భారతీయ వ్యవసాయ పరిశ్రమ మరో హరిత విప్లవం అంచున ఉంది, ఇది దానిని మరింత ఆదాయాన్ని సమకూర్చేదిగా మరియు లాభదాయకంగా చేస్తుంది, ఎందుకంటే వచ్చే పదేళ్లలో భారతదేశంలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తి అది కూడా సేంద్రీయ పద్ధతిలో రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. భారతదేశపు గ్రామీణ ప్రజలకు చెందిన పశువులు మరణించడం వల్ల వారికి కలిగే ఆర్థిక నష్టం నుండి వారికి రక్షణ అందించడం కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్యాటిల్ ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తోంది. గ్రామీణ సమాజానికి ఇదొక అత్యంత విలువైన ఆస్తుల్లో ఒకటిగా ఉంటోంది.
ఆవులను కలిగి ఉన్న వ్యక్తులు, ఎద్దులు లేదా గేదెలు మంచి మరియు చక్కటి ఆరోగ్యంతో ఉన్నట్లు మరియు గాయాలు లేదా వ్యాధులేవీ లేనట్లు పశు వైద్యుడు / సర్జన్ నుండి సర్టిఫికేట్ కలిగి ఉండడంతో పాటు ఆ వ్యక్తులు తాము నివసించే గ్రామం మరియు సామాజిక రంగంలోని మైక్రో ఫైనాన్స్ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, ప్రభుత్వ ప్రాయోజిత సంస్థలు మరియు అలాంటి సంబంధిత బృందాలు / సంస్థల్లో సభ్యులు (బృందాలుగా) ఉంటే, అలాంటి వారికి ఈ పాలసీ కవర్ అందిస్తుంది. పశువులలో ఇన్సూరెన్స్ చేయదగిన ఆసక్తి ఉన్న ఎవరైనా వ్యక్తి ఇన్సూరెన్స్ పొందడానికి అప్లై చేసుకోవడానికి అర్హులు.
పశువుల మరణం అనేది పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న భౌగోళిక ప్రాంతంలో, ప్రాణనష్టం జరిగినప్పుడు లేదా వ్యాధులు సంక్రమించినప్పుడు లేదా శస్త్రచికిత్స చేసినప్పుడు ఇన్సూరెన్స్ చేయబడిన పశువులను కవర్ చేస్తుంది. కరువు, అంటువ్యాధులు మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సదరు ఇన్సూర్ చేయబడిన పశువు అనేది నిర్దేశిత భౌగోళిక ప్రదేశానికి వెలుపల మరణించినప్పటికీ, ఈ పాలసీ కవర్ అందిస్తుంది. ఇతర ప్రకృతి వైపరీత్యాలు అంటే అగ్ని, పిడుగుపాటు, తుఫాను, సైక్లోన్, టైఫూన్, టెంపెస్ట్, హరికేన్, సుడిగాలి, వరదలు మరియు ఉప్పెనలు, కొండచరియలు విరిగిపడటం, రాక్ స్లైడ్ మరియు బుష్ మంటలు. ఇది మా బేస్ ఆఫర్ (కనీస అవసరమైన కవరేజ్).
దురదృష్టవశాత్తు పశువుల మరణం సంభవించిన సందర్భంలో, మేము ఇన్సూర్ చేయబడిన మొత్తాన్ని (పాలసీ వ్యవధిలో అన్ని ఇన్సూర్ చేయబడిన ప్రమాదాల కోసం మొత్తం చెల్లించవలసిన గరిష్ట మొత్తం) లేదా దాని మరణం సమయంలో పశువుల మార్కెట్ విలువ ఏది తక్కువైతే అది చెల్లిస్తాము. ప్రత్యామ్నాయంతో సరిపోల్చండి
ఆప్షనల్ ప్రయోజనాలు
శాశ్వత వైకల్యం ఈ కవర్ అనేది పశువులకు ఏర్పడే శాశ్వత మరియు పూర్తి వైకల్యం ప్రమాదాన్ని కవర్ చేస్తుంది.
పాలసీలో పేర్కొన్న విధంగా, ప్రయోజనాలన్నీ గరిష్ట మొత్తానికి లోబడి ఉంటాయని దయచేసి గమనించండి. ఏదైనా కొటేషన్ విడుదల చేయబడినప్పుడు లేదా ఏదైనా పాలసీ జారీచేయబడినప్పుడు ఇవి స్పష్టంగా పేర్కొనబడి ఉంటాయి.
పాలసీలో భాగంగా "ఇన్సూరెన్స్ చేయబడిన పశువులు" అని పిలువబడే అతని / ఆమె పశువులతో సహా, సభ్యులు / క్లయింట్‌ల పేర్లు షెడ్యూల్‌లో కలిగిన గ్రూప్ పేరు మీద ఒక పాలసీ జారీ చేయబడుతుంది. దూడ వయస్సు (ఆవు / గేదె యొక్క) 90 రోజుల కంటే ఎక్కువ ఉండాలి మరియు పాలిచ్చే పశువులు (ఆవు / గేదె) 4వ సారి వరకు పాలిచ్చేవిగా ఉండాలి.
పాలసీ ఈ క్రింది వాటిని కవర్ చేయదు:
హానికరమైన లేదా విభిన్నమైన తప్పిదం లేదా నిర్లక్ష్యం, అధిక లోడింగ్, నైపుణ్య రహిత పనితీరు.
కంపెనీ నుండి రాతపూర్వక సమ్మతి లేకుండా, ప్రతిపాదన ఫారమ్‌లో పేర్కొన్న ప్రయోజనం కోసం కాకుండా పశువును ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించడం.
ఉద్దేశపూర్వక చర్యలు లేదా పూర్తి స్థాయి నిర్లక్ష్యం
పశువు మరణాన్ని నివారించడంలో వైఫల్యం
రిస్క్ ప్రారంభానికి ముందే జరిగిన ప్రమాదాలు లేదా సోకిన వ్యాధులు. పాలసీ వ్యవధి ప్రారంభం నుండి 15 రోజుల్లోపు వ్యాధి సోకడం.
వాాయు లేదా సముద్ర మార్గం ద్వారా రవాణా.
ఉద్దేశపూర్వకంగా చంపడం. ఒక పశువైద్యుడు లేదా నిర్ణీత ప్రభుత్వ అధికారి సూచన లేకుండా వధించడం.
దొంగతనం లేదా రహస్యంగా అమ్మేయడం.
ఇన్సూర్ చేయబడిన పశువు తప్పిపోయినప్పుడు
తీవ్రవాదం, యుద్ధం, రేడియోయాక్టివిటీ మరియు అణు ప్రమాదాలు
పర్యవసాన నష్టం
మినహాయింపులకు సంబంధించిన ఉదాహరణగా చెప్పబడిన జాబితా ఇది ఇది. ఉదాహరణగా చెప్పబడిన జాబితా కోసం, దయచేసి పాలసీ వివరాలు చూడండి.
ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడానికి అవసరమైన డాక్యుమెంట్‌లు:
సరైన విధంగా నింపబడిన మరియు సంతకం చేయబడిన ప్రతిపాదన ఫారమ్
సూచించిన నిర్దేశిత ఫారమ్‌లో జంతువు ఆరోగ్య స్థితి మరియు మార్కెట్ విలువను నిర్ధారిస్తూ పశు వైద్య నిపుణుడు ఇచ్చిన సర్టిఫికేట్
పశువును కొనుగోలు చేసినప్పుడు చెల్లించిన నగదు రసీదు
పశువు ఫోటో
కంపెనీకి సమర్పించిన సంబంధిత డాక్యుమెంట్‌ల ఆధారంగా క్లెయిమ్‌లు అంచనా వేయబడతాయి మరియు చెల్లించబడతాయి. క్రింది డాక్యుమెంట్‌లు సమర్పించడం మీద ఆధారపడి చెల్లింపు కోసం పాలసీ పరిగణలోకి తీసుకోబడుతుంది.
సరిగ్గా పూర్తి చేయబడిన క్లెయిమ్ ఫారమ్.
అర్హత కలిగిన వెటర్నరీ సర్జన్ నుండి మరణ దృవీకరణ పత్రం.
పాలసీ / సర్టిఫికెట్.
చెవికి కట్టిన ట్యాగ్.
ఒక పూర్తి స్థాయి ఆన్‌లైన్ పశువుల ట్యాగింగ్, మరియు క్లెయిమ్స్ మాడ్యూల్. పశువుల ఇన్సూరెన్స్ మార్కెట్‌లో ఇదే మొదటిదైన ఇంటిగ్రేటెడ్ మొబైల్ యాప్ ద్వారా క్లెయిమ్‌లకు పాలసీ నమోదులో పూర్తి కాగితరహిత వాతావరణం.
ఈ సమాచారం వివరణ కోసం మాత్రమే. వాస్తవ కవరేజ్ అనేది జారీ చేసిన పాలసీల్లోని భాషకు లోబడి ఉంటుంది.
పశువుల ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన ప్రశ్నల కోసం, దయచేసి మా టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి 022 6234 6256
1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్ 24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
1 కోటి+ చిరునవ్వులు సురక్షితం
మీకు అవసరమైన సపోర్ట్-24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards