టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్లు
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో టూ వీలర్ ఇన్సూరెన్స్
ప్రీమియం కేవలం ₹538 వద్ద ప్రారంభం*

వార్షిక ప్రీమియం ప్రారంభం

కేవలం ₹538 వద్ద*
2000+ నగదురహిత నెట్‌వర్క్ గ్యారేజీలు ^

2000+ నగదురహిత

నెట్‌వర్క్ గ్యారేజీలు**
ఎమర్జెన్సీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్

రోడ్‌సైడ్ ఎమర్జెన్సీ

సహాయం
4.4 కస్టమర్ రేటింగ్‌లు ^

4.4

కస్టమర్ రేటింగ్‌లు
హోమ్ / టూ వీలర్ ఇన్సూరెన్స్ / ప్లాన్‌లను సరిపోల్చండి

ఆన్‌లైన్‌లో టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను సరిపోల్చండి

టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్లను సరిపోల్చండి

మోటార్‌‌బైక్‌లు సరసమైన, సౌకర్యవంతమైన రవాణా మార్గాలను అందించే ప్రజాదారణ పొందిన టూ-వీలర్ వాహనాలు. కార్లతో పోల్చితే ఇవి చాలా తక్కువ స్థలాన్ని తీసుకుంటాయి, రద్దీగా ఉండే రోడ్లపై సులభంగా ప్రయాణించగలవు. అయితే, మీరు ఒక బైక్‌ను రైడ్ చేస్తున్నట్లయితే, బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం మంచిది, ఎందుకంటే ఊహించని సంఘటనల కారణంగా వాహనం మరియు ప్రమాదవశాత్తు జరిగిన నష్టానికి ఇది కవరేజీని అందిస్తుంది. ఒక తగిన పాలసీని కొనుగోలు చేసేటప్పుడు, టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో సరిపోల్చడం తెలివైన నిర్ణయం. అలా చేయడం ద్వారా, మీరు మీ అవసరానికి సరిపోయే ఉత్తమ పాలసీని ఎంచుకోవచ్చు.

అగ్నిప్రమాదం, దొంగతనం, భూకంపం, వరద మరియు ఇతర అనవసర సందర్భాల కారణంగా టూ-వీలర్ నష్టానికి బైక్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తుంది. చెల్లుబాటు అయ్యే బైక్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం వలన, యజమానులు తమ మోటార్‌బైక్‌కు కలిగే ఈ నష్టాల కోసం ఖర్చులను స్వయంగా భరించాల్సిన అవసరం లేదు. ఎందుకనగా, బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది వారి టూ-వీలర్ నష్టానికి సంబంధించిన ఖర్చులను కవర్ చేయడానికి సహాయపడుతుంది. 1988 మోటార్ వాహన చట్టం ప్రకారం, థర్డ్ పార్టీ కవర్‌ను కలిగి ఉండటం తప్పనిసరి, అయితే, మీ మోటార్‌బైక్ పూర్తి రక్షణ కోసం, సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం తెలివైన నిర్ణయం.

మీరు ఆన్‌లైన్‌లో బైక్ ఇన్సూరెన్స్‌ను సరిపోల్చినప్పుడు, అది అందించే కవరేజ్ ద్వారా మీరు పాలసీని భిన్నంగా ఉంచవచ్చు. మీరు సమగ్ర ఇన్సూరెన్స్ లేదా స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ కవర్ లేదా థర్డ్ పార్టీ కవర్ నుండి ఎంచుకోవచ్చు. మేము 2000+ నగదురహిత గ్యారేజీల విస్తృత నెట్‌వర్క్‌ను అందిస్తున్నందున మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా ఆన్‌లైన్‌లో టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయవచ్చు/రెన్యూ చేయవచ్చు.

బైక్ ఇన్సూరెన్స్ పోలిక ఎందుకు ముఖ్యం?

మార్కెట్లో అనేక రకాల బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు ఉన్నప్పటికీ, మీ మోటార్‌బైక్ కోసం సరైన పాలసీని ఎంచుకోవడానికి, ఈ విభిన్నమైన ప్లాన్‌లను ఆన్‌లైన్‌లో సరిపోల్చుకోవడం ఉత్తమం. ఆన్‌లైన్‌లో మరింత సమాచారం లభ్యమవుతుంది కావున, అనేక వర్గాలకు సంబంధించిన విభిన్న ప్లాన్‌లను సరిపోల్చడం చాలా సులభం. ఈ పోలికలు, తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను అందించే అత్యుత్తమ బైక్ ఇన్సూరెన్స్‌ను గుర్తించడంలో మీకు సహాయపడతాయి. వేర్వేరు బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను సరిపోల్చడంలో ముడిపడివున్న కొన్ని కీలక అంశాలను పరిశీలించండి.

1
డబ్బుకు విలువ
వివిధ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్లను సరిపోల్చడంతో వాటిలో ప్రతిదానికి జోడించిన ప్రీమియంలను దృష్టిలో ఉంచుకుని, అందులో ఏవైనా మీ బడ్జెట్‌కు సరిపోతాయో లేదో అని నిర్ధారించడం సాధ్యమవుతుంది. సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లతో పోలిస్తే థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్ మరింత సరసమైనది. అయితే, మరింత కవరేజీని అందించే సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో పోల్చితే థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు వాటి పరిధి పరంగా చాలా పరిమితంగా ఉంటాయి.
2
కవరేజీ ఎంపికలు
మీ బైక్‌కు తగిన కవరేజీని ఏ పాలసీ అందిస్తుందో తెలుసుకోవడానికి, వివిధ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు అందించే కవరేజీని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. థర్డ్ పార్టీ కవరేజీతో పాటు సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ఒక సంవత్సరం లేదా ఎక్కువ కాలం పాటు పొందవచ్చు. సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ పాలసీలు మరింత కవరేజీని అందిస్తాయి, అందులో యాక్సిడెంట్ కారణంగా నష్టం, దొంగతనంతో పాటు పర్సనల్ యాక్సిడెంట్ కవరేజీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టం, అగ్నిప్రమాదం మరియు థర్డ్‌పార్టీ వాహనానికి, వ్యక్తికి జరిగిన నష్టం నుండి తలెత్తే బాధ్యతలు కవర్ చేయబడతాయి. థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు మొదటి రెండింటికి విరుద్ధంగా, చివరి నాలుగు వర్గాలకు మాత్రమే కవరేజీని అందిస్తాయి.
3
మెరుగైన సర్వీస్
మీరు మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ బైక్ ఇన్సూరెన్స్ పాలసీలను పోల్చడం ప్రారంభించిన తర్వాత మాత్రమే, ప్రతి ప్లాన్ కింద అందించబడే విభిన్న సేవల రకాలను మీరు అర్థం చేసుకుంటారు. బైక్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అందించే అమ్మకాల తర్వాత-సేవలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
4
సౌలభ్యం హామీ ఇవ్వబడింది
బైక్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం అనేది, మీ బైక్ పాడైపోయినప్పుడు మరియు/లేదా థర్డ్ పార్టీకి నష్టం జరిగిన సందర్భంలో తలెత్తే బాధ్యతల నుండి మీకు కవరేజీ అందించబడుతుందని పదే పదే గుర్తుచేస్తుంది. మీరు వేర్వేరు బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను సరిపోల్చాలనుకున్నపుడు ఆన్‌లైన్‌ ఆప్షన్ ఎంచుకోండి, ఎందుకనగా అది మీ ఇంటి సౌలభ్యం నుండి పూర్తవుతుంది, అలాగే ఉత్తమంగా కూడా ఉంటుంది.

మీరు బైక్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎలా సరిపోల్చాలి?

బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను సరిపోల్చడం అనేది మీ బైక్ కోసం సరైన పాలసీని షార్ట్‌లిస్ట్ చేయడంలో ఉత్తమ మార్గంగా ఉంటుంది. ఒక విశాల దృష్టికోణం నుండి చూసినప్పుడు, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే బైక్ ఇన్సూరెన్స్ పాలసీలనేవి సమగ్ర కవర్ మరియు థర్డ్ పార్టీ బాధ్యత అనే రెండు విస్తృత ఎంపికలుగా విభజించబడ్డాయి. మీ బైక్ కోసం సరైన కవర్ ఎంచుకోవడం కోసం, ఈ రెండు రకాల పాలసీలు అందించే ప్రయోజనాలు అర్థం చేసుకుందాం.

  సమగ్ర (ఒకే సంవత్సరం)మల్టీ ఇయర్ టూ వీలర్ ఇన్సూరెన్స్  థర్డ్ పార్టీ (లయబిలిటీ మాత్రమే)
యాక్సిడెంటల్ డ్యామేజీ కోసం బైక్ ఇన్సూరెన్స్   
దొంగతనం కోసం బైక్ ఇన్సూరెన్స్   
అగ్నిప్రమాదం కారణంగా జరిగిన నష్టానికి బైక్ ఇన్సూరెన్స్   
ప్రకృతి వైపరీత్యం కారణంగా కలిగే నష్టానికి బైక్ ఇన్సూరెన్స్   
పర్సనల్ యాక్సిడెంట్ కవర్   
థర్డ్-పార్టీ వాహనానికి కలిగే నష్టానికి బైక్ ఇన్సూరెన్స్   
థర్డ్-పార్టీ వ్యక్తికి గాయం కోసం బైక్ ఇన్సూరెన్స్   
టూ వీలర్ ఇన్సూరెన్స్ కోసం జీరో డిప్రిషియేషన్ కవర్ఆప్షనల్ యాడ్-ఆన్  
ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కవర్ఆప్షనల్ యాడ్-ఆన్  

 

బైక్ ఇన్సూరెన్స్ పాలసీలను సరిపోల్చడానికి పరిగణలోకి తీసుకునే ముఖ్యమైన కారకాలు

మీరు వేర్వేరు బైక్ ఇన్సూరెన్స్ పాలసీలను ఒకదానితో ఒకటి పోల్చడం ప్రారంభించినప్పుడు, అనేక ముఖ్యమైన కారకాలు మీ ముందుకు వస్తాయి, అలాగే, మీరువాటిని పరిగణనలోకి తీసుకోవాలి. ఇందులో అత్యంత ముఖ్యమైనవి క్రింద వివరించబడ్డాయి.

ధర

వేర్వేరు బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లకు వేర్వేరు ధరలు జోడించబడతాయి. మీరు వివిధ బైక్ ఇన్సూరెన్స్ పాలసీలను పోల్చినప్పుడు, తక్కువ మొత్తంతో ఎక్కువ ప్రయోజనాలను అందించే ప్లాన్ కోసం చూడాలి. థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు, సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లతో పోల్చితే చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి, అలాగే, అవి చాలా తక్కువ కవరేజీని అందిస్తాయి.

కవరేజ్

మీరు ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌లు అందించే కవరేజీ రకాన్ని బట్టి, వివిధ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను సరిపోల్చాలి. థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు, తమ పాలసీదారులను థర్డ్-పార్టీ వ్యక్తికి, వాహనానికి జరిగిన నష్టం నుండి మాత్రమే కాకుండా ప్రకృతి వైపరీత్యం లేదా అగ్నిప్రమాదం కారణంగా సంభవించిన నష్టాల నుండి కూడా రక్షిస్తాయి. పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కూడా అందించబడుతుంది. మరోవైపు, సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు ఈ కారకాల్లో ప్రతిదానికీ కవరేజీని అందిస్తాయి. అలాగే, దొంగతనం, ప్రమాదాల విషయంలో కూడా గొప్ప కవరేజీని అందిస్తాయి. అందుబాటులోని ఆప్షనల్ యాడ్-ఆన్‌లు అనేవి పాలసీదారులు వారి కవరేజీ పరిధిని విస్తరించడానికి అనుమతిస్తాయి.

రివ్యూలు

మీరు ఏదైనా బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవడానికి ముందు, గతంలో ఈ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను కొనుగోలు చేసిన ఇతరులు ఇచ్చిన రివ్యూలను సరిపోల్చడం చాలా ముఖ్యం. ఈ రివ్యూలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి, బైక్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌లతో పాలసీదారుల అనుభవాలను గురించిన ఒక అంతర్దృష్టిని అందిస్తాయి. అలాగే, మంచి రివ్యూలు పాలసీ విలువ గురించి మీకు భరోసా ఇవ్వగలిగినప్పటికీ, చెడు రివ్యూలు పాలసీకి సంబంధించిన సంభావ్య ఎదురుదెబ్బలను స్పష్టం చేస్తాయి.

క్లెయిమ్ రికార్డులు

వివిధ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను సరిపోల్చే సమయంలో, ప్రతి ఇన్సూరెన్స్ ప్రొవైడర్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తిని కూడా పరిశీలించడం చాలా ముఖ్యం. అధిక క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి అనేది కవరేజ్ అందించడంలో ప్రొవైడర్ యొక్క విశ్వసనీయతను సూచిస్తుంది. ఉదాహరణకు, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 91.23% క్లెయిమ్ ఇన్సూరెన్స్ సెటిల్‌మెంట్ నిష్పత్తిని కలిగి ఉంది, ఇది చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

నగదు రహిత గ్యారేజీలు

వివిధ బైక్ ఇన్సూరెన్స్ పాలసీల మధ్య సరిపోల్చేటపుడు, మీరు ప్రతి బైక్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నెట్‌వర్క్ కింద చేర్చబడిన నగదురహిత గ్యారేజీల సంఖ్యను పరిశీలించాలి. ఒక ఆదర్శవంతమైన బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్ దాని నెట్‌వర్క్ పరిధిలో అనేక నగదురహిత గ్యారేజీలను కలిగి ఉంటుంది, ఇవి పాలసీదారులకు అందుబాటులో ఉంటాయి. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 7500 నగదురహిత గ్యారేజీలను కలిగి ఉంది.

ధర

వేర్వేరు బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లకు వేర్వేరు ధరలు జోడించబడతాయి. మీరు వివిధ బైక్ ఇన్సూరెన్స్ పాలసీలను పోల్చినప్పుడు, తక్కువ మొత్తంతో ఎక్కువ ప్రయోజనాలను అందించే ప్లాన్ కోసం చూడాలి. థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు, సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లతో పోల్చితే చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి, అలాగే, అవి చాలా తక్కువ కవరేజీని అందిస్తాయి.

కవరేజ్

మీరు ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌లు అందించే కవరేజీ రకాన్ని బట్టి, వివిధ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను సరిపోల్చాలి. థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు, తమ పాలసీదారులను థర్డ్-పార్టీ వ్యక్తికి, వాహనానికి జరిగిన నష్టం నుండి మాత్రమే కాకుండా ప్రకృతి వైపరీత్యం లేదా అగ్నిప్రమాదం కారణంగా సంభవించిన నష్టాల నుండి కూడా రక్షిస్తాయి. పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కూడా అందించబడుతుంది. మరోవైపు, సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు ఈ కారకాల్లో ప్రతిదానికీ కవరేజీని అందిస్తాయి. అలాగే, దొంగతనం, ప్రమాదాల విషయంలో కూడా గొప్ప కవరేజీని అందిస్తాయి. అందుబాటులోని ఆప్షనల్ యాడ్-ఆన్‌లు అనేవి పాలసీదారులు వారి కవరేజీ పరిధిని విస్తరించడానికి అనుమతిస్తాయి.

రివ్యూలు

మీరు ఏదైనా బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవడానికి ముందు, గతంలో ఈ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను కొనుగోలు చేసిన ఇతరులు ఇచ్చిన రివ్యూలను సరిపోల్చడం చాలా ముఖ్యం. ఈ రివ్యూలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి, బైక్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌లతో పాలసీదారుల అనుభవాలను గురించిన ఒక అంతర్దృష్టిని అందిస్తాయి. అలాగే, మంచి రివ్యూలు పాలసీ విలువ గురించి మీకు భరోసా ఇవ్వగలిగినప్పటికీ, చెడు రివ్యూలు పాలసీకి సంబంధించిన సంభావ్య ఎదురుదెబ్బలను స్పష్టం చేస్తాయి.

క్లెయిమ్ రికార్డులు

వివిధ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను సరిపోల్చే సమయంలో, ప్రతి ఇన్సూరెన్స్ ప్రొవైడర్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తిని కూడా పరిశీలించడం చాలా ముఖ్యం. అధిక క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి అనేది కవరేజ్ అందించడంలో ప్రొవైడర్ యొక్క విశ్వసనీయతను సూచిస్తుంది. ఉదాహరణకు, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 91.23% క్లెయిమ్ ఇన్సూరెన్స్ సెటిల్‌మెంట్ నిష్పత్తిని కలిగి ఉంది, ఇది చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

నగదు రహిత గ్యారేజీలు

వివిధ బైక్ ఇన్సూరెన్స్ పాలసీల మధ్య సరిపోల్చేటపుడు, మీరు ప్రతి బైక్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నెట్‌వర్క్ కింద చేర్చబడిన నగదురహిత గ్యారేజీల సంఖ్యను పరిశీలించాలి. ఒక ఆదర్శవంతమైన బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్ దాని నెట్‌వర్క్ పరిధిలో అనేక నగదురహిత గ్యారేజీలను కలిగి ఉంటుంది, ఇవి పాలసీదారులకు అందుబాటులో ఉంటాయి. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 7500 నగదురహిత గ్యారేజీలను కలిగి ఉంది.

టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా కొనుగోలు చేయాలి

మీరు టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను సరిపోల్చిన తర్వాత, మీరు ఈ క్రింది మార్గాల్లో బైక్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడానికి ముందుకు సాగవచ్చు:

దశ 1: హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్ హోమ్ పేజీలోని బైక్ ఇన్సూరెన్స్ ఐకాన్‌పై క్లిక్ చేయండి మరియు మీ బైక్ రిజిస్ట్రేషన్ నంబర్‌తో సహా వివరాలను పూరించండి మరియు తరువాత కోట్ పొందండి పై క్లిక్ చేయండి.

దశ 2: సమగ్ర, స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ మరియు థర్డ్ పార్టీ కవర్ నుండి ఎంచుకోండి. మీరు సమగ్ర ప్లాన్‌ను ఎంచుకుంటే మీరు మీ ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువను కూడా సవరించవచ్చు. మీరు ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వరకు ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

దశ 3: మీరు ప్రయాణీకులు మరియు పెయిడ్ డ్రైవర్ కోసం పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ను కూడా జోడించవచ్చు. అంతేకాకుండా, ఇంజిన్ గేర్‌బాక్స్ ప్రొటెక్షన్, ఎమర్జెన్సీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్, జీరో డిప్రిసియేషన్ మొదలైనటువంటి యాడ్-ఆన్‌ను ఎంచుకోవడం ద్వారా మీరు పాలసీని కస్టమైజ్ చేయవచ్చు

దశ 4: మీ మునుపటి బైక్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి వివరాలను ఇవ్వండి. ఉదా. మునుపటి పాలసీ రకం (సమగ్ర లేదా థర్డ్ పార్టీ, పాలసీ గడువు తేదీ, చేసిన మీ క్లెయిముల వివరాలు, ఏవైనా ఉంటే)

దశ 5: మీరు ఇప్పుడు మీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను చూడవచ్చు

సెక్యూర్డ్ పేమెంట్ గేట్‌వే ద్వారా ప్రీమియంను చెల్లించండి.

టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ అడ్రస్‌కు లేదా వాట్సాప్‌కు పంపబడుతుంది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎందుకు ఎంచుకోవాలి

మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి బైక్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు కొనుగోలు చేయాలి అనేది ఇక్కడ ఇవ్వబడింది:

ఇంటి వద్ద రిపేర్ సర్వీస్

ఇంటి వద్ద రిపేర్ సర్వీస్

బైక్ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీతో మీరు మా 2000+ నగదురహిత గ్యారేజీల విస్తృత నెట్‌వర్క్ నుండి ఇంటి వద్దనే మరమ్మత్తు సేవను పొందుతారు.
AI ఎనేబుల్డ్ మోటార్ క్లెయిమ్ సెటిల్‌మెంట్

AI ఎనేబుల్డ్ మోటార్ క్లెయిమ్ సెటిల్‌మెంట్

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో బైక్ ఇన్సూరెన్స్ పాలసీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ల కోసం AI టూల్ ఐడియాలను (ఇంటెలిజెంట్ డ్యామేజ్ డిటెక్షన్ ఎస్టిమేషన్ మరియు అసెస్‌మెంట్ సొల్యూషన్) అందిస్తుంది. ఐడియాలు రియల్-టైమ్‌లో మోటార్ క్లెయిమ్స్ సెటిల్‌మెంట్‌లో సహాయపడతాయి. అలాగే, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 100% క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి రికార్డును కలిగి ఉంది.
ప్రీమియంపై డబ్బును ఆదా చేయండి

ప్రీమియంపై డబ్బును ఆదా చేయండి

మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి బైక్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేస్తే, మీరు టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను సరిపోల్చవచ్చు మరియు మీ అవసరాలకు తగినట్లుగా ఉత్తమ ప్లాన్ అందించే కవరేజీని ఎంచుకోవచ్చు. ఇంకా, మీరు డిస్కౌంట్లను కూడా తనిఖీ చేయవచ్చు మరియు ప్రీమియంపై ఆదా చేసుకోవచ్చు.
వార్షిక ప్రీమియం కేవలం ₹538 నుండి ప్రారంభం

వార్షిక ప్రీమియం కేవలం ₹538 నుండి ప్రారంభం

కేవలం ₹538 నుండి ప్రారంభమయ్యే వార్షిక ప్రీమియంతో, మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి ఆన్‌లైన్‌లో బైక్ ఇన్సూరెన్స్ కొనుగోలు లేదా రెన్యూ చేయడానికి చూడాలి.
ఎమర్జెన్సీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్

ఎమర్జెన్సీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎమర్జెన్సీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ యాడ్ ఆన్ కవర్‌తో స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ మరియు సమగ్ర కవర్‌తో మీరు ఎప్పుడైనా మరియు ఎక్కడైనా వాహన మరమ్మత్తు సహాయం పొందవచ్చు. ఇంజిన్ గేర్‌బాక్స్ ప్రొటెక్షన్, జీరో డిప్రిసియేషన్ మొదలైనటువంటి ఇతర యాడ్ ఆన్ కవర్‌ను కూడా మీరు ఎంచుకోవచ్చు.
టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి

తక్షణమే పాలసీని కొనుగోలు చేయండి

మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి ఆన్‌లైన్‌లో బైక్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే మీ టూ వీలర్‌ను సురక్షితం చేసుకోవచ్చు.

టూ వీలర్ ఇన్సూరెన్స్ను పోల్చేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు

మీరు టూ-వీలర్ కోసం ఇన్సూరెన్స్ ప్లాన్లను సరిపోల్చినప్పుడు, మీరు ఈ క్రింది విషయాలను గుర్తుంచుకోవాలి:

1

కవరేజ్ మరియు ప్రీమియం

మీరు టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను సరిపోల్చినప్పుడు, కవరేజ్ అంశాన్ని క్షుణ్ణంగా పరిగణించండి. చెల్లించవలసిన ప్రీమియం మొత్తానికి సంబంధించి బైక్ ఇన్సూరెన్స్ పాలసీలోని చేర్పులు మరియు మినహాయింపులను సరిపోల్చండి. చివరిగా, మీరు వివిధ ప్లాన్లను షార్ట్‌లిస్ట్ చేయవచ్చు మరియు మీ బైక్ కోసం ఉత్తమంగా సరిపోయేదాన్ని ఎంచుకోవచ్చు. తగినంత కవరేజ్ మరియు ఖర్చు-తక్కువ ధరతో తగిన కలయికను పొందండి.
2

యాడ్-ఆన్‌లను తనిఖీ చేయండి

సమగ్ర ఇన్సూరెన్స్ ప్లాన్‌లతో అందుబాటులో ఉన్న రైడర్‌లు లేదా యాడ్-ఆన్‌లను తనిఖీ చేయండి. అనవసరమైన యాడ్-ఆన్ కవర్‌లను ఎంచుకోకండి, మీ అవసరాలను తీర్చే ఒకదాన్ని ఎంచుకోండి.
3

తొలగించదగినవి

క్లెయిమ్ సెటిల్‌మెంట్ సమయంలో మీరు చెల్లించవలసిన మరమ్మత్తు ఖర్చులో ఇది కొంత శాతం. మీ ప్రీమియంలను తగ్గించడానికి మీరు ఎక్కువ మినహాయింపులను ఎంచుకోవచ్చు. అయితే, మీరు క్లెయిమ్‌లను సెటిల్ చేసినప్పుడు మీరు చెల్లించే మొత్తాన్ని ఇది పెంచుతుంది. అందువల్ల, ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడానికి ముందు, మినహాయింపులను సరిపోల్చండి.
4

క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి

క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి అనేది ఇచ్చిన ఆర్థిక సంవత్సరంలో సెటిల్ అయిన వాటికి స్వీకరించిన క్లెయిముల నిష్పత్తి. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 100% క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి రికార్డును కలిగి ఉంది.
5

మినహాయింపులు

బైక్ ఇన్సూరెన్స్ పాలసీ మినహాయింపులు మరియు కవరేజ్ అనేవి నిజమైన సమాచారం పేర్కొనబడిన చోటు. మీరు బైక్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో సరిపోల్చినప్పుడు మీరు మీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ వివరాలను జాగ్రత్తగా చదవాలి.
2000కు పైగా భారతదేశం అంతటా నెట్‌వర్క్ గ్యారేజీలు
2000+ˇ నెట్‌వర్క్ గ్యారేజీలు
భారతదేశం వ్యాప్తంగా

బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను సరిపోల్చడంపై ఇటీవలి బ్లాగులు

గడువు ముగియడానికి ముందు మీ బైక్ ఇన్సూరెన్స్‌ను ఎలా మూల్యాంకన చేయాలి మరియు రెన్యూ చేయాలి

గడువు ముగియడానికి ముందు మీ బైక్ ఇన్సూరెన్స్‌ను ఎలా మూల్యాంకన చేయాలి మరియు రెన్యూ చేయాలి

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
జనవరి 06, 2023 నాడు ప్రచురించబడింది
బైక్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో సరిపోల్చడం

మీరు ఆన్‌లైన్‌లో బైక్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు సరిపోల్చాలి

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
మార్చి 04, 2022న ప్రచురించబడింది
టూ-వీలర్ ఇన్సూరెన్స్ పోలిక

టూ-వీలర్ ఇన్సూరెన్స్‌ను సరిపోల్చడం వలన కలిగే 5 ప్రయోజనాలు

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
ఫిబ్రవరి 28, 2022 న ప్రచురించబడింది
బైక్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసేటప్పుడు లేదా రెన్యూ చేసేటప్పుడు ఈ తప్పులను చేయకండి - బైక్ ఇన్సూరెన్స్

బైక్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు లేదా రెన్యూ చేసేటప్పుడు ఈ తప్పులను చేయవద్దు

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
అక్టోబర్ 29, 2020 న ప్రచురించబడింది
ఉత్తమ టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను గుర్తించడానికి మరియు కొనుగోలు చేయడానికి చిట్కాలు

ఉత్తమ టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను గుర్తించడానికి మరియు కొనుగోలు చేయడానికి చిట్కాలు

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
ప్రచురణ తేదీ ఏప్రిల్ 25, 2019
blog right slider
blog left slider
మరిన్ని బ్లాగ్‌లను చూడండి
ఇప్పుడే ఉచిత కోట్ పొందండి
టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి సమయం ఆసన్నమైంది

బైక్ ఇన్సూరెన్స్ పోలికపై తరచుగా అడగబడే ప్రశ్నలు

ఏదైనా ఒక ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి ముందు అనేక పరిశోధనలు చేయడం, వివిధ బైక్ ఇన్సూరెన్స్ పాలసీలను సరిపోల్చడం చాలా ముఖ్యం. ఈ పరిశోధన మీ మోటార్‌బైక్ కోసం ఉత్తమమైన పాలసీని నిర్ణయించడంలో, తద్వారా మీ డబ్బును ఆదా చేయడంలో మీకు సహాయం చేస్తుంది. ఈ పోలికలు ప్రతి ప్లాన్‌కు చెందిన ప్రీమియంలను, పాలసీ కవర్ చేసే ప్రతి అంశాన్ని అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడతాయి. మీ బడ్జెట్‌కు ఏ ప్లాన్ ఉత్తమంగా సరిపోతుందో కూడా మీరు నిర్ణయించవచ్చు. ఒకవేళ, మీ బడ్జెట్ పరిమితంగా ఉన్నపుడు, సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో పోల్చినపుడు ప్రీమియం చాలా తక్కువగా ఉండే థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం వెళ్లడం ఉత్తమం.
ఆన్‌లైన్‌లో విభిన్న బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను పోల్చడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, వాటిలో కొన్ని దిగువన ఇవ్వబడ్డాయి.
● మీ ఇంటి సౌకర్యం నుండి ఆన్‌లైన్‌లో పాలసీలను సరిపోల్చుకునే ప్రయోజనం.
● మీరు ఈ పోలికలను ఏ సమయంలోనైనా చేయవచ్చు, ఇన్సెంటివ్ కొరకు వారికి అనుకూలంగా ఉన్న పాలసీ కోసం మిమ్మల్ని ప్రోత్సహించే సేల్స్‌మ్యాన్ ఒత్తిడికి గురికావాల్సిన అవసరం లేదు.
● వివిధ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లకు సంబంధించి ఆన్‌లైన్‌లో మరింత సమాచారం అందుబాటులో ఉంది.
● ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న రివ్యూలు ఒక నిర్దిష్ట ప్లాన్‌ను సూచిస్తాయి లేదా ఒక నిర్దిష్ట బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో ఉన్న లోటును గురించి పూర్తి అంతర్దృష్టిని ఇస్తాయి.
● మీరు బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు, వాటి ప్రీమియంలను గురించి వివరంగా తెలుసుకోవచ్చు, అది ఆర్థికంగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడంలో మీకు సహాయపడుతుంది.
ఈ క్రింది అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను సరిపోల్చవచ్చు.
క్లెయిమ్ రికార్డులు – మీరు వివిధ బైక్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌లకు సంబంధించి వారి క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తుల మధ్య వ్యత్యాసాన్ని సరిపోల్చుతూ, అవి ఏ మేరకు కవరేజీని అందిస్తాయో అంచనా వేయవచ్చు.
కవరేజ్ పరిధి – సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లతో పోలిస్తే థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీలు పరిమితమైన కవరేజ్ పరిధితో వస్తాయి.
నగదు రహిత గ్యారేజీల నెట్‌వర్క్ – బైక్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ తన నెట్‌వర్క్‌లో ఎన్ని ఎక్కువ నగదు రహిత గ్యారేజీలను కలిగి ఉంటే, దాని ఇన్సూరెన్స్ పాలసీ అంత సౌకర్యవంతమైన కవరేజీని అందిస్తుందని అర్థం.
ప్రీమియం వసూలు – వేర్వేరు పాలసీలు వేర్వేరు ప్రీమియంలను కలిగి ఉంటాయి, కావున, వీటిని ప్రతి ఒక్కరు తమ బడ్జెట్ ప్రకారం పరిగణలోకి తీసుకోవాలి.
థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీలను, నేడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అతి తక్కువ ఖరీదైన బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అని అర్థం చేసుకోవచ్చు. ఈ పాలసీ కవరేజ్ పరిధి, ప్రాథమికంగా సమగ్ర అంశాలకు కాకుండా థర్డ్ పార్టీ బాధ్యత చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. అదేవిధంగా, ఆప్షనల్ యాడ్-ఆన్‌లను అందించే సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ పాలసీలు ఖరీదైనవి.
బైక్ కోసం టూ-వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్ లభ్యతను చెక్ చేయడం అనేది అంత సులభమైన పనికాదు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో బైక్ ఇన్సూరెన్స్ వెబ్‌సైట్‌ను సందర్శించండి, మీ మోటర్‌బైక్‌ను కొనుగోలు చేసిన సమయంతో పాటు మీ బైక్ బ్రాండ్, మోడల్ మరియు వెర్షన్‌ను గుర్తించండి. మీరు అందించే ఈ సమాచారం చాలా విలువైనది, ఎందుకనగా ఇది మీ బైక్ వయస్సుని నిర్ణయించడంలో సహాయపడుతుంది మరియు ప్రీమియంపై ప్రభావం చూపుతుంది. మీరు మీ మోటార్‌బైక్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న నగరాన్ని, మీ వద్ద ఏదైనా మునుపటి బైక్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే దాని చెల్లుబాటును తెలిపిన తర్వాత, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్ మీ మోటార్‌బైక్ కోసం అందుబాటులో ఉన్న వివిధ రకాల బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను మీకు అందిస్తుంది.
మీరు బైక్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో సరిపోల్చినప్పుడు, వివిధ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను సరిపోల్చడం మంచిది - సమగ్ర ఇన్సూరెన్స్, స్టాండ్‌అలోన్ ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మరియు సరికొత్త బైక్‌ల కోసం కవర్.
అవును, ఎటువంటి దాగి ఉన్న ఖర్చు లేనందున మరియు మోసపూరిత ప్రమాదం కూడా లేనందున బైక్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయం. ఇది కాకుండా, మీరు టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను సరిపోల్చవచ్చు మరియు ఉత్తమ కవరేజీతో పాలసీని ఎంచుకోవచ్చు.
1988 మోటార్ వాహనాల చట్టం ప్రకారం, కనీసం బైక్ ఇన్సూరెన్స్ పాలసీకి చెందిన థర్డ్ పార్టీ కవర్‌ను కొనుగోలు చేయడం తప్పనిసరి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ₹538 నుండి ప్రారంభమయ్యే వార్షిక ప్రీమియంతో బైక్ ఇన్సూరెన్స్ అందిస్తుంది*. అయితే, వాహన ఇంజిన్ క్యూబిక్ సామర్థ్యం మరియు మీరు ఎంచుకున్న ప్లాన్ ఆధారంగా ధరలు భిన్నంగా ఉంటాయి.
మీ టూ-వీలర్ పూర్తి రక్షణ కోసం సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం మంచిది. సమగ్ర ఇన్సూరెన్స్‌తో, మీరు స్వంత నష్టం మరియు థర్డ్ పార్టీ బాధ్యతల కోసం కవరేజ్ పొందుతారు.
మీరు సమగ్ర కవర్ లేదా ఓన్ డ్యామేజ్ కవర్‌ను ఎంచుకుంటే, ఎమర్జెన్సీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్, జీరో డిప్రిసియేషన్, నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్, రిటర్న్ టు ఇన్వాయిస్ మరియు ఇంజిన్ గేర్‌బాక్స్ ప్రొటెక్టర్ వంటి యాడ్ ఆన్ కవర్‌లను ఎంచుకోవడం ద్వారా మీరు మీ కవరేజీని పెంచుకోవచ్చు.
మీరు ఆన్‌లైన్‌లో బైక్ ఇన్సూరెన్స్‌ను సరిపోల్చినప్పుడు, అది అందించే కవరేజీతో మీరు వివిధ ప్లాన్‌లను తనిఖీ చేయవచ్చు. తదనుగుణంగా, మీరు మీ అవసరాలకు సరిపోయే ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు.