మహారాష్ట్రలోని మచలా చోప్డా గావ్ జల్‌గావ్‌లోని పాఠశాల
మా CSR కార్యాచరణలో "గావ్ మేరా" అనే మా ప్రతిష్టాత్మక కార్యక్రమం కీలకంగా ఉంటోంది. ఎంపిక చేసిన గ్రామాల్లో విద్య మరియు పారిశుద్ధ్యానికి సంబంధించి ప్రస్తుత స్థితిని మెరుగుపరచడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉంటోంది.
విద్య మరియు గ్రామీణాభివృద్ధి
పిల్లల విషయంలో బడి అనేది ఇల్లు తర్వాత ఇల్లు లాంటిది అని చెబుతారు. అయితే, ప్రభుత్వం-నడిపే అనేక పాఠశాలలు నీరు, విద్యుత్ లేదా పరిశుభ్రత లాంటి విషయాలకు దూరంగా ఉంటూ, కలుషిత వాతావరణంలో మరియు శిధిలమైన స్థితిలో ఉంటున్నాయి. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్లు, గ్రంధాలయాలు లాంటి కనీస సౌకర్యాలకు కూడా నోచుకోవడం లేదు. మెజారిటీ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌ల ప్రసక్తే లేదు.
ఈ అంతరాయం పూరించడం కోసమే, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి "గావ్ మేరా" కార్యక్రమం స్థిరమైన విద్యా మౌలిక సదుపాయాల అవసరాలు పరిష్కరించడాన్ని లక్ష్యంగా ఎంచుకుంది. విద్యకు సంబంధించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని (SDG) సాకారం చేసే దిశగా, గ్రామీణ భారతదేశంలోని ప్రభుత్వ పాఠశాలలను పునర్నిర్మించడం ద్వారా వాటిలో భౌతిక మౌలిక సదుపాయాలు పునరుద్ధరించడానికి కంపెనీ పెట్టుబడి పెట్టింది. ఈ క్రమంలో, కొత్తగా నిర్మించబడిన పాఠశాలలు బోధనోపకరణాలు (బాల మార్గదర్శకాలు) సహితంగా నిర్మించడం ద్వారా, సరైన రీతిలో నిర్మించబడతాయి. అభ్యాసన కోసం శిశు-స్నేహిత మరియు వినోద-ఆధారిత భౌతిక పర్యావరణం అభివృద్ధి చేయడం ద్వారా విద్యలో నాణ్యమైన మెరుగుదలను అందించడానికి ఉద్దేశించిన ఒక వినూత్న భావన ఇది. ఇందులో భాగంగా కొత్తగా నిర్మించిన తరగతి గదుల్లో ప్రకాశవంతమైన లైటింగ్ మరియు వెంటిలేషన్ ఉండేలా మేము నిర్ధారిస్తాము. అలాగే, కొత్తగా నిర్మించబడిన పాఠశాలల్లో బెంచీలు, డెస్కులు, గ్రీన్ బోర్డులు, వంటగది, భోంచేసే సౌకర్యాలు, లైబ్రరీలు మరియు కంప్యూటర్ గదులు లాంటి సదుపాయాలన్నీ ఉంటాయి.
కాస్మిక్ డివైన్ సొసైటీతో కలసి మా ఉద్యోగులు స్వచ్ఛందంగా ముంబైలోని పేద పిల్లలకు పోషకాలతో నిండిన భోజనం అందించారు.
చెన్నై, ఢిల్లీ, నోయిడా, ఘాజియాబాద్, బెంగళూరు మరియు చండీగఢ్‌లో నిర్వహించబడిన కంటి ఆరోగ్య శిబిరాల్లో స్వచ్ఛందంగా పనిచేస్తున్న ఉద్యోగులు. ఈ శిబిరాల్లో భాగంగా, గ్రామీణ ప్రజలకు కేటరాక్ట్, గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతి, రెటినల్ రుగ్మతలు మరియు ఇతర కంటి వ్యాధుల గురించి అవగాహన కల్పించాము.
పూణేలోని గరడే గ్రామంలో వాటర్‌షెడ్‌ల నిర్మాణం కోసం హెచ్‌టి పరేఖ్ ఫౌండేషన్‌తో పాటు పానీ ఫౌండేషన్‌తో కలసి స్వచ్ఛందంగా శ్రమదానం చేస్తున్న హెచ్‌డిఎఫ్‌సిఎర్గో ఉద్యోగులు. దాదాపుగా 30,000 లీటర్ల నీటిని ఒక సమయంలో తీసుకురాగలిగిన మరియు మొత్తం 1,45,000 లీటర్ల నీటిని నిల్వ చేయగల సామర్థ్యం కలిగిన 03 కంపార్ట్‌మెంట్ బండ్‌లు నిర్మించిన వాలంటీర్లు.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో CSR కార్యక్రమాలకు సంబంధించిన ప్రశ్నలు, సలహాలు మరియు అభిప్రాయాల కోసం, మాకు ఇక్కడ రాయండి: csr.initiative@hdfcergo.com