నిస్సందేహంగా మీ ఇల్లు మీకొక పవిత్ర స్థలము, అక్కడ మీరు సురక్షితంగా మరియు ప్రశాంతంగా ఉండాలని భావిస్తుంటారు, ఇంటి నిర్మాణం, అందులోని సామగ్రి మరియు ఇంటి అలంకరణ కోసం మీరు భారీ మొత్తంలో డబ్బు వెచ్చించి ఉంటారు. అందుకే, అలాంటి ప్రతిష్టాత్మకమైన తమ ఇంటిని హోమ్ ఇన్సూరెన్స్ పాలసీతో సురక్షితం చేసుకోవడాన్ని చాలామంది ఎంచుకుంటారు. మీ హోమ్ ఇన్సూరెన్స్‌ను మరింత సమగ్రమైనదిగా చేయడానికి,. సంవత్సరంలోని ఎక్కువ భాగం వాతావరణం పూర్తి వేడి మరియు తేమతో నిండిన ఈ దేశంలో, ఎయిర్ కండిషనర్‌లు ప్రాథమిక అవసరంగా పరిగణించబడుతున్నాయి. జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా చేసుకోవడం కోసం ఒకటి కంటే ఎక్కువ ACలు ఉన్న ప్రతి ఇంట్లో, ప్రతి AC కొనుగోలు సందర్భంలో ఖర్చు పెరుగుతూనే ఉంటుంది.
ACల అధిక ధరలతో పాటు వాటి విలక్షణతలు మెరుగుపరిచే నిరంతర సాంకేతిక ఆవిష్కరణలను పరిగణనలోకి తీసుకుంటే, అధిక ధరలు కలిగిన ఈ ఉపయోగకర గృహోపకరణాలను దొంగతనం మరియు ప్రమాదాల నుండి రక్షించాల్సిన అవసరం ఉంది. మీరు మీ హోమ్ ఇన్సూరెన్స్ కింద మీ ఎయిర్ కండీషనర్‌లను ఇన్సూర్ చేయవచ్చు మరియు టెన్షన్ లేని జీవితాన్ని ఆస్వాదించవచ్చు
ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ ఎయిర్ కండీషనర్లు ఉండడంతో పాటు, అవి అనేక బిల్ట్-ఇన్ ఫీచర్‌లతో ఉంటున్నాయి. అందుకే, వాటి కొనుగోలు మాత్రమే కాకుండా, వాటి నిర్వహణ కూడా ఖరీదైనదిగా ఉంటుంది. ఎయిర్ కండిషనర్‌ను కూడా కవర్ చేసే ఒక సమగ్ర హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది కింది ప్రయోజనాలు కలిగి ఉంటుంది
మీ ఎయిర్ కండిషనర్ కోసం ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం అనేది ప్రీమియం ఖర్చుతో పాటు పాలసీతో వచ్చే కవరేజీని ప్రభావితం చేసే అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ అంశాలను ఇక్కడ చూడండి:
అగ్నిప్రమాదం, పిడుగుపాటు, నీటి ట్యాంకులు పగిలిపోవడం లేదా నీరు పొంగిపొర్లడం, ప్రకృతి వైపరీత్యాల వంటి ఊహించని లేదా ఆకస్మిక పరిస్థితుల కారణంగా జరిగే నష్టాలు.
దొంగతనం, లూటీ, దోపిడీ, ఇంట్లో దొంగలు పడడం, అల్లర్లు మరియు సమ్మెలు వంటి సంఘ-వ్యతిరేక కార్యకలాపాలు మొదలైన వాటి కారణంగా సంభవించే ఆర్థిక నష్టం.
ఏదైనా బాహ్య ప్రమాదం కారణంగా లేదా ఎయిర్ కండిషనర్ రవాణా సమయంలో జరిగే నష్టాలు ఎయిర్ కండిషనర్ ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడతాయి.
ఏదైనా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ సమస్యల కారణంగా ఏర్పడే బ్రేక్‌డౌన్‌లు. మరమ్మత్తు మరియు రీప్లేస్‌మెంట్ ఖర్చు తిరిగి చెల్లించబడుతుంది.
వస్తువును ఇన్సూర్ చేశామనే ధైర్యంతో యజమానులు నిర్లక్ష్యంగా ఉండడం వల్ల జరిగిన నష్టాలు. తప్పుగా నిర్వహించడం లేదా దుర్వినియోగం చేయడం లాంటి యజమానుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన నష్టాలు కవర్ చేయబడవు
యజమానుల ద్వారా ఉద్దేశపూర్వకంగా జరిగిన నష్టాలు పాలసీ క్రింద కవర్ చేయబడవు. భాగాలను క్రింద పడేయడం వల్ల ప్రమాదవశాత్తు అవి విరిగిపోయినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు వాటికి కవర్ లభించదు
పాలసీ తీసుకునే సమయంలో, ఉత్పత్తి గురించి ఇన్సూర్ చేయబడిన వ్యక్తి పారదర్శక విధానంలో సరైన సమాచారం అందించడం అవసరం. ఏదైనా ముఖ్యమైన సమాచారం అందించకపోవడం లేదా దానిని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడం జరిగితే, అది ఇన్సూరెన్స్ కింద కవర్ చేయబడదు
తయారీదారు లోపం కారణంగా చోటుచేసుకునే తయారీ లేదా ఇతర లోపాలు కవర్ చేయబడవు. ఇలాంటి సందర్భంలో, తయారీదారు మీద ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ఒక క్లెయిమ్ ఫైల్ చేయాలి
ఎయిర్ కండీషనర్ కొనుగోలు చేసిన మొదటి సంవత్సరంలోపు పాలసీ తీసుకోవాలి కాబట్టి, కొనుగోలు తేదీ నుండి 365 రోజుల కంటే ఎక్కువ పాతబడిన ఎయిర్ కండీషనర్‌ల కోసం ఇన్సూరెన్స్ చెల్లదు.
సాధారణ అరుగుదల మరియు తరుగుదల లేదా కొత్తవి జోడించిన కారణంగా ఉత్పన్నమయ్యే నష్టాలు ఇన్సూరెన్స్ క్రింద కవర్ చేయబడవు
1.6+ కోట్ల చిరునవ్వులు సురక్షితం చేయబడ్డాయి!@
మీకు అవసరమైన సపోర్ట్ 24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
#1.6+ కోట్ల చిరునవ్వులు సెక్యూర్ చేయబడ్డాయి
మీకు అవసరమైన సపోర్ట్-24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
అవాంతరాలు లేని మరియు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్