భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. భారతదేశంలో 70% గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు కానీ ఇన్సూరెన్స్‌కు ఎటువంటి యాక్సెస్ లేదు లేదా అతి తక్కువ యాక్సెస్ కలిగి ఉన్నారు. ప్రోడక్ట్ ఆఫరింగ్ మరియు డిస్ట్రిబ్యూషన్ పరంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇంకా ఈ మార్కెట్‌ను పరీక్షించలేదు. ఇప్పుడు పెట్టుబడులనేవి గ్రామీణ ప్రాంతాలకు కూడా వస్తుండడంతో పరిస్థితి మారుతోంది. సుస్థిరమైన మరియు స్థిరమైన వృద్ధి చరిత్ర కోసం కొత్త మార్కెట్‌ను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యం. ఈ విభాగంలోని ఈ అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుంటే, చెప్పుకోదగ్గ స్థాయిలో ఆస్తి అందుబాటులో ఉంది. గ్రామీణ మార్కెట్ సామర్థ్యాన్ని అందుకోవడానికి ఇన్సూరెన్స్ పరిశ్రమకు ఇదొక అవకాశం అందిస్తుంది. ఈ నేపథ్యంలో, ఆ సామర్థ్యాన్ని అందుకోవడం కోసం ఆ మార్కెట్‌లో అడుగుపెట్టడానికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ నిర్ణయించింది.
కిసాన్ సర్వ సురక్ష కవచ్ పాలసీ అనేది రైతులు మరియు వ్యవసాయ వ్యాపారులకు సంబంధించిన వివిధ ఆస్తులకు విధించబడే విస్తృత శ్రేణి నష్టాలకు కవరేజ్ అందించడం కోసం సమగ్ర ప్యాకేజీతో రూపొందించబడిన ఒక పాలసీ. ఈ పాలసీ కింద అందుబాటులో ఉన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విభాగాలను ఎంచుకోవడం ద్వారా కవరేజ్ కస్టమైజ్ చేయవచ్చు. ఒకే దాని క్రింద కంటెంట్లు, పంపుసెట్లు మరియు జంతువుతో నడిచే బండి కోసం కవరేజ్ అందించబడుతుంది. ఈ కవరేజ్‌తో పాటు వ్యక్తిగత ప్రమాద కవర్ కూడా అందుకోవచ్చు.
ఈ విభాగం అనేది వివిధ సంఘటనల నుండి మీ భవనం, వస్తువులు మరియు వ్యవసాయ వస్తువులను కవర్ చేస్తుంది అవి., అగ్నిప్రమాదాలు మరియు ప్రత్యేక ప్రమాదాలు, భూకంపం, పిడుగులు, అల్లర్లు, సమ్మె, తుఫాను, హరికేన్, టోర్నడో, భూ చరియలు విరిగిపడడం , విస్ఫోటనం, దోపిడీ మరియు దొంగతనం మొదలైనవి.
డ్రైవింగ్ యూనిట్, స్విచ్‌లు, వైరింగ్ మరియు స్టార్టర్‌కు అగ్నిప్రమాదం, లైటింగ్, దోపిడీ, మెకానికల్/ఎలక్ట్రికల్ బ్రేక్‍డౌన్ మరియు అల్లర్లు, సమ్మె లేదా హానికర నష్టంతో సహా మీ సబ్‌మెర్సిబుల్ లేదా సబ్‌మెర్సిబుల్-యేతర పంప్ కోసం ఈ విభాగం కవరేజ్ అందిస్తుంది.
ప్రమాదవశాత్తు మరణం మరియు శాశ్వత వైకల్యం నుండి మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు కవర్ అందిస్తుంది.
ప్రమాదవశాత్తు నష్టాలు, అగ్నిప్రమాదం, పిడుగుపాటు, వరద, దోపిడీ, ఇల్లు కూలడం లేదా దొంగతనం మరియు రవాణా సమయంలో మీ బండికి మరియు/లేదా దాని ఉపకరణాలకు ఎదురయ్యే నష్టం నుండి రక్షణ అందిస్తుంది.
కాలుష్యం మరియు కలుషితం కారణంగా ఆస్తికి నష్టం
తరుగుదల మరియు అరుగుదల కారణంగా జరిగిన నష్టం లేదా డ్యామేజీ, క్రమంగా తగ్గుదల లేదా నెమ్మదిగా సంభవించే నష్టం.
పర్యవసాన నష్టం
ఉద్దేశపూర్వక అనుచిత ప్రవర్తన లేదా నిర్లక్ష్యం
నిర్మాణంలో ఉన్నప్పుడు ప్రాంగణంలో అద్దాలు పగిలిపోవడం లేదా తొలగించే సమయంలో అద్దాలు పగిలిపోవడం.
పరిహార డ్యామేజీల సంఖ్య పెరిగిన ఫలితంగా ఎదురయ్యే ఫైన్‌లు జరిమానాలు, శిక్షాత్మక లేదా ఉత్కృష్ట నష్టాలు లేదా ఏదైనా ఇతర నష్టాలు.
ఆభరణాలు, విలువైన రాళ్ళు, డబ్బు, బులియన్ లేదా ప్రత్యేకంగా పేర్కొన్నవి తప్ప ఇతర డాక్యుమెంట్‌లకు కలిగే నష్టం మరియు/లేదా అవి దెబ్బతినడం.
కుటుంబ సభ్యుల ద్వారా జరిగే దోపిడీ మరియు/లేదా కొల్లగొట్టడం లేదా దొంగతనం.
పశువులు, మోటార్ వాహనం మరియు పెడల్ సైకిళ్లకు కలిగే నష్టాలు.
పంపు సెట్ భాగాలను విడదీయడానికి అయ్యే ఖర్చు, మరమ్మత్తు కోసం షాపుకు తీసుకెళ్లి, మళ్లీ తీసుకురావడానికి అయ్యే రవాణా ఖర్చు మినహాయించబడుతుంది.
ఐదు ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి మరియు ఎంచుకున్న ప్లాన్ ఆధారంగా ఇన్సూర్ చేయబడిన మొత్తం పరిమితులను ఎంచుకోవడానికి ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి సౌలభ్యం ఉంటుంది.
ఏదైనా ప్లాన్ కోసం, సెక్షన్ I అనేది తప్పనిసరిగా ఉంటుంది మరియు అదనంగా ఏదైనా ఒక సెక్షన్ ఎంచుకోవచ్చు.
చెల్లించవలసిన ప్రీమియం అనేది ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ఎంచుకున్న ప్లాన్ మరియు విభాగాల మీద ఆధారపడి ఉంటుంది.
ఇన్సూర్ చేయబడిన మొత్తం | ||||||
సెక్షన్ | విభాగం పేరు | ప్లాన్ - I | ప్లాన్ - II | ప్లాన్ - III | ప్లాన్ - IV | ప్లాన్ - V |
1 | ఆస్తి నష్టం | 50,000 | 100,000 | 150,000 | 200,000 | 250,000 |
2 | వ్యవసాయ పంప్‌సెట్‌లు | 25,000 | 25,000 | 25,000 | 50,000 | 75,000 |
పర్సనల్ యాక్సిడెంట్ | ||||||
ఇన్సూర్ చేయబడిన వ్యక్తి | 25,000 | 25,000 | 25,000 | 50,000 | 100,000 | |
3 | సంపాదన లేని జీవిత భాగస్వామి | 12,500 | 12,500 | 12,500 | 25,000 | 50,000 |
1స్ట్ 2 పిల్లలు - ప్రతిఒక్కరికి | 10,000 | 10,000 | 10,000 | 20,000 | 40,000 | |
4 | పశువుతో నడిచే బండి ఇన్సూరెన్స్ | 20,000 | 20,000 | 20,000 | 20,000 | 20,000 |
1 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్ 24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
1 కోటి+ చిరునవ్వులు సురక్షితం
మీకు అవసరమైన సపోర్ట్-24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards