ప్రముఖ మేక్ మోడల్స్ కోసం పాలసీ
మోటార్ ఇన్సూరెన్స్
హోమ్ / మోటార్ ఇన్సూరెన్స్ / కారు ఇన్సూరెన్స్ / మేక్ మరియు మోడల్ కోసం కారు ఇన్సూరెన్స్
మీ కార్ ఇన్సూరెన్స్ కోసం త్వరిత కోట్

10pm కంటే ముందు నన్ను సంప్రదించడానికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌కు నేను అధికారం ఇస్తున్నాను. నా NDNC రిజిస్ట్రేషన్‌ను ఈ సమ్మతి ఓవర్‌రైడ్ చేయడానికి నేను అంగీకరిస్తున్నాను.

కాల్ ఐకాన్
సహాయం కావాలా? మా నిపుణులతో మాట్లాడండి 022-62426242

ప్రముఖ బ్రాండ్లు మరియు మోడల్స్ కోసం కారు ఇన్సూరెన్స్ పాలసీ

ఒక కారును కొనుగోలు చేయడం అనేది మీరు చేసే ప్రధాన పెట్టుబడులలో ఒకటి; ఇది జీవితంలో మీరు సాధించిన ఒక పెద్ద విజయం మాత్రమే కాదు, జీవనశైలిలో తెచ్చుకున్న ఒక కొత్త మార్పు కూడా. ఇది సంక్లిష్టమైన ప్రజా రవాణా వ్యవస్థను ఛేదించడంలో మీకు సహాయపడుతుంది. మీరు అస్తవ్యస్తమైన రైళ్లు మరియు రద్దీగా ఉండే బస్సుల్లో ప్రయాణించాల్సిన అవసరం లేదు. ఒక కారు మీలో ఆనందాన్ని తెచ్చిపెట్టినట్లే, అనేక ప్రమాదాలను కూడా ఆహ్వానిస్తుంది. అయితే, థర్డ్ పార్టీ వ్యక్తి లేదా ఆస్తికి సంబంధించిన రిస్క్‌లను ఇన్సూర్ చేయడానికి, మోటారు వాహనాల చట్టం దీనిని తప్పనిసరి చేసింది. చెల్లుబాటయ్యే కారు ఇన్సూరెన్స్ పాలసీ . చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం అనేది జరిమానాలను, ఆర్థిక నష్టాన్ని ఆకర్షించవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద మేము మల్టీఇయర్ థర్డ్ పార్టీ లయబిలిటీ పాలసీని అందిస్తున్నాము, ఇది థర్డ్ పార్టీ వ్యక్తికి లేదా వాహనానికి 2 లేదా 3 సంవత్సరాల వ్యవధి వరకు కవరేజీని అందిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో సంస్థ ఇన్సూరెన్స్ పట్ల పెరుగుతున్న ప్రాధాన్యతను అర్థం చేసుకుంటుంది, ఇది థర్డ్ పార్టీకి సంబంధించిన ప్రమాదాలను కవర్ చేయడమే కాకుండా మీ స్వంత వాహనాన్ని, డ్రైవర్‌ను కూడా సురక్షితం చేస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, యాక్సిడెంట్లు లేదా తీవ్రవాదం కారణంగా సంభవించే నష్టాల నుండి మీ స్వంత వాహనాన్ని ఇన్సూర్ చేయడానికి మేము ప్రత్యేక కాంప్రిహెన్సివ్ కారు ఇన్సూరెన్స్ పాలసీని రూపొందించాము.

కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్

మనము తరచుగా కారు ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేస్తాము; అయితే ఈ బిజీ లైఫ్‌స్టైల్, తీరని షెడ్యూల్స్ కారణంగా సకాలంలో దానిని రెన్యూ చేయడంలో విఫలమవుతాము. మీ తదుపరి రెన్యూవల్ తేదీ కోసం ఎల్లప్పుడూ రిమైండర్‌ను సెట్ చేయండి, తద్వారా మీరు తదుపరి రెన్యూవల్ ప్రీమియంను సకాలంలో చెల్లించవచ్చు. మీ పాలసీ గడువు ముగిసినట్లయితే, మీరు చట్టపరమైన సమస్యను ఎదుర్కొనవచ్చు లేదా మీ వాహనానికి ఏదైనా ప్రమాదవశాత్తు నష్టం జరిగితే ఆ ఆర్థిక నష్టాలను భరించాల్సి రావచ్చు. అయితే, రెన్యూవల్స్ మిమ్మల్ని కేవలం ఇన్సూరెన్స్ చేయించడం కోసం మాత్రమే కాకుండా, నో క్లెయిమ్ బోనస్ వంటి కొనసాగింపు ప్రయోజనాల కోసం కూడా ఉద్దేశించబడ్డాయి.

ప్రసిద్ధ కారు బ్రాండ్లు మరియు మోడల్‌ల జాబితా


కైనెటిక్ మహీంద్ర సుజుకి రాయల్ ఎన్‌ఫీల్డ్
టొయోటా టొయోటా ఇన్నోవా టాటా హ్యుందాయ్
హోండా మారుతీ సుజుకీ ఆల్టో మారుతీ సుజుకి స్విఫ్ట్ నిస్సాన్
ఫోర్డ్ ఫోక్స్‌వేగన్ స్కోడా డాట్సన్
మహీంద్రా XUV 500 హీరో HF డీలక్స్ హీరో స్ప్లెండర్ హ్యుందాయ్
హ్యుందాయ్ గ్రాండ్ హ్యూందాయ్ వెర్నా హ్యుందాయ్ ఎలైట్ హోండా CB షైన్
హోండా డియో హోండా యాక్టివా బజాజ్ బజాజ్ పల్సర్
బజాజ్ ప్లాటినా హీరో మోటార్ కార్ప్. ప్యాషన్ ప్రో హీరో HF డీలక్స్
హీరో స్ప్లెండర్ టివిఎస్ టివిఎస్ అపాచీ టివిఎస్ జుపీటర్

ఇతర సంబంధిత కథనాలు

 

తరచుగా అడిగే ప్రశ్నలు

కారు ఇన్సూరెన్స్ అనేది మీ వాహనానికి ఆర్థిక నష్టాన్ని కలిగించే ఏదైనా సంఘటన నుండి రక్షణ కల్పించడానికి ప్రత్యేకించిన ఒక రకమైన ఇన్సూరెన్స్ పాలసీ. దానితో పాటు, మీ వాహనం కారణంగా తలెత్తే ఏవైనా థర్డ్ పార్టీ బాధ్యతలు కారు ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తాయి. మోటారు వాహన చట్టం ప్రకారం లయబిలిటీ ఓన్లీ పాలసీని కొనుగోలు చేయడం తప్పనిసరి, అది లేకుండా రోడ్డుపై వాహనాన్ని వినియోగించలేరు.
ఒక సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీ ఏదైనా డీకొనడం వలన జరిగే నష్టం, అగ్నిప్రమాదం, దొంగతనం, భూకంపం మొదలైన వాటి వలన మీ వాహనానికి రక్షణను అందిస్తుంది. దీనికి అదనంగా, మరణం, శారీరక గాయం మరియు మూడవ పార్టీ ఆస్తి నష్టం లాంటి ఏదైనా థర్డ్ పార్టీ బాధ్యతకు కవర్ అందిస్తుంది.
ఇక్కడ అందుబాటులోఉన్న రెండు రకాల కారు ఇన్సూరెన్స్ పాలసీలు - కాంప్రిహెన్సివ్ మరియు లయబిలిటీ ఓన్లీ పాలసీ.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 1st సెప్టెంబర్, 2018 నుండి ప్రతి యజమాని తన కొత్త బ్రాండ్ కారు కోసం దీర్ఘకాలిక పాలసీని కొనుగోలు చేయాలి. మీరు మీ విలువైన వాహనం కోసం కింద ఇవ్వబడిన దీర్ఘకాలిక పాలసీల నుండి ఒక దానిని ఎంచుకోవచ్చు: i. 3 సంవత్సరాల వ్యవధి కోసం లయబిలిటీ ఓన్లీ పాలసీ. ఈ పాలసీ థర్డ్ పార్టీకి జరిగిన మరణం లేదా గాయం లేదా ఆస్తి నష్టం కారణంగా తలెత్తే బాధ్యతల నుండి కవరేజీని అందిస్తుంది. ii. 3 సంవత్సరాల పాలసీ వ్యవధి కోసం ప్యాకేజీ పాలసీ. ఈ పాలసీ ఏదైనా ప్రభావ నష్టం, అగ్ని, దొంగతనం, భూకంపం మొదలైన వాటి కారణంగా మీ వాహనాన్ని రక్షించడానికి సమగ్ర కవరేజీని అందిస్తుంది. అంతేకాకుండా, ఇది థర్డ్ పార్టీ విషయంలో జరిగే మరణం, శారీరక గాయం మరియు ఆస్తి నష్టం వంటి ఏదైనా బాధ్యతకు కవరేజీని అందిస్తుంది. iii. 3 సంవత్సరాల పాలసీ వ్యవధి కోసం బండిల్ పాలసీ. ఈ పాలసీ స్వంత నష్టానికి ఒక సంవత్సరం పాటు, థర్డ్ పార్టీ విభాగానికి 3 సంవత్సరాల పాటు కవరేజిని అందిస్తుంది.
అవును, రోడ్డుపై తిరిగే ప్రతి మోటారు వాహనం కనీసం లయబిలిటీ ఓన్లీ పాలసీతో ఇన్సూరెన్స్ చేయబడాలి అని మోటార్ వాహన చట్టం పేర్కొంది.
జీరో డిప్రిషియేషన్ అనేది ఒక యాడ్-ఆన్ కవర్ మరియు అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు. ఇది డిప్రిసియేషన్‌తో సంబంధం లేకుండా మీ వాహనానికి పూర్తి కవరేజ్‌ను అందిస్తుంది. ఉదాహరణకు, మీ వాహనం తీవ్రంగా డ్యామేజ్ అయితే, మీరు ఏ డిప్రిషియేషన్ మొత్తానికి చెల్లించవలసిన అవసరం లేదు మరియు పాలసీ నిబంధనలు, షరతులకు లోబడి పూర్తి క్లెయిమ్ అమౌంట్ కోసం అర్హత పొందుతారు. అయితే, పాలసీ డాక్యుమెంట్ ప్రకారం ఏవైనా అదనపు లేదా మినహాయింపులను మీరు భరించాల్సి ఉంటుంది.
ఎమర్జెన్సీ అసిస్టెన్స్ అనేది ఒక యాడ్-ఆన్ కవర్, అదనపు ప్రీమియంను చెల్లించడం ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు. ఇది బ్రేక్‌డౌన్ సందర్భంలో సహాయాన్ని, టైర్ మార్పిడిలు, టోయింగ్ సౌకర్యం, ఇంధనం భర్తీ మొదలైనటువంటి అనేక ప్రయోజనాలను పాలసీ వ్యవధిలో అందజేస్తుంది. అయితే, ఈ ప్రయోజనాలను పొందడానికి కస్టమర్లు ముఖ్యంగా పాలసీ డాక్యుమెంట్‌లో పేర్కొన్న కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేయాలి.
చాలా సులభంగా, క్లెయిమ్-రహిత సంవత్సరం తర్వాత మీ పాలసీని రెన్యూ చేసేటప్పుడు చెల్లించవలసిన స్వంత డ్యామేజ్ ప్రీమియంలో ఇది ఒక డిస్కౌంట్. ఇది జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడానికి, ప్రమాదాలను నివారించడానికి ఒక ప్రోత్సాహకం.
మీరు మీ గడువు ముగిసిన పాలసీని ఆన్‌లైన్‌లో సులభంగా రెన్యూ చేసుకోవచ్చు. మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి సెల్ఫ్ ఇన్‌స్పెక్షన్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి, ఒకసారి డాక్యుమెంట్లు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా ఆమోదించబడిన తర్వాత, చెల్లింపు లింక్ పంపబడుతుంది, మీరు పాలసీ రెన్యూవల్ కోసం చెల్లింపు చేయవచ్చు. చెల్లింపు చేయబడిన తర్వాత, మీరు పాలసీ కాపీని అందుకుంటారు.
నో క్లెయిమ్ బోనస్ అనేది మునుపటి పాలసీ గడువు తేదీ నుండి 90 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. కావున, గడువు ముగిసిన పాలసీని 90 రోజులోపు రెన్యూ చేయకపోతే నో క్లెయిమ్ బోనస్ 0% అవుతుంది, తదుపరి రెన్యూ చేసిన పాలసీకి ఎలాంటి ప్రయోజనం అందదు.
వాహనం ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV) అనేది 'ఇన్సూరెన్సు మొత్తం'గా పరిగణించబడుతుంది, ఇది ప్రతి ఇన్సూర్ చేసిన వాహనానికి ప్రతి పాలసీ వ్యవధి ప్రారంభంలో నిర్ణయించబడుతుంది. వాహనం IDV అనేది బ్రాండ్ యొక్క తయారీదారు జాబితా చేసిన విక్రయ ధర ఆధారంగా మరియు ఇన్సూరెన్స్/ రెన్యూవల్ ప్రారంభంలో ప్రతిపాదించిన వాహనం మోడల్ ఆధారంగా నిర్ణయించబడుతుంది మరియు డిప్రిసియేషన్ కోసం సర్దుబాటు చేయబడుతుంది (దిగువ పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం). సైడ్ కారు(లు) మరియు / లేదా యాక్సెసరీలు లాంటి ఏవైనా పార్టులు వాహనానికి అమర్చబడి ఉంటే వాటి IDV అనేది తయారీదారు జాబితా చేసిన వాహనం విక్రయ ధరలో చేర్చబడకపోతే, అది కూడా పై విధంగా నిర్ణయించబడుతుంది.
పేపర్ వర్క్, భౌతిక డాక్యుమెంటేషన్ అవసరం లేదు మరియు మీరు మీ పాలసీని తక్షణమే పొందుతారు.
ఇప్పటికే ఉన్న మీ ఇన్సూరెన్స్ పాలసీని ఒక ఎండార్స్‌మెంట్‌ను పాస్ చేయడం ద్వారా కొనుగోలుదారు పేరు మీదకు బదిలీ చేయవచ్చు. అయితే, సేల్ డీడ్/ ఫారమ్ 29/ 30/ విక్రేత NOC/ NCB రికవరీ అమౌంట్ వంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు ఇప్పటికే ఉన్న పాలసీ ప్రకారం ఆమోదం పొందడం అవసరం. లేదా మీరు ఇప్పటికే ఉన్న పాలసీని రద్దు చేయవచ్చు. పాలసీని రద్దు చేయడానికి సేల్ డీడ్/ ఫారమ్ 29/ 30 వంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు కూడా అవసరమవుతాయి.
అవార్డులు మరియు గుర్తింపు
x
x