- 1 సంవత్సరానికి మీ కారును రెన్యూ చేసుకోండి. ప్రమాదాలు, దొంగతనాలు, ప్రకృతి వైపరీత్యాలు మరియు మానవ నిర్మిత సంఘటనల వలన థర్డ్ పార్టీకి ఏ నష్టం జరగకుండా కవరేజ్ పొందండి
ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు లేదా మానవ నిర్మిత సంఘటనల వంటి ఊహించని ప్రమాదాల కారణంగా తలెత్తే బాధ్యతలకు కార్ ఇన్సూరెన్స్, బీమా కవరేజీని అందిస్తుంది. మీరు మీ పాలసీని దాని గడువు తేదీకి ముందుగానే రెన్యూ చేయలేకపోతే, అది ల్యాప్స్ అయిన స్థితిలోకి వస్తుంది, ఈ సమయంలో మీరు రైజ్ చేసిన ఏదైనా క్లెయిమ్ తిరస్కరించబడగల అవకాశం ఉంటుంది. మోటారు వాహనాల చట్టం 1988, ఇటీవల ఆమోదించబడిన మోటారు వాహనాల (సవరణ) చట్టం 2019 ప్రకారం టూ వీలర్ డ్రైవర్లు ఎల్లవేళలా చెల్లుబాటు అయ్యే కారు ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం తప్పనిసరి.
కారు డ్రైవర్లు ఎప్పుడూ కార్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం అనేది చట్టపరమైన అవసరం. మీరు ప్రమాదానికి గురైన సందర్భంలో మీ వద్ద చెల్లుబాటు అయ్యే కార్ ఇన్సూరెన్స్ లేనపుడు, ఇన్సూరెన్స్ ప్లాన్‌ను రెన్యూ చేసుకోకపోవడం అనేది ఖరీదైన తప్పుగా రుజువు అవుతుంది. అప్పుడు మీరు థర్డ్ పార్టీకి జరిగిన ఏదైనా శారీరక గాయం లేదా నష్టానికి, థర్డ్ పార్టీ ఆస్తికి సంబంధించిన ఖర్చులను మీ స్వంత జేబు నుండి చెల్లించాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ ప్లాన్‌ల విషయంలో గడువు తేదీకి ముందుగానే మీ పాలసీని ఆన్‌లైన్ రెన్యూవల్ ఆప్షన్‌తో, రెన్యూ చేయడం అనేది మీకు మరింత సౌకర్యవంతంగా మరియు సులభంగా మారింది.
1.5+ కోట్ల చిరునవ్వులు సురక్షితం చేయబడ్డాయి!@
ఓవర్ నైట్ వెహికల్ రిపేర్స్
అత్యుత్తమమైన పారదర్శకత
మీకు అవసరమైన సపోర్ట్-24x7
కాగితరహితంగా ఉండండి! పరిమితులు లేకుండా ఉండండి!
1.5+ కోట్ల చిరునవ్వులు సురక్షితం చేయబడ్డాయి!@
ఓవర్‌నైట్ కారు మరమ్మత్తు సేవలు***
అత్యుత్తమమైన పారదర్శకత
మీకు అవసరమైన - 24 x 7 మద్దతు!
కాగితరహితంగా ఉండండి! పరిమితులు లేకుండా ఉండండి!
సాధారణంగా, డిప్రిసియేషన్ మొత్తాన్ని తీసివేసిన తర్వాత మాత్రమే మీ పాలసీ మీకు క్లెయిమ్ మొత్తాన్ని చెల్లిస్తుంది. మీ పాలసీ వివరాలలో డిప్రిసియేషన్/తరుగుదల వివరాలు ఉంటాయి. కావున, పూర్తి మొత్తాన్ని పొందడానికి మీరు ఏమి చేయవచ్చు? ఇక్కడ ఒక మార్గం ఉంది! జీరో-డిప్రిసియేషన్ కవర్! జీరో డిప్రిసియేషన్‌తో, ఇక డిప్రిసియేషన్ కోతలు ఉండవు, మీరు పూర్తి మొత్తాన్ని పొందుతారు !
పార్క్ చేసిన వాహనానికి లేదా విండ్‌షీల్డ్ గ్లాస్‌కు ఏదైనా బాహ్య ప్రభావం వలన, వరదలు, మంటలు మొదలైన వాటి వల్ల కలిగే నష్టం కోసం క్లెయిమ్ చేసినట్లయితే, ఈ యాడ్ ఆన్ కవర్ మీరు ఇప్పటివరకు అర్జించిన నో క్లెయిమ్ బోనస్‌ను రక్షించడమే కాకుండా, తదుపరి NCB స్లాబ్‌కు కూడా తీసుకువెళుతుంది .
మీ కారులోని ఏదైనా సాంకేతికత లేదా మెకానికల్ బ్రేక్‌డౌన్ సమస్యలను ఎదుర్కోవడానికి, మేము 24 గంటలూ మీకు సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాము! ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కవర్‌లో సైట్‌లో చిన్న రిపేరింగ్‌లు, లాస్ట్ కీ అసిస్టెన్స్, డూప్లికేట్ కీ సమస్య, టైర్ మార్పులు, బ్యాటరీ జంప్ స్టార్ట్‌లు, ఇంధన ట్యాంక్ ఖాళీ చేయడం, టోయింగ్ ఛార్జీలు ఉంటాయి!
మీ కారు దొంగిలించబడిందని లేదా పూర్తిగా డ్యామేజ్ అయిందని అనే మాట వినబడిన రోజు కన్నా బాధాకరమైన విషయం ఏముంటుంది? మీ పాలసీ ఎల్లప్పుడూ మీ వాహనం యొక్క IDV (ఇన్సూరెన్స్ డిక్లేర్డ్ వాల్యూ)ని మీకు చెల్లిస్తుంది. IDV వాహనం యొక్క ప్రస్తుత మార్కెట్ ధరకు సమానంగా ఉంటుంది. కానీ, ఇన్‌వాయిస్ యాడ్-ఆన్‌కు తిరిగి రావడంతో, మీరు ఇన్‌వాయిస్ విలువ మరియు IDV మధ్య వ్యత్యాసాన్ని కూడా పొందుతారు! మీరు FIR ఫైల్ చేయబడిందని, సంఘటన జరిగిన 90 రోజులలోపు కారును తిరిగి పొందలేదని నిర్ధారించుకోవాలి.
వర్షాలు కురిసినా లేదా వరద అలలు ఎగసిపడినా, మీ వాహనం యొక్క గేర్‌బాక్స్, ఇంజిన్‌లు ప్రత్యేక రక్షణ కవచం ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ కవరేజీతో సురక్షితం చేయబడతాయి! ఇది అన్ని చిన్న భాగాలు లేదా అంతర్గత భాగాల భర్తీ లేదా మరమ్మత్తు కోసం చెల్లిస్తుంది. అంతేకాకుండా, ఇది లేబర్ ఖర్చులు, కంప్రెషన్ టెస్టుల ఖర్చులు, మెషిన్ ఛార్జీలు, ఇంజన్ సిలిండర్ రీ-బోరింగ్‌లను మరింత కవర్ చేస్తుంది.
మీ కీస్ దొంగిలించబడ్డాయా లేదా పోగొట్టుకున్నారా? వీలైనంత త్వరగా మీరు రీప్లేస్‌మెంట్ కీస్ పొందడానికి ఈ యాడ్-ఆన్ మీకు సహాయపడుతుంది!
మీ కారులో ఉపయోగించే అన్ని వినియోగ వస్తువులను కవర్ చేసే వినియోగించదగిన వస్తువుల కవర్ ఇక్కడ ఇవ్వబడింది! అవును! మీకు ప్రస్తుతం ఇది అవసరం! ఇది నట్లు, బోల్ట్‌ల వంటి పునర్వినియోగంచదగని అన్ని వినియోగ వస్తువులకు కూడా చెల్లిస్తుంది ....
మీ కారు రిపేర్‌లో ఉన్నప్పుడు క్యాబ్స్ కోసం చెల్లించారా? డౌన్‌టైమ్ ప్రొటెక్షన్ ఇక్కడ ఉంది! రోజువారీ ప్రయాణం కోసం ఇతర రవాణా మార్గాలను ఉపయోగించడానికి కస్టమర్ చేసిన ఖర్చుకు క్యాష్ అలవెన్స్ ప్రయోజనాన్ని అందిస్తుంది .
అన్ని రకాల వాహనాలు | ఓన్ డ్యామేజ్ ప్రీమియంపై % తగ్గింపు |
---|---|
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి పూర్తి సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు | 20% |
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 2 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు | 25% |
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 3 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు | 35% |
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 4 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు | 45% |
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 5 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు | 50% |
వాహనం యొక్క వయస్సు | IDV నిర్ణయించడానికి % లో డిప్రిసియేషన్ |
---|---|
6 నెలలకు మించనిది | 5% |
6 నెలలకు మించి కానీ 1 సంవత్సరం మించనిది | 15% |
1 సంవత్సరం మించి కానీ 2 సంవత్సరాలు మించనిది | 20% |
2 సంవత్సరాలు మించి కానీ 3 సంవత్సరాలు మించనిది | 30% |
3 సంవత్సరాలు మించి కానీ 4 సంవత్సరాలు మించనిది | 40% |
4 సంవత్సరాలు మించి కానీ 5 సంవత్సరాలు మించనిది | 50% |