కరోనా కవచ్, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో పాలసీ అనేది కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఉత్పన్నమయ్యే వైద్య ఖర్చుల కోసం చెల్లించడానికి రూపొందించబడింది. కరోనా కవచ్ పాలసీ ప్రారంభాన్ని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ప్రకటించింది మరియు భారతదేశంలోని అన్ని సాధారణ మరియు స్టాండ్‌అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ తమ వినియోగదారులకు ఈ పాలసీ అందించడాన్ని తప్పనిసరి చేసింది. ఎవరికైనా కోవిడ్-19 ఇన్ఫెక్షన్ పాజిటివ్‌గా తేలితే, వారి హాస్పిటలైజేషన్, ప్రీ-పోస్ట్ హాస్పిటలైజేషన్, హోమ్ కేర్ చికిత్స ఖర్చులు మరియు ఆయుష్ చికిత్సను కవర్ చేయడమనేది కరోనా కవచ్ పాలసీ లక్ష్యంగా ఉంటుంది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా కరోనా కవచ్‌ను ఆన్‌లైన్‌లో కొనండి మరియు ప్రస్తుత మహమ్మారి సమయంలో నాణ్యతగల వైద్య చికిత్సలకు యాక్సెస్ పొందండి.
కోవిడ్-19 ఇన్సూరెన్స్, ఇతర హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్టుల వంటిదే, అయితే ఇది కరోనావైరస్ సంబంధిత ఆరోగ్య అత్యవసర పరిస్థితుల నుండి ఆర్థిక రక్షణను అందిస్తుంది. 2020 లో ప్రారంభమైన కరోనావైరస్ ప్రపంచ విపత్తు కారణంగా కోవిడ్-19 ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రవేశపెట్టబడింది. ఆ సమయంలో, పరిస్థితి తీవ్రతను అనుసరించి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) కోవిడ్-19 వైద్య బిల్లుల నుండి ఆర్థికంగా తమను తాము రక్షించుకోవడంలో వినియోగదారులకు సహాయపడటానికి కరోనా కవచ్ అనే ఒక ప్రాథమిక కోవిడ్-19 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రారంభించడం తప్పనిసరి చేసింది
కోవిడ్-19 వలన ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అనేక మంది మరణించారు. మరియు కరోనావైరస్ మహమ్మారి ఇంకా ముగియలేదు. ప్రస్తుత కోవిడ్-19 వేరియంట్ BF.7 చైనాలో ఉపద్రవం సృష్టిస్తోంది మరియు భారతదేశంలోని కొన్ని ప్రదేశాలలో కూడా కొన్ని కేసులు కనుగొనబడ్డాయి. కాబట్టి, పరిస్థితి తీవ్రమైనప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మరింత ముఖ్యం. మాస్కులు ధరించడం, చేతులను కడుక్కోవడం మరియు శానిటైజ్ చేయడం ప్రజలు అనుసరించవలసిన ప్రాథమిక నియమం. అంతే కాకుండా, కోవిడ్-19 సంబంధిత చికిత్సలను కవర్ చేసే మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం ముఖ్యం. రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీతో పాటు, కరోనా కవచ్ పాలసీని కూడా ప్రత్యేకంగా కొనుగోలు చేయవచ్చు.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ద్వారా తప్పనిసరి చేయబడిన ప్రకారం, ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి కోవిడ్-19 నిర్ధారించబడితే, వారి హాస్పిటలైజేషన్ ఖర్చులను ఈ పాలసీ కవర్ చేస్తుంది. అదిమాత్రమే కాకుండా, హాస్పిటలైజేషన్ వ్యవధిలో కోవిడ్-19 కారణంగా ఏదైన ఇతర అనారోగ్యాలు ఏర్పడితే వాటిని కూడా ఈ పాలసీ కవర్ చేస్తుంది. అయితే, ప్రస్తుత మహమ్మారితో సంబంధం లేని ఏదైనా ఇతర చికిత్సలను ఈ పాలసీ కవర్ చేయదు. ఇతర సాధారణ మరియు క్లిష్టమైన వ్యాధుల కోసం మీరు ఇన్సూరెన్స్ చేయించుకోవాలనుకుంటే, ఒక సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను మీరు ఎంచుకోవాలి. ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం కోసం ఫ్లోటర్ ప్లాన్ రూపంలో కరోనా కవచ్ పాలసీ కొనుగోలు చేయవచ్చు. అయితే, 18 నుండి 65 సంవత్సరాల మధ్య వ్యక్తులకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది.
అయితే, ప్రస్తుత మహమ్మారితో సంబంధం లేని ఏదైనా ఇతర చికిత్సలను ఈ పాలసీ కవర్ చేయదు. ఇతర సాధారణ మరియు క్లిష్టమైన వ్యాధుల కోసం మీరు ఇన్సూరెన్స్ చేయించుకోవాలనుకుంటే, ఒక సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను మీరు ఎంచుకోవాలి. ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం కోసం ఫ్లోటర్ ప్రణాళిక రూపంలో కరోనా కవచ్ పాలసీ కొనుగోలు చేయవచ్చు. అయితే, 18 నుండి 65 సంవత్సరాల మధ్య వ్యక్తులకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది.
బెడ్-ఛార్జీలు, నర్సింగ్ ఛార్జీలు, రక్త పరీక్షలు, PPE కిట్లు, ఆక్సిజన్, ICU మరియు డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు వరకు ప్రతిదానిని ఇది కవర్ చేస్తుంది.
ఆసుపత్రిలో చేరడానికి ముందు, డాక్టర్ కన్సల్టేషన్‌లు, చెక్-అప్‌లు మరియు రోగనిర్ధారణ వైద్య ఖర్చులు ఉంటాయి. ఆసుపత్రిలో చేరడానికి 15 రోజుల ముందు వరకు మేము అటువంటి ఖర్చుల కోసం కవరేజ్ అందిస్తాము. కోవిడ్-19 కోసం రోగనిర్ధారణ ఖర్చులను కూడా మేము కవర్ చేస్తాము.
ఆసుపత్రి నుండి డిస్ఛార్జ్ అయిన 30 రోజుల వరకు అయిన వైద్య ఖర్చుల కోసం కూడా కవరేజ్ పొందండి.
మీరు కరోనా వైరస్ కోసం ఇంటి వద్దే చికిత్స చేయించుకుంటే, అప్పుడు మేము 14 రోజుల వరకు ఆరోగ్య పర్యవేక్షణ, మందుల ఖర్చులు కవర్ చేస్తాము.
మేము ఆయుర్వేదం, యునాని, సిద్ధ మరియు హోమియోపతి వంటి మీ శరీరానికి స్వస్థత చేకూర్చే చికిత్సా పద్ధతులకు మద్దతును ఇస్తాము. మీరు ఏ రకమైనమైన చికిత్సను కోరుకున్నప్పటికీ, అవసరమైన సమయంలో మేము ఎల్లప్పుడూ మీ కోసం అందుబాటులో ఉంటాము.
ఇంటి నుండి ఆసుపత్రికి లేదా ఆసుపత్రి నుండి ఇంటికి అంబులెన్స్‌లో ప్రయాణించినప్పుడు అది కూడా కవర్ చేయబడుతుంది. ప్రతి హాస్పిటలైజేషన్ కోసం మేము ₹2000 చెల్లిస్తాము.
ప్రస్తుత రోగనిర్ధారణ మరియు చికిత్సకు సంబంధించని లేదా ఆకస్మికం కాని డయాగ్నోస్టిక్స్ మరియు మూల్యాంకన ప్రయోజనాల కోసం హాస్పిటలైజేషన్.
బెడ్ రెస్ట్‌కు సంబంధించిన ఖర్చులు, ఇంటి వద్ద కస్టోడియల్ కేర్ లేదా నైపుణ్యం కలిగిన మరియు నైపుణ్యం లేని వారి ద్వారా నర్సింగ్ సౌకర్యం లాంటివి కవర్ చేయబడవు.
డాక్టర్ ద్వారా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఔషధాలు కొనుగోలు చేయడానికి అయ్యే ఖర్చులు కవర్ చేయబడవు.
ఏదైనా నిరూపించబడని చికిత్స, సేవలు మరియు సరఫరాలనేవి వాటి సమర్థతకు మద్దతు ఇవ్వడానికి గణనీయమైన వైద్య డాక్యుమెంటేషన్ లేనప్పుడు వాటికి సంబంధించిన ఖర్చులను మేము కవర్ చేయము. అయితే, కోవిడ్-19 చికిత్స కోసం ప్రభుత్వం ద్వారా అధీకృతం చేయబడిన చికిత్స కవర్ చేయబడుతుంది.
యుద్ధం వినాశకరమైనది మరియు దురదృష్టకరమైనది కావచ్చు. అయితే, మా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు ఏవీ యుద్ధాల సంబంధిత ఏ క్లెయిమ్‌నూ కవర్ చేయదు.
OPD చికిత్సలు లేదా డే కేర్ సంబంధిత వైద్య ఖర్చులు కవర్ చేయబడవు.
ఇన్‌ఆక్యులేషన్‌లు, వ్యాక్సినేషన్‌లు లేదా ఇతర నివారణ చికిత్సకు సంబంధించి ఏవైనా ఖర్చులు కవర్ చేయబడవు.
దేశపు భౌగోళిక పరిమితులకు వెలుపల తీసుకున్న చికిత్స కోసం వైద్య ఖర్చులను మేము కవర్ చేయము.
ప్రభుత్వం ద్వారా అధీకృతం చేయబడని డయాగ్నోస్టిక్ సెంటర్‌లో చేయబడిన పరీక్ష ఈ పాలసీ క్రింద గుర్తించబడదు.
15 రోజుల వరకు కోవిడ్-19 చికిత్స కోసం రోజుకు 24 గంటల హాస్పిటలైజేషన్ కోసం ఇన్సూర్ చేయబడిన మొత్తంలో మీరు 0.5% పొందుతారు.
కరోనా కవచ్ పాలసీ అందుబాటులోకి రావడానికి 15 రోజుల వేచి ఉండే వ్యవధి సూచించబడింది.
కరోనా కవచ్ పాలసీ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో UIN: HDFHLIP21078V012021
కోవిడ్-19 మహమ్మారి ఒక పరీక్ష అని మరియు ఈ ప్రపంచం ఎదుర్కొన్న ఈ సవాలును జయించడానికి బహుళస్థాయిలో సహకారం యొక్క అవసరాన్ని చూపించింది అని కేంద్ర శాస్త్ర మరియు సాంకేతిక మంత్రి అన్నారు.
ఆధారం: NDTV.com | 24 నవంబర్ 2020 న ప్రచురించబడింది
కరోనావైరస్ హాస్పిటలైజేషన్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అయిన కరోనా కవచ్ ప్రజాదరణను పొందింది. భారతదేశం అంతటా ఇన్సూరర్లు అంగీకరించారు.
మూలం: TOI | 17 అక్టోబర్ 2020 న ప్రచురించబడింది
తరచుగా అడిగే ప్రశ్నలు