ఘోరమైన ప్రమాదాలు మరణానికి కారణమవుతాయి. ఒక ప్రమాదంలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి అతని/ఆమె తన ప్రాణాలను కోల్పోతే, మా పాలసీ బీమా మొత్తంలో 100% వరకు అందిస్తుంది.
కొన్నిసార్లు పెద్ద ప్రమాదాలు తలరాతను నిర్ణయిస్తాయి. ప్రమాదంలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి శాశ్వతంగా వైకల్యానికి గురైతే, ఇన్సూరెన్స్ మొత్తాన్ని బట్టి ప్రయోజనాలు అందిస్తాము.
ఎముకలు లేకుండా కదలికలు అసాధ్యం. ఒక యాక్సిడెంట్ కారణంగా ఎముకలు విరిగినట్లయితే మా పాలసీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని బట్టి ప్రయోజనాలను అందిస్తుంది.
ఒక అగ్నిప్రమాదం మీ జీవితంలోని వెలుగును తొలగిస్తుంది. ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి ఏదైనా ప్రమాదం ఎదురైతే మా పాలసీ బీమా మొత్తం ఆధారంగా ప్రయోజనాలను అందిస్తుంది మరింత తెలుసుకోండి...
సకాలంలో సహాయం అందకపోవడం ప్రాణాంతకంగా మారవచ్చు. సమీపంలోని ఆసుపత్రికి చేరుకోవడానికి మా పాలసీ రవాణా ఖర్చులను చెల్లిస్తుంది, మరింత తెలుసుకోండి...
ప్రమాదాల వల్ల నగదు కొరత ఏర్పడుతుంది. ప్రమాదం కారణంగా జరిగిన హాస్పిటలైజేషన్ కోసం మేము రోజువారీ నగదు అలవెన్సును అందిస్తాము.
సాహస క్రీడలు మీకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తాయి, కానీ, కొన్ని ప్రమాదాలు ఎదురైనపుడు అవి హానికరంగా మారతాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పాల్గొన్నప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.
మీరు మీ విలువైన ప్రాణానికి హాని తలపెట్టాలనుకోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు గాయపరచుకోవడం మేము కోరుకోము. మా పాలసీ స్వతహాగా-చేసుకున్న గాయాలను కవర్ చేయదు.
యుద్ధం వినాశకరమైనది మరియు దురదృష్టకరమైనది కావచ్చు. అయితే, మా పాలసీ యుద్ధాల కారణంగా సంభవించే ఏ క్లెయిమ్‌ను కవర్ చేయదు.
మీరు డిఫెన్స్ (ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్) కార్యకలాపాలలో పాల్గొన్నప్పుడు సంభవించే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.
మీ వ్యాధి తీవ్రతను మేము అర్థం చేసుకున్నాము. అయితే, మా పాలసీ సుఖవ్యాధులు లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధులను కవర్ చేయదు.
ఊబకాయం కోసం చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ వంటివి మీ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడవు.
చేర్పులు మరియు మినహాయింపు సంబంధిత పూర్తి వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/ పాలసీ వివరాలు చూడండి
ప్రపంచమంతా రాత్రిపూట నిద్రిస్తుంది కానీ, మేము గడియారం వలె రాత్రి, పగలు తేడా లేకుండా మీకు 24 గంటల పాటు నిరంతర కవరేజిని అందిస్తామని నిర్ధారిస్తున్నాము
మీరు మీ తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ వహిస్తారని మాకు తెలుసు. మేము మీ తల్లిదండ్రులను 70 సంవత్సరాల వరకు, ఇతరులను 65 సంవత్సరాల వరకు కవర్ చేయడంలో మద్దతును అందిస్తాము.
మేము భౌగోళిక సరిహద్దులను దాటవేసి ప్రపంచవ్యాప్తంగా కవరేజీని అందిస్తాము.
మేము లైఫ్‌టైమ్ రెన్యూవల్ కోసం వీలైన పాలసీలను అందిస్తాము, కావున, వయస్సు పెరిగే కొద్దీ పాలసీని రెన్యూ చేయడంలో సహాయం చేయడానికి మీ ముందుకు వస్తాము.
మేము సదా మీకు సేవచేయాలని కోరుకుంటాము, పాలసీని రద్దు చేసే ఆప్షన్ మీపై ఆధారపడి ఉంటుంది. మేము ఫ్రీ లుక్ క్యాన్సలేషన్ కోసం అనుమతిస్తాము.
మాపై మీకున్న నమ్మకాన్ని మేము గుర్తిస్తున్నాము మరియు దీర్ఘకాలిక పాలసీలపై డిస్కౌంట్ల కోసం హామీ ఇస్తున్నాము.