నాలెడ్జ్ సెంటర్
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో #1.6+ కోట్ల హ్యాపీ కస్టమర్లు
#1.6 కోట్లు

హ్యాపీ కస్టమర్లు

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 1లక్ష+ నగదురహిత ఆసుపత్రులు
1 లక్ష+

నగదు రహిత ఆసుపత్రులు

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 24x7 అంతర్గత క్లెయిమ్ సహాయం
24x7 అంతర్గత

క్లెయిమ్ సహాయం

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఆరోగ్య పరీక్షలు లేవు
ఎలాంటి హెల్త్

చెక్-అప్‌లు లేవు

హోమ్ / ట్రావెల్ ఇన్సూరెన్స్ / భారతదేశం నుండి జర్మనీ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి

ట్రావెల్ ఇన్సూరెన్స్ జర్మనీ

జర్మనీని అధికారికంగా జర్మనీ ఫెడరల్ రిపబ్లిక్ అని పిలుస్తారు. యూరప్ కేంద్ర ప్రాంతంలోని దేశాల్లో ఇది కూడా ఒకటి. ఇది ప్రపంచంలోని అగ్రశ్రేణి అంతర్జాతీయ హాలిడే గమ్యస్థానాల్లో ఒకటిగా ఉంటోంది. ఇది దాని విభిన్న శ్రేణి పర్యాటక ఆకర్షణలకు పేరు గాంచింది. ఈ అందమైన దేశంలో మీరు కొంత సమయం గడపాలనుకుంటున్నా లేదా వివిధ చారిత్రక మరియు సహజ ల్యాండ్‌మార్క్‌లు చూడాలనుకుంటున్నా, మీలాంటి సందర్శకుల కోసం ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో సైట్‌సీయింగ్ అవకాశాలు ఉన్నాయి. మీ తదుపరి యూరోపియన్ సెలవు ప్లాన్‌లో భాగంగా, మీరు ఈ దేశాన్ని సందర్శించాలనుకుంటే, మంచి అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ లో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణనలోకి తీసుకోండి.

జర్మనీ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీ ట్రిప్ సమయంలో ఎదురుకాగల అనేక ఆకస్మిక పరిస్థితుల నుండి మిమ్మల్ని ఆర్థికంగా కవర్ చేస్తుంది. ఈ విషయం మీద అదనపు సమాచారం కోసం మరింత చదవడం కొనసాగించండి.

ట్రావెల్ ఇన్సూరెన్స్ జర్మనీ‌కి సంబంధించిన కీలక ఫీచర్లు

జర్మనీ ట్రావెల్ ఇన్సూరెన్స్‌‌కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫీచర్ల జాబితా ఇక్కడ ఇవ్వబడింది ;

ముఖ్యమైన ఫీచర్లు వివరాలు
గరిష్ట కవరేజీవైద్యం, ప్రయాణం మరియు బ్యాగేజీ సంబంధిత అత్యవసర పరిస్థితులు లాంటి వివిధ ఊహించని సంఘటనల నుండి కవరేజీ అందిస్తుంది.
నిరంతర మద్దతు24x7 కస్టమర్ కేర్ మద్దతు మరియు ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్మెంట్ ద్వారా ఎల్లవేళలా సహాయం.
సులభమైన నగదురహిత క్లెయిములుఅనేక నెట్‌వర్క్ ఆసుపత్రుల ద్వారా యాక్సెస్ చేయదగిన క్యాష్‌లెస్ క్లెయిమ్స్ ప్రయోజనాలను అందిస్తుంది.
కోవిడ్-19 కవరేజ్కోవిడ్-19 కారణంగా హాస్పిటలైజేషన్ ఖర్చుల కోసం కవరేజీ.
భారీ కవర్ మొత్తం$40k నుండి $1000K వరకు విస్తృతమైన కవరేజ్ పరిధి.

జర్మనీ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ రకాలు

మీరు ఎంచుకున్న జర్మనీ ట్రావెల్ ఇన్సూరెన్స్ రకం అనేది మీ ప్రయాణ అవసరాన్ని బట్టి ఉండాలి. అందించబడే ప్రధాన ఎంపికలు ఇక్కడ ఇవ్వబడ్డాయి ;

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి వ్యక్తుల కోసం ట్రావెల్ ప్లాన్

వ్యక్తి కోసం ట్రావెల్ ప్లాన్లు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తిగత అడ్వెంచర్ల కోసం

ఈ రకమైన అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది వైద్యం, బ్యాగేజీ మరియు ప్రయాణ సంబంధిత ఆకస్మిక పరిస్థితుల నుండి ఒంటరి ప్రయాణీకులకు కవర్ అందిస్తుంది.

ప్లాన్లను చూడండి మరింత తెలుసుకోండి
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి కుటుంబాల కోసం ట్రావెల్ ప్లాన్

కుటుంబాల కోసం ట్రావెల్ ప్లాన్

సంతోషకరమైన కుటుంబ పర్యటనల కోసం

ఈ రకమైన అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఒకే పాలసీ కింద ఒక ట్రిప్ సమయంలో కుటుంబంలోని బహుళ సభ్యుల కోసం కవరేజీ అందిస్తుంది.

ప్లాన్లను చూడండి మరింత తెలుసుకోండి
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా విద్యార్థులకు ట్రావెల్ ప్లాన్

విద్యార్థుల కోసం ట్రావెల్ ప్లాన్

ఇంటి నుండి దూరంగా ఉన్నవారి కోసం

విద్యా సంబంధిత ప్రయోజనాల కోసం విదేశాలకు ప్రయాణించే విద్యార్థులకు కవరేజీ అందించడం కోసం ఈ రకమైన అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ రూపొందించబడింది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా తరచుగా విమానయానం చేసే వారికి ట్రావెల్ ప్లాన్

తరచుగా విమానయానం చేసేవారి కోసం ట్రావెల్ ప్లాన్

తెలిసిన పరిమితులను మించి కలలు కనే జెట్ సెట్టర్ల కోసం

సీనియర్ సిటిజన్‌లు అంతర్జాతీయ విహారానికి వెళ్లినప్పుడు వారికి కవరేజీ అందించడం కోసం ఈ రకమైన ప్లాన్ రూపొందించబడింది.

ప్లాన్లను చూడండి మరింత తెలుసుకోండి
సీనియర్ సిటిజన్స్ కోసం ట్రావెల్ ప్లాన్

సీనియర్ సిటిజన్స్ కోసం ట్రావెల్ ప్లాన్

మనసులో యవ్వనం ఉరకలేసే వారికోసం

ఒక నిర్దిష్ట వ్యవధిలో ఒకే అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ క్రింద అనేకసార్లు సురక్షితంగా వెళ్లిరావడానికి ఈ పాలసీ సహాయపడుతుంది.

ప్లాన్లను చూడండి మరింత తెలుసుకోండి

ట్రావెల్ ఇన్సూరెన్స్ జర్మనీ ప్లాన్ కొనుగోలు చేయడం వలన ప్రయోజనాలు

జర్మనీ ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో పెట్టుబడి పెట్టడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైనవి క్రింద వివరించబడ్డాయి:

1

ఆర్థికపరమైన ప్రశాంతత

ఊహించని పరిస్థితులకు కవరేజీ అందించడం, ఒత్తిడి తగ్గించడం మరియు ఆర్థిక భారం తగ్గించడం ద్వారా అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఆర్థికపరమైన ప్రశాంతతను అందిస్తుంది.

2

నగదురహిత ప్రయోజనాలు

జర్మనీ ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో నగదురహిత వైద్య సహాయం భాగంగా ఉంటుంది కాబట్టి, ముందస్తు చెల్లింపుల గురించి ఆందోళన లేకుండా నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో చికిత్స పొందవచ్చు.

3

త్వరిత సహాయం

జర్మనీ ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో 24x7 కస్టమర్ సపోర్ట్ మరియు సమర్థవంతమైన క్లెయిమ్స్ ప్రాసెసింగ్‌ను ఆనందించండి, ఇది అవాంతరాలు-లేని ట్రిప్‌ను నిర్ధారిస్తుంది.

4

బ్యాగేజీ సెక్యూరిటీ

జర్మనీ ట్రిప్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ద్వారా, మీ అంతర్జాతీయ ప్రయాణ సమయంలో ఆలస్యాలు, నష్టం లేదా డ్యామేజీ నుండి మీ వస్తువులను రక్షించుకోండి.

5

సమగ్ర వైద్య కవరేజ్

జర్మనీ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది అత్యవసర వైద్య సంరక్షణ, డెంటల్ ఖర్చులు, తరలింపు, స్వదేశానికి తిరిగి రావడం మరియు మరిన్ని వాటితో సహా వివిధ వైద్య ఖర్చులు కవర్ చేస్తుంది.

5

ప్రయాణ-సంబంధిత సమస్యలు

విమాన ఆలస్యం, వ్యక్తిగత బాధ్యత మరియు హైజాక్ డిస్ట్రెస్ అలవెన్స్ లాంటి ఊహించని పరిస్థితులకు కవరేజీ పొందండి, మీ ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచుకోండి.

మీ తదుపరి యూరోపియన్ విహారంలో ఫ్రాన్స్ దేశం సందర్శించాలని ఆలోచిస్తున్నారా? హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో ఇప్పుడే మీ ట్రిప్‌ని సురక్షితం చేసుకోండి.

భారతదేశం నుండి జర్మనీ ప్రయాణం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద ఏమి కవర్ చేయబడుతుంది?

భారతదేశం నుండి జర్మనీ ప్రయాణం కోసం జర్మనీ ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద కవర్ చేయబడే కొన్ని విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి ;

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా ఎమర్జెన్సీ మెడికల్ ఖర్చులకు కవరేజ్

వైద్య అత్యవసర పరిస్థితి-సంబంధిత ఖర్చులు

వైద్య అత్యవసర పరిస్థితులకి సంబంధించిన ఖర్చులను మా పాలసీ కవర్ చేస్తుంది కాబట్టి, మీరు మీ ట్రిప్ సమయంలో మీ జేబు నుండి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా అత్యవసర డెంటల్ ఖర్చులకు కవరేజ్

డెంటల్ ఎమర్జెన్సీ-సంబంధిత ఖర్చులు:

జర్మనీ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీరు ఎదుర్కొనే డెంటల్ ఎమర్జెన్సీలకు సంబంధించిన ఖర్చులను కూడా కవర్ చేస్తుంది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా మెడికల్ ఎవాక్యుయేషన్ కవరేజ్

మెడికల్ తరలింపు

తక్షణ సంరక్షణ అవసరమయ్యే వైద్య అత్యవసర పరిస్థితుల్లో, సమీప ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి విమానం/భూ మార్గం ద్వారా తరలించడానికి సంబంధించిన ఖర్చులు కవర్ చేయడం ద్వారా మా పాలసీ సహాయపడుతుంది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా ఆసుపత్రి నుండి రోజువారీ నగదు అలవెన్స్

ఆసుపత్రి నుండి రోజువారీ నగదు అలవెన్స్

చిన్నపాటి హాస్పిటలైజేషన్ సంబంధిత ఖర్చులు చెల్లించడంలో కూడా మా పాలసీ మీకు సహాయపడుతుంది కాబట్టి, మీరు మీ ప్రయాణ బడ్జెట్‌కి మించి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా మెడికల్ మరియు బాడీ రీపాట్రియేషన్ కవరేజ్

వైద్యపరమైన మరియు భౌతికకాయం తరలింపు

మరణం సంభవించడం లాంటి దురదృష్టకర సందర్భంలో, ఆ వ్యక్తి మృతదేహాన్ని వారి స్వదేశానికి బదిలీ చేసే ఖర్చుని కవర్ చేయడానికి మా పాలసీ బాధ్యత వహిస్తుంది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రమాదవశాత్తు మరణం కవరేజ్

ప్రమాదం కారణంగా మరణం

ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మరణం సంభవించడం లాంటి దురదృష్టకర సందర్భంలో, మా పాలసీ మీ కుటుంబానికి ఏకమొత్తంలో పరిహారం అందిస్తుంది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా శాశ్వత వైకల్యం కోసం కవరేజ్

శాశ్వత వైకల్యం

ఊహించని సంఘటన కారణంగా శాశ్వత వైకల్యానికి దారితీస్తే, ఈ పాలసీ మీకు ఏకమొత్తంలో పరిహారం అందిస్తుంది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా పర్సనల్ లయబిలిటీ కవరేజ్

వ్యక్తిగత బాధ్యత

విదేశంలో ఉన్నప్పుడు థర్డ్-పార్టీ నష్టానికి మీరు బాధ్యత వహించాల్సి వస్తే, మీరు ఆ నష్టాలకు పరిహారం చెల్లించడాన్ని మా పాలసీ సులభతరం చేస్తుంది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కవరేజ్

ఆర్థిక అత్యవసర సహాయం

దొంగతనం లేదా దోపిడీ కారణంగా మీరు నగదు సమస్య ఏర్పడితే, భారతదేశం నుండి అత్యవసర ఫండ్ ట్రాన్స్‌ఫర్‌లను సులభతరం చేయడంలో మా పాలసీ సహాయపడుతుంది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా హైజాక్ డిస్ట్రెస్ కోసం అలవెన్స్ కవరేజ్

హైజాక్ డిస్ట్రెస్ అలవెన్స్

ఒకవేళ మీ విమానం హైజాక్‌కి గురైతే, ఆ పరిస్థితిని అధికారులు పరిష్కరిస్తు సమయంలో మీకు కలిగే ఇబ్బందికి పరిహారం అందించడం ద్వారా మేము మా బాధ్యతను నిర్వర్తిస్తాము.

మా జర్మనీ ట్రావెల్ ఇన్సూరెన్స్ మీకు ఒక రీయింబర్స్‌మెంట్ ఫీచర్‌ని అందిస్తుంది. విమానం ఆలస్యమైనప్పుడు అవసరమైన కొనుగోళ్లు చేయడానికి అవసరమయ్యే ఖర్చులు కవర్ చేయడంలో ఇది మీకు సహాయపడుతుంది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా హోటల్ వసతులకు కవరేజ్

హోటల్ వసతులు

వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా మీరు మీ హోటల్‌ బసను పొడిగించాల్సి వస్తే, ఆ అదనపు ఖర్చులను మా పాలసీ కవర్ చేస్తుంది.

మీరు పోగొట్టుకున్న లేదా మీ నుండి దొంగిలించబడిన వ్యక్తిగత డాక్యుమెంట్‌లు మరియు వస్తువులు భర్తీ చేయడానికి అయ్యే ఖర్చు కోసం మా జర్మనీ ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో మీకు కవర్ లభిస్తుంది.

చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజీ కోల్పోయిన సందర్భంలో మా పాలసీ మీకు పరిహారం అందిస్తుంది. కాబట్టి, మీ అత్యవసర వస్తువులు లేనప్పటికీ, మీ జర్మనీ ట్రిప్ కోసం ఖర్చు చేయడం గురించి ఆందోళన చెందకండి.

ఒకవేళ మీ చెక్-ఇన్ బ్యాగేజీ ఆలస్యంగా మీ చేతికి వస్తే, ఆ ఆలస్యపు సమయంలో మీకు అవసరమైన కొనుగోళ్లను మా పాలసీ కవర్ చేస్తుంది.

భారతదేశం నుండి జర్మనీ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద ఏవి కవర్ చేయబడవు?

భారతదేశం నుండి జర్మనీ కోసం మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద వీటికి కవరేజీ అందించకపోవచ్చు;

చట్టం ఉల్లంఘన

చట్టం ఉల్లంఘన

యుద్ధం, తీవ్రవాదం లేదా చట్టం ఉల్లంఘన కారణంగా సంభవించే ఆరోగ్య సమస్యలనేవి ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద కవర్ చేయబడవు.

మాదకద్రవ్యాల వినియోగం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో కవర్ చేయబడదు

మత్తు పదార్థాల వినియోగం

మీరు మత్తు పదార్థాలు లేదా నిషేధిత పదార్థాలు ఉపయోగిస్తే, జర్మనీ ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎటువంటి కవరేజీని అందించదు.

ముందుగా ఉన్న వ్యాధులు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడవు

ముందునుంచే ఉన్న వ్యాధులు

ట్రిప్‌కి ముందే మీకు ఏదైనా వైద్య పరిస్థితి ఉంటే లేదా ముందుగానే ఉన్న వ్యాధి కోసం చికిత్స తీసుకుంటే, ఆ ఖర్చులను ఈ ప్లాన్ కవర్ చేయదు.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ కాస్మెటిక్ సర్జరీలు, ఓబెసిటీ చికిత్సలను కవర్ చేయదు

యుద్ధం లేదా తీవ్రవాదం

తీవ్రవాదం లేదా యుద్ధం కారణంగా కలిగిన గాయాలు లేదా ఆరోగ్య సమస్యలు.

స్వతహా చేసుకున్న గాయాలు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో పరిధిలోకి రావు

స్వంతగా-కలగజేసుకున్న గాయం

ఉద్దేశపూర్వకమైన హాని లేదా ఆత్మహత్యా ప్రయత్నాల ఫలితంగా కలిగే గాయాలనేవి అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద కవర్ చేయబడవు.

సాహస క్రీడలు

సాహస క్రీడలు

ప్రమాదకర కార్యకలాపాలు మరియు సాహస క్రీడల్లో పాల్గొన్న ఫలితంగా కలిగే గాయాలు మరియు హాస్పిటల్ ఖర్చులను ఈ పాలసీ కవర్ చేయదు.

సాహస క్రీడలు

ఊబకాయం మరియు కాస్మెటిక్ చికిత్స

విదేశీ దేశ పర్యటన సమయంలో, మీరు లేదా మీ కుటుంబ సభ్యులు కాస్మెటిక్ లేదా ఊబకాయం చికిత్స చేయించుకోవడానికి ఎంచుకుంటే, సంబంధిత ఖర్చులు ఈ ప్లాన్ క్రింద కవర్ చేయబడవు.

జర్మనీ కోసం ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా కొనుగోలు చేయాలి?

• ఇక్కడ క్లిక్ చేయండి లింక్, లేదా మా పాలసీని కొనుగోలు చేయడానికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ వెబ్‌పేజీని సందర్శించండి.

• ప్రయాణీకుల వివరాలు, గమ్యస్థాన సమాచారం మరియు ట్రిప్ ప్రారంభం మరియు ముగింపు తేదీలను నమోదు చేయండి.

• మా మూడు ప్రత్యేకమైన ఎంపికల నుండి మీకు ఇష్టమైన ప్లాన్‌ను ఎంచుకోండి.

• మీ వ్యక్తిగత వివరాలను అందించండి.

• ప్రయాణీకుల గురించి అదనపు వివరాలను పూరించండి మరియు ఆన్‌లైన్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించి చెల్లించడానికి కొనసాగండి.

• ఇక మిగిలింది ఒక్కటే- మీ పాలసీని తక్షణమే డౌన్‌లోడ్ చేసుకోండి!

విదేశాల్లో వైద్య అత్యవసర పరిస్థితుల కోసం అయ్యే ఖర్చు అనేది మీ ప్రయాణ బడ్జెట్‌కి భారంగా మారడాన్ని అనుమతించకండి. ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో అత్యవసర వైద్య మరియు డెంటల్ ఖర్చుల నుండి మిమ్మల్ని మీరు ఆర్థికంగా కవర్ చేసుకోండి.

జర్మనీ గురించి ఆసక్తికరమైన వాస్తవాలు

కేటగిరీలు నిర్దేశం
సాంస్కృతిక వారసత్వంజర్మనీ లోని చారిత్రాత్మక నగరాలన్నీ శతాబ్దాల నాటి ఆకర్షణను నేటి ఆధునిక సోయగాలతో మిశ్రమం చేస్తుంటాయి.
సామర్థ్యం మరియు ఇంజనీరింగ్ ఆటోమోటివ్ దిగ్గజాలకు నిలయమైన జర్మనీ ఖచ్చితత్వంతో కూడిన ఇంజనీరింగ్ మరియు ఆవిష్కరణల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలు సెట్ చేస్తోంది.
దృశ్యపరమైన ప్రకృతిదృశ్యాలుబ్లాక్ ఫారెస్ట్‌లోని అందమైన గ్రామాలు, దట్టమైన అడవులు మరియు శాశ్వతమైన అందాలను అన్వేషించండి.
పాకశాస్త్ర రుచులుఒక ప్రామాణికమైన జర్మన్ రుచుల అనుభవం కోసం హార్టీ స్టీవ్స్, సాసేజ్‌లు మరియు ఐకానిక్ ప్రెట్జెల్స్‌లో పాల్గొనండి.
ఇన్నోవేషన్‌లు మరియు టెక్నాలజీ పరిశోధన మరియు అభివృద్ధి రంగాల్లో నిబద్ధత కారణంగా సాంకేతిక అభివృద్ధిలో జర్మనీ ముందు భాగంలో ఉంటోంది.
చారిత్రాత్మక కట్టడాలు బ్రాండెన్‌బర్గ్ గేట్ అనేది జర్మనీ ఐక్యతకు ఒక గొప్ప చిహ్నంగా ఉండగా, న్యూష్‌వాన్‌స్టైన్ క్యాసిల్ అనేది ఫెయిరీటేల్ ఆకర్షణకు నిలయంగా ఉంటోంది.

జర్మనీ టూరిస్ట్ వీసా కోసం అవసరమయ్యే డాక్యుమెంట్‌లు

జర్మనీ టూరిస్ట్ వీసా కోసం మీరు సమర్పించాల్సిన డాక్యుమెంట్‌ల ఉదాహరణలు ఇక్కడ ఇవ్వబడ్డాయి ;

• సంపూర్ణంగా నింపిన మరియు సంతకం చేసిన జర్మనీ టూరిస్ట్ వీసా అప్లికేషన్ ఫారం,

• చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్

• రెండు ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు,

• వసతి రుజువు,

• రౌండ్ ట్రిప్ ప్రయాణ రుజువు లేదా రిజర్వేషన్,

• ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్,

• జర్మనీలోని మీ అతిథి నుండి ఆహ్వాన లేఖ,

• ఆర్థిక మార్గాల రుజువు,

• ఉపాధి స్థితి రుజువు,

• తల్లిదండ్రుల నుండి జనన సర్టిఫికెట్ మరియు సమ్మతి లేఖ (మైనర్లకు మాత్రమే) మరియు

• అదనపు డాక్యుమెంట్లు (అవసరమైతే).

జర్మనీని సందర్శించడానికి ఉత్తమ సమయం

సాధారణంగా, పర్యాటక ప్రయోజనాల కోసం జర్మనీని సందర్శించడానికి వసంతకాలం మరియు వేసవికాలం రెండూ ఉత్తమ సమయాలుగా పరిగణించబడతాయి. ఈ దేశంలోని వసంతకాలం మార్చి నుండి మే వరకు ఉంటుంది. చల్లటి చలికాలం తర్వాత వచ్చే ఈ సీజన్‌ అనేది వాతావరణానికి ఒక వెచ్చటి స్పర్శను తీసుకువస్తుంది. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు ఏప్రిల్ మధ్యలో దాదాపుగా 14°C మరియు మే నెలలలో దాదాపుగా 19°C వరకు ఉంటాయి. ట్రెక్కింగ్, హైకింగ్, మౌంటైన్ బైకింగ్ మొదలైన అన్వేషణ, సైట్ సీయింగ్ మరియు సాహస కార్యకలాపాల కోసం ఇదొక గొప్ప సమయంగా ఉంటుంది. వసంతకాలంలో పూర్తి స్థాయిలో పుష్పించిన వృక్షాలను చూడడం కోసం జర్మనీకి ప్రయాణించడం మరొక కీలక అంశంగా ఉంటుంది.

జూన్ నుండి ఆగస్ట్ వరకు ఉండే వేసవికాలంలో పూర్తి ఉష్ణోగ్రతతో పాటు వాతావరణ పరిస్థితులు సైతం మరింత ఆహ్లాదకరంగా ఉంటాయి. బాల్టిక్ సముద్రం మీద నుండి వీచే గాలుల కారణంగా ఉత్తర ప్రాంతం కొంచెం చల్లగా అనిపించినప్పటికీ, దానితో పోల్చినప్పుడు దక్షిణ ప్రాంతం వెచ్చగా ఉంటుంది. జర్మనీ దేశవ్యాప్తంగా చూడటానికి మరియు అన్వేషించడానికి ఇదొక గొప్ప సమయంగా ఉంటుంది. బెర్లిన్ కల్చర్ ఫెస్టివల్ మరియు కార్నివాల్, షట్జెన్‌ఫెస్ట్ హాన్నోవర్, ఫ్రీబర్గ్ వైన్ ఫెస్టివల్ మొదలైన ప్రఖ్యాత ఈవెంట్లను ఈ కాలంలో నిర్వహిస్తారు.

జర్మనీని సందర్శించడానికి ముందు ఉత్తమ సమయం, వాతావరణం, ఉష్ణోగ్రత మరియు ఇతర అంశాల గురించి మరింత తెలుసుకోవడానికి. జర్మనీని సందర్శించడానికి ఉత్తమ సమయం గురించి మా బ్లాగ్ చదవండి.

జర్మనీ కోసం సంవత్సరం అంతటా అవసరమైనవి

1. అవసరమైతే షెన్గన్ వీసా మరియు ట్రావెల్ ఇన్సూరెన్స్ సమాచారంతో సహా పాస్‌పోర్ట్ మరియు ట్రావెల్ డాక్యుమెంట్లు.

2. నగరాలు మరియు దేశవ్యాప్తంగా అన్వేషించడానికి సౌకర్యవంతమైన నడక బూట్లు.

3. వేసవి కోసం సన్‌గ్లాసెస్ మరియు సన్‌స్క్రీన్.

4. హైడ్రేటడ్‌గా ఉండడానికి రీయూజబుల్ వాటర్ బాటిల్.

5. కెమెరా మరియు ఎలక్ట్రానిక్ ఛార్జర్లు/అడాప్టర్లు.

6. వేసవి కోసం తేలికైన SPF సన్‌స్క్రీన్, బ్రీతబుల్ క్లోతింగ్ మరియు శాండిల్స్.

7. చల్లని సాయంత్రం వేళ వెచ్చదనాన్ని జోడించడానికి తేలికపాటి జాకెట్, స్కార్ఫ్ లేదా కార్డిగాన్.

జర్మనీ ట్రావెల్: చేపట్టాల్సిన భద్రత మరియు జాగ్రత్త చర్యలు

• మీ పరిసరాల గురించి తెలుసుకోండి.

• ప్రత్యేకించి రద్దీగా ఉండే పర్యాటక ప్రదేశాల్లో మీ పర్సులు, వ్యక్తిగత డాక్యుమెంట్లు మరియు ఇతర విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోండి.

• అధికారికంగా గుర్తించబడిన టాక్సీలు మాత్రమే ఉపయోగించండి

• భారతీయ ఎంబసీ సంప్రదింపు వివరాలను ఎల్లప్పుడూ మీతో తీసుకువెళ్ళండి.

• నగరంలోని 'సురక్షితమైన' మరియు 'సురక్షితం కాని' ప్రాంతాలు గురించి అప్-టూ-డేట్ సమాచారం కోసం, మీ హోటల్ మేనేజర్ లేదా స్థానిక పర్యాటక సమాచార అధికారిని సంప్రదించండి.

కోవిడ్-19 ప్రయాణ నిర్దిష్ట ప్రయాణ మార్గదర్శకాలు

• పబ్లిక్ ప్రదేశాలలో మరియు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను ఉపయోగించేటప్పుడు ఫేస్ మాస్క్ ధరించండి.

• జనం ఎక్కువగా ఉన్న టూరిస్ట్ ప్రాంతాల్లో వ్యక్తిగత పరిశుభ్రత మరియు సురక్షితమైన దూరాన్ని పాటించండి.

• ఇటీవలి ప్రాంతీయ కోవిడ్-19 మార్గదర్శకాలు మరియు నియమాల గురించి తెలుసుకోండి మరియు వాటిని అనుసరించండి.

• మీరు ఏవైనా లక్షణాలు కనిపిస్తే స్థానిక అధికారులను సంప్రదించండి.

జర్మనీలోని అంతర్జాతీయ విమానాశ్రయాల జాబితా

నగరం విమానాశ్రయం పేరు
ఫ్రాంక్‌ఫర్ట్ఫ్రాంక్‌ఫర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్
బెర్లిన్బెర్లిన్ టీగెల్ విమానాశ్రయం
హాంబర్గ్హాంబర్గ్ విమానాశ్రయం
డార్ట్‌మండ్డార్ట్‌మండ్ విమానాశ్రయం
కొలోన్కొలోన్ బాన్ విమానాశ్రయం
ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయండి

వైద్య అత్యవసర పరిస్థితుల కారణంగా హోటల్ బస పొడిగించబడినప్పుడు ఎదురయ్యే అదనపు ఖర్చులు నిర్వహించడానికి ట్రావెల్ ఇన్సూరెన్స్‌ని అనుమతించండి. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి!

జర్మనీలో ప్రముఖ గమ్యస్థానాలు

జర్మనీలోని అత్యంత ప్రజాదరణ పొందిన ప్రయాణ గమ్యస్థానాల్లో కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి, వీటిని మీరు మీ ప్రయాణ ప్రయాణ ప్రణాళికకు జోడించవచ్చు ;

1

బెర్లిన్

బెర్లిన్ అనేది జర్మనీలో అతిపెద్ద మరియు ఆ దేశపు రాజధాని నగరం. ఇక్కడ 3.7 మిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు, చాలావరకు జర్మనీ ట్రావెల్ ప్లాన్‌లలో ఇదే తరచుగా ప్రారంభ స్థానంగా ఉంటోంది. బెర్లిన్ అనేది చరిత్రలో స్థానం కలిగిన ఒక నగరం మరియు ఇక్కడ అనేక ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలు మరియు సాంస్కృతిక ఆకర్షణలు ఉన్నాయి. అందమైన బెర్లిన్ క్యాథడ్రల్‌లో పర్యటించడంతో పాటు ఇక్కడి అనేక ప్రఖ్యాత బార్లలో ఒకదానిలో ఒక గ్లాస్ బీరు రుచి చూడడం వరకు, ఈ నగరంలో మీ పర్యటన సందర్భంగా మీరు చాలా విషయాలు చేయవచ్చు. బెర్లిన్‌లో రిచ్‌స్టాగ్, మ్యూజియం ఐలాండ్, జెండర్‌మెన్‌మార్క్ట్, విక్టరీ కాలమ్, బెర్లిన్ వాల్ మెమోరియల్ లాంటివి ప్రధాన పర్యాటక ప్రదేశాలుగా ఉన్నాయి.

2

మ్యూనిచ్

అందమైన ఐసర్ నదీ తీరంలో కొలువైన మ్యూనిచ్ అనేది ఈ దేశంలోని మూడవ అతిపెద్ద నగరంగా ఉంటోంది. ఇది జర్మనీలోని ఒక ఆదర్శవంతమైన ప్రదేశం, ఇక్కడ మీరు గొప్ప చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు మరియు ఆధునిక అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక మిశ్రమాన్ని కనుగొనవచ్చు. ప్రపంచ స్థాయి ఫుట్‌బాల్ క్లబ్, FC బేయర్న్ మ్యూనిచ్ మరియు BMW సెంట్రల్ హెడ్‌క్వార్టర్‌కి మ్యూనిచ్ నిలయంగా ఉంటోంది. అలాగే, జర్మనీలో అత్యధికంగా సందర్శించబడే నగరాల్లో ఒకటిగానూ ఉంటోంది. ఈ నగరంలోని స్క్లాస్ నింఫెన్‌బర్గ్, డ్యూష్ మ్యూజియం, పీటర్‌స్కిర్చ్, రెసిడెంజ్, అసంక్రిచ్ మొదలైనవి ఇక్కడి ఇతర పర్యాటక ప్రదేశాలుగా ఉన్నాయి. భారతదేశం నుండి జర్మనీ ప్రయాణం కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోలో చవకైన ట్రావెల్ ఇన్సూరెన్స్‌ కనుగొనండి.

3

ఫ్రాంక్‌ఫర్ట్

ఫ్రాంక్‌ఫర్ట్ ఎఎం మెయిన్ అని అధికారికంగా పిలువబడే ఫ్రాంక్‌ఫర్ట్ అనేది ఈ ప్రాంతంలోని చారిత్రక మరియు మతపరమైన ప్రముఖ కేంద్రంగా ఉంటోంది. ఆకాశాన్నంటే ఆధునిక బిల్డింగులు మరియు మధ్యయుగపు నాటి నిర్మాణాల సమ్మేళనంగా కనిపించే ఈ నగరంలోని విభిన్న దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఫ్రాంక్‌ఫర్ట్‌లో మరియు దాని చుట్టుపక్కలా అత్యంత ముఖ్యమైన ఆకర్షణలుగా రోమర్, ఫ్రాంక్‌ఫర్ట్ ఓల్డ్ టౌన్, పాల్స్‌కిర్చ్, కైసర్‌డం సెయింట్ బార్థోలోమాస్, ఐజర్నర్ స్టెగ్, జూ ఫ్రాంక్‌ఫర్ట్ మొదలైనవి ఉన్నాయి.

4

కొలోన్

దేశపు పశ్చిమం వైపున ఉన్న కొలోన్ నగరం అత్యంత ప్రముఖ పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా ఉంటోంది. ఈ అందమైన నగరం ఈ ప్రాంతంలోని అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక కేంద్రాల్లో ఒకటిగా ఉంటోంది. ఇక్కడ అనేక గ్యాలరీలు, మ్యూజియంలు, చారిత్రాత్మక సైట్లు ఉన్నాయి. మీరు జర్మనీలోని కొలోన్‌ పర్యటనకి వెళ్లినప్పుడు అక్కడి కొలోన్ క్యాథడ్రల్, పాత టౌన్ కొలోన్, కొలోన్ సిటీ హాల్ మొదలైన వాటిని సందర్శించారని నిర్ధారించుకోండి.

5

హాంబర్గ్

బెర్లిన్ తర్వాత, హాంబర్గ్ అనేది జర్మనీలో రెండవ అతిపెద్ద నగరంగా ఉంటోంది. ఇది ఈ ప్రాంతంలోని ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రంగా మరియు కళలు, చరిత్ర, సంస్కృతి, వినోదం మరియు వాణిజ్య అంశాలకు ఒక పెద్ద కేంద్రంగా ఉంటోంది. స్పీచర్‌స్టాడ్ట్, హెఫెన్సిటీ, మెరిటైమ్ మ్యూజియం హాంబర్గ్, ప్లాంటెన్ అన్ బ్లోమెన్ హ్యాంబర్గ్ మొదలైనవి ఈ నగరపు కొన్ని ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.

6

హీడెల్‌బర్గ్

నెక్కర్ నది వెంబడి కొలువైన హీడెల్‌బర్గ్ దాని ఆకర్షణీయ సెట్టింగ్ మరియు ఐకానిక్ హైడెల్‌బర్గ్ కోట కోసం ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ఆకర్షణీయ బారోక్ ఆర్కిటెక్చర్‌ని వీక్షిస్తూ ఈ చారిత్రాత్మక పురాతన పట్టణంలో అడుగుపెట్టండి, జర్మనీ దేశపు పురాతన విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ సందర్శించండి మరియు ఫిలాసఫర్ వాక్ నుండి అద్భుతమైన వీక్షణలను ఆస్వాదించండి. ఆకర్షణీయమైన ఈ పట్టణ రూపం, సాంస్కృతిక వారసత్వం మరియు సెరెన్ నదీతీరం మీలో ఒక మరచిపోలేని అనుభవం సృష్టిస్తాయి.

జర్మనీలో చేయవలసిన పనులు

జర్మనీకి మీ ట్రిప్ సమయంలో, ఈ విషయాలు ప్రయత్నించారని నిర్ధారించుకోండి ;

• 368 మీటర్ల ఎత్తు నుండి ఈ నగరంలోని ఉత్తమ ఆకర్షణీయ వీక్షణలు వీక్షించడం కోసం బెర్లిన్ TV టవర్‌ని సందర్శించండి.

• జర్మనీలోని అనేక నగరాల్లో అందుబాటులో ఉండే వైన్-టేస్టింగ్ టూర్‌కి వెళ్ళండి.

• జర్మనీలోని టాప్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ లీగ్, బండెస్లిగాలో ఫుట్‌బాల్ థ్రిల్-సీకింగ్ లైవ్ గేమ్ చూడండి.

• ఈ దేశవ్యాప్తంగా ఉన్న ఆకర్షణీయ కోటలు వీక్షించడానికి గైడ్ సహాయంతో టూర్ వెళ్లండి.

• సాహసోపేతమైన రైన్ రివర్‌బోట్ రైడ్‌ని మీ ప్రియమైన వారితో కలసి ఆనందించండి.

• ఈ దేశపు చరిత్రను మరింత తెలుసుకోవడానికి యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా ఉన్న మ్యూజియం ఐలాండ్‌ని సందర్శించండి.

• జర్మనీలోని ప్రధాన మార్కెట్లుగా ఉన్న కొలోన్‌లోని షిల్డర్‌గేస్, ఫ్రాంక్‌ఫర్ట్‌లోని జీల్, బెర్లిన్‌లోని కుడామ్, డసెల్‌డార్ఫ్‌లోని కొనిగ్‌సల్లీ మొదలైన మార్కెట్లలో షాపింగ్ విహారానికి వెళ్లండి.

జర్మనీలో డబ్బు ఆదా చేసే చిట్కాలు

జర్మనీ వ్యాప్తంగా ప్రయాణించడం అత్యంత ఖరీదైన వ్యవహారమే అయినప్పటికీ, మీరు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవడానికి కూడా అనేక మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు ;

• రద్దీ సీజన్ కాని సమయంలో మీ సందర్శనను షెడ్యూల్ చేసుకోవడం అనేది మీ జర్మనీ ట్రిప్ సమయంలో డబ్బు ఆదా చేయడానికి ఉత్తమ మార్గాల్లో ఒకటిగా ఉంటుంది. ఈ సమయంలో తక్కువ పర్యాటకుల కారణంగా, వసతులు, ప్రయాణాలు మరియు ఇతర సేవల ధరలనేవి ఇతర పోల్చదగిన స్థాయిలో చవకగా ఉంటాయి.

• జర్మనీలో ప్రయాణించే సమయంలో టాక్సీలు లేదా అద్దెలు తప్పించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అవి అత్యంత ఖరీదైనవిగా ఉండే అవకాశం ఉంది. ట్రామ్స్, బస్సులు, రైళ్లు మొదలైన స్థానిక ప్రజా రవాణా ఉపయోగించండి. ఎందుకంటే, అవి విశ్వసనీయమైనవిగా ఉండడంతో పాటు అత్యంత చవకగా కూడా ఉంటాయి.

• జర్మనీలో ఉన్నప్పుడు తెలివిగా షాపింగ్ చేస్తున్నారని నిర్ధారించుకోండి. ఎందుకంటే, ఇక్కడి వస్తువులు చాలా ఖరీదైనవి మరియు చాలా ప్రదేశాల్లో బేరమాడే పరిస్థితి ఉండకపోవచ్చు.

• జర్మనీలో బయటకు వెళ్లినప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేయడం కోసం స్థానిక రెస్టారెంట్లలో డైనింగ్‌ని పరిగణనలోకి తీసుకోండి. అలా చేయని పక్షంలో, లగ్జరీ రెస్టారెంట్లలో ఆహారం చేసే ఖర్చు అనేది మీ ప్రయాణ బడ్జెట్‌కి భారంగా మారవచ్చు.

• జర్మనీలోని వివిధ ప్రదేశాల్లో అందించే ఉచిత కార్యకలాపాలు మరియు మ్యూజియం టూర్లు లాంటి ప్రయోజనం పొందారని నిర్ధారించుకోండి. ప్రదేశాలు చూడడానికి వెళ్లినప్పుడు డబ్బు ఆదా చేయడానికి ఇది ఒక గొప్ప మార్గంగా ఉంటుంది.

• జర్మనీ ప్రయాణం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో పెట్టుబడి పెట్టడం అనేది ఊహించని సంఘటనల నుండి మిమ్మల్ని ఆర్థికంగా సురక్షితంగా ఉంచుతుంది. మీ జర్మనీ ట్రిప్ సమయంలో డబ్బు ఆదా చేయడానికి మీరు తీసుకోగల ఒక గొప్ప జాగ్రత్త చర్యగా ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా, జర్మనీ కోసం ఉత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కనుగొనండి.

జర్మనీలో ప్రసిద్ధి చెందిన భారతీయ రెస్టారెంట్ల జాబితా

మీరు మీ ట్రిప్ సమయంలో జర్మనీలో సందర్శించగల కొన్ని ఉత్తమ భారతీయ రెస్టారెంట్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి ;

• బాంబే ప్యాలెస్
చిరునామా: డార్మ్‌స్టేడర్ ల్యాండ్‌స్ట్రేస్ 6, 60594 ఫ్రాంక్‌ఫర్ట్ ఎఎం మెయిన్, జర్మనీ
తప్పక ప్రయత్నించాల్సినవి: లస్సీ

• ఇండియా క్లబ్
చిరునామా: బెహ్రెన్‌స్ట్రేస్ 72, 10117 బెర్లిన్, జర్మనీ
తప్పక ప్రయత్నించండి: పిండీ చోలే కుల్చా

• సింగ్ ఇండియన్ రెస్టారెంట్
చిరునామా: స్టీన్‌డామ్ 35, 20099 హాంబర్గ్, జర్మనీ
తప్పక ప్రయత్నించాల్సినవి: షాహి పనీర్

• ఢిల్లీ 6 రెస్టారెంట్
చిరునామా: ఫ్రైడ్రిచ్‌స్ట్రే 237, 10969 బెర్లిన్, జర్మనీ
తప్పక ప్రయత్నించాల్సినవి: కడాయ్ పనీర్

జర్మనీలో స్థానిక చట్టం మరియు పాటించాల్సిన పద్ధతులు

జర్మనీలో పర్యాటకులు అనుసరించాల్సిన కొన్ని ముఖ్యమైన స్థానిక చట్టాలు మరియు పద్ధతులు ఇక్కడ ఇవ్వబడ్డాయి ;

• జర్మనీలో జేవాకింగ్ చట్టవిరుద్ధం మరియు జరిమానా విధించగల నేరం. మీరు జీబ్రా క్రాసింగ్‌ని దాటడం మొదలుపెట్టడానికి ముందు రోడ్-క్రాసింగ్ లైట్ పచ్చ రంగులో మారే వరకు వేచి ఉండండి.

• మీ సందర్శనకు ముందే, జర్మనీలో వ్యర్థాలను రీసైకిల్ చేయడానికి సరైన మార్గం గురించి తెలుసుకోండి. వ్యర్థాలను సరైన పద్ధతిలో పారవేయకపోవడాన్ని ఇక్కడ అభినందించరు.

• ఎవరి ఇంట్లోకైనా అడుగుపెట్టడానికి ముందు, షూలతో పాటుగా లోపలకు వెళ్లడాన్ని అనుమతించారా, లేదా అని విషయం నిర్ధారించుకోండి.

• బైసైకిల్ లైన్‌ని ఫుట్‌పాత్‌గా భావించి తికమక పడకండి. అలా చేయడం వల్ల మీరు సైక్లిస్ట్‌ల మార్గానికి అడ్డువెళ్లే అవకాశం ఉంది. ఇది ప్రమాదకరం మరియు ఒక ప్రధాన ట్రాఫిక్ నేరం కూడా కాగలదు.

• జర్మనీలోని ఎవరికైనా శుభాకాంక్షలు చెప్పే సమయంలో, ప్రత్యేకించి వాళ్లు అపరిచితులైనప్పుడు, వారిని అధికారికంగా పలకరించాలని నిర్ధారించుకోండి.

• మీరు ఎవరినైనా పలకరించాలనుకున్నప్పుడు గుటెన్ ట్యాగ్ (గుడ్ డే) మరియు హాలో (హలో) రెండింటినీ మీరు ఉపయోగించవచ్చు. అలాగే, గుడ్‌బై చెప్పాలనుకుంటే, “Tschüss” ఉపయోగించండి.

జర్మనీలో భారతీయ ఎంబసీలు

జర్మనీలోని భారతీయ ఎంబసీ వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి ;

జర్మనీలోని భారత ఎంబసీ పని గంటలు అడ్రస్
భారత రాయబార కార్యాలయంసోమ-శుక్ర, 9:00 AM - 5:30 PMటైర్‌గార్టెన్‌స్ట్రేస్ 17, 10785 బెర్లిన్, జర్మనీ

ఎక్కువగా సందర్శించబడే దేశాలకు అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్

ఈ కింద ఇవ్వబడిన ఆప్షన్‌ల నుండి మీకు కావలసినది ఎంచుకోండి, తద్వారా మీరు విదేశీ దేశానికి మీ పర్యటన కోసం మరింత మెరుగ్గా సిద్ధం అవచ్చు

చవకైన స్విట్జర్లాండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం శోధిస్తున్నారా?
కేవలం కొన్ని క్లిక్‌లలో మీకు ఇష్టమైన ప్లాన్ పై త్వరిత కోట్‌లను పొందండి!

తాజా ట్రావెల్ ఇన్సూరెన్స్ బ్లాగ్‌లను చదవండి

slider-right
డెన్పసర్లో సందర్శించవలసిన ఉత్తమ ప్రదేశాలు: అల్టిమేట్ గైడ్

డెన్పసర్లో సందర్శించవలసిన ఉత్తమ ప్రదేశాలు: అల్టిమేట్ గైడ్

మరింత చదవండి
18 డిసెంబర్, 2024న ప్రచురించబడింది
ఫిన్‌ల్యాండ్‌లో సందర్శించవలసిన ఉత్తమ ప్రదేశాలు: అల్టిమేట్ గైడ్

ఫిన్‌ల్యాండ్‌లో సందర్శించవలసిన ఉత్తమ ప్రదేశాలు: అల్టిమేట్ గైడ్

మరింత చదవండి
18 డిసెంబర్, 2024న ప్రచురించబడింది
కుటాలో సందర్శించవలసిన ఉత్తమ ప్రదేశాలు: అల్టిమేట్ గైడ్

కుటాలో సందర్శించవలసిన ఉత్తమ ప్రదేశాలు: అల్టిమేట్ గైడ్

మరింత చదవండి
18 డిసెంబర్, 2024న ప్రచురించబడింది
ఇస్తాన్‌బుల్‌లో సందర్శించడానికి ఉత్తమ ప్రదేశాలు

ఇస్తాన్‌బుల్‌లో సందర్శించడానికి ఉత్తమ ప్రదేశాలు

మరింత చదవండి
26 నవంబర్, 2024న ప్రచురించబడింది
మాల్టా వీసా ఇంటర్వ్యూ ప్రశ్నలు

అవసరమైన మాల్టా వీసా ఇంటర్వ్యూ ప్రశ్నలు మరియు చిట్కాలు

మరింత చదవండి
26 నవంబర్, 2024న ప్రచురించబడింది
స్లైడర్-లెఫ్ట్

జర్మనీ ట్రావెల్ ఇన్సూరెన్స్ గురించి తరచుగా అడగబడే ప్రశ్నలు

అవును. జర్మనీ వెళ్లడానికి షెన్గన్ వీసా కోసం దరఖాస్తు చేయడానికి, మీరు చెల్లుబాటు అయ్యే ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి.

జర్మనీ వెళ్లడానికి ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం ఖర్చుని ట్రిప్ వ్యవధి, మొత్తం ప్రయాణీకులు మరియు వారి సంబంధిత వయస్సులు, ఎంచుకున్న కవరేజీ రకం లాంటి అనేక అంశాలు ప్రభావితం చేయవచ్చు. భారతదేశం నుండి జర్మనీ వెళ్లడానికి చవకైన ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం మీరు మా వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు.

ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం మెడికల్ చెక్-అప్ అవసరం అనేది పూర్తిగా మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే ట్రావెల్ ఇన్సూరెన్స్ జర్మనీ ప్లాన్‌లతో ప్రయాణం చేయడానికి ముందు మీరు తప్పనిసరి హెల్త్ చెక్-అప్‌ చేయించుకోవాల్సిన అవసరం లేదు.

సాధారణంగా, చాలావరకు జర్మన్ ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ క్రింద ముందుగా ఉన్న అనారోగ్యాలకు కవర్ లభించదు.

మీరు సులభంగా జర్మనీ కోసం అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు, మీరు ఈ పేజీలో పేర్కొన్న దశలవారీ పద్ధతిని అనుసరించవచ్చు లేదా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి జర్మనీ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

జర్మనీ కోసం ఉత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీ అన్ని ప్రాథమిక అవసరాలు తీర్చగల, అనేక ప్రయోజనాలు, ఫీచర్లు కలిగినదిగా ఉండాలి మరియు సహేతుకమైన ధర ట్యాగ్‌తో లభించాలి. భారతదేశం నుండి జర్మనీ ప్రయాణం కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి మీరు చవకైన ట్రావెల్ ఇన్సూరెన్స్‌ కనుగొనవచ్చు.

జర్మనీ ప్రయాణం కోసం కనీస ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ 30,000 యూరోలుగా ఉండాలి మరియు ఇది అన్ని షెన్గన్ సభ్య రాష్ట్రాలకు వర్తిస్తుంది.

అవార్డులు మరియు గుర్తింపు

BFSI లీడర్‌షిప్ అవార్డులు 2022 - సంవత్సరం యొక్క ప్రోడక్ట్ ఇన్నోవేటర్ (ఆప్టిమా సెక్యూర్)

ETBFSI ఉత్తమ పురస్కారాలు 2021

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ
అవార్డులు సెప్టెంబర్ 2021

ICAI అవార్డులు 2015-16

SKOCH ఆర్డర్-ఆఫ్-మెరిట్

ఉత్తమ కస్టమర్ అనుభవం
అవార్డ్ ఆఫ్ ది ఇయర్

ICAI అవార్డులు 2014-15

CMS అవుట్‌స్టాండింగ్ అఫిలియేట్ వరల్డ్-క్లాస్ సర్వీస్ అవార్డ్ 2015

iAAA రేటింగ్

ISO సర్టిఫికేషన్

ప్రైవేట్ సెక్టార్‌లో ఉత్తమ ఇన్సూరెన్స్ కంపెనీ - జనరల్ 2014

slider-right
స్లైడర్-లెఫ్ట్
అన్ని అవార్డులను చూడండి
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయండి

చదవడం పూర్తయిందా? ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా?