నాలెడ్జ్ సెంటర్
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో #1.6+ కోట్ల హ్యాపీ కస్టమర్లు
#1.6 కోట్లు

హ్యాపీ కస్టమర్లు

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 1లక్ష+ నగదురహిత ఆసుపత్రులు
1 లక్ష+

నగదు రహిత ఆసుపత్రులు

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 24x7 అంతర్గత క్లెయిమ్ సహాయం
24x7 అంతర్గత

క్లెయిమ్ సహాయం

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఆరోగ్య పరీక్షలు లేవు
ఎలాంటి హెల్త్

చెక్-అప్‌లు లేవు

హోమ్ / ట్రావెల్ ఇన్సూరెన్స్ / దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనండి

దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్

దుబాయ్ నగరం ప్రాచీన సంస్కృతి యొక్క గొప్పదనంతోపాటు ఆధునిక కాలపు విలాసాన్ని కూడా కలిగి ఉంటుంది. మీరు ఒక ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నట్లయితే, అప్పుడు మీరు ఎత్తైన ఆకాశహర్మ్యాలు నుండి సందడిగా ఉండే సౌక్‌లలో పర్యటించడం అనేది ఒక మంచి అనుభూతి. మీరు ట్రిప్‌కి బయలుదేరడానికి ముందు, గుర్తుంచుకోవలసిన ఒకటి లేదా రెండు విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ప్రయాణ సమయంలో వైద్య అత్యవసర పరిస్థితుల నుండి లగేజీ పోగొట్టుకోవడం వరకు అన్నింటికీ మనశ్శాంతిని అందిస్తుంది. కొన్ని ఊహించని దుర్ఘటనల కారణంగా మీ సాహస కార్యకలాపాలు ఆగిపోవాలని మీరు కోరుకోరు కదా. అందువల్ల, మీరు ప్రయాణాన్ని ప్లాన్ చేస్తున్నప్పుడు, మీరు మీ జాబితాలో దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను చేర్చడం మర్చిపోకూడదు. ఈ చిన్న ప్రయత్నం మీ ప్రయాణం సజావుగా మరియు ఇబ్బందులు లేకుండా సాగేలా చూస్తుంది.

దుబాయ్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ కీలక ఫీచర్లు

దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కొన్ని ముఖ్యమైన ఫీచర్ల జాబితా ఇక్కడ ఇవ్వబడింది:

ముఖ్యమైన ఫీచర్లు వివరాలు
గరిష్ట కవరేజీవైద్యం, ప్రయాణం మరియు బ్యాగేజీ సంబంధిత అత్యవసర పరిస్థితులు లాంటి వివిధ ఊహించని సంఘటనల నుండి కవరేజీ అందిస్తుంది.
నిరంతర మద్దతు24x7 కస్టమర్ కేర్ మద్దతు మరియు ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్మెంట్ ద్వారా ఎల్లవేళలా సహాయం.
సులభమైన నగదురహిత క్లెయిములుఅనేక నెట్‌వర్క్ ఆసుపత్రుల ద్వారా యాక్సెస్ చేయదగిన క్యాష్‌లెస్ క్లెయిమ్స్ ప్రయోజనాలను అందిస్తుంది.
కోవిడ్-19 కవరేజ్కోవిడ్-19 కారణంగా హాస్పిటలైజేషన్ ఖర్చుల కోసం కవరేజీ.
భారీ కవర్ మొత్తం$40k నుండి $1000K వరకు విస్తృతమైన కవరేజ్ పరిధి.

దుబాయ్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ రకాలు

దుబాయ్ కోసం మీరు ఎంచుకునే ట్రావెల్ ఇన్సూరెన్స్ మీ ప్రయాణ అవసరాల ఆధారంగా ఉండాలి. అందించబడే ప్రధాన ఎంపికలు ఇక్కడ ఇవ్వబడ్డాయి ;

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా దుబాయ్ కోసం వ్యక్తిగత ట్రావెల్ ప్లాన్

వ్యక్తి కోసం ట్రావెల్ ప్లాన్లు

ఒంటరి ప్రయాణీకులు మరియు థ్రిల్ కోరుకునేవారి కోసం

ఈ రకమైన అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది వైద్యం, బ్యాగేజీ మరియు ప్రయాణ సంబంధిత ఆకస్మిక పరిస్థితుల నుండి ఒంటరి ప్రయాణీకులకు కవర్ అందిస్తుంది.

ప్లాన్లను చూడండి మరింత తెలుసుకోండి
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా దుబాయ్ కోసం ఫ్యామిలీ ట్రావెల్ ప్లాన్

కుటుంబాల కోసం ట్రావెల్ ప్లాన్

కలిసి ప్రయాణిస్తున్న కుటుంబాల కోసం

ఈ రకమైన అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఒకే పాలసీ కింద ఒక ట్రిప్ సమయంలో కుటుంబంలోని బహుళ సభ్యుల కోసం కవరేజీ అందిస్తుంది.

ప్లాన్లను చూడండి మరింత తెలుసుకోండి
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా దుబాయ్ కోసం స్టూడెంట్ ట్రావెల్ ప్లాన్

విద్యార్థుల కోసం ట్రావెల్ ప్లాన్

తమ కలలను సాకారం చేసుకునే వ్యక్తుల కోసం

విద్యా సంబంధిత ప్రయోజనాల కోసం విదేశాలకు ప్రయాణించే విద్యార్థులకు కవరేజీ అందించడం కోసం ఈ రకమైన అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ రూపొందించబడింది.

ప్లాన్లను చూడండి మరింత తెలుసుకోండి
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా దుబాయ్ కోసం మల్టీ ట్రిప్ ట్రావెల్ ప్లాన్

తరచుగా విమానయానం చేసేవారి కోసం ట్రావెల్ ప్లాన్

తరచుగా విమానయానం చేసేవారి కోసం

సీనియర్ సిటిజన్‌లు అంతర్జాతీయ విహారానికి వెళ్లినప్పుడు వారికి కవరేజీ అందించడం కోసం ఈ రకమైన ప్లాన్ రూపొందించబడింది.

ప్లాన్లను చూడండి మరింత తెలుసుకోండి
దుబాయ్ కోసం సీనియర్ సిటిజన్స్ ట్రావెల్ ప్లాన్

సీనియర్ సిటిజన్స్ కోసం ట్రావెల్ ప్లాన్

ఎప్పటికీ యవ్వనంగా ఉండే వారి కోసం

ఒక నిర్దిష్ట వ్యవధిలో ఒకే అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ క్రింద అనేకసార్లు సురక్షితంగా వెళ్లిరావడానికి ఈ పాలసీ సహాయపడుతుంది.

ప్లాన్లను చూడండి మరింత తెలుసుకోండి

దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయడం వలన కలిగే ప్రయోజనాలు

మీరు దుబాయ్‌‌లో వెళ్లే ఏ ట్రిప్ కోసం అయినా, మీకు దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇది మీకు అవసరమైన విషయాలు తెలుసుకునేలా చేయడం మాత్రమే కాకుండా మీ దుబాయ్‌ ట్రిప్ ఒక మంచి, సురక్షితమైన మరియు ఒత్తిడి లేనిదిగా చూసుకుంటుంది. మీరు దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎందుకు తీసుకోవాలి అనేదానికి కారణాలు ఇవే:

1

వైద్య అత్యవసరాలు

ప్రపంచంలో ఉత్తమ హెల్త్ కేర్‌లో కొన్నింటిని దుబాయ్ కలిగి ఉన్నప్పటికీ, అక్కడ చికిత్స చాలా ఖరీదైనదిగా ఉండవచ్చు. దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఏవైనా ఊహించని అనారోగ్యాలు లేదా గాయాలను కవర్ చేస్తుంది, ఆ విధంగా మీరు ఖరీదైన ఆసుపత్రి బిల్లుల వల్ల ఎదుర్కొనే ఆర్థిక ఒత్తిడి నుండి రక్షిస్తుంది.

2

లగేజ్ కోల్పోవడం

ముఖ్యంగా మీరు విదేశాల్లో ఉన్నప్పుడు, మీ లగేజీని పోగొట్టుకోవడం అనేది ఒక పీడకలగా ఉంటుంది. దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ బ్యాగేజ్ కోల్పోవడం లేదా ఆలస్యాన్ని కవర్ చేస్తుంది, తద్వారా తక్షణ ఉపయోగం కోసం అవసరమైన వస్తువులను సులభంగా కొనుగోలు చేయవచ్చు.

3

ట్రిప్ రద్దు/ఆలస్యం

మీ విమానం ఆలస్యం లేదా రద్దు చేయబడింది అని అనుకోండి. దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ మీకు నాన్-రీఫండబుల్ ఖర్చుల కోసం రీయింబర్స్ చేస్తుంది ; అందువల్ల, మీరు ఎటువంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా మీ ప్లాన్‌లను రీషెడ్యూల్ చేయగలుగుతారు.

4

వ్యక్తిగత బాధ్యత

ప్రమాదం ఎప్పుడైనా జరగవచ్చు, మరియు మీ వల్ల ప్రమాదవశాత్తు ఎవరి ఆస్తికైనా నష్టం కలగవచ్చు లేదా ఎవరైనా గాయపడవచ్చు. అటువంటి సందర్భాల్లో, మీ దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ చట్టపరమైన ఖర్చులను కవర్ చేస్తుంది, అలాగే ఆకస్మిక ఆర్థిక భారాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

5

అడ్వెంచర్ స్పోర్ట్స్ కవరేజ్

దుబాయ్ డ్యూన్ బాషింగ్ మరియు స్కైడైవింగ్ వంటి అనేక సాహస కార్యకలాపాలను అందిస్తుంది. మీరు ఏదైనా అడ్వెంచర్ స్పోర్ట్స్ లో పాల్గొనాలి అనుకుంటే, దుబాయ్‌లోని ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ఆ కార్యకలాపాలకు సంబంధించిన గాయాలను కవర్ చేస్తుంది, తద్వారా మీకు ఒత్తిడి లేకుండా ఉంచుతుంది.

మీ దుబాయ్ ట్రిప్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం చూస్తున్నారా? ఇంకా చూడవలసిన అవసరం లేదు.

భారతదేశం నుండి దుబాయ్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద ఏమి కవర్ చేయబడుతుంది

భారతదేశం నుండి దుబాయ్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద సాధారణంగా కవర్ చేయబడే కొన్ని అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

వైద్య అత్యవసర పరిస్థితి-సంబంధిత ఖర్చులు

వైద్య అత్యవసర పరిస్థితి-సంబంధిత ఖర్చులు

వైద్య అత్యవసర పరిస్థితులకి సంబంధించిన ఖర్చులను మా పాలసీ కవర్ చేస్తుంది కాబట్టి, మీరు మీ ట్రిప్ సమయంలో మీ జేబు నుండి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

డెంటల్ ఎమర్జెన్సీ-సంబంధిత ఖర్చులు

డెంటల్ ఎమర్జెన్సీ-సంబంధిత ఖర్చులు

దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ మీరు ఎదుర్కొనే దంత సంబంధిత అత్యవసర పరిస్థితుల ఖర్చులను కూడా కవర్ చేస్తుంది.

మెడికల్ తరలింపు

మెడికల్ తరలింపు

తక్షణ సంరక్షణ అవసరమయ్యే వైద్య అత్యవసర పరిస్థితుల్లో, సమీప ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి విమానం/భూ మార్గం ద్వారా తరలించడానికి సంబంధించిన ఖర్చులు కవర్ చేయడం ద్వారా మా పాలసీ సహాయపడుతుంది.

ఆసుపత్రి నుండి రోజువారీ నగదు అలవెన్స్

ఆసుపత్రి నుండి రోజువారీ నగదు అలవెన్స్

చిన్నపాటి హాస్పిటలైజేషన్ సంబంధిత ఖర్చులు చెల్లించడంలో కూడా మా పాలసీ మీకు సహాయపడుతుంది కాబట్టి, మీరు మీ ప్రయాణ బడ్జెట్‌కి మించి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

వైద్యపరమైన మరియు భౌతికకాయం తరలింపు

వైద్యపరమైన మరియు భౌతికకాయం తరలింపు

మరణం సంభవించడం లాంటి దురదృష్టకర సందర్భంలో, ఆ వ్యక్తి మృతదేహాన్ని వారి స్వదేశానికి బదిలీ చేసే ఖర్చుని కవర్ చేయడానికి మా పాలసీ బాధ్యత వహిస్తుంది.

ప్రమాదం కారణంగా మరణం

ప్రమాదం కారణంగా మరణం

ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మరణం సంభవించడం లాంటి దురదృష్టకర సందర్భంలో, మా పాలసీ మీ కుటుంబానికి ఏకమొత్తంలో పరిహారం అందిస్తుంది.

శాశ్వత వైకల్యం

శాశ్వత వైకల్యం

ఊహించని సంఘటన కారణంగా శాశ్వత వైకల్యానికి దారితీస్తే, ఈ పాలసీ మీకు ఏకమొత్తంలో పరిహారం అందిస్తుంది.

వ్యక్తిగత బాధ్యత

వ్యక్తిగత బాధ్యత

విదేశంలో ఉన్నప్పుడు థర్డ్-పార్టీ నష్టానికి మీరు బాధ్యత వహించాల్సి వస్తే, మీరు ఆ నష్టాలకు పరిహారం చెల్లించడాన్ని మా పాలసీ సులభతరం చేస్తుంది.

ఆర్థిక అత్యవసర సహాయం

ఆర్థిక అత్యవసర సహాయం

దొంగతనం లేదా దోపిడీ కారణంగా మీరు నగదు సమస్య ఏర్పడితే, భారతదేశం నుండి అత్యవసర ఫండ్ ట్రాన్స్‌ఫర్‌లను సులభతరం చేయడంలో మా పాలసీ సహాయపడుతుంది.

హైజాక్ డిస్ట్రెస్ అలవెన్స్

హైజాక్ డిస్ట్రెస్ అలవెన్స్

ఒకవేళ మీ విమానం హైజాక్‌కి గురైతే, ఆ పరిస్థితిని అధికారులు పరిష్కరిస్తు సమయంలో మీకు కలిగే ఇబ్బందికి పరిహారం అందించడం ద్వారా మేము మా బాధ్యతను నిర్వర్తిస్తాము.

విమాన ఆలస్యాలు

విమాన ఆలస్యాలు

మా దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అందించే రీయింబర్స్‌మెంట్ ఫీచర్‌ ద్వారా విమాన ఆలస్యం వల్ల అవసరమైన కొనుగోళ్లకు సంబంధించిన ఖర్చులు కవర్ చేయబడతాయి.

హోటల్ వసతులు

హోటల్ వసతులు

వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా మీరు మీ హోటల్‌ బసను పొడిగించాల్సి వస్తే, ఆ అదనపు ఖర్చులను మా పాలసీ కవర్ చేస్తుంది.

బ్యాగేజీ మరియు వ్యక్తిగత డాక్యుమెంట్లు కోల్పోవడం

బ్యాగేజీ మరియు వ్యక్తిగత డాక్యుమెంట్లు కోల్పోవడం

మా దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ ద్వారా పోయిన లేదా దొంగిలించబడిన వ్యక్తిగత డాక్యుమెంట్లు మరియు వస్తువులను భర్తీ చేసే ఖర్చు కవర్ చేయబడుతుంది.

చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ నష్టం

చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ నష్టం

చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజీ కోల్పోయిన సందర్భంలో మా పాలసీ మీకు పరిహారం అందిస్తుంది. కాబట్టి, మీకు అవసరమైనవి లేకపోయినా మీ దుబాయ్ ట్రిప్‌లో ఆ ఖర్చుల గురించి చింతించకండి.

చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ యొక్క ఆలస్యం

చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ యొక్క ఆలస్యం

మీ చెక్-ఇన్ సామాను ఆలస్యం అయితే, విషయాలు సర్దుకునే లోపు అవసరమైన కొనుగోళ్లను మా పాలసీ కవర్ చేస్తుంది.

పైన పేర్కొన్న కవరేజ్ మా కొన్ని ట్రావెల్ ప్లాన్లలో అందుబాటులో ఉండకపోవచ్చు. మా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి మరింత తెలుసుకోవడానికి దయచేసి పాలసీ వివరాలు, బ్రోచర్ మరియు ప్రాస్పెక్టస్‌ను చదవండి.

భారతదేశం నుండి దుబాయ్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద ఏమి కవర్ చేయబడదు

భారతదేశం నుండి దుబాయ్ కోసం మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ వీటి కోసం కవరేజ్ అందించకపోవచ్చు:

చట్టం ఉల్లంఘన

చట్టం ఉల్లంఘన

యుద్ధం, తీవ్రవాదం లేదా చట్ట ఉల్లంఘన కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద కవర్ చేయబడవు.

మాదకద్రవ్యాల వినియోగం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో కవర్ చేయబడదు

మత్తు పదార్థాల వినియోగం

మీరు మత్తు పదార్థాలు లేదా నిషేధిత పదార్థాలను ఉపయోగించినట్లయితే, దుబాయ్ ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎటువంటి కవరేజీని అందించదు.

ముందుగా ఉన్న వ్యాధులు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడవు

ముందుగా ఉన్న వ్యాధులు

ట్రిప్‌కి ముందే మీకు ఏదైనా వైద్య పరిస్థితి ఉంటే లేదా ముందుగానే ఉన్న వ్యాధి కోసం చికిత్స తీసుకుంటే, ఆ ఖర్చులను ఈ ప్లాన్ కవర్ చేయదు.

యుద్ధం లేదా తీవ్రవాదం

యుద్ధం లేదా తీవ్రవాదం

తీవ్రవాదం లేదా యుద్ధం కారణంగా కలిగిన గాయాలు లేదా ఆరోగ్య సమస్యలు.

స్వతహా చేసుకున్న గాయాలు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో పరిధిలోకి రావు

స్వతహా చేసుకున్న గాయం

ఉద్దేశపూర్వకమైన హాని లేదా ఆత్మహత్యా ప్రయత్నాల ఫలితంగా కలిగే గాయాలనేవి అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద కవర్ చేయబడవు.

సాహస క్రీడలు

సాహస క్రీడలు

ప్రమాదకర కార్యకలాపాలు మరియు సాహస క్రీడల్లో పాల్గొన్న ఫలితంగా కలిగే గాయాలు మరియు హాస్పిటల్ ఖర్చులను ఈ పాలసీ కవర్ చేయదు.

ఊబకాయం మరియు కాస్మెటిక్ చికిత్స

ఊబకాయం మరియు కాస్మెటిక్ చికిత్స

విదేశీ దేశ పర్యటన సమయంలో, మీరు లేదా మీ కుటుంబ సభ్యులు కాస్మెటిక్ లేదా ఊబకాయం చికిత్స చేయించుకోవడానికి ఎంచుకుంటే, సంబంధిత ఖర్చులు ఈ ప్లాన్ క్రింద కవర్ చేయబడవు.

దుబాయ్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో ఎలా కొనుగోలు చేయాలి?

మీరు దుబాయ్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాలనుకుంటే, మీరు అనుసరించవలసిన దశలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:

• అధికారిక హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

• "ఇప్పుడే కొనండి" బటన్‌ను కనుగొనండి మరియు దానిపై క్లిక్ చేయండి.

• ట్రిప్ రకం, మొత్తం ప్రయాణీకులు మరియు వారి సంబంధిత వయస్సు వంటి అవసరమైన వివరాలను నమోదు చేయండి మరియు "కొనసాగించండి" పై క్లిక్ చేయండి.

• మీరు సందర్శించడానికి ప్లాన్ చేస్తున్న దేశం పేరు అంటే దుబాయ్‌ని, అలాగే బయలుదేరే మరియు తిరిగి వచ్చే తేదీలను పేర్కొనండి, తరువాత ను నొక్కండి.

• పాప్-అప్ విండోలో మీ పేరు, ఇమెయిల్ మరియు ఫోన్ నంబర్ వంటి మీ సంప్రదింపు వివరాలను నమోదు చేయండి మరియు "కోట్ చూడండి" పై క్లిక్ చేయండి.

• అందుబాటులో ఉన్న ప్లాన్ల నుండి ఎంచుకోండి, "కొనండి" ఎంచుకోండి, మరియు తదుపరి విండోకు వెళ్ళడానికి ధృవీకరణ కోడ్‌ను నమోదు చేయండి.

• పాలసీకి అవసరమైన అదనపు సమాచారాన్ని అనుసరించండి మరియు ఆన్‌లైన్ చెల్లింపును పూర్తి చేయండి.

• చెల్లింపు విజయవంతంగా పూర్తయిన తర్వాత, మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ జారీ చేయబడుతుంది మరియు మీరు అందించిన ఇన్‌బాక్స్‌కు పంపబడుతుంది.

విదేశాల్లో వైద్య అత్యవసర పరిస్థితుల కోసం అయ్యే ఖర్చు అనేది మీ ప్రయాణ బడ్జెట్‌కి భారంగా మారడాన్ని అనుమతించకండి. ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో అత్యవసర వైద్య మరియు డెంటల్ ఖర్చుల నుండి మిమ్మల్ని మీరు ఆర్థికంగా కవర్ చేసుకోండి.

దుబాయ్ గురించి ఆసక్తికరమైన విషయాలు

వాస్తవం వివరాలు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంబుర్జ్ ఖలీఫా అనేది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం అని మీకు తెలిసి ఉండవచ్చు, కానీ ఇది ఎత్తైన అబ్జర్వేషన్ డెక్ మరియు రెస్టారెంట్‌ కూడా కలిగి ఉంది అని మీకు తెలుసా? అక్కడ నుండి మీరు మొత్తం నగరాన్ని చూడవచ్చు, ఇది మీ ట్రిప్ సమయంలో మీరు తప్పనిసరిగా సందర్శించవలసిన ప్రదేశం.
ఎడారిలో ఇండోర్ స్కీయింగ్ఇది అసాధ్యంగా అనిపించవచ్చు, కానీ దుబాయ్ ఎమిరేట్స్ మాల్ లోపల ఒక ఇండోర్ స్కీ రిసార్ట్ అయిన స్కీ దుబాయ్‌ ఉంది. ఇక్కడ, మీరు ఎడారి వేడి నుండి తప్పించుకుంటూ స్కీ, స్నోబోర్డ్ చేయవచ్చు మరియు పెంగ్విన్లను కూడా కలవవచ్చు.
ఆదాయపు పన్ను ఉండదుదుబాయ్ అనేక మంది ప్రవాసులను ఆకర్షిస్తుందనే కారణాల్లో ఆదాయపు పన్ను లేకపోవడం అనేది ఒకటి. ఇది నివాసులు మెరుగ్గా జీవించడానికి అనుమతిస్తుంది. అయితే, మీరు సందర్శించినప్పుడు, మీ ట్రిప్‌ను సురక్షితంగా ఉంచడానికి దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవడం మర్చిపోకండి.
రోబోట్‌లతో ఒంటెల రేసింగ్దుబాయ్‌లో ఒంటెల రేసింగ్ అనేది ఒక సాంప్రదాయ క్రీడ, కానీ వారు మనుషులకు బదులుగా రోబోట్ జాకీలను ఉపయోగిస్తారని మీకు తెలుసా? ఇది మీరు మరెక్కడా కనుగొనలేని సంప్రదాయం మరియు సాంకేతికతతో కూడిన ప్రత్యేక కలయిక.
గోల్డ్ ATMలుదుబాయ్‌లో మాత్రమే మీరు ATM నుండి గోల్డ్ బార్లను విత్‍డ్రా చేయవచ్చు! గోల్డ్ టు గో మెషీన్లు బుర్జ్ ఖలీఫాతో సహా అనేక ప్రదేశాలలో ఉన్నాయి, వీటిలో ఒక బటన్‌ని పుష్ చేయడం ద్వారా మీరు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.
మానవ-నిర్మిత ఐల్యాండ్‌లుపామ్ జుమేరా మరియు ప్రపంచ ఐల్యాండ్‌లు ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతాలు. ఈ మానవ నిర్మిత ఐల్యాండ్‌లు అంతరిక్షం నుండి కనిపిస్తాయి మరియు విలాసవంతమైన హోటళ్ళు, విల్లాలు మరియు వినోద ఎంపికలకు నిలయంగా ఉంటూ, ఇవి దుబాయ్ ఆకాంక్షలకు ఐకానిక్ చిహ్నాలుగా ఉన్నాయి.
సస్టైనబుల్ సిటీసౌర శక్తిని ఉపయోగించడం, నీటిని రీసైకిల్ చేయడం మరియు పర్యావరణ అనుకూలమైన జీవితం వంటి వాటిని ప్రోత్సహిస్తున్న సస్టైనబుల్ సిటీ వంటి ప్రాజెక్టులతో దుబాయ్ సుస్థిరతపై కూడా దృష్టి పెడుతుంది. పర్యావరణం గురించి శ్రద్ధ వహించే ఒక నగరంగా దుబాయ్ భవిష్యత్తు గురించి ఇది ఒక ఉదాహరణ.

దుబాయ్ టూరిస్ట్ వీసా కోసం అవసరమైన డాక్యుమెంట్లు

దుబాయ్ టూరిస్ట్ వీసా కోసం అప్లై చేసే ప్రక్రియలో భాగంగా, భారతీయ పౌరులు ఈ క్రింది ముఖ్యమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. అవి ఇలా ఉన్నాయి:

పాస్‌పోర్ట్: ఇది మీ ప్రవేశ తేదీ నుండి కనీసం ఆరు నెలలు చెల్లుబాటులో ఉండాలి.

వీసా అప్లికేషన్ ఫారం: పూర్తి చేయబడిన మరియు సంతకం చేయబడిన అప్లికేషన్ ఫారం

ఫోటోలు: తెలుపు బ్యాక్‌గ్రౌండ్‌ గల ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు.

విమాన ప్రయాణ ప్రణాళిక: దుబాయ్ నుండి ప్రవేశం మరియు నిష్క్రమణ తేదీని చూపే రిటర్న్ టిక్కెట్.

ఆర్థిక రుజువు: ఖర్చులు చేయగలరు అని మీ ఆర్థిక సామర్థ్యాన్ని నిరూపిస్తూ ఒక బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా పే స్లిప్ అవసరం.

వసతి రుజువు: దుబాయ్‌లో హోటల్ బుకింగ్ లేదా ఆతిధ్యం ఇచ్చే వ్యక్తి నుండి ఆహ్వాన లేఖ.

దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్: మీ బస సమయంలో వైద్య అత్యవసర పరిస్థితులు మరియు తలెత్తే ఏవైనా ఇతర ఊహించని పరిస్థితుల కోసం ఇన్సూరెన్స్.

దుబాయ్‌ను సందర్శించడానికి ఉత్తమ సమయం

దుబాయ్‌కు ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు, సందర్శించడానికి ఉత్తమ సమయం అనేది మీరు ఏమి అనుభూతి చెందాలనుకుంటున్నారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. బయట ప్రదేశాలు మరియు చల్లని వాతావరణాన్ని ఇష్టపడే వారికి, నవంబర్ మరియు మార్చి మధ్య దుబాయ్ ట్రిప్ అనుకూలమైనది. ఈ సమయంలో, ఉష్ణోగ్రతలు 20°C నుండి 25°C మధ్య ఆహ్లాదకరంగా ఉంటాయి, అందువల్ల బుర్జ్ ఖలీఫా లేదా బీచ్ ఎక్సర్‌సైజ్‌లు వంటి అన్ని వివిధ ఆకర్షణలకు ఇది సరైన సమయం.

అయితే, మీరు ఎండను తట్టుకోగలిగితే జూన్ నుండి ఆగస్ట్ నెల వరకు మీకు అనుకూలంగా ఉంటుంది ; మీరు మెరుగైన ధరలు మరియు తక్కువ జనాలను కనుగొంటారు. 40°C కంటే ఎక్కువ వేడి ఉష్ణోగ్రతలకు సిద్ధంగా ఉండండి. మీరు ఏ సమయాన్ని ఎంచుకున్నా, దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పక తీసుకోండి. వైద్య అత్యవసర పరిస్థితులు లేదా ట్రిప్‌ల రద్దు వంటి ఏవైనా ఊహించని పరిస్థితులలో ఇది మిమ్మల్ని కవర్ చేస్తుంది. వాతావరణం మరియు మీ బడ్జెట్‌ పరంగా అలోచించి దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను తీసుకోండి.

దుబాయ్ కోసం సంవత్సరం అంతటా అవసరమైనవి

ట్రిప్ ప్రయాణ ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడంతో పాటు, దుబాయ్ సందర్శన కోసం మీ సూట్‌కేస్‌లో ఏమేమి తీసుకురావాలో నిర్ధారించుకోండి. సంవత్సరం అంతటా అవసరమయ్యే కొన్ని వస్తువులు క్రింద ఇవ్వబడ్డాయి ;

• కాలినడకన దేశాన్ని అన్వేషించడానికి సౌకర్యవంతమైన బూట్లు మీకు సహాయపడతాయి.

• క్రెడిట్/డెబిట్ కార్డ్- ముఖ్యంగా అంతర్జాతీయ యాక్సెస్‌ కలవి

• తేలికైన, మర్యాదపూర్వక దుస్తులు- బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యంగా మతపరమైన లేదా సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించేటప్పుడు సంప్రదాయపు దుస్తులు ధరించాలి

• బహిరంగ ప్రదేశాలలో తిరిగేటప్పుడు దుబాయ్‌లో సంవత్సరం-అంతా ఉండే తీవ్రమైన వేడిని నివారించడానికి సన్‌స్క్రీన్, సన్‌గ్లాసెస్ మరియు టోపీ.

• రోజు మొత్తం హైడ్రేటెడ్‌గా ఉండడానికి రీయూజబుల్ వాటర్ బాటిల్స్.

• మీ మొత్తం బస, ట్రావెల్ అడాప్టర్ మరియు వోల్టేజ్ కన్వర్టర్ చెల్లుబాటును నిర్ధారించే ముఖ్యమైన ట్రావెల్ డాక్యుమెంట్లు.

దుబాయ్ తీసుకోవలసిన భద్రత మరియు జాగ్రత్త చర్యలు

భద్రత మరియు జాగ్రత్త చర్యలు దుబాయ్‌లో మీ ట్రిప్‌ను ఆనందదాయకంగా చేస్తాయి. మీ కోసం ఒక త్వరిత గైడ్ ఇక్కడ ఇవ్వబడింది:

• దుబాయ్‌లో వేడి తీవ్రంగా ఉంటుంది ; అందువల్ల, ఎక్కువ నీరు త్రాగండి మరియు ఎండలో ఎక్కువ సమయం గడపకండి.

• మీ విలువైన వస్తువులు ఎల్లప్పుడూ హోటల్ సేఫ్‌లలో ఉన్నాయని నిర్ధారించుకోండి మరియు మీరు ఒక బహిరంగ ప్రదేశానికి వెళ్లినప్పుడు మీ పరిసరాల గురించి అవగాహన కలిగి ఉండండి.

• నగరం అంతటా సురక్షితంగా తిరగడానికి లైసెన్స్ పొందిన ట్యాక్సీలు లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగించండి.

• ముఖ్యంగా ఏదైనా మతపరమైన ప్రదేశాన్ని సందర్శించేటప్పుడు, మర్యాదపూర్వకంగా దుస్తులు ధరించడం ద్వారా స్థానికుల పట్ల గౌరవంగా ఉండండి.

• బహిరంగ ప్రదేశాలలో ప్రవర్తన మరియు మద్యం వినియోగానికి సంబంధించిన కఠినమైన నియమాలు ఉన్నందున మీరు ఎటువంటి చట్టపరమైన సమస్యలను ఎదుర్కోకుండా ఉండేందుకు స్థానిక చట్టాలు మరియు నియమాల గురించి తెలుసుకోండి.

• ఊహించని సంఘటనల నుండి, వైద్య అత్యవసర పరిస్థితుల నుండి ట్రిప్ రద్దు లేదా అంతరాయాల నుండి మిమ్మల్ని రక్షించగల దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం మర్చిపోకండి.

• స్థానిక పోలీస్ మరియు ఎంబసీతో సహా అత్యవసర కాంటాక్టుల జాబితాను మీతో పాటు తీసుకువెళ్ళండి.

• మునుపటి అనారోగ్యాలు కలవారు, ప్రయాణించడానికి ముందు మీతో సంబంధిత మందులను కలిగి ఉండటం మరియు మీ డాక్టర్‌ను సంప్రదించడం అవసరం.

• ముఖ్యంగా సున్నితమైన ప్రాంతాల్లో, వారి అనుమతి లేకుండా ప్రజల ఫోటోలు తీయవద్దు.

• బహిరంగంగా ప్రేమను చూపించడం ద్వారా కోపానికి గురవ్వచ్చు మరియు జరిమానాలు లేదా చట్టపరమైన పరిణామాలు కూడా తలెత్తవచ్చు.

దుబాయ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాల జాబితా

ప్రధాన విమానాశ్రయం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం లేదా DXB మరియు చాలా అంతర్జాతీయ విమానాలకు ఇది ప్రధాన కేంద్రం. మరొక విమానాశ్రయం అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం, దీనిని DWC అని కూడా పిలుస్తారు, ఇది ప్రధానంగా కార్గో మరియు చిన్న ప్రయాణ విమానాలతో వ్యవహరించే సెకండరీ విమానాశ్రయంగా పనిచేస్తుంది.

ఎయిర్‌పోర్ట్ నగరం IATA కోడ్
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్దుబాయ్DXB
అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయందుబాయ్DWC
ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయండి

వైద్య అత్యవసర పరిస్థితుల కారణంగా హోటల్ బస పొడిగించబడినప్పుడు ఎదురయ్యే అదనపు ఖర్చులు నిర్వహించడానికి ట్రావెల్ ఇన్సూరెన్స్‌ని అనుమతించండి. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి!

దుబాయ్‌లో ప్రముఖ గమ్యస్థానాలు

చూడటానికి మరియు చాలా కార్యకలాపాలు చేయడానికి, దుబాయ్‌లో అద్భుతమైన గమ్యస్థానాలు ఉన్నాయి. మీరు తప్పకుండా మీ ట్రిప్‌లో సందర్శించాల్సిన కొన్ని ప్రధాన ప్రదేశాలు క్రింద ఇవ్వబడ్డాయి:

1

బుర్జ్ ఖలీఫా

ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం అయిన బుర్జ్ ఖలీఫాను చూడకుండా మీ దుబాయ్ సందర్శన పూర్తి కాదు. 828 మీటర్ల ఎత్తులో ఉన్న 148 మరియు 125వ అంతస్తులపై గల దాని అబ్జర్వేషన్ డెక్స్ నుండి అద్భుతమైన వీక్షణలను అందిస్తుంది. నగరం మరియు అద్భుతమైన విస్తృత ఎడారి వీక్షణ కోసం దీనిని తప్పనిసరిగా సందర్శించాలి. మీరు వెళ్లే ముందు మీ దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందాలని గుర్తుంచుకోండి, అది అక్కడ ఉన్నప్పుడు మీకు ఏదైనా అత్యవసర పరిస్థితిలో సహాయపడుతుంది.

2

పామ్ జుమేరా

ఇది ఒక పామ్ చెట్టు ఆకారంలో అభివృద్ధి చేయబడిన ఒక ఐకానిక్ మానవ నిర్మిత ద్వీపం. కొన్ని ఖరీదైన హోటళ్ళు దానిపై ఉన్నాయి, వాటిలో అత్యంత ప్రసిద్ధి చెందినది అట్లాంటిస్ ది పామ్. బోర్డ్ వాక్‌లపై ప్రశాంతంగా నడవండి, బీచ్‌లలో సరదాగా తిరగండి లేదా ఏదైనా ఫ్యాన్సీ రెస్టారెంట్లలో భోజనం చేయండి. ఈ పామ్ దుబాయ్ కోరికలు మరియు కొత్తదనంకు ప్రతీకగా పరిగణించబడుతుంది.

3

దుబాయ్ మాల్

ఇది బుర్జ్ ఖలీఫా సమీపంలో ఉంది మరియు షాపింగ్ ఆర్కేడ్ కంటే చాలా పెద్దది. ఇందులో ఇండోర్ ఐస్ స్కేటింగ్ రింక్, పెద్ద అక్వేరియం మరియు అనేక డైనింగ్ సదుపాయాలు ఉంటాయి. షాపింగ్ మరియు డైనింగ్ లేదా సరదాగా తిరగడం, ఇలా ఎల్లప్పుడూ అందరికీ ఏదో ఒకటి అందుబాటులో ఉంటుంది. తీవ్రమైన వేడి నుండి బయటపడటానికి మరియు కొంచెం సరదాగా సమయం గడపడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం.

4

దుబాయ్ క్రీక్

మీరు దుబాయ్‌ యొక్క చారిత్రాత్మక ప్రదేశాల గురించి వెతుకుతున్నట్లయితే, ఆ ప్రదేశం ఇదే. అబ్రా లేదా చెక్క బోట్‌లో ఎక్కి ఆ వాగులో ఒక ట్రిప్‌కు వెళ్ళండి , పురాతన సూక్‌ల చుట్టూ తిరగండి మరియు అల్ ఫహిది ఫోర్ట్ లోపల ఉన్న దుబాయ్ మ్యూజియంను సందర్శించండి. ఇది నగరం యొక్క ఆధునిక స్కైలైన్‌ నుండి ఒక మంచి వైవిధ్యం మరియు దుబాయ్ యొక్క గత చరిత్ర గురించి మీకు ఒక అవగాహనను ఇస్తుంది.

5

ఎడారిలో సఫారి

ఒక ప్రత్యేక అనుభవం కోసం ఇసుక తిన్నెలపై విహరించండి. చాలా ఎడారి సఫారీలలో డ్యూన్ బాషింగ్, ఒంటె సఫారీ మరియు నక్షత్రాల క్రింద ఒక బెడౌయిన్-శైలి డిన్నర్ వంటి అదనపు కార్యకలాపాలు కూడా ఉంటాయి. సంస్కృతిని తెలుసుకుంటూ ఎడారి ప్రకృతి దృశ్యాలను మరియు దాని సహజ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం.

6

దుబాయ్ మరీనా

ఈ ఉల్లాసమైన ప్రాంతం ప్రశాంతంగా షికారు చేయడానికి, పడవ పర్యటనకు లేదా మెరీనా వీక్షణలతో విందు చేయడానికి చాలా బాగుంటుంది. ఈ స్థానిక ప్రదేశం దాని అద్భుతమైన ఆకాశహర్మ్యాలు మరియు రాత్రివేళల్లో వినోదభరిత వాతావరణం కోసం ప్రసిద్ధి చెందింది.

దుబాయ్‌లో చేయవలసిన పనులు

మీరు దుబాయ్‌లో ఉన్నప్పుడు, మీ ట్రిప్‌ను మరపురానిదిగా చేసే పనులకు ఎటువంటి కొరత ఉండదు. మీరు ఖచ్చితంగా మిస్ చేయకూడని కొన్ని అద్భుతమైన కార్యకలాపాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

1

బుర్జ్ ఖలీఫా

బుర్జ్ ఖలీఫాతో మీ అన్వేషణను ప్రారంభించండి, 148వ మరియు 125వ అంతస్తులు ఈ నగరం యొక్క అద్భుతమైన వీక్షణలను అందిస్తాయి. దుబాయ్‌ని గొప్పగా పరిచయం చేయడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. దుబాయ్‌లో ప్రయాణించడానికి మీకు ఇన్సూరెన్స్ ఉందని నిర్ధారించుకోండి, తద్వారా మీరు బహిరంగ ప్రదేశాలలో అన్వేషిస్తున్న సమయంలో మీకు ఏదైనా సహాయం అవసరమైతే మీరు కవర్ చేయబడతారు.

2

దుబాయ్ మాల్‌ను సందర్శించండి

ఇది కేవలం ఒక షాపింగ్ గమ్యస్థానం మాత్రమే కాదు. ఇది ఒక వినోద ప్రపంచం. దుబాయ్ అక్వేరియం నుండి ఐస్ రింక్ మరియు VR పార్క్ వరకు, ప్రతి ఒక్కరి కోసం ఏదో ఒకటి ఉంటుంది. మీరు షాపింగ్ చేస్తున్నా, డైనింగ్ చేస్తున్నా లేదా అన్వేషిస్తున్నా కొన్ని గంటలు గడపడానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం.

3

దుబాయ్ ఫౌంటైన్ షో

ఇది బుర్జ్ ఖలీఫా యొక్క కింది భాగంలో ఉంది, సంగీతం మరియు లైట్లకు అనుగుణంగా నీటితో ఒక ఆహ్లాదకరమైన నృత్యాన్ని అందిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం వేళ నగరంలోని స్కైలైన్ యొక్క వెలుగులతో పాటు ప్రకాశించినపుడు, ఇది ఒక అద్భుతమైన దృశ్యంగా ఉంటుంది.

4

జుమేరా బీచ్

మీరు ఎండ మరియు ఇసుక కోరుకుంటుంటే, అప్పుడు జుమేరా బీచ్ మంచి ఎంపిక. ఈ ప్రదేశం సముద్రం పక్కన అలా తిరగడం, ఈతకొట్టడం లేదా సరదాగా నడవడానికి అనువైన ప్రదేశం. ఇది సముద్రం నుండి బుర్జ్ అల్ అరబ్ యొక్క అద్భుతమైన వీక్షణను అందిస్తుంది.

5

ఎడారిలో సఫారి

అత్యంత ఉత్కంఠభరితమైన సాహసం ఎడారి సఫారి. మీరు ఒక 4x4 లో ఇసుకతిన్నెల పై సవారీ, ఒక ఒంటె సవారీ చేస్తారు మరియు నక్షత్రాల క్రింద ఒక సాంప్రదాయక బెడౌయిన్-శైలి డిన్నర్ ఆనందించండి. ఎడారి యొక్క అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను చూడటానికి మరియు స్థానిక సంస్కృతి గురించి తెలుసుకుంటూ వినోదాన్ని పొందడానికి ఇది ఖచ్చితంగా ఉత్తమమైన మార్గం.

6

పాత దుబాయ్

ఒక మార్పు కోసం, దుబాయ్‌ యొక్క చారిత్రాత్మక విభాగాన్ని అన్వేషించండి. అల్ ఫహిదీ చారిత్రక జిల్లాలో ప్రయాణించండి, దుబాయ్ మ్యూజియంను సందర్శించండి మరియు దుబాయ్ క్రీక్‌లో అబ్రా రైడ్ చేయండి. నగరం యొక్క గొప్ప వారసత్వ చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం.

దుబాయ్‌లో డబ్బులు ఆదా చేసే చిట్కాలు

మీరు దుబాయ్‌ని అన్వేషిస్తున్నప్పుడు, ఎక్కువ డబ్బుని ఖర్చు చేయకుండా అద్భుతమైన సమయాన్ని గడపడం సులభం. మీ బడ్జెట్ నుండి ఎక్కువ ప్రయోజనం పొందడంలో మీకు సహాయపడటానికి కొన్ని డబ్బు ఆదా చేసే చిట్కాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

1

ఈట్ స్మార్ట్

దుబాయ్‌లో బయట భోజనం చేయడానికి అనేక ఖరీదైన ఎంపికలు ఉన్నాయి, కానీ మీరు చవకైన ధరలలో మంచి ఆహార ఎంపికలని కనుగొనవచ్చు. మీరు స్థానిక రెస్టారెంట్లు లేదా ఫుడ్ స్టాల్స్ కోసం చూడండి, మాల్స్ మరియు మార్కెట్లలో భోజనం చేయడానికి ప్రయత్నించండి, ఇక్కడ ధరలు చవకగా ఉంటాయి మీ ఖర్చును తగ్గిస్తాయి.

2

పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగించండి

దుబాయ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మౌలిక సదుపాయాలు చాలా సమర్థవంతమైనవి మరియు అందుబాటు ధరలో ఉంటాయి. మెట్రో, బస్సులు మరియు వాటర్ ట్యాక్సీలు మంచి ప్రయాణ మార్గాలు. అన్ని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లలో అంగీకరించబడే నోల్ కార్డును ఉపయోగించడం చాలా సౌకర్యవంతం మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్నది.

3

షాప్ స్మార్ట్

మీరు షాపింగ్ చేయాలనుకుంటే, మరింత ప్రత్యేకంగా మరియు చవకగా ఉండే మర్చండైజ్ కోసం స్థానిక సూక్‌లకు వెళ్లడం మంచి ఆలోచన. ముఖ్యంగా, మంచి బేరసారాల కోసం గోల్డ్ సూక్ మరియు స్పైస్ సూక్ చాలా చక్కటి ఎంపిక. అంతేకాకుండా, దుబాయ్ నగరం అనేక అమ్మకాలు మరియు డిస్కౌంట్ వ్యవధులను నిర్వహిస్తుంది, ముఖ్యంగా షాపింగ్ మాల్స్‌లో.

4

ఉచిత ఆకర్షణలను సందర్శించండి

ఆనందించడానికి అనేక ఉచిత లేదా తక్కువ-ఖర్చు గల ఆకర్షణలు ఉన్నాయి. జుమేరా బీచ్ వంటి పబ్లిక్ బీచ్‌లను అన్వేషించండి, దుబాయ్ మరీనా చుట్టూ తిరిగి ప్రదేశాలను సందర్శించండి లేదా అల్ ఫహిదీ హిస్టారికల్ డిస్ట్రిక్ట్‌ని సందర్శించండి. దుబాయ్‌లోని అనేక సాంస్కృతిక ప్రదేశాలు మరియు అవుట్‌డోర్ ప్రాంతాలను ఉచితంగా సందర్శించవచ్చు.

5

డీల్స్ మరియు ఆఫర్ల ప్రయోజనాన్ని పొందండి

మీరు ముందుగా బుక్ చేసినా లేదా ఆఫ్-పీక్ సమయంలో సందర్శించినట్లయితే అనేక ఆకర్షణలు మరియు రెస్టారెంట్లు డీల్స్ అందిస్తాయి కాబట్టి ప్రత్యేక ఆఫర్లు మరియు డిస్కౌంట్ల కోసం చూడండి.

6

దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందండి

ఇది అదనపు ఖర్చులాగా అనిపించినప్పటికీ, దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం వలన దీర్ఘకాలంలో మీరు డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఇది వైద్య అత్యవసర పరిస్థితులు, ట్రిప్ రద్దులు మరియు ఇతర ఊహించని సంఘటనలను కవర్ చేస్తుంది, ఇది గణనీయమైన అదనపు ఖర్చులను నివారించడానికి మీకు సహాయపడుతుంది.

దుబాయ్‌లో ప్రసిద్ధమైన భారతీయ రెస్టారెంట్ల జాబితా

మీరు దుబాయ్‌లో భారతీయ ఆహారాన్ని మిస్ చేసినప్పుడు ఈ క్రింది రెస్టారెంట్లు వివిధ రకాల రుచికరమైన భారతీయ వంటకాలను అందిస్తూ, భారతదేశపు గొప్ప వారసత్వ వంటకాల రుచిని మీకు అందిస్తాయి.

రెస్టారెంట్ తప్పక ప్రయత్నించవలసిన వంటకాలు అడ్రస్
రవి రెస్టారెంట్చికెన్ కర్రీ, నిహారిఅల్ సత్వా, దుబాయ్, UAE
బిర్యానీ పాట్హైదరాబాదీ బిర్యానీ, మటన్ కోర్మాది మరీనా, దుబాయ్, UAE
ముంతాజ్ మహల్బటర్ చికెన్, పనీర్ టిక్కాగ్రాండ్ హయాత్ దుబాయ్, షేఖ్ రషీద్ రోడ్, దుబాయ్
ఇండిగో బై వినీత్సముద్రపు పీతల కర్రీ, ల్యాంబ్ షాంక్గ్రోస్వెనార్ హౌస్, దుబాయ్ మరీనా, దుబాయ్
అమృత్‌సర్అమృత్‌సరి తందూరి, చోలే భటూరేఅల్ కరామా, దుబాయ్, UAE
కుంకుమపువ్వుప్రాన్ మసాలా, ల్యాంబ్ బిర్యానీఅట్లాంటిస్ ది పామ్, దుబాయ్

దుబాయ్‌లో స్థానిక చట్టం మరియు ఆచారాలు

మీరు దుబాయ్‌లో ఉన్నప్పుడు, సులభమైన మరియు ఆనందదాయకమైన ట్రిప్ చేయడానికి స్థానిక చట్టాలు మరియు ఆచారాలను గౌరవించడం ముఖ్యం. గుర్తుంచుకోవలసిన కొన్ని కీలక అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

• అన్ని బహిరంగ ప్రదేశాలలో సరైన దుస్తులు ధరించండి మరియు ముఖ్యంగా మాల్స్, మార్కెట్లు మరియు ప్రార్ధన స్థలాలలో అభ్యంతరకరమైన దుస్తులను నివారించండి.

• బహిరంగంగా ప్రేమను చూపే కిస్సింగ్ లేదా హగ్గింగ్ వంటిని చేయకండి ; ఇది అనుమతించబడదు మరియు చట్టపరమైన సమస్యలకు దారితీస్తుంది.

• చాలావరకు పబ్లిక్ ప్రాంతాల్లో ధూమపానం నిషేధించబడింది. మీకు జరిమానా విధించబడని ధూమపానం జోన్ కోసం చూడండి.

• మీరు రంజాన్ సమయంలో అక్కడ ఉంటే, పగటిపూట బహిరంగంగా తినడం, తాగడం లేదా ధూమపానం చేయకండి. ఉపవాసం చేసే వారి పట్ల సానుభూతితో ఉండండి.

• లైసెన్స్ పొందిన ప్రాంగణంలో మాత్రమే మద్యపానం చేయాలి. బహిరంగంగా మద్యం సేవించడం పూర్తిగా నిషేధించబడింది మరియు భారీ జరిమానాలు విధించబడవచ్చు.

• మొత్తం బస సమయంలో సౌకర్యంగా ఉండేలా ఎటువంటి చట్టపరమైన ఇబ్బంది లేదా అత్యవసర పరిస్థితి వంటి అన్ని ఊహించని పరిస్థితులను కవర్ చేసే సరైన దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను పొందండి.

• షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు లేదా వస్తువులు అందించేటప్పుడు, మీ కుడి చేతిని ఉపయోగించండి, ఎడమ చేతిని ఉపయోగించడం అగౌరవంగా భావించబడుతుంది.

• తిట్టడం లేదా అసభ్యకరమైన భాషను ఉపయోగించడం అనేది చట్టపరమైన ఇబ్బందులకు దారితీయవచ్చు. మీ సంభాషణలను మర్యాదపూర్వకంగా మరియు గౌరవప్రదంగా ఉంచండి.

దుబాయ్‌లోని భారతీయ ఎంబసీలు

ఎంబసీ శుక్రవారాలు మరియు శనివారాలలో మూసివేయబడుతుంది. ఏవైనా అప్‌డేట్లు లేదా వారి పనివేళల్లో మార్పు వివరాల కోసం వారి అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయడం లేదా నేరుగా వారిని సంప్రదించడం ఎల్లప్పుడూ ఒక మంచి ఆలోచన.

దుబాయ్-ఆధారిత భారతీయ ఎంబసీ పని గంటలు అడ్రస్
ఇండియన్ కాన్సులేట్ జనరల్ఆదివారం నుండి గురువారం వరకు: 9:00 AM - 5:30 PM24వ అంతస్తు, అల్ జవాద్ టవర్ 2, షేఖ్ జాయేద్ రోడ్, దుబాయ్, UAE

ఎక్కువగా సందర్శించబడే దేశాలకు అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్

ఈ కింద ఇవ్వబడిన ఆప్షన్‌ల నుండి మీకు కావలసినది ఎంచుకోండి, తద్వారా మీరు విదేశీ దేశానికి మీ పర్యటన కోసం మరింత మెరుగ్గా సిద్ధం అవచ్చు

అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ వలన విమాన ఆలస్యాలు, సామాను కోల్పోవడం మరియు ప్రయాణం సంబంధిత ఇతర అసౌకర్యాలు తక్కువ ఇబ్బందిని కలిగిస్తాయి.

తాజా ట్రావెల్ ఇన్సూరెన్స్ బ్లాగ్‌లను చదవండి

slider-right
డెన్పసర్లో సందర్శించవలసిన ఉత్తమ ప్రదేశాలు: అల్టిమేట్ గైడ్

డెన్పసర్లో సందర్శించవలసిన ఉత్తమ ప్రదేశాలు: అల్టిమేట్ గైడ్

మరింత చదవండి
18 డిసెంబర్, 2024న ప్రచురించబడింది
ఫిన్‌ల్యాండ్‌లో సందర్శించవలసిన ఉత్తమ ప్రదేశాలు: అల్టిమేట్ గైడ్

ఫిన్‌ల్యాండ్‌లో సందర్శించవలసిన ఉత్తమ ప్రదేశాలు: అల్టిమేట్ గైడ్

మరింత చదవండి
18 డిసెంబర్, 2024న ప్రచురించబడింది
కుటాలో సందర్శించవలసిన ఉత్తమ ప్రదేశాలు: అల్టిమేట్ గైడ్

కుటాలో సందర్శించవలసిన ఉత్తమ ప్రదేశాలు: అల్టిమేట్ గైడ్

మరింత చదవండి
18 డిసెంబర్, 2024న ప్రచురించబడింది
ఇస్తాన్‌బుల్‌లో సందర్శించడానికి ఉత్తమ ప్రదేశాలు

ఇస్తాన్‌బుల్‌లో సందర్శించడానికి ఉత్తమ ప్రదేశాలు

మరింత చదవండి
26 నవంబర్, 2024న ప్రచురించబడింది
మాల్టా వీసా ఇంటర్వ్యూ ప్రశ్నలు

అవసరమైన మాల్టా వీసా ఇంటర్వ్యూ ప్రశ్నలు మరియు చిట్కాలు

మరింత చదవండి
26 నవంబర్, 2024న ప్రచురించబడింది
స్లైడర్-లెఫ్ట్

దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ గురించి తరచుగా అడగబడే ప్రశ్నలు

అవును, దుబాయ్‌లోకి ప్రవేశించడానికి భారతీయ పౌరులు వీసా కలిగి ఉండాలి. టూరిస్ట్ వీసా కోసం ఒక ఆన్‌లైన్ అప్లికేషన్ లేదా మీ ట్రావెల్ ఏజెంట్ కూడా దీనిని సులభంగా ఏర్పాటు చేయవచ్చు, కానీ అవాంతరాలు లేని వీసా ప్రాసెస్ కోసం దరఖాస్తుదారు అవసరమైన అన్ని డాక్యుమెంట్లు మరియు దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో సిద్ధంగా ఉండాలి.

మీరు మర్యాదపూర్వక దుస్తులు ధరించాలి, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో. సాధారణ దుస్తులు బయటకు వెళ్ళడానికి అనువైనవి, కానీ ఎక్కువగా శరీరం కనిపించకుండా దుస్తులు ధరించాలి. మతపరమైన లేదా సాంప్రదాయక ప్రదేశాల విషయానికి వస్తే, సంప్రదాయ దుస్తులను ధరించడం మంచిది.

ప్రపంచంలోనే పర్యాటకులకు సురక్షితమైన నగరాల్లో ఒకటిగా దుబాయ్ రేట్ చేయబడింది. ఇది చాలా తక్కువ నేరాలను రికార్డ్ చేసే నగరం మరియు కఠినమైన చట్టం కింద నేరం చేసిన వారికి శిక్షలను అమలు చేస్తుంది. అయితే, ఏదైనా ఆకస్మిక అత్యవసర పరిస్థితి లేదా ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను పొందడం అనేది ఎల్లప్పుడూ ఒక గొప్ప మార్గం.

టిప్ ఇవ్వడం అభినందించబడుతుంది కానీ తప్పనిసరి కాదు. రెస్టారెంట్లలో, ఈ సర్వీస్ మీ బిల్లులో చేర్చబడకపోతే దాదాపుగా 10% టిప్ ఇవ్వడం రివాజు. ట్యాక్సీల కోసం, రౌండ్ ఫిగర్ ఛార్జీలను చెల్లించడం ఒక మంచి పని.

వైద్య అత్యవసర పరిస్థితిలో, తక్షణ సహాయం కోసం 999కి డయల్ చేయండి. ఏవైనా వైద్య ఖర్చులను కవర్ చేయడానికి మరియు మీ ట్రిప్ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండేలా నిర్ధారించడానికి దుబాయ్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం చాలా ముఖ్యం.

దుబాయ్ సాధారణంగా ఫోటోలకు అందమైనది అయినప్పటికీ, మీరు ప్రభుత్వ భవనాలు, మిలిటరీ ఇన్‌స్టాలేషన్‌లు మరియు స్థానిక వ్యక్తుల ఫోటోలను వారి అనుమతి లేకుండా తీయడం నివారించాలి. ముఖ్యంగా వ్యక్తిగత లేదా మతపరమైన ప్రదేశాలలో ఎవరినైనా ఫోటో తీయడానికి ముందు ఎల్లప్పుడూ వారిని అడగండి.

ఇంగ్లీష్ విస్తృతంగా మాట్లాడినప్పటికీ మరియు అర్థం చేసుకున్నప్పటికీ, కొన్ని ప్రాథమిక అరబిక్ పదబంధాలను నేర్చుకోవడం సహాయకరం మరియు అభినందించదగినది. స్థానికులతో సాధారణ పలకరింపులు మరియు మర్యాదపూర్వక భావప్రకటనలు మీ సంభాషణలను మెరుగుపరచగలవు.

అవార్డులు మరియు గుర్తింపు

BFSI లీడర్‌షిప్ అవార్డులు 2022 - సంవత్సరం యొక్క ప్రోడక్ట్ ఇన్నోవేటర్ (ఆప్టిమా సెక్యూర్)

ETBFSI ఉత్తమ పురస్కారాలు 2021

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ
అవార్డులు సెప్టెంబర్ 2021

ICAI అవార్డులు 2015-16

SKOCH ఆర్డర్-ఆఫ్-మెరిట్

ఉత్తమ కస్టమర్ అనుభవం
అవార్డ్ ఆఫ్ ది ఇయర్

ICAI అవార్డులు 2014-15

CMS అవుట్‌స్టాండింగ్ అఫిలియేట్ వరల్డ్-క్లాస్ సర్వీస్ అవార్డ్ 2015

iAAA రేటింగ్

ISO సర్టిఫికేషన్

ప్రైవేట్ సెక్టార్‌లో ఉత్తమ ఇన్సూరెన్స్ కంపెనీ - జనరల్ 2014

slider-right
స్లైడర్-లెఫ్ట్
అన్ని అవార్డులను చూడండి
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయండి

చదవడం పూర్తయిందా? ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా?