కాల్ ఐకాన్
సహాయం కావాలా? మా నిపుణులతో మాట్లాడండి 022-62426242
హోమ్ / హోమ్ ఇన్సూరెన్స్ / ఎలక్ట్రానిక్ పరికరాల కోసం ఇన్సూరెన్స్

మీ ఇంటి కోసం ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్

ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఊహించని నష్టాలు లేదా డ్యామేజీల నుండి మీ అవసరమైన మరియు నచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలను రక్షించడానికి మీకు సహాయపడుతుంది. నేటి ప్రపంచంలో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లు, ఐప్యాడ్‌లు, టాబ్లెట్‌లు మొదలైన గాడ్జెట్‌లు ప్రతి ఇంటిలో భాగం. నిజం చెప్పాలంటే రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, ఎయిర్ కండిషనర్ లాంటివి లేకుండా ఒక ఇంటిని సమర్థంగా నిర్వహించే అవకాశం ఉండదు. ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాల ఆవశ్యకతలను అత్యంత జాగురూకతతో నిర్వహించినప్పటికీ, యాక్సిడెంట్లు మరియు ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. అటువంటి నష్టాల కోసం సిద్ధంగా ఉండటానికి అన్ని అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలు/గాడ్జెట్‌లు ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ కవర్‌తో హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడేలా చూసుకోవాలి. నిజానికి, అలాంటి ఏదైనా పరికరానికి బ్రేక్‌డౌన్ లేదా డ్యామేజీ జరిగినప్పుడు మీ జేబు నుండి మీరు భారీగా ఖర్చు చేయాల్సి రావచ్చు.

ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతినడమే కాకుండా ఖరీదైనవిగా కూడా ఉంటాయి మరియు సులభంగా భర్తీ చేయబడవు. దోపిడీ మరియు దొంగతనం కారణంగా వాటిల్లే నష్టం నుండి కూడా మీ ఎలక్ట్రానిక్ పరికరాలను మీ హోమ్ పాలసీ రక్షించాలి. కాబట్టి, హోమ్ ఇన్సూరెన్స్‌ను తీసుకునేటప్పుడు, మీ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాలకు ప్రమాదవశాత్తు జరిగిన నష్టం నుండి పాలసీ కవరేజ్ మిమ్మల్ని రక్షిస్తుందో లేదో తనిఖీ చేయండి.

ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం వలన కలిగే ప్రయోజనాలు

ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ కోసం ఇన్సూరెన్స్ పొందడం ద్వారా, మీరు ఈ క్రింది మార్గాల్లో ప్రయోజనం పొందవచ్చు:-

ప్రయోజనాలు వివరాలు
ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షిస్తుంది వరదలు, పిడుగుపాటు, భూకంపం మొదలైన వాటి కారణంగా జరిగిన ప్రమాదవశాత్తు నష్టాల నుండి మీ ఇంటిలో విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను సురక్షితం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
దొంగతనం/దోపిడీని కవర్ చేస్తుంది దొంగతనం లేదా దోపిడీ లాంటివి ఎవరికైనా జరగవచ్చు. ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ దొంగతనం లేదా దోపిడీ కారణంగా జరిగిన నష్టాలను కవర్ చేయడం ద్వారా మీ విలువైన ఎలక్ట్రానిక్స్‌ను రక్షిస్తుంది.
సులభమైన క్లెయిమ్స్ ప్రాసెస్ 24/7 మద్దతుతో పాటు సరళమైన క్లెయిమ్ రిజిస్ట్రేషన్ మరియు త్వరిత సెటిల్‌మెంట్లు అటువంటి నష్టాలు లేదా డ్యామేజీలను సులభంగా నిర్వహించడానికి సహాయపడతాయి.
సరసమైన కవరేజ్ సరైన ప్రీమియం రేట్లతో భారీ కవరేజీని అందిస్తుంది, ఇది ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్‌ను ప్రతి ఒక్కరికీ సరసమైనదిగా చేస్తుంది.
మనశ్శాంతి హోమ్ కంటెంట్ ఇన్సూరెన్స్ కింద ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ ఆర్థిక మద్దతుతో, మీరు మనశ్శాంతిని పొందవచ్చు మరియు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక ఇంటి యజమాని/ అద్దెదారుగా ఉండవచ్చు.

ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ పాలసీ ఫీచర్లు

ఫీచర్లు ప్రయోజనాలు
విస్తృత కవర్ ఇది మీ ఇంటిలో అనేక అవసరమైన ఎలక్ట్రికల్ పరికరాలను కవర్ చేయడానికి సహాయపడుతుంది, వారికి ఏదైనా నష్టం లేదా డ్యామేజీ జరిగిన సందర్భంలో ఆర్థిక నష్టాలను తగ్గిస్తుంది.
అన్నివేళలా మద్దతు 24/7 కస్టమర్ సపోర్ట్‌తో, మీ ప్రశ్నలకు సమాధానాలు పొందడం మరియు క్లెయిములను రిజిస్టర్ చేయడం ఒక సులభమైన పని.
పునరుద్ధరణ మరియు డేటా నష్టాన్ని కవర్ చేస్తుంది రిపేర్ మరియు రీప్లేస్‌మెంట్‌కు అదనంగా, ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ డేటా నష్టం మరియు డేటా రీస్టోరేషన్ కోసం కవరేజ్ అందిస్తుంది.
ఆర్థిక సహాయం వర్తించే ఎలక్ట్రికల్ పరికరాలకు నష్టం లేదా డ్యామేజీ జరిగిన సందర్భంలో, పాలసీ తగిన కవరేజీని అందిస్తుంది, తద్వారా మీరు పరిస్థితిని ఆర్థికంగా పరిష్కరించుకోవచ్చు.

ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో ఏమి చేర్చబడింది?

అగ్ని
అగ్ని

అగ్నిప్రమాదం, పిడుగుపాటు, పేలుడు, యుద్ధం, తుఫాను, భూకంపం, వరద, భూచరియలు విరిగిపడడం, కొండ చరియలు విరిగిపడడం మొదలైన అన్ని ప్రకృతి వైపరీత్యాల నుండి కవరేజీ లభిస్తుంది.

ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ బ్రేక్‌డౌన్
ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ బ్రేక్‌డౌన్

ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ బ్రేక్‌డౌన్ కారణంగా మీ ఎలక్ట్రానిక్ పరికరాలకు జరిగే ఏదైనా నష్టం కవర్ చేయబడుతుంది.

డేటా నష్టం
డేటా నష్టం

పైన పేర్కొన్న విధంగా టేప్‌లు, డిస్క్‌లు, హార్డ్ డ్రైవ్‌ల వంటి ఎక్సటర్నల్ డేటా డ్రైవ్‌లను ప్రమాదం కారణంగా కోల్పోవడం

పునరుద్ధరణ
పునరుద్ధరణ

డేటా పునరుద్ధరణ ఖర్చు ఇక్కడ కవర్ చేయబడుతుంది

రిప్లేస్‌మెంట్
రిప్లేస్‌మెంట్

మరమ్మత్తు మరియు భర్తీ చేయడం కోసం కవరేజీ అందించబడుతుంది

భాగాలు
భాగాలు

భాగాలు మరియు ఫిట్టింగ్‌ల కోసం కవరేజీ అందించబడుతుంది

 ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో ఏమి చేర్చబడలేదు?

ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యం
వరదలు

వాతావరణ మార్పు కారణంగా సంభవించిన వరదలతో జరిగిన నష్టం

తొలగించదగినవి
తొలగించదగినవి

పాలసీ ప్రకారం, ఏవైనా వర్తించే మినహాయింపులు ఉంటే అవి మినహాయించబడతాయి

సంపాదనలు
సంపాదనలు

ఆదాయాలు నష్టపోవడం లేదా ఏదైనా పరోక్ష రకం నష్టం కవర్ చేయబడదు

ఫీజులు
ఫీజులు

ఆర్కిటెక్ట్‌లు, సర్వేయర్‌లు లేదా కన్సల్టింగ్ ఇంజనీర్‌ల ఫీజులు (3% క్లెయిమ్ మొత్తానికి మించినప్పుడు) కవర్ చేయబడవు

శిధిలాలు
శిధిలాలు

శిధిలాల తొలగింపును ఈ పాలసీ కవర్ చేయదు

అద్దె
అద్దె

అద్దె నష్టం కవర్ చేయబడదు

అదనపు ఖర్చు
అదనపు ఖర్చు

ప్రత్యామ్నాయ వసతి కోసం చెల్లించే అద్దె లాంటి అదనపు ఖర్చులు చేర్చబడవు

ల్యాప్స్ అయిన పాలసీ
ల్యాప్స్ అయిన పాలసీ

ఇన్సూరెన్స్ వ్యవధి ముగిసిన తర్వాత సంభవించే ఏవైనా నష్టాలు కవర్ చేయబడవు

ఈ పాలసీ క్రింద ఏ పరికరాలు కవర్ చేయబడతాయి?

హోమ్ కంటెంట్స్ ఇన్సూరెన్స్ కింద ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ కింద వివిధ పరికరాలు కవర్ చేయబడతాయి. కొన్ని ఉదాహరణల్లో ఇవి ఉంటాయి ;

టెలివిజన్
టెలివిజన్

టెలివిజన్లు లేదా టీవీలు అనేవి భారతీయ ఇళ్లల్లో సాధారణ భాగం, వినోదం మరియు వార్తల ముఖ్యమైన వనరు. హోమ్ కంటెంట్స్ ఇన్సూరెన్స్ కింద ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్, దాని వలన కలిగే ఏవైనా నష్టాలు లేదా డ్యామేజీలను కవర్ చేస్తుంది.

రిఫ్రిజరేటర్
రిఫ్రిజరేటర్

రిఫ్రిజిరేటర్లు వంటగదికి జీవనాధారం, ఆహార పదార్థాలు, స్నాక్స్, ఐస్ క్రీంలు మొదలైన వాటిని నిల్వ చేస్తాయి. ఈ పాలసీ ఈ పరికరాలను కవర్ చేస్తుంది, తద్వారా మీరు వంటగదిలో ఎప్పటిలానే పని చేసుకోవచ్చు.

వాషింగ్ మెషిన్
వాషింగ్ మెషిన్

చేతితో దుస్తులను ఉతికే రోజులు పోయాయి. వాషింగ్ మెషీన్లు ఖరీదైనవి, ఇంటిలో ముఖ్యమైనవి మరియు ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ దానిని కవర్ చేస్తుంది.

ఎయిర్ కండిషనర్
ఎయిర్ కండిషనర్

గడిచే ప్రతి సంవత్సరం వేసవికాలంలో ఎయిర్ కండిషనర్ లేకుండా ఉండడం మరింత కష్టంగా మారుతోంది. మీరు బ్యాంకులోని డబ్బులను ఎక్కువ ఖర్చు చేయకుండా దెబ్బతిన్న/దొంగిలించబడిన AC ని మరమ్మత్తు చేయాలనుకుంటే లేదా మార్చాలనుకుంటే, ఈ పాలసీలో పెట్టుబడి పెట్టండి.

వాక్యూమ్ క్లీనర్
వాక్యూమ్ క్లీనర్

పాడైపోయిన వ్యాక్యూమ్ క్లీనర్‌తో రోజువారీ పనులను పూర్తి చేయడం చాలా కష్టంగా ఉండవచ్చు. హోమ్ కంటెంట్స్ ఇన్సూరెన్స్ పాలసీ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ కింద కవరేజీని ఉపయోగించండి మరియు ఎప్పుడైనా దానిని మరమ్మత్తు/రిప్లేస్ చేయించుకోండి.

ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ పాలసీని ఎవరు తీసుకోవచ్చు?

ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ పాలసీని ఎవరు తీసుకోవచ్చు అనేది ఇక్కడ ఇవ్వబడింది ;

1. ఇంటి యజమాని: ప్రమాదవశాత్తు నష్టాల నుండి తమ ఇంటి వస్తువులు మరియు నిర్మాణాన్ని (ఎలక్ట్రానిక్ పరికరాలతో సహా) రక్షించాలనుకునే స్వతంత్ర భవనం లేదా అపార్ట్‌మెంట్ యజమాని ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవచ్చు.

2. అద్దెదారు: తమ విలువైన ఇంటి వస్తువులను (విలువవైన ఎలక్ట్రానిక్ పరికరాలతో సహా) కవర్ చేయాలనుకునే అద్దెదారు లేదా రెంటర్ ఈ పాలసీని ఎంచుకోవచ్చు.

మీ హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ పాలసీ కోసం క్లెయిమ్ ఎలా చేయాలి?

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ పాలసీ క్లెయిమ్‌ను రిజిస్టర్ చేయడం చాలా సులభం. మీరు చేయవలసిందల్లా ఈ సులభమైన దశలను అనుసరించడం ;

1. ఇన్సూరర్‌కు వెంటనే తెలియజేయండి మరియు హెల్ప్‌లైన్ నంబర్ 022-6234 6234కు కాల్ చేయడం లేదా care@hdfcergo.comకు ఒక ఇమెయిల్ పంపడం ద్వారా క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోండి,‌

2. క్లెయిమ్స్ ప్రాసెస్ కోసం అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి, ఇందులో సరిగ్గా నింపబడిన క్లెయిమ్స్ ఫారం, నిర్వహణ ఒప్పందం కాపీ, ఇన్సూరెన్స్ పాలసీ కాపీ, నిర్వహించబడిన ఏదైనా మరమ్మత్తు పని బిల్లులు, ఇన్సూర్ చేయబడిన పరికరాల వివరాలు మొదలైనవి ఉండవచ్చు.,

3. నష్టాన్ని పరిశీలించడానికి మరియు అంచనా వేయడానికి నియమించబడిన సర్వేయర్‌తో అవసరమైన సహాయం మరియు సహకారాన్ని అందించడం, మరియు వారు రిపోర్ట్‌ను పూర్తి చేసి దానిని సమర్పించినంత వరకు వేచి ఉండండి,

4. మరిన్ని సూచనల కోసం వేచి ఉండండి (ఏదైనా ఉంటే).

సమర్పించిన రిపోర్ట్‌ను పరిశీలించిన తర్వాత, అది ఆమోదించబడినట్లయితే ఇన్సూరర్ మీకు క్లెయిమ్ మొత్తాన్ని చెల్లిస్తారు.

Awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1.6+ కోట్ల చిరునవ్వులు సురక్షితం చేయబడ్డాయి!@

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
Awards
Awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్ 24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. ఇబ్బందులు లేని క్లెయిమ్ అనుభవాన్ని అందించడానికి మా ఇన్ హౌస్ క్లెయిమ్స్ బృందం నిరంతరంగా సహకారం అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
Awards
Awards
Awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కస్టమర్ అవసరాలను తీర్చడం

గత 20 సంవత్సరాల నుండి, మేము ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లు మరియు యాడ్ ఆన్ కవర్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను ఎటువంటి అవాంతరాలు లేకుండా తీరుస్తున్నాము.
Awards
Awards
Awards
Awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
Awards
Awards
Awards
Awards
Awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

Awards

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డులు, 2021 వద్ద హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో "క్లెయిమ్స్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్" కేటగిరీ కింద అవార్డు గెలుచుకుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?
Awards

​#1.6+ కోట్ల చిరునవ్వులు సెక్యూర్ చేయబడ్డాయి

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
Awards

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
Awards

కస్టమర్ అవసరాలను తీర్చడం

గత 20 సంవత్సరాల నుండి, మేము ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్‌లను మరియు యాడ్ ఆన్ కవర్‌లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను సజావుగా అందజేస్తున్నాము.
Awards

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
Awards

Awards

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డులు, 2021 వద్ద హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో "క్లెయిమ్స్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్" కేటగిరీ కింద అవార్డు గెలుచుకుంది.

మా నెట్‌వర్క్
శాఖలు

100+

అవాంతరాలు లేని మరియు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్


రిజిస్టర్ చేసుకోండి మరియు మీ క్లెయిమ్‌లను ట్రాక్ చేయండి

మీకు సమీపంలో గల
శాఖలను గుర్తించండి

మీ మొబైల్ ద్వారా
అప్‌డేట్‌లను అందుకోండి

ఇష్టపడే క్లెయిమ్‌ల
విధానాన్ని ఎంచుకోండి

ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్‌పై ఇటీవలి బ్లాగులు

ఇతర సంబంధిత కథనాలు

 

ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ గురించి తరచుగా అడగబడే ప్రశ్నలు

1.క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ విధానం ఎలా ఉంటుంది?

క్లెయిమ్ రిజిస్టర్ చేయబడి మరియు అవసరమైన డాక్యుమెంట్‌లు సమర్పించబడిన తర్వాత, వివరాలు ధృవీకరించడానికి మరియు రిపోర్ట్ సమర్పించడానికి ఒక సర్వేయర్ నియమించబడతారు. నివేదిక అందుకున్న తర్వాత, ఆ నివేదిక సంతృప్తికరంగా ఉంటే, క్లెయిమ్ మొత్తం లెక్కించబడుతుంది మరియు పాలసీదారునికి చెల్లించబడుతుంది.

సాధారణంగా, సెటిల్‌మెంట్‌ విడుదల చేయడం కోసం, క్లెయిమ్ డాక్యుమెంట్‌లు సమర్పించిన తేదీ నుండి 30 రోజులు అవసరమవుతాయి

అందుకు అవసరమైన డాక్యుమెంట్లు ఇవి
  1. సరిగ్గా నింపిన క్లెయిమ్స్ ఫారమ్
  2. ఇన్సూరెన్స్ పాలసీ ఫోటోకాపీ
  3. ఇన్సూర్ చేయబడిన వ్యక్తి వివరాలు
  4. నిర్వహణ ఒప్పందం కాపీ
  5. ఏదైనా మరమ్మత్తు పని నిర్వహించి ఉంటే, దానికి సంబంధించిన బిల్లులు మరియు డాక్యుమెంట్‌లు

పనిచేయడం కోసం వోల్టేజ్ మరియు పవర్ అవసరమైన అన్ని పరికరాల కోసం ఎలక్ట్రానిక్ పరికరం అనేే పదం ఉపయోగించబడుతుంది. సాధారణంగా TV, కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌లు, CPU మొదలైనవి ఇందులోకి వస్తాయి.

మీరు ఎంత త్వరగా తెలియజేస్తే, అంత మెరుగైన ఫలితం ఉంటుంది. అయితే, నష్టం/దెబ్బతిన్న తేదీ నుండి 14 రోజుల్లోపు మీరు ఆ విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేశారని నిర్ధారించుకోండి.

ఎలక్ట్రానిక్ ఉపకరణం పాలసీ ఏటా రెన్యూవల్ చేయబడుతుంది.

అవును, మీరు ఎప్పుడైనా మీ పాలసీని రద్దు చేయవచ్చు లేదా ముగించవచ్చు. రాతపూర్వకంగా తెలియజేస్తే చాలు మరియు మీ అభ్యర్థన ప్రాసెస్ చేయబడుతుంది. మీరు ప్రీమియం చెల్లించి ఉంటే, అది రీఫండ్ చేయబడుతుంది.

ఇన్సూర్ చేయబడిన మొత్తం ఆధారంగా ప్రీమియం లెక్కించబడుతుంది. మరోవైపు, ఇన్సూర్ చేయబడిన మొత్తం ఈ క్రింది అంశాల ఆధారంగా లెక్కించబడుతుంది –

● ఇన్సూర్ చేయవలసిన పరికరం

● పరికరాల వయస్సు

● ఎలక్ట్రానిక్ పరికరాల మొత్తం విలువ

డ్యామేజ్ అయిన లేదా దొంగిలించబడిన పరికరాన్ని అదే మోడల్ మరియు అదే స్థితిలో ఉన్న పరికరంతో భర్తీ చేయడానికి అయ్యే ఖర్చును ఇన్సూర్ చేయబడిన మొత్తంగా పరిగణిస్తారు.

ఇన్సూరెన్స్ మొత్తం నిర్ణయించబడిన తర్వాత, ప్రీమియం లెక్కించబడుతుంది. ఇది ఇన్సూర్ చేయబడిన మొత్తంలో ప్రతి మైల్‌కు ₹ 15 గా లెక్కించబడుతుంది. గరిష్ట ఇన్సూర్ చేయబడిన మొత్తం అనేది హోమ్ కంటెంట్ ఇన్సూర్ చేయబడిన మొత్తంలో 30% వరకు ఉండవచ్చు. ఈ ప్లాన్ మీ పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరాల కోసం ప్రపంచవ్యాప్తంగా అదనపు కవరేజ్ కూడా అందిస్తుంది. మీరు ఈ కవరేజీని ఎంచుకుంటే, ప్రీమియం 10% పెరుగుతుంది.

మీకు కావలసినట్లయితే మీరు మీ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ కవర్‌ను వార్షికంగా రెన్యూ చేసుకోవచ్చు. అనేక సందర్భాల్లో, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హోమ్ షీల్డ్ ఇన్సూరెన్స్ 5 సంవత్సరాల వరకు నిరంతర కవరేజీని కూడా అందిస్తుంది. ఇది ప్రతి సంవత్సరం పాలసీని రెన్యూ చేయకుండా నిరంతరాయ కవరేజీని ఆనందించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

ఇది హోమ్ కంటెంట్స్ ఇన్సూరెన్స్‌లో తప్పనిసరి భాగం, ఇది ఊహించని సంఘటన కారణంగా వాషింగ్ మెషీన్లు, ACలు, TVలు, రిఫ్రిజిరేటర్లు మొదలైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు కలిగే నష్టాలు లేదా డ్యామేజీలను కవర్ చేసి, వాటికి చెల్లిస్తుంది.

అవును. దొంగతనం లేదా దోపిడీ కారణంగా వర్తించే ఎలక్ట్రానిక్ పరికరాలు మీ ఇంటి నుండి దొంగిలించబడితే, ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ దానిని భర్తీ చేయడానికి కవరేజ్ అందిస్తుంది.

ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ అగ్నిప్రమాదం, మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ బ్రేక్‌డౌన్ మరియు డేటా నష్టం కారణంగా జరిగిన నష్టం లేదా డ్యామేజీల నుండి మీ ఇంటిలో ఎలక్ట్రానిక్ పరికరాలను కవర్ చేస్తుంది. ఇది డేటా పునరుద్ధరణ, భాగాలు మరియు ఫిట్టింగ్స్, భర్తీ మొదలైన వాటి ఖర్చులను కూడా కవర్ చేస్తుంది.

ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడే ఎలక్ట్రానిక్ పరికరాలకు కొన్ని ఉదాహరణ TV, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, వాక్యూమ్ క్లీనర్లు, ఎయిర్ కండిషనర్లు మొదలైనవి.
అవార్డులు మరియు గుర్తింపు
x