కాల్ ఐకాన్
సహాయం కావాలా? మా నిపుణులతో మాట్లాడండి 022-62426242
హోమ్ / హోమ్ ఇన్సూరెన్స్ / దొంగతనం కోసం హోమ్ ఇన్సూరెన్స్

మీ ఇంటి కోసం దొంగతనం మరియు దోపిడీ ఇన్సూరెన్స్ కవరేజ్

మీరు మీ ఇల్లు లేదా వ్యాపార ఆస్తిని నిర్మించుకోవడానికి ఖర్చు చేయవచ్చు, దురదృష్టవశాత్తు, అవి దొంగతనం మరియు దోపిడీ నుండి రక్షించబడతాయని అర్థం కాదు. ఇంట్లో లేదా పని ప్రాంగణంలో దొంగతనం లేదా దోపిడీ జరిగిన ఏదైనా సంఘటన భారీ ఆర్థిక ప్రభావాన్ని చూపుతుంది మరియు మీ భద్రత భావనను తక్షణమే దెబ్బతీయవచ్చు. దొంగతనం మరియు దోపిడీ ఊహించలేనివి, కానీ మీ ఆస్తి సురక్షితంగా ఉండేలా చూసుకోవడం ఒక తెలివైన ఎంపిక. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో దొంగతనం మరియు దోపిడీ ఇన్సూరెన్స్‌తో, మీరు ఊహించని సంఘటనల నుండి మీ విలువైన ఆస్తులను రక్షించుకోవచ్చు. మా సమగ్ర కవరేజ్ నష్టాల నుండి ఆర్థిక రక్షణను అందిస్తుంది, మీ మార్గంలో ఏది ఎదురైనప్పటికీ మీరు వేగంగా మరియు మనశ్శాంతితో కోలుకోవచ్చని నిర్ధారిస్తుంది.

దొంగతనం నుండి ఇంటిని ఎలా రక్షించుకోవాలి?

తాళం వేయండి
అందరూ అదే పని చేస్తారు కదా అని అనిపించవచ్చు. కానీ, చాలామంది ఊరికి వెళ్లే సమయంలో అన్ని తలుపులు మరియు కిటికీలకు సరైన విధంగా తాళం వేయరు. మీరు అన్ని వైపులా జాగ్రత్త చేసినప్పటికీ, ముందు తలుపుకి తాళం వేయడం మర్చిపోకండి. మీరు ఇంట్లో లేనప్పుడు మీ ఇంట్లోకి ప్రవేశించి, వస్తువులు తీసుకెళ్లడమనేది దొంగలకు సులభంగా ఉంటుంది. నిజానికి, మీరు ఇంట్లో లేనప్పుడు మాత్రమే మీ ఇంట్లోకి ప్రవేశించడానికి దొంగలు ప్రయత్నిస్తారని అనుకోకండి. మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీ ఇంట్లో దొంగలు పడవచ్చు. మీరు మీ ఇంటి మెయిన్ డోర్‌కి సరిగ్గా తాళం వేయకపోతే, మీ ఇంట్లో దొంగలు పడి, నిమిషాల్లోనే మీ వస్తువులు తీసుకెళ్లిపోగలరు.
హోమ్ అలారం సిస్టమ్‌లు
మీరు మీ ఇంటి నుండి బయటకు వెళ్లిన ప్రతిసారి, మీ హోమ్ అలారం సెట్ చేసినట్లుగా నిర్ధారించుకోండి. మీరు ఇప్పటికీ దానిని బిగించాల్సి ఉన్నా, బిగించే ఆలోచనలో ఉన్నా, అది ఖచ్చితంగా విలువైనదిగానే ఉంటుంది. హోమ్ అలారం సిస్టమ్‌లు మీ ఇంటిని రక్షించడానికి రూపొందించబడ్డాయి మరియు ఎవరైనా మీ ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేసినప్పుడు అవి హెచ్చరిక పంపుతాయి. హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద కొంచెం ఆదా చేసుకోవడానికి కూడా ఇది మీకు సహాయపడుతుంది.
మీ రక్షణ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేసుకోండి
CCTV సెట్ చేయడమనేది మంచి ఆలోచనే కానీ, దానిని క్రమం తప్పకుండా పరిశీలించడం కూడా ముఖ్యమే.. మీరు మీ భద్రతా పరికరాలను సకాలంలో అప్‌గ్రేడ్ చేస్తూ, నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే, దొంగతనం ఘటన సమయంలో మాత్రమే మీరు కెమెరాను తనిఖీ చేయడం కాకుండా, మీ ప్రాంగణంలో ఏదైనా అపరిచిత సందర్శనలు గమనించడం కోసం కూడా సాధారణంగా తనిఖీ చేస్తూ ఉండాలి.
మీరు ఇంట్లో లేని విషయం అందరికీ తెలిసేలా చేయకండి
మీ భవిష్యత్ ప్రయాణాల గురించి సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌లో తెలియజేయకండి. ప్రత్యేకించి ప్రభుత్వ సెలవు రోజులు, వేసవి సెలవులు మరియు శీతాకాలంలో సెలవుల సమయంలో ఇంటి యజమానులు ఇల్లు విడిచి వెళ్తున్నారా అని తెలుసుకోవడం కోసం దొంగలు ఇప్పుడు ఆన్‌లైన్ పోస్టులు కూడా పరిశీలిస్తున్నారు. మీరు ఇంట్లో లేరనే విషయం దొంగలకు తెలిస్తే, అలాంటి సమయంలో ఇంట్లోకి వచ్చి దొంగతనం చేయడం వాళ్లకి సులభంగా ఉంటుంది. కాబట్టి, మీరు ఎప్పుడైనా ఇల్లు విడిచి వెళ్లాలనుకున్నప్పుడు, మీరు విశ్వసించే పొరుగువారికి ఆ విషయం చెప్పి, మీరు వచ్చే వరకు మీ ఇంటి మీద కన్నేసి ఉంచాల్సిందిగా చెప్పండి.

హోమ్ ఇన్సూరెన్స్ క్రింద దొంగతనం కోసం కవరేజీ

ఇంటి నిర్మాణానికి నష్టం
దొంగలు ఎల్లప్పుడూ చప్పుడు లేకుండా వచ్చి, దొంగతనం ముగించుకుని వెళ్లే పరిస్థితి ఉండకపోవచ్చు. దొంగతనం సమయంలో వాళ్లు మీ ఇంటి తలుపు లేదా ఏదైనా గోడకు నష్టం చేసే అవకాశం కూడా ఉంది. దొంగతనం కారణంగా జరిగిన ఈ రకమైన నష్టం కూడా అవాంతరాలు లేకుండా కవర్ చేయబడుతుంది. మీ ఇంట్లోకి ప్రవేశించడం కోసం దొంగ మీ తలుపును పగులగొట్టడం వల్ల మీ ఇంటి నిర్మాణానికి నష్టం జరిగితే, దాన్ని సరిచేయడానికి అయ్యే ఖర్చును ఇన్సూరెన్స్ పాలసీ చూసుకుంటుంది. ఎందుకంటే, దొంగతనం సంఘటనలు మీ ఇంటి నిర్మాణానికి నష్టం కలిగించినప్పుడు అవి కవర్ చేయబడాల్సిన అవసరం ఉంది.
ఇంట్లోని వస్తువులు కోల్పోవడం
U అంటే, యునాని అని అర్థం. దాదాపు పదకొండవ శతాబ్దంలో అరబ్బులు మరియు పర్షియన్‌లు ద్వారా ప్రవేశపెట్టబడిన యునానీ వైద్యం అనేది భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన ప్రత్యామ్నాయ చికిత్సల్లో ఒకటిగా ఉంటోంది. ప్రకృతిలోనే కాకుండా, మనిషి దేహంలో కూడా ఉండే గాలి, భూమి, నీరు మరియు అగ్ని అనే నాలుగు మూలకాల అసమతౌల్యం కారణంగానే వ్యాధి సంభవిస్తుందనేది యునానీ వైద్యానికి కీలకంగా ఉంటుంది. యునాని వైద్యంలో, ఖమీరా అబ్రెషం హకీమ్ అర్షద్ వాలా లాంటి వివిధ ప్రకృతి పదార్థాలు కలిగిన మూలికా ఫార్ములాల సాయంతో వ్యాధులకు చికిత్స చేస్తుంటారు. ఈ మూలికా ఫార్ములాలో కుంకుమపువ్వు, ఏలకులు, బిర్యానీ ఆకు మరియు భారతీయ బే లీఫ్ మరియు నారదబ్బ కాయ వంటి వృక్ష సంబంధిత అంశాలు ఉంటాయి. యునాని ప్రాముఖ్యతను మేము అర్థం చేసుకున్నాము కాబట్టి, యునానీ కోసం హాస్పిటలైజేషన్ ఖర్చులను కూడా మేము కవర్ చేస్తాము.
దోపిడీ మరియు దొంగతనం రెండింటినీ కవర్ చేస్తుంది
కొన్ని హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలు దొంగతనం లేదా దోపిడీని మాత్రమే కవర్ చేస్తాయి. అయితే, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హోమ్ షీల్డ్ ఇన్సూరెన్స్‌లో మేము ఒకే పాలసీ ద్వారా దొంగతనం మరియు దోపిడీ రెండింటినీ కవర్ చేస్తాము. ఎలాంటి బలప్రయోగం లేకుండా మీ ఇంట్లోకి ప్రవేశించి, మీ వస్తువులను తీసుకెళ్లడాన్ని దొంగతనంగా పరిగణిస్తారు. దొంగతనం మరియు దోపిడీ మధ్య చాలామందికి గణనీయమైన వ్యత్యాసం కనిపించకపోయినప్పటికీ, ఇన్సూరెన్స్ పరిధిలో ఇవి రెండూ విభిన్నమైన నేరాలు మరియు అన్ని పాలసీలు ఈ రెండింటినీ కలిపి కవర్ చేయవు.

థెఫ్ట్ ఇన్సూరెన్స్ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోను ఎందుకు ఎంచుకోవాలి?

విశ్వసనీయమైన బ్రాండ్
దొంగతనం నుండి మీ ఇంటి నిర్మాణాన్ని, ఇంట్లోని వస్తువులను భద్రపరిచే విషయానికి వస్తే, క్లెయిమ్ చెల్లింపు సామర్థ్యాన్ని కలిగి ఉండే నాణ్యమైన బ్రాండ్ కోసం వెళ్లండి, అది అవసరమైన సమయంలో మీకు అండగా నిలుస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అనేది సరైన ఇన్సూరెన్స్ ప్లాన్‌లు అందించడంతో పాటు అత్యంత సులభమైన పద్ధతిలో మరియు పారదర్శకతతో క్లెయిమ్‌లు సెటిల్ చేయడం ద్వారా, #1.3 కోట్ల మంది సంతోషకరమైన వినియోగదారులను సురక్షితం చేసింది. 24x7 కస్టమర్ సపోర్ట్ మరియు ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ బృందంతో, మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము.
1 కవర్‌లోనే అన్ని ఆఫర్‌లు
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో ఒకే ఇన్సూరెన్స్ ప్లాన్ కింద మీరు నిర్మాణం మరియు కంటెంట్ రెండింటినీ కవర్ చేస్తారు కాబట్టి, ఇంటి నిర్మాణం మరియు వస్తువులను మీరు ప్రత్యేకంగా కవర్ చేయాల్సిన అవసరం లేదు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే హోమ్ షీల్డ్ ఇన్సూరెన్స్ అనేది ఒక సమగ్రమైన కవర్ మరియు ఇది మీ ఇంటిని పూర్తిగా సురక్షితం చేస్తుంది. ఒకే కప్పు క్రింద షాపింగ్ అనుభవాన్ని మా వద్ద అనుభూతి చెందండి. మేము ఒకే ప్లాన్ కింద దొంగతనం, దోపిడీ రెండింటినీ కూడా కవర్ చేస్తాము.
ప్రీమియంల మీద 45% వరకు డిస్కౌంట్
ఆన్‌లైన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి మీరు తక్షణమే మీ ప్రీమియంను లెక్కించవచ్చు, సభ్యులను జోడించవచ్చు లేదా తొలగించవచ్చు, ప్లాన్‌లను కస్టమైజ్ చేయవచ్చు లేదా ఆన్‌లైన్‌లో మీరు మీ కవరేజీని సులభంగా చెక్ చేయవచ్చు.
₹25 లక్షల వరకు వస్తువులు కవర్ చేయబడతాయి
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే హోమ్ షీల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద మీరు సులభంగా ₹25 లక్షల వరకు విలువైన మీ గృహోపకరణాలను సురక్షితం చేసుకోవచ్చు. మీ మొత్తం కంటెంట్ విలువ ₹25 లక్షలకు మించకూడదు.
ఆకర్షణీయమైన ఆప్షనల్ కవర్‌లు
మీ ఇంటి కోసం కవరేజీ పరిధిని విస్తరించడానికి, మేము ఆప్షనల్ కవర్‌లు అందిస్తాము. తద్వారా, మీకు ఎంతో ఇష్టమైన మీ ఇంట్లో కవర్ కాని వస్తువు ఏదీ ఉండదు. గృహోపకరణాల కోసం హోమ్ షీల్డ్ ఇన్సూరెన్స్‌తో, మీరు పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆభరణాలు మరియు విలువైన వస్తువులు మరియు పెడల్ సైకిల్‌ లాంటి వాటిని అదనపు ప్రీమియంతో కవర్ చేయడానికి ఎంచుకోవచ్చు. తీవ్రవాదులు లేదా ప్రభుత్వ రక్షణ సేవకు చెందిన భద్రతా స్క్వాడ్ ద్వారా మీ ఇంటికి నష్టం కలిగితే, మేము టెర్రరిజం కవర్‌ కూడా అందిస్తాము.

దొంగతనం మరియు దోపిడీ కవర్ కోసం హోమ్ ఇన్సూరెన్స్‌ను ఎవరు కొనుగోలు చేయాలి?

ఇంటి యజమానులు
ఎలాంటి దొంగతనం అయినా అది ఇంటి యజమానులకు బాధ కలిగిస్తుంది. మీ ఇంట్లో అధిక ద్రవ్య విలువ కలిగిన వస్తువులు మాత్రమే కాకుండా, మీ మరియు మీ కుటుంబ సభ్యుల జ్ఞాపకాలతో నిండి ఉన్న ఇతర అంశాలు కూడా ఉంటాయి. ఒక దురదృష్టకర సంఘటన సందర్భంలో, దొంగతనం కవర్‌తో కూడిన సరైన హోమ్ ఓనర్స్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం కీలక పాత్రను పోషిస్తుంది. ఒకవేళ, మీరు ఒక స్వంత ఇంటిని కలిగి ఉండి, అందులో ఎలక్ట్రానిక్స్, ఆభరణాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఇతర విలువైన వస్తువులు ఉన్నట్లయితే, మీరు దొంగతనం కవర్‌తో కూడిన హోమ్ ఇన్సూరెన్స్‌ను తప్పనిసరిగా పొంది ఉండాలి. కావున, మీరు దొంగతనం సంఘటనలో ఇన్సూర్ చేసిన వస్తువులలో దేనినైనా పోగొట్టుకుంటే, అవి ఆర్థిక నష్టాల నుండి కవర్ చేయబడతాయి. ఒక హోమ్ ఇన్సూరెన్స్ పాలసీతో మీ ఇంటికి ఈ రక్షణ అవసరం. మీరు ఇప్పటికే హోమ్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉన్నట్లయితే, అది దొంగతనం లేదా దోపిడీ కారణంగా నష్టాలను కవర్ చేస్తుందో లేదో చెక్ చేయండి. దొంగతనం కవర్‌తో హోమ్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం ఖచ్చితంగా మీకు మనశ్శాంతిని కలిపిస్తుంది.
ఇంటి అద్దెదారులు
మీరు సొంత ప్రాపర్టీ లేని, తాత్కాలికంగా ఒక అపార్ట్‌మెంట్‌లో నివసించే అద్దెదారు లేదా రెంటర్. కానీ, ఇంటి లోపల ఉన్న వస్తువులు మీ సొంతం కానట్లయితే? ఒకవేళ ఇల్లు మీ స్వంతం కాకపోయినా, అందులోని వస్తువులు మీ స్వంతం అయినప్పటికీ. దొంగతనం ఘటనలో మీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లు, విలువైన వస్తువులు, దుస్తులు మరియు గృహోపకరణాలు దొంగిలించబడితే, ఈ ముఖ్యమైన వస్తువులను మళ్లీ కొనుగోలు చేయడం అనేది భారీ ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు. అందువలన, ఎల్లప్పుడూ మీ ఇంట్లోని వస్తువులను హోమ్ ఇన్సూరెన్స్ కవర్‌తో సురక్షితం చేసుకోండి. మీ ఇంటి యజమాని తన సొంత వస్తువులను మాత్రమే భద్రపరచగలరు, మీరు స్వయంగా ఇంట్లోకి తెచ్చిన వస్తువులను మాత్రం కాదు. మీ విలువైన వస్తువులను భద్రపరచడం మరియు పూర్తి మనశ్శాంతిని పొందడం చాలా ముఖ్యం.

దొంగతనాన్ని కవర్ చేసే హోమ్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం ఏవిధంగా లెక్కించబడుతుంది?

కవరేజ్ అమౌంట్
హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ప్రస్తుత ఆస్తి విలువపై ఆధారపడి లెక్కించబడుతుంది. అధిక కవరేజ్ లేదా అధిక ఇన్సూరెన్స్ మొత్తం అనేది ఎక్కువ ప్రీమియంపై ఆధారపడి, వాటికి అనులోమానుపాతంలో ఉంటుంది. 1 కోటి విలువైన ఫ్లాట్‌కు చెల్లించే ప్రీమియంతో పోలిస్తే, ఐదు కోట్ల విలువైన ఫ్లాట్‌కు చెల్లించే ప్రీమియం ఖచ్చితంగా అధికంగా ఉంటుంది. మీ ఇన్సూరెన్స్ మొత్తం విలువ అనేది మీ ఇంటి ప్రస్తుత ఆస్తి రేటుపై ఆధారపడి ఉంటుంది. వస్తువుల కోసం ఇన్సూరెన్స్ మొత్తం అనేది, వాటి రిప్లేస్‌మెంట్ విలువను బట్టి ఉండాలి.
స్థానం
మీ హోమ్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియంను లెక్కించేటప్పుడు, మీ నివాస నగరం కూడా పరిగణలోకి తీసుకోబడుతుంది. ఒకవేళ, మీరు ఉండే నివాసంలో చాలా దొంగతనం కేసులు నమోదు అయినట్లయితే, మీ ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. ప్రీమియంను నిర్ణయించడంలో మీ నివాస స్థలం ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
మినహాయింపులు, ఏవైనా ఉంటే
మినహాయింపులు అనగా, క్లెయిమ్ సందర్భంలో మీరు తప్పనిసరిగా చెల్లించాల్సిన మొత్తం. మీ హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు మినహాయింపులను కలిగి ఉంటే, మీ ప్రీమియం అమౌంట్ మినహాయించదగిన శాతంపై ఆధారపడి ఉంటుంది. మినహాయించదగినది అధికంగా ఉంటే అది ప్రీమియంను తగ్గిస్తుంది మరియు దానికి విలోమానుపాతంలో ఉంటుంది.
వస్తువుల విలువ
మీ ఇంట్లో ఖరీదైన ఫర్నిచర్ మరియు ఎలక్ట్రానిక్స్ విస్తృత శ్రేణిలో ఉన్నట్లయితే, మీ ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. అదనంగా, మీరు ఆభరణాలు, విలువైన వస్తువులను కవర్ చేయాలని ఎంచుకుంటే, మీరు వాటిని కూడా అదనపు ప్రీమియంతో కవర్ చేయవచ్చు.
భద్రతా చర్యలు
మీ ఇంటి కోసం కవరేజీ పరిధిని విస్తరించడానికి, మేము ఆప్షనల్ కవర్‌లు అందిస్తాము. తద్వారా, మీకు ఎంతో ఇష్టమైన మీ ఇంట్లో కవర్ కాని వస్తువు ఏదీ ఉండదు. గృహోపకరణాల కోసం హోమ్ షీల్డ్ ఇన్సూరెన్స్‌తో, మీరు పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆభరణాలు మరియు విలువైన వస్తువులు మరియు పెడల్ సైకిల్‌ లాంటి వాటిని అదనపు ప్రీమియంతో కవర్ చేయడానికి ఎంచుకోవచ్చు. తీవ్రవాదులు లేదా ప్రభుత్వ రక్షణ సేవకు చెందిన భద్రతా స్క్వాడ్ ద్వారా మీ ఇంటికి నష్టం కలిగితే, మేము టెర్రరిజం కవర్‌ కూడా అందిస్తాము.
కొనుగోలు విధానం మరియు మీ వృత్తి
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద, మీరు జీతం పొందే ఒక ఉద్యోగి అయితే డిస్కౌంట్లను పొందుతారు, అలాగే, మీరు పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లయితే మేము కూడా మీకు డిస్కౌంట్లను అందిస్తాము, కావున మీ ఇంటికి నష్టం కలిగించే అనిశ్చితుల నుండి పూర్తి కవరేజీ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హోమ్ షీల్డ్ కవర్‌ను ఎంచుకోండి.
అదనపు లేదా ఆప్షనల్ కవర్
మీకు ఖరీదైన ఆభరణాలు లేదా పెడల్ సైకిల్ ఉంటే, ఇంటి వస్తువుల కోసం తక్కువ ప్రీమియం చెల్లించడానికి మీరు ఆప్షనల్ కవర్‌లు తీసుకోవాలి. ఆభరణాలు, విలువైన మరియు పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువుల కోసం ఆప్షనల్ కవర్‌లతో మీ ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉండవచ్చు, కానీ మీరు విస్తృతమైన కవరేజ్ పరిధిని కూడా పొందుతారు.

దొంగతనం మరియు దోపిడీ ఇన్సూరెన్స్‌పై తరచుగా అడిగే ప్రశ్నలు

అవార్డులు మరియు గుర్తింపు
x