తుంది. క్లాన్ హౌజులలో తిరగండి, పేరానాకన్ మ్యాన్షన్ చూడండి లేదా అన్ని దిశలలో చూడటానికి పెనాంగ్ హిల్ పై హైకింగ్ కి వెళ్ళండి.

5

సబాహ్ (బోర్నియో)

ఆగేయాసియాలోని ఎత్తయిన శిఖరం మౌంట్ కినబాలును అధిరోహించండి, లేదా సిపాదన్‌లోని నీటిలోపలి అద్భుత ప్రదేశాన్ని చూడటానికి డైవ్ చేయండి. ఓరంగుటాన్ రీహాబిలిటేషన్ సెంటర్ వంటి వన్యప్రాణుల అభయారణ్యాలను చూడండి లేదా బోర్నియో వారసత్వం గురించి లోతైన అవగాహన కోసం సబాహ్ యొక్క స్వదేశీ సంస్కృతుల గురించి తెలుసుకోండి. భారతదేశంలో మలేషియా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ వలన ఈ అందమైన ప్రదేశాలను చింత లేకుండా అన్వేషించవచ్చు.

6

కెమెరాన్ హైల్యాండ్స్

తోటల వద్ద టీ తయారీ ప్రక్రియలో నిమగ్నం అయిపోండి, మరో ప్రపంచపు అనుభవం కోసం మాస్సీ ఫారెస్ట్‌లో హైకింగ్‌కి వెళ్ళండి లేదా బటర్‌ఫ్లై ఫార్మ్‌ను సందర్శించండి. చల్లటి వాతావరణం మలేషియాలో సాధారణంగా ఉండే వెచ్చనైన వాతావరణం నుండి ఉపశమనం అందిస్తుంది. ఇక్కడ స్ట్రాబెర్రీ ఫార్మ్స్, బటర్‌ఫ్లై గార్డెన్స్ మరియు ఈ ప్రాంతం యొక్క చరిత్ర మరియు వారసత్వాన్ని ప్రదర్శించే ప్రఖ్యాత టైమ్ టన్నెల్ మ్యూజియం ఉన్నాయి.


మలేషియాలో చేయవలసిన పనులు

మలేషియాలో ప్రయాణిస్తున్నప్పుడు చేయవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

జార్జ్ టౌన్‌లో హెరిటేజ్ ట్రైల్స్: అందమైన స్ట్రీట్ ఆర్ట్, చారిత్రాత్మక ప్రదేశాలు మరియు వైవిధ్యమైన నిర్మాణాలు కలిగి ఉన్న జార్జ్ టౌన్ యొక్క యునెస్కో వీధులలో విహరించండి. అనేక సంప్రదాయ వంటకాల కలయిక అయిన పెనాంగ్ యొక్క ప్రసిద్ధ చెందిన హాకర్ ఫుడ్‌ను ఆస్వాదించండి.

కినాబాలు పార్క్ చూడండి: ఆగ్నేయాసియాలోని ఎత్తయిన శిఖరం మరియు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన కినబాలు పార్క్‌లో ట్రెక్కింగ్‌కి వెళ్ళండి. ప్రపంచంలో అతి పెద్ద పుష్పం అయినా రఫ్లేసియాను చూడండి మరియు ఈ పర్యావరణ ఖజానాలో విభిన్నమైన పక్షి జాతులను చూడండి.

లాంగ్‌కవిలో మ్యాంగ్రోవ్ టూర్: బోట్ టూర్ల ద్వారా లంగ్‌కావి యొక్క మడ అడవుల్లో విహరించండి, విభిన్నమైన వృక్ష సంపద, గద్ద వంటి అరుదైన వన్య ప్రాణులు మరియు మర్మమైన సున్నపురాయి శిలలను చూసి ద్వీపం యొక్క సహజ సౌందర్యాన్ని ఆనందించండి.

కినబతంగన్‌లో రివర్ సఫారీ: కినబతంగన్ నది దగ్గర ఉండే వన్యప్రాణులను చూడటానికి రివర్ క్రూయిజ్‌లో వెళ్ళండి. బోర్నియో యొక్క గొప్ప జీవవైవిధ్యంలో భాగం అయిన ప్రోబోస్సిస్ కోతులు, పిగ్మీ ఏనుగులు మరియు ఓరంగుటాన్లను వాటి సహజ పరిసరాలలో చూడండి.

సిపదన్‌లో డైవ్: రీఫ్ షార్కులు, బర్రాకుడాస్, మరియు గ్రీన్ సీ టర్టిల్స్ వంటి సముద్ర జీవులను చూడటానికి సిపదన్ ద్వీపంలో ప్రపంచ స్థాయి డైవింగ్ సాహసాలు చేయండి. ఇది సంరక్షణ ప్రాంతం అయినందున రోజువారీ సందర్శకుల సంఖ్య పై పరిమితి ఉంటుంది, ఇది ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది.

బటు గుహలను అన్వేషించండి: మురుగన్ యొక్క ఎత్తైన విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోండి, హిందూ పుణ్యక్షేత్రాలు మరియు శక్తివంతమైన పండుగలతో అలంకరించబడిన అద్భుతమైన గుహలకు ఉన్న 272 మెట్లను ఎక్కండి. సాంస్కృతికంగా లీనమయ్యే అనుభూతి కోసం థాయిపుసం ఉత్సవాన్ని చూడండి.


ఈ యాక్టివిటీల కోసం భారతదేశం నుండి మలేషియా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరం, ఈ వైవిధ్యమైన సాహసాలు చేసేటప్పుడు ఎదురయ్యే ఊహించని సంఘటనలకు ఇది కవరేజ్ అందిస్తుంది.

డబ్బు ఆదా చేసే చిట్కాలు

మలేషియాలో ప్రయాణం చేసేటప్పుడు మీ కోసం కొన్ని డబ్బు ఆదా చేసే చిట్కాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

• బడ్జెట్-ఫ్రెండ్లీ ధరల వద్ద సిసలైన మలేషియన్ వంటకాల కోసం లోకల్ స్ట్రీట్ ఫుడ్ లేదా "హాకర్ సెంటర్లు" ఎంచుకోండి. ఈ ప్రదేశాలు నాసి లేమక్, రోటి కనాయి మరియు లక్సా వంటి విభిన్న డిష్‌లను అందిస్తాయి.

• విలాసవంతమైన హోటళ్లు కాకుండా వివిధ వసతి ఎంపికలను చూడండి. ముఖ్యంగా జార్జ్ టౌన్ లేదా మేలక వంటి ప్రాంతాల్లో హాస్టల్స్, గెస్ట్ హౌస్లు మరియు హోమ్ స్టేస్ సరసమైనవి కానీ సౌకర్యవంతంగా ఉంటాయి.

• నగరాల మధ్య మరియు కౌలాలంపూర్ వంటి మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో తక్కువ ఖర్చు ప్రయాణం కోసం రైళ్లు లేదా బస్సులు వంటి మలేషియా యొక్క సమర్థవంతమైన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్‌లను ఉపయోగించండి. అదనపు సౌలభ్యం మరియు డిస్కౌంట్ ఇవ్వబడిన ఛార్జీల కోసం ప్రీపెయిడ్ ట్రావెల్ కార్డులను కొనుగోలు చేయడాన్ని పరిగణించండి.

• పబ్లిక్ పార్కులు, మసీదులు, దేవాలయాలు, మరియు సాంస్కృతిక చిహ్నాలు అయిన సుల్తాన్ అబ్దుల్ సమద్ బిల్డింగ్ లేదా థెన్ హౌ టెంపుల్ వంటి అనేక ఉచిత ఆకర్షణలను సందర్శించండి.

• జ్ఞాపికలు, దుస్తులు మరియు హస్తకళల కోసం కౌలాలంపూర్ లోని పెటాలింగ్ స్ట్రీట్ లేదా మెలాకా లోని జోంకర్ స్ట్రీట్‌ను సందర్శించండి. మెరుగైన డీల్స్ కోసం తెలివిగా బేరం చేయండి.

• అన్వేషించేటప్పుడు ఒక తిరిగి ఉపయోగించదగిన నీటి బాటిల్ మరియు స్నాక్స్ తీసుకువెళ్ళండి. బాటిల్ చేయబడిన నీటిని నిరంతరం కొనుగోలు చేయకుండా డబ్బు ఆదా చేయడానికి పబ్లిక్ వాటర్ స్టేషన్ల వద్ద రీఫిల్ చేయండి. మార్కెట్లలో లభించే స్థానిక పండ్లు లేదా స్నాక్స్ సరసమైన మరియు రుచికరమైన ఎంపికలు అందిస్తాయి.

• పర్యాటకులు తక్కువగా ఉండే షోల్డర్ సీజన్లు (ఏప్రిల్-మే, అక్టోబర్) లో సందర్శించండి. ఈ సమయంలో వసతి రేట్లు తక్కువగా ఉండడమే కాక మీరు ప్రశాంతంగా విహరించగలుగుతారు.

• బాటు కేవ్స్ లేదా లాంగ్‌కవి కేబుల్ కారు వంటి వాటి కోసం గ్రూప్ లేదా బడ్జెట్ టూర్లు ఎంచుకోండి. అనేక సైట్ల కోసం కంబైన్డ్ ఎంట్రీ టిక్కెట్లను అందించే ప్యాకేజ్ డీల్స్ కోసం చూడండి, ఇది తరచుగా డిస్కౌంట్ ఇవ్వబడిన రేట్ల వద్ద లభిస్తాయి.

ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా, ప్రయాణికులు తమ బడ్జెట్ నుండి అధిక ప్రయోజనం పొందవచ్చు మరియు రాజీ పడకుండా మలేషియాలో గొప్ప అనుభవాన్ని పొందవచ్చు. భారతదేశం నుండి మలేషియా పర్యటనకు వెళ్లే ముందు ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవడం గుర్తుంచుకోండి, తక్కువ ఖర్చు అయ్యే ఈ ఎంపికలు మరియు ఉత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్ మలేషియాతో ఊహించని పరిస్థితుల నుండి ఆర్థిక రక్షణను పొందండి.

మలేషియాలో ప్రసిద్ధి చెందిన భారతీయ రెస్టారెంట్ల జాబితా

మీరు మలేషియాలో ప్రయాణిస్తున్నప్పుడు మీ ఆకలిని తీర్చడానికి మలేషియాలో దేశీయ రుచులను అందించే ప్రముఖ భారతీయ రెస్టారెంట్ల జాబితా ఇక్కడ ఇవ్వబడింది:

• పాసేజ్ థ్రు ఇండియా
చిరునామా: 1వ అంతస్తు, నం. 4, పెర్షియారన్ అంపాంగ్, 55000 కౌలాలంపూర్, మలేషియా
తప్పక ప్రయత్నించాల్సిన వంటకాలు: బటర్ చికెన్ మరియు గార్లిక్ నాన్

• నాగసరి కర్రీ హౌస్
చిరునామా: 22, జలన్ టన్ మొహమ్మద్ ఫువాద్ 2, తమన్ టన్ డాక్టర్ ఇస్మాయిల్, 60000 కౌలాలంపూర్, మలేషియా
తప్పక ప్రయత్నించాల్సిన వంటకాలు: ఫిష్ హెడ్ కర్రీ

• ముత్తు'స్ కర్రీ
చిరునామా: 7, జలన్ దోబీ, 74000 సెరెంబన్, నేగేరి సెంబిలాన్, మలేషియా
తప్పక ప్రయత్నించవలసిన వంటకాలు: ఫిష్ హెడ్ కర్రీ మరియు చికెన్ మసాలా

• శరవణా భవన్
చిరునామా: 52, జలన్ మారోఫ్, బంగ్సర్, 59100 కౌలాలంపూర్, మలేషియా
తప్పక ప్రయత్నించాల్సిన వంటకాలు: మసాలా దోస మరియు ఫిల్టర్ కాఫీ

• ఫియర్స్ కర్రీ హౌస్
చిరునామా:16, జలన్ కేముజ, బంగ్సర్, 59000 కౌలాలంపూర్, మలేషియా
తప్పక ప్రయత్నించవలసిన వంటకాలు: చికెన్ వరువల్‌తో బనానా లీఫ్ రైస్

• రీస్టోరన్ శ్రీ నిర్వాణ మాజు
చిరునామా: 43, జలన్ తెలవి 3, బంగ్సర్ బారు, 59100 కౌలాలంపూర్, మలేషియా
తప్పక ప్రయత్నించవలసిన వంటకాలు: పీతల కర్రీతో బనానా లీఫ్ రైస్

• సంగీత వెజిటేరియన్ రెస్టారెంట్
చిరునామా: 263, జలన్ టన్ సంబంతన్, బ్రిక్‌ఫీల్డ్స్, 50470 కౌలాలంపూర్, మలేషియా
తప్పక ప్రయత్నించాల్సిన వంటకాలు: నెయ్యి దోస మరియు వెజిటెబుల్ బిర్యానీ

• నాసి కందర్ పెలితా
చిరునామా: 149-151తో సహా అనేక బ్రాంచ్‌లు, జలన్ అంపాంగ్, 50450 కౌలాలంపూర్, మలేషియా
తప్పక ప్రయత్నించాల్సిన వంటకాలు: చికెన్ కర్రీ మరియు రోటీ కనాయ్‌తో నాసి కందర్

మలేషియాలో స్థానిక చట్టం మరియు ఆచారాలు

మలేషియాకు ప్రయాణిస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని స్థానిక చట్టాలు మరియు ఆచారాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:

• మతపరమైన ప్రదేశాలను సందర్శించేటప్పుడు తగిన విధంగా దుస్తులు ధరించండి ; మీ భుజాలు మరియు మోకాలు కవర్ చేయండి. మసీదులు మరియు దేవాలయాలలోకి ప్రవేశించే ముందు గౌరవ సూచకంగా షూస్ తీయండి.

• చట్టపరమైన పర్యవసానాలను నివారించడానికి మలేషియన్ రాచరిక కుటుంబం గురించి విమర్శలు లేదా అగౌరవ పరిచే వ్యాఖ్యలు చేయకుండా ఉండండి.

• శుభాకాంక్షలు తెలిపేటప్పుడు, సంజ్ఞలు చేసేటప్పుడు మరియు వస్తువులను అందించేటప్పుడు కుడి చేతిని ఉపయోగించండి. ఎడమ చేతిని ఉపయోగించడం నివారించండి, మలేషియన్ సంస్కృతిలో ఇది అశుద్ధంగా పరిగణించబడుతుంది.

• మలేషియాలో ఎక్కువగా ఇదే ముస్లిమ్ జనాభా కఠినమైన మద్యం నిబంధనలను అనుసరిస్తుంది. నిషేధిత ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవించకుండా ఉండండి.

• ప్రజలు లేదా వస్తువులను మీ కాళ్లతో చూపడం నివారించండి, ఇది అగౌరవానికి సూచనగా పరిగణించబడుతుంది.

• సాంప్రదాయక ప్రాంతాల్లో నిరసన తెలిపే అవకాశం ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో ప్రేమను వ్యక్తపరచకండి.

• హై-ఎండ్ రెస్టారెంట్లలో లేదా అసాధారణమైన సర్వీస్ కోసం మినహా, మలేషియాలో టిప్పింగ్ కస్టమరీ కాదు.

• మాదకద్రవ్యాలు కలిగి ఉండడం లేదా తరలించడం సహా డ్రగ్స్ సంబంధిత నేరాల కోసం తీవ్రమైన చట్టపరమైన పర్యవసానాలు ఉంటాయి.

• కమ్యూనల్ డిష్‌లను పంచుకునే సమయంలో తినడానికి మీ కుడి చేతిని లేదా పాత్రలను ఉపయోగించండి.

• న్యాచురల్ సైట్స్‌లో చెత్తను పారవేయకండి. బాధ్యతాయుతంగా చెత్తను డిస్పోజ్ చేయండి.

ఈ స్థానిక చట్టాలు మరియు సాంస్కృతిక మర్యాదలను అనుసరించడం వలన మలేషియాలో గౌరవప్రదమైన మరియు అవాంతరాలు-లేని అనుభవాన్ని పొందుతారు. భారతదేశం నుండి మలేషియా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను పొందడం మర్చిపోవద్దు, మీ సందర్శన సమయంలో అవసరమైన మద్దతు మరియు కవరేజ్‌ను ఇది అందిస్తుంది.

మలేషియాలో భారతీయ ఎంబసీలు

మీరు మలేషియాకు ప్రయాణిస్తున్నప్పుడు చూడవలసిన కొన్ని మలేషియా-ఆధారిత భారతీయ ఎంబసీలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

ఆస్ట్రేలియా-ఆధారిత భారతీయ ఎంబసీ పని గంటలు అడ్రస్
కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, పెనాంగ్సోమ-శుక్ర: 9 AM - 5:30 PMనం. 1, జలన్ టంకు అబ్దుల్ రహ్మాన్, 10350 జార్జ్ టౌన్, పెనాంగ్, మలేషియా
హై కమిషన్ ఆఫ్ ఇండియా, కోలాలంపూర్సోమ-శుక్ర: 9 AM - 5:30 PMలెవెల్ 28, మేనారా 1 మాంట్ కియారా, నం. 1, జలన్ కియారా, మాంట్ కియారా, 50480 కౌలాలంపూర్, మలేషియా
కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, జోహోర్ బహ్రూసోమ-శుక్ర: 9 AM - 5:30 PMలెవెల్ 6, విస్మా ఇండియన్ ఛాంబర్, 35, జలన్ పెర్టివి, 83000 బటు పహాట్, జోహోర్, మలేషియా

ఎక్కువగా సందర్శించబడే దేశాలకు అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్

ఈ కింద ఇవ్వబడిన ఆప్షన్‌ల నుండి మీకు కావలసినది ఎంచుకోండి, తద్వారా మీరు విదేశీ దేశానికి మీ పర్యటన కోసం మరింత మెరుగ్గా సిద్ధం అవచ్చు

ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉన్న దేశాల జాబితా

మై:హెల్త్ మెడిష్యూర్ సూపర్ టాప్-అప్ ప్లాన్

షెన్గన్ దేశాలు

  • ఫ్రాన్స్
  • స్పెయిన్
  • బెల్జియం
  • ఆస్ట్రియా
  • ఇటలీ
  • స్వీడన్
  • లిథువేనియా
  • జర్మనీ
  • ద నెదర్లాండ్స్
  • పోలండ్
  • ఫిన్లాండ్
  • నార్వే
  • మాల్టా
  • పోర్చుగల్
  • స్విట్జర్లాండ్
  • ఎస్టోనియా
  • డెన్మార్క్
  • గ్రీస్
  • ఐస్‌ల్యాండ్
  • స్లోవేకియా
  • చెక్ రిపబ్లిక్ (చెకియా)
  • హంగేరి
  • లాట్వియా
  • స్లోవేనియా
  • లీకెన్‌స్టెయిన్ మరియు లక్సెంబర్గ్
మై:హెల్త్ మెడిష్యూర్ సూపర్ టాప్-అప్ ప్లాన్

ఇతర దేశాలు

  • క్యూబా
  • ఈక్వడోర్
  • ఇరాన్
  • టర్కీ
  • మొరాకో
  • థాయిలాండ్
  • UAE
  • టోగో
  • అల్జీరియా
  • రొమేనియా
  • క్రొయేషియా
  • మోల్డోవా
  • జార్జియా
  • అరుబా
  • కంబోడియా
  • లెబనాన్
  • సీషెల్స్
  • అంటార్కిటికా

సోర్స్: VisaGuide.World

అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ వలన విమాన ఆలస్యాలు, సామాను కోల్పోవడం మరియు ప్రయాణం సంబంధిత ఇతర అసౌకర్యాలు తక్కువ ఇబ్బందిని కలిగిస్తాయి.

తాజా ట్రావెల్ ఇన్సూరెన్స్ బ్లాగ్‌లను చదవండి

slider-right
డెన్పసర్లో సందర్శించవలసిన ఉత్తమ ప్రదేశాలు: అల్టిమేట్ గైడ్

డెన్పసర్లో సందర్శించవలసిన ఉత్తమ ప్రదేశాలు: అల్టిమేట్ గైడ్

మరింత చదవండి
18 డిసెంబర్, 2024న ప్రచురించబడింది
ఫిన్‌ల్యాండ్‌లో సందర్శించవలసిన ఉత్తమ ప్రదేశాలు: అల్టిమేట్ గైడ్

ఫిన్‌ల్యాండ్‌లో సందర్శించవలసిన ఉత్తమ ప్రదేశాలు: అల్టిమేట్ గైడ్

మరింత చదవండి
18 డిసెంబర్, 2024న ప్రచురించబడింది
కుటాలో సందర్శించవలసిన ఉత్తమ ప్రదేశాలు: అల్టిమేట్ గైడ్

కుటాలో సందర్శించవలసిన ఉత్తమ ప్రదేశాలు: అల్టిమేట్ గైడ్

మరింత చదవండి
18 డిసెంబర్, 2024న ప్రచురించబడింది
ఇస్తాన్‌బుల్‌లో సందర్శించడానికి ఉత్తమ ప్రదేశాలు

ఇస్తాన్‌బుల్‌లో సందర్శించడానికి ఉత్తమ ప్రదేశాలు

మరింత చదవండి
26 నవంబర్, 2024న ప్రచురించబడింది
మాల్టా వీసా ఇంటర్వ్యూ ప్రశ్నలు

అవసరమైన మాల్టా వీసా ఇంటర్వ్యూ ప్రశ్నలు మరియు చిట్కాలు

మరింత చదవండి
26 నవంబర్, 2024న ప్రచురించబడింది
స్లైడర్-లెఫ్ట్

మలేషియా ట్రావెల్ ఇన్సూరెన్స్ గురించి తరచుగా అడగబడే ప్రశ్నలు

మలేషియా సాధారణంగా పర్యాటకులకు సురక్షితం. రద్దీగా ఉండే ప్రాంతాల్లో సాధారణ జాగ్రత్తలు పాటించండి మరియు జేబు దొంగతనం వంటి చిన్న చిన్న నేరాల పట్ల జాగ్రత్త వహించండి. అదనపు భద్రత కోసం రాత్రిపూట ఏకాంత ప్రాంతాలను నివారించండి. భారతదేశం నుండి మలేషియా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం ఊహించని పరిస్థితులలో సహాయాన్ని అందిస్తుంది.

మలేషియాలోకి ప్రవేశించడానికి భారతీయ పౌరులకు వీసా అవసరం. కనీసం మీ పాస్‌పోర్ట్ ఆరు నెలలు చెల్లుబాటు అవ్వాలి మరియు ముందుగానే అవసరమైన వీసాలను ఏర్పాటు చేసుకోండి.

అవును, ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలు మరియు నగరాల్లో ఇంగ్లీష్ విస్తృతంగా మాట్లాడతారు మరియు అర్థం చేసుకుంటారు. అయితే, కొన్ని ప్రాథమిక మలయ్ వాక్యాలను నేర్చుకోవడం అభినందించబడుతుంది మరియు స్థానికులతో మాట్లాడేటప్పుడు మీ అనుభవాన్ని మెరుగుపరచుకోవచ్చు.

పొట్ట సమస్యలను నివారించడానికి బాటిల్ నీరు లేదా వేడి నీరు తాగడం మంచిది. మళ్ళీ ఉపయోగించదగిన వాటర్ బాటిల్‌ను తీసుకుని వెళ్లండి, సురక్షితమైన వనరుల వద్ద రీఫిల్ చేయండి.

మలేషియాలో మలేషియన్ రింగిట్ (MYR)ను ఉపయోగిస్తారు. అధీకృత అవుట్‌లెట్‌లలో ఉత్తమ ధరలకు కరెన్సీలను మార్చుకోండి.

హెపటైటిస్ A, టైఫాయిడ్ మరియు టెటానస్ వంటి వ్యాక్సినేషన్లు సిఫార్సు చేయబడ్డాయి. వ్యక్తిగతీకరించిన సలహా కోసం మీ ప్రయాణానికి ముందు ఒక హెల్త్‌కేర్ ప్రొఫెషనల్‌ను సంప్రదించండి. మీ బస సమయంలో వైద్య అత్యవసర పరిస్థితులను కవర్ చేయడానికి ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ మలేషియాను పరిగణించండి.

టిప్పింగ్ తప్పనిసరి కాదు కానీ హై-ఎండ్ రెస్టారెంట్‌లలో లేదా అసాధారణమైన సర్వీస్ కోసం ఇస్తారు.

అవార్డులు మరియు గుర్తింపు

BFSI లీడర్‌షిప్ అవార్డులు 2022 - సంవత్సరం యొక్క ప్రోడక్ట్ ఇన్నోవేటర్ (ఆప్టిమా సెక్యూర్)

ETBFSI ఉత్తమ పురస్కారాలు 2021

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ
అవార్డులు సెప్టెంబర్ 2021

ICAI అవార్డులు 2015-16

SKOCH ఆర్డర్-ఆఫ్-మెరిట్

ఉత్తమ కస్టమర్ అనుభవం
అవార్డ్ ఆఫ్ ది ఇయర్

ICAI అవార్డులు 2014-15

CMS అవుట్‌స్టాండింగ్ అఫిలియేట్ వరల్డ్-క్లాస్ సర్వీస్ అవార్డ్ 2015

iAAA రేటింగ్

ISO సర్టిఫికేషన్

ప్రైవేట్ సెక్టార్‌లో ఉత్తమ ఇన్సూరెన్స్ కంపెనీ - జనరల్ 2014

slider-right
స్లైడర్-లెఫ్ట్
అన్ని అవార్డులను చూడండి
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయండి

చదవడం పూర్తయిందా? ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా?