ఒక ఇంటిని కొనుగోలు చేయడమనేది మీరు మీ జీవితకాలంలో వెచ్చించే ఒక అత్యంత ముఖ్యమైన మరియు ఖరీదైన పెట్టుబడిగా ఉంటుంది. కాబట్టి, అలాంటి ఇంటిని పిడుగుపాటు, భూకంపం మొదలైన ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షించుకోవడం చాలా ముఖ్యం. ప్రకృతి వైపరీత్యాలు సంభవించే ముందు చాలా అరుదుగా మాత్రమే హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి. ప్రత్యేకించి, పిడుగుపాటు కారణంగా, మీ ఆస్తికి తీవ్రమైన ప్రమాదం పొంచి ఉంటుంది. పిడుగుపాటు కారణంగా అగ్నిప్రమాదం, వైరింగ్‌కు నష్టం, షార్ట్ సర్క్యూట్‌లు మరియు ఎలక్ట్రికల్ ఉపకరణాలు ధ్వంసం కావడం లాంటి ప్రమాదాలు ఉండడమే ఇందుకు కారణం. దీనికారణంగా, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కూడా కలగవచ్చు. ఫిట్టింగ్స్, ఫర్నిచర్, గృహోపకరణాలు మరియు ఇతర వస్తువులు లాంటి మీ వ్యక్తిగత వస్తువులు కూడా దెబ్బతింటాయి. కొన్ని సందర్భాల్లో, పిడుగుపాటు కారణంగా ఇల్లు మొత్తం ధ్వంసమైతే, దానిని పునర్నిర్మించాల్సి రావచ్చు. మరియు, అది మీకొక పెద్ద ఆర్థిక మరియు మానసిక సమస్యగా మారవచ్చు.
నిజానికి, అలాంటి ప్రకృతి విపత్తులను నియంత్రించడానికి లేదా నివారించడానికి మీరు చేయగలిగింది ఏమీ లేనప్పటికీ, పిడుగుపాటు కవరేజీతో మీరొక సమగ్రమైన హోమ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయవచ్చు. పిడుగుపాటు కారణంగా జరిగిన నష్టాలకు కవరేజీ అనేది ఇంటి నిర్మాణానికి జరిగిన నష్టాలను కవర్ చేయడమే కాకుండా, ఫిక్సర్‌లు మరియు ఫిట్టింగ్‌లు, ఎలక్ట్రికల్ ఉపకరణాలు మరియు ఇతర వస్తువులు లాంటి మీ వ్యక్తిగత వస్తువులకు జరిగే నష్టాలను కూడా కవర్ చేస్తుంది. పిడుగుపాటు కోసం కవరేజీ అనేది ప్రత్యేక పాలసీ రూపంలో అందుబాటులో లేకపోయినప్పటికీ, దానిని మీరు మీ హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లలో భాగం చేసుకోవచ్చు.
సొంత ఇల్లు అనేది మీరు మీ ప్రియమైన వారితో అమూల్యమైన జ్ఞాపకాలను సృష్టించుకునే మరియు మీ కలలు నిజం కావడం ప్రత్యక్షంగా కనిపించే ఒక ప్రదేశం కాబట్టి, మీ కలల ఇంటిని కొనుగోలు చేయడం కోసం మీరు మీ జీవితంలో చేసిన అన్ని పొదుపులను వెచ్చిస్తారు. అందుకే, మీ ఇంటి భావోద్వేగభరిత విలువ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకే, పిడుగుపాటు నష్టానికి కూడా కవరేజీ అందించే ఒక హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం మంచిది. అలాంటి పాలసీతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి
ఇంటి నిర్మాణంతో పాటు ఎలక్ట్రికల్ పరికరాలు మరియు ఇతర ఫిక్సర్లు మరియు ఫిట్టింగ్స్ కోసం కవరేజీ
విద్యుత్ హెచ్చుతగ్గులు, షార్ట్ సర్క్యూట్ లేదా పిడుగుపాటు కారణంగా అగ్నిప్రమాదం వల్ల జరిగిన నష్టం
అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు
ఎలక్ట్రానిక్ మరియు గృహోపకరణాల మరమ్మత్తు మరియు మార్చడానికి అయ్యే ఖర్చు
పిడుగుపాటు తర్వాత, మీ ఇంటి పునర్నిర్మాణ సమయంలో మీకు ప్రత్యామ్నాయ వసతి
వస్తువును ఇన్సూర్ చేసామనే ధైర్యంతో యజమానులు నిర్లక్ష్యం వహించడం కారణంగా జరిగిన నష్టాలను ఇన్సూరెన్స్ కవర్ చేయదు. తప్పుగా నిర్వహించడం లేదా దుర్వినియోగం చేయడం లాంటి యజమానుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన నష్టాలు కవర్ చేయబడవు
బులియన్లు, నాణేలు, కళాఖండాలు మొదలైనవి
పాలసీ అనేది వస్తువు కొనుగోలు చేసిన ఏడాది లోపల తీసుకోవాలి కాబట్టి, కొనుగోలు తేదీ నుండి 365 రోజుల కంటే ఎక్కువ పాతవైన టెలివిజన్‌ల కోసం ఇన్సూరెన్స్ చెల్లదు
పిడుగుపాటుతో కాకుండా, ఇంకేదైనా కారణంతో అగ్నిప్రమాదం జరిగితే
పాలసీ తీసుకునే సమయంలో, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి పారదర్శక పద్ధతిలో ఉత్పత్తి గురించిన సరైన సమాచారం అందించాలి. ఏదైనా ముఖ్యమైన సమాచారం అందించబడకపోతే లేదా ఉద్దేశపూర్వకంగా దానిని దాచిపెడితే, అది ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడదు
యజమానుల ఉద్దేశపూర్వక ప్రవర్తనతో జరిగిన డ్యామేజీలు ఈ పాలసీ క్రింద కవర్ చేయబడవు. విడిభాగాలు ప్రమాదవశాత్తూ విరిగిపోవడం లేదా డ్యామేజ్ కావడం, వాటిని నేల మీద పడేయడం లాంటివి కవర్ చేయబడవు
1.6+ కోట్ల చిరునవ్వులు సురక్షితం చేయబడ్డాయి!@
మీకు అవసరమైన సపోర్ట్ 24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
#1.6+ కోట్ల చిరునవ్వులు సెక్యూర్ చేయబడ్డాయి
మీకు అవసరమైన సపోర్ట్-24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
అవాంతరాలు లేని మరియు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్