థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ఇన్సూర్ చేయబడిన వ్యక్తి వాహనం ద్వారా ప్రమాదం కారణంగా తలెత్తే థర్డ్ పార్టీ బాధ్యతలకు కవరేజ్ అందిస్తుంది. టూ వీలర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీదారు వాహనం ద్వారా ప్రమాదం జరిగిన సందర్భంలో థర్డ్ పార్టీ ఆస్తి/వ్యక్తికి జరిగిన నష్టాలను కవర్ చేస్తుంది. ఇందులో థర్డ్ పార్టీ వ్యక్తి శాశ్వత వైకల్యం లేదా మరణం కూడా ఉంటుంది. 1988 మోటార్ వాహనాల చట్టం ప్రకారం, టూ వీలర్ యజమాని థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. థర్డ్ పార్టీ కవర్ లేకుండా భారతదేశంలో బైక్ లేదా స్కూటర్‌ను నడపడం చట్టవిరుద్ధం మరియు ట్రాఫిక్ పోలీసులు అది లేకుండా మీ వాహనాన్ని నడపడానికి ₹2000 వరకు జరిమానా విధించవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్ నుండి థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం సులభంగా మరియు సరళంగా ఉంటుంది, నేడే మీ రైడ్‌ను సురక్షితం చేసుకోండి.
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి ముందు, దాని ఫీచర్లలో కొన్నింటి గురించి మీరు తెలుసుకోవాలి
ఫీచర్లు | వివరణ |
తక్కువ ప్రీమియం | థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం ₹538 వద్ద ప్రారంభమవుతుంది మరియు సమగ్ర ఇన్సూరెన్స్‌తో పోలిస్తే ఇది చాలా సరసమైనది. |
లయబిలిటీ కవర్ అందిస్తుంది | థర్డ్ పార్టీ ఆస్తి/వ్యక్తికి జరిగిన నష్టం కారణంగా ఉత్పన్నమయ్యే ఆర్థిక మరియు చట్టపరమైన బాధ్యతల నుండి 3వ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. దీనిలో మీ ఇన్సూర్ చేయబడిన టూ-వీలర్ కారణంగా థర్డ్ పార్టీకి జరిగిన గాయం లేదా వారి మరణం ఉంటుంది. |
కొనుగోలు చేయడం సులభం | థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా ఆన్‌లైన్‌లో సులభంగా కొనుగోలు చేయవచ్చు. |
చట్టపరమైన అవసరాన్ని నెరవేర్చండి | థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం ద్వారా మీరు 1988 మోటారు వాహనాల చట్టం ప్రకారం తప్పనిసరి ఆవశ్యకతను నెరవేరుస్తున్నారు. |
ప్రయోజనాలు | వివరణ |
చట్టపరమైన సమస్యలను నివారించండి | 1988 మోటారు వాహనాల చట్టం ప్రకారం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. మీరు చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ లేకుండా టూ-వీలర్‌ను రైడ్ చేస్తున్నట్లయితే, అప్పుడు మీకు జరిమానా విధించబడుతుంది. |
థర్డ్ పార్టీ లయబిలిటీల కోసం కవరేజ్ | ఇన్సూర్ చేయబడిన బైక్ కారణంగా థర్డ్-పార్టీ గాయపడినా లేదా దురదృష్టవశాత్తు మరణించినా, ఈ పాలసీ క్రింద ఆర్థిక పరిహారం కవర్ చేయబడుతుంది. |
సరసమైన పాలసీ | థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ సమగ్ర మరియు స్టాండ్అలోన్ ఓన్-డ్యామేజ్ పాలసీ కంటే ఎక్కువ సరసమైనది. క్యూబిక్ సామర్థ్యం ఆధారంగా IRDAI తన ప్రీమియంను నిర్ణయిస్తుంది. |
థర్డ్-పార్టీ వాహనానికి కవరేజ్ | ఇన్సూర్ చేయబడిన బైక్ థర్డ్ పార్టీకి నష్టం కలిగించినట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ కవరేజ్ అందిస్తుంది. |
కాగితరహిత ప్రక్రియ | మీరు థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినా లేదా ప్లాన్‌ను రెన్యూ చేసినా, ఎటువంటి పేపర్‌వర్క్ అవసరం లేదు. మీరు అన్ని సంబంధిత డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. |
మా థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీతో మేము ఏవైనా వైద్య అత్యవసర పరిస్థితుల నుండి మిమ్మల్ని రక్షించడానికి రూ.15 లక్షల విలువైన తప్పనిసరి పర్సనల్ యాక్సిడెంట్ (సిపిఎ) పాలసీని అందిస్తాము.
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్‌లో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి వాహనంతో సహా, థర్డ్ పార్టీ ఆస్తికి జరిగిన నష్టానికి ఇన్సూరర్ ఖర్చులను చెల్లిస్తారు.
ఇన్సూర్ చేయబడిన వ్యక్తి వాహనం కారణంగా థర్డ్ పార్టీ వ్యక్తికి గాయం లేదా మరణం జరిగినట్లయితే, ఇన్సూరర్ వైద్య చికిత్స లేదా ఇతర నష్టాలకు కవరేజీని అందిస్తారు.
చట్ట ప్రకారం ప్రతి బైక్/స్కూటర్ యజమాని టూ వీలర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం తప్పనిసరి అవసరం. 3వ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలను అధ్యయనం చేసిన తర్వాత, మీరు ఒక సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవచ్చు. దానిని గురించి ఈ కింది పట్టికలో వివరంగా పరిశీలిద్దాం
ప్రయోజనాలు | ప్రతికూలతలు |
బైక్ కోసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది, థర్డ్ పార్టీకి జరిగిన గాయం లేదా మరణంతో సహా, థర్డ్ పార్టీ వ్యక్తికి జరిగిన నష్టాల కోసం ఇన్సూర్ చేసిన వారికి కవరేజీని అందిస్తుంది. ఉదాహరణకు, మిస్టర్ A తన టూ వీలర్‌ను నడుపుతున్నప్పుడు ప్రమాదవశాత్తు మిస్టర్ B గాయపడ్డాడు, అయితే, మిస్టర్ B చికిత్స ఖర్చు కోసం ఇన్సూరర్ చెల్లించాల్సి ఉంటుంది. | థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి లేదా వారి వాహనానికి జరిగిన నష్టాలను కవర్ చేయదు. ఉదాహరణకు, మిస్టర్ A ఈ పాలసీని కలిగి ఉన్నారు మరియు అతని స్కూటర్ ప్రమాదానికి గురై డ్యామేజ్ అయింది, ఇలాంటి సందర్భంలో రిపేరింగ్ ఖర్చును మిస్టర్ A భరించాల్సి ఉంటుంది.. |
థర్డ్ పార్టీ లయబిలిటీల కోసం కవరేజ్ | ఈ పాలసీతో, పాలసీహోల్డర్ బైక్ దొంగిలించబడినప్పుడు ఇన్సూరెన్స్ సంస్థ పరిహారం చెల్లించదు. |
సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ పాలసీతో పోలిస్తే థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం సరసమైనది. | టూ వీలర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఖర్చు తక్కువగా ఉంటుంది, అయితే, మీరు పరిమిత కవరేజీని పొందుతారు. |
ఈ పాలసీని కొనుగోలు చేయడం సులభం మరియు ప్రీమియం రేటును ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) నిర్ణయిస్తుంది. | థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్‌తో రైడర్లు ఏవీ అందుబాటులో లేవు. అలాగే, మీరు ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువని (IDV) కస్టమైజ్ చేయలేరు. |
థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ మీకు పాలసీదారునికి అత్యంత మౌలిక రకమైన కవరేజ్‌ని అందిస్తుంది. ఇది వాహనానికి, ఆస్తికి లేదా వ్యక్తికి జరిగిన డ్యామేజీ/నష్టాల నుండి మిమ్మల్ని కవర్ చేస్తుంది. టూ వీలర్ యజమానులందరికీ థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ తప్పనిసరి కూడా, ఇది కలిగి ఉండకపోతే ₹ 2000 జరిమానా మరియు/3 నెలల వరకు జైలు శిక్ష విధించబడవచ్చు.
పారామీటర్లు | సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ | థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ |
కవరేజ్ | ఒక కాంప్రిహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ స్వంత నష్టం మరియు థర్డ్ పార్టీ బాధ్యతలకు కవరేజ్ అందిస్తుంది. | థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ థర్డ్ పార్టీ లయబిలిటీలకు మాత్రమే కవరేజ్ అందిస్తుంది. ఇందులో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి వాహనం వలన థర్డ్ పార్టీకి కలిగే గాయం, మరణం మరియు ఆస్తి నష్టం ఉంటాయి. |
ఆవశ్యకత యొక్క స్వభావం | ఇది తప్పనిసరి కాదు, అయితే మీకు మరియు మీ వాహనం కోసం మొత్తం రక్షణ పొందవలసిందిగా సిఫార్సు చేయబడింది. | మోటారు వాహనాల చట్టం ప్రకారం కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్‌ను కలిగి ఉండటం తప్పనిసరి |
యాడ్-ఆన్స్ లభ్యత | హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందిస్తున్న కాంప్రెహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్‌తో మీరు జీరో డిప్రిసియేషన్ కవర్ మరియు ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కవర్ పొందవచ్చు. | థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్‌తో యాడ్-ఆన్ కవర్‌లను ఎంచుకోలేరు. |
ధర | ఇది విస్తృతమైన కవరేజీని అందిస్తుంది కాబట్టి ఇది ఖరీదైనది. | థర్డ్ పార్టీ బాధ్యతలకు మాత్రమే కవరేజ్ అందిస్తుంది కాబట్టి దీని ధర తక్కువగా ఉంటుంది. |
బైక్ విలువ కస్టమైజేషన్ | మీ ఇన్సూరెన్స్ అవసరాలకు అనుగుణంగా మీరు సమగ్ర టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని కస్టమైజ్ చేయవచ్చు. | థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కస్టమైజ్ చేయలేరు. ఇది IRDAI మరియు మీ బైక్ యొక్క ఇంజిన్ క్యూబిక్ సామర్థ్యం ద్వారా ప్రకటించబడిన వార్షిక బైక్ ఇన్సూరెన్స్ రేట్ల ఆధారంగా నిర్ణయించబడే ఒక ప్రామాణిక పాలసీ. |
థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ కింద పరిహారం యజమాని-డ్రైవర్‌కు అందించబడుతుంది. అయితే, యజమాని-డ్రైవర్‌కు ఇన్సూర్ చేయబడిన బైక్ యొక్క చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి. క్రింది పట్టికలో, పాలసీదారునికి థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ కవర్ కింద అందించబడే పరిహార శాతాన్ని మీరు చూడవచ్చు:
గాయం స్వభావం | పరిహారం స్కేల్ |
మరణం సంభవించిన సందర్భంలో | 100% |
రెండు అవయవాలు కోల్పోయినా లేదా రెండు కళ్ళు చూపు పోయిన సందర్భంలో | 100% |
ఒక అవయవం మరియు ఒక కంటిచూపు కోల్పోయిన సందర్భంలో | 50% |
గాయాల నుండి శాశ్వత పూర్తి వైకల్యం సందర్భంలో | 100% |
సుప్రీం కోర్టు ఆర్డర్ ప్రకారం, అన్ని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కొత్త బైకుల కోసం దీర్ఘకాలిక థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీని అందించాలి. టూ వీలర్ల కోసం తప్పనిసరి ఐదు సంవత్సరాల పాలసీని అందించడానికి IRDAI ఇన్సూరెన్స్ కంపెనీలను నిర్దేశించింది. అందువల్ల, ప్రతి కొత్త బైక్ యజమాని వారి వాహనంలో ఐదు సంవత్సరాల థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందని నిర్ధారించుకోవాలి. ఈ కొత్త పాలసీని ప్రవేశపెట్టడంతో, ప్రతి సంవత్సరం పాలసీని రెన్యూ చేయడంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ పాలసీతో, పాలసీదారు ఐదు సంవత్సరాలపాటు సెట్ చేయబడినందున ప్రీమియంలో వార్షిక పెరుగుదలను కూడా నివారించవచ్చు.
1 జూన్, 2022 నుండి దీర్ఘకాలిక థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీకి క్రింది రేట్లు వర్తిస్తాయి
ఇంజిన్ సామర్థ్యం (cc) | 5 సంవత్సరాలపాటు థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ రేట్లు |
75cc వరకు | ₹ 2901 |
75 నుండి 150 cc మధ్య | ₹ 3851 |
150 నుండి 350 cc మధ్య | ₹ 7365 |
350 సిసి పైన | ₹ 15117 |
టూ-వీలర్ ఇంజిన్ సామర్థ్యం ఆధారంగా థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను IRDAI నిర్ణయిస్తుంది. అందువల్ల, టూ-వీలర్ ఇంజిన్ క్యూబిక్ కెపాసిటీ (cc) అనేది థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేసే ఏకైక అంశం.
ఆన్‌లైన్‌లో థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తున్నప్పుడు, దాని ప్రీమియం ఎలా లెక్కించబడుతుందో తెలుసుకోవడం అవసరం. మీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించడానికి దశలవారీ మార్గదర్శకాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి
• దశ 1 – హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు మీ బైక్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి మరియు ఒక కోట్ పొందండి పై క్లిక్ చేయడం ద్వారా కొనసాగండి.
• దశ 2- మీరు మీ బైక్ మేక్ మరియు మోడల్‌ను ఎంటర్ చేయాలి.
• దశ 3 – మీరు థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవాలి.
• దశ 4 – మీ చివరి బైక్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి వివరాలు ఇవ్వండి- గడువు తేదీ. మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ IDని ఎంటర్ చేయండి.
• దశ 5 - ఇప్పుడు మీరు మీ థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ధరను చూడవచ్చు.
మోటారు వాహనాల చట్టం ప్రకారం థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి మాత్రమే కాకుండా, మీరు ఈ కవర్‌ను ఎందుకు కలిగి ఉండాలి అనేదానికి ఇతర కారణాలు ఉన్నాయి:
✔ చట్టం ప్రకారం తప్పనిసరి: థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ అనేది భారతదేశంలోని బైక్ యజమానులందరూ కలిగి ఉండవలసిన ఒక అవసరమైన మరియు తప్పనిసరి కవర్. మీ వద్ద థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ లేనట్లు ట్రాఫిక్ పోలీస్ ద్వారా కనుగొనబడితే, మీ పై ₹ 2000/- వరకు జరిమానా విధించబడవచ్చు.
✔ 3వ పార్టీ వాహనానికి జరిగిన ఏదైనా నష్టాన్ని కవర్ చేస్తుంది: ఇన్సూర్ చేయబడిన బైక్ ప్రమాదం కారణంగా థర్డ్ పార్టీ వాహనానికి లేదా వారి ఆస్తికి నష్టం జరిగిన సందర్భంలో, మీ థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ కవరేజ్ మీరు నష్టాల యొక్క ఖర్చు గురించి ఆందోళన చెందకుండా పరిహారం చెల్లిస్తుంది.
✔ 3వ పార్టీ వాహన యజమాని-డ్రైవర్ కోసం ఏదైనా గాయం లేదా మరణం కొరకు కవరేజ్: ఇన్సూర్ చేయబడిన బైక్ వలన కలిగిన ప్రమాదం కారణంగా ఒక థర్డ్ పార్టీ వాహనం యొక్క యజమాని గాయపడితే, అటువంటి వ్యకిగత నష్టం వలన ఏర్పడే ఆర్థిక నష్టాలను థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ భరిస్తుంది. ఇంకా, ఆ ప్రమాదం కారణంగా థర్డ్ పార్టీ వ్యక్తి మరణించినట్లయితే, చట్టపరమైన మరియు ఆర్థిక పర్యవసానాల నుండి థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ పొందిన వారికి రక్షణ అందిస్తుంది.
✔ వేగవంతమైన మరియు సులభమైన కొనుగోలు: విసుగు పుట్టించే ఇన్సూరెన్స్ కొనుగోలు విధానాలు పూరాతనమైనవి. ఇప్పుడు, మా వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కొన్ని క్లిక్‌లలో మీకు ఇష్టమైన థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్‌ను అతి తక్కువ డాక్యుమెంటేషన్ సమర్పించడం ద్వారా పొందండి
✔ ఖర్చుకి తగిన ప్రతిఫలం అందించే ఇన్సూరెన్స్ పాలసీ: అన్ని థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు IRDAI ద్వారా ముందే నిర్వచించబడతాయి కాబట్టి; ఇది ఈ పాలసీని అందరికీ అందుబాటు ధర వద్ద లభిస్తుంది. అందువల్ల, ఒక నామమాత్రపు విలువ వద్ద రోడ్డు మలుపులో పొంచి ఉన్న ఊహించని థర్డ్ పార్టీ ఖర్చుల కోసం మీరు కవరేజీని ఆశించవచ్చు.
ఇది కూడా చదవండి: థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ యొక్క ప్రయోజనాలు
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ప్రత్యేకంగా నిలిపే కీలక అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
• త్వరిత, కాగితరహిత ఇన్సూరెన్స్ కొనుగోలు విధానం
• ప్రీమియం ₹538 నుండి ప్రారంభం*
• ఎమర్జెన్సీ డోర్‌స్టెప్ లేదా రోడ్‌సైడ్ అసిస్టెన్స్ యాడ్-ఆన్ కవర్ ఆప్షన్
• ఒక విస్తృతమైన నెట్‌వర్క్ 2000+ నగదురహిత గ్యారేజీలు
• అపరిమిత క్లెయిములు చేయవచ్చు
• 100% క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి^
• తనిఖీ లేకుండా రెన్యూవల్ చేసుకునే ఎంపిక
ఆన్‌లైన్‌లో థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడానికి కింది దశలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి.
సెక్యూర్డ్ పేమెంట్ గేట్‌వే ద్వారా ప్రీమియంను చెల్లించండి. టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ అడ్రస్‌కు లేదా వాట్సాప్‌కు పంపబడుతుంది.
మీరు థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేయాలనుకుంటే, మీరు ఈ క్రింది దశలను అనుసరించాలి:
దశ 1: ఇన్సూరర్ వెబ్‌సైట్‌ను సందర్శించండి, వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి మరియు పాలసీని రెన్యూ చేసుకోండి.
దశ 2: మీరు రెన్యూ చేయాలనుకుంటున్న మీ పాలసీకి సంబంధించిన వివరాలను నమోదు చేయండి. థర్డ్ పార్టీ కవర్ ప్లాన్‌ను ఎంచుకోండి.
దశ 3: రెన్యూ చేయబడిన బైక్ ఇన్సూరెన్స్ పాలసీ మీ రిజిస్టర్డ్ ఇమెయిల్-ఐడికి మెయిల్ చేయబడుతుంది.
భారతీయ రోడ్లపై బైక్‌ను రైడ్ చేసేటప్పుడు అధిక ప్రమాదాల సంభావ్యత రేటు కారణంగా చాలా రిస్కులు ఉంటాయి. నష్టాలకు పరిహారం చెల్లించడానికి టూ-వీలర్ యజమానులందరికీ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం మరియు ఒక ఆదర్శవంతమైన ప్లాన్ ఏదైనా వాహన నష్టాలకు కవరేజ్ అందించాలి. మీకు ప్రాథమిక థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే, మీరు థర్డ్ పార్టీ లయబిలిటీలకు మాత్రమే కవరేజ్ పొందుతారు, అయితే సమగ్ర ఇన్సూరెన్స్ స్వంత నష్టం మరియు థర్డ్ పార్టీ లయబిలిటీలకు కవరేజ్ అందిస్తుంది. మీ బైక్ కోసం మీకు ప్రాథమిక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే ఉంటే, సమగ్ర ఇన్సూరెన్స్‌కు మారడానికి దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
• ఇన్సూరర్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
• టూ-వీలర్ ఇన్సూరెన్స్ కొనండి పై క్లిక్ చేయండి.
• మీ ప్రస్తుత థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన వివరాలను కలిగి ఉన్న అన్ని అవసరమైన ఫారంలను సబ్మిట్ చేయండి
• మీరు మీ టూ-వీలర్ కోసం స్వీయ తనిఖీ ఎంపికను ఎంచుకోవచ్చు.
• సర్వేయర్ ఇచ్చిన నివేదికల ఆధారంగా, పాలసీ ప్లాన్ అప్‌గ్రేడ్ చేయబడుతుంది
• మునుపటి థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ప్లాన్ రద్దు చేయబడుతుంది మరియు కొత్త పాలసీ ప్రారంభించబడుతుంది
✔ చెల్లుబాటు అయ్యే సాక్ష్యం ఇన్సూర్ చేయబడిన బైక్ వలన వారికి, వారి కారు లేదా వారి ఆస్తికి జరిగిన హాని గురించి, క్లెయిమ్ చేయడానికి ముందు, థర్డ్ పార్టీ వద్ద తగిన, ఖచ్చితమైన మరియు విశ్వసనీయమైన సాక్ష్యం ఉండాలి.
✔ ఇన్సూరెన్స్ కంపెనీ మరియు పోలీసులకు రిపోర్ట్ చేయడం: కవరేజ్ ఉన్న మీ బైక్ వలన ప్రమాదం జరిగినట్లయితే, వెంటనే మీ ఇన్సూరెన్స్ కంపెనీ మరియు పోలీసులకు తప్పకుండా తెలియజేయండి, తద్వారా థర్డ్ పార్టీలకు ఏదైనా హాని కలిగి ఉంటే మీరు ఈ క్రింది దశలను సులభంగా అనుసరించవచ్చు.
✔ నష్టాల కోసం పరిమితి డ్యామేజీల కోసం అందించగల గరిష్ట మొత్తాన్ని పేర్కొంటూ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఒక ఆర్డర్ జారీ చేస్తుంది. పరిహార మొత్తం IRDAI మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటుంది. ప్రస్తుతం, థర్డ్ పార్టీ ఆస్తికి జరిగిన నష్టం కోసం చెల్లించగలిగిన గరిష్ట మొత్తం ₹7.5 లక్షలు. అయితే, థర్డ్ పార్టీలకు గాయం అయిన సందర్భంలో, పరిహార మొత్తం పై ఎటువంటి పరిమితి లేదు.
• థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ కాపీ
• ధృవీకరణ కోసం బైక్ RC కాపీ మరియు ఒరిజినల్ పన్ను రసీదు.
• థర్డ్ పార్టీ మరణం, నష్టం మరియు శారీరక గాయాలు జరిగిన సందర్భంలో పోలీస్ FIR రిపోర్ట్.
• మీ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కాపీ.
• నష్టానికి సంబంధించి రిపేర్ అంచనా.
• చెల్లింపు రసీదులు మరియు రిపేర్ బిల్లులు.
బైక్ ఇంజిన్ సామర్థ్యం | ప్రీమియం |
75CC కంటే తక్కువ | ₹ 482 |
75CC కంటే ఎక్కువ, కానీ 150CC కంటే తక్కువ | ₹ 752 |
150CC కంటే ఎక్కువ, కానీ 350CC కంటే తక్కువ | ₹ 1,193 |
350CC కన్నా ఎక్కువ | ₹ 2,323 |