ప్రపంచంలోని అతిపెద్ద కారు తయారీ సంస్థ 2008లో తమ జెట్టా సెడాన్‌ను విడుదల చేయడంతో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఫోక్స్‌వేగన్ ఇప్పుడు పోలో హ్యాచ్‌బ్యాక్ నుండి ప్రీమియం SUV టిగువాన్ వరకు పలు మోడళ్లను విక్రయిస్తుంది. జర్మన్ తయారీదారు నుండి మోడల్స్ వాటి ప్రీమియం బిల్ట్ క్వాలిటీ, డ్రైవింగ్ డైనమిక్స్ మరియు ఆఫర్‌లో ఉన్న భద్రతా పరికరాలకు ప్రసిద్ధి చెందాయి.
ఫోక్స్‌వేగన్ పేర్కొన్న విభాగాలలో ఈ క్రింది ఆఫర్లను కలిగి ఉంది – ప్రీమియం హ్యాచ్‌బ్యాక్/క్రాస్‌ఓవర్ (పోలో మరియు క్రాస్ పోలో), సబ్-కాంపాక్ట్ (అమియో), కాంపాక్ట్ (వెంటో) మరియు ఎగ్జిక్యూటివ్ సెడాన్ (జెట్టా) విభాగాలు. ఇటీవల, VW టిగువాన్‌తో SUV విభాగంలోకి తిరిగి ప్రవేశించింది. అలాగే ఫోక్స్‌వేగన్ కారు మోడల్స్ కోసం ఒక మంచి కారు ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రమాదం జరిగిన సందర్భంలో చాలా అవసరమైన ఆర్థిక రక్షణను అందిస్తుంది.
అగ్రస్థానంలో ఉన్న ఐదు ఫోక్స్‌వేగన్ మోడల్స్
ఫోక్స్‌వేగన్ పోలోనడపడానికి చాలా సౌకర్యంగా ఉండే ప్రీమియం సిటీ హ్యాచ్ అనేది ఈ విభాగంలో అందుబాటులో ఉంది. అద్భుతమైన డ్రైవింగ్ డైనమిక్స్, చక్కగా-నిర్మించబడిన ఇంటీరియర్‌లు మరియు ఆకట్టుకునే పరికరాల జాబితా లాంటివి దీన్ని కోరుకోవడానికి కారణంగా ఉంటున్నాయి
ఫోక్స్‌వేగన్ అమియోజర్మన్ కార్‌మేకర్ ఫోక్స్‌వేగన్ నుండి వచ్చిన మొదటి సబ్-కాంపాక్ట్ సెడాన్, అమియో, దాని విశాలమైన క్యాబిన్, సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లు మరియు డ్రైవింగ్ డైనమిక్స్‌తో ఆకట్టుకుంది.
ఫోక్స్‌వేగన్ వెంటోకాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌లో ఒక ప్రముఖ ఎంపిక, వెంటో, సౌకర్యం, థ్రిల్ మరియు ఫీచర్లను అందించడంలో ఆల్ రౌండ్ ప్యాకేజీగా నిలుస్తుంది.
ఫోక్స్‌వ్యాగన్ జెట్టాఫోక్స్‌వాగన్ జెట్టా అనేది ఎగ్జిక్యూటివ్ సెడాన్ విభాగం క్రిందకు వస్తుంది. జెట్టా USPలలో ప్రీమియం క్యాబిన్, శక్తివంతమైన ఇంజన్‌లతో పాటు రైడ్ నాణ్యత కూడా లభిస్తుంది.
ఫోక్స్‌వేగన్ టిగ్వాన్SUV విభాగంలోకి మళ్లీ ప్రవేశించిన ఫోక్స్‌వేగన్ టిగ్వాన్ అనేది అన్ని "SUV" విలక్షణతల విషయంలో రాజీ పడకుండానే సెడాన్ లాంటి డ్రైవింగ్ డైనమిక్స్ అందిస్తుంది.
ప్రమాదాలు ఉహించలేనివి. యాక్సిడెంట్ కారణంగా మీ ఫోక్స్‌వ్యాగన్ కారు దెబ్బతిందా? భయపడకండి! మేము దానిని కవర్ చేస్తాము!
బూమ్! అగ్నిప్రమాదం మరియు విస్ఫోటనం ఏదైనప్పటికీ, నిప్పు కారణంగా మీ ఫోక్స్‌వ్యాగన్ కారు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. చింతించకండి మేము దానిని పరిష్కరిస్తాము.
మీ ఫోక్స్‌వ్యాగన్ కార్ దొంగిలించబడిందా? చాలా బాధాకరమైన విషయం! మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మేము దాని కోసం కవరేజ్ అందిస్తాము!
భూకంపం, కొండచరియలు విరిగిపడడం, వరదలు, అల్లర్లు, తీవ్రవాదం మొదలైన వాటి కారణంగా మీకు ఇష్టమైన ఫోక్స్‌వేగన్ కారు దెబ్బతినే అవకాశం ఉంది. మరింత చదవండి...
మీకు ₹ 15 లక్షల ప్రత్యామ్నాయ వ్యక్తిగత యాక్సిడెంట్ పాలసీ ఉంటే, మీరు ఈ కవర్‌ను దాటవేయవచ్చు మరింత చదవండి...
ఒకవేళ మీ ఫోక్స్‌వేగన్ కారు కారణంగా జరిగిన యాక్సిడెంట్‌లో మూడవ వ్యక్తి గాయపడినా లేదా వారి ఆస్తులకు నష్టాలు వాటిల్లినా, మేము వీటికి పూర్తి కవరేజీ అందిస్తాము మరింత చదవండి...
ఫోక్స్‌వేగన్ కార్ విలువలో తరుగుదలను మేము కవర్ చేయము.
ఏవైనా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ బ్రేక్‌డౌన్‌లు లాంటివి కూడా మీ ఫోక్స్‌వేగన్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద కవర్ చేయబడవు.
చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ మీ వద్ద లేకపోతే మీ ఫోక్స్‌వేగన్ కార్ ఇన్సూరెన్స్ ఉపయోగపడదు. డ్రగ్స్/మద్యం ప్రభావం కింద డ్రైవింగ్ చేసినట్లయితే, అది కార్ ఇన్సూరెన్స్ కవరేజ్ పరిధిలోకి రాదు.
సాధారణంగా, మీ ఫోక్స్‌వేగన్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది తరుగుదల మొత్తం మినహాయించిన తర్వాత క్లెయిమ్ మొత్తం మాత్రమే మీకు చెల్లిస్తుంది. మీ పాలసీ వివరాలలో డిప్రిసియేషన్/తరుగుదల వివరాలు ఉంటాయి. కావున, పూర్తి మొత్తాన్ని పొందడానికి మీరు ఏమి చేయవచ్చు? ఇక్కడ ఒక మార్గం ఉంది! జీరో-డిప్రిసియేషన్ కవర్! జీరో డిప్రిసియేషన్‌తో, ఇక డిప్రిసియేషన్ కోతలు ఉండవు, మీరు పూర్తి మొత్తాన్ని అందుకుంటారు!
మీ ఫోక్స్‌వేగన్ కారును పార్క్ చేసి ఉన్నప్పుడు ఏదైనా ఢీకొట్టడం, వరదలు, అగ్నిప్రమాదం మొదలైన వాటి కారణంగా అది డ్యామేజీ కావడం లేదా దాని విండ్‌షీల్డ్ గ్లాస్ డ్యామేజీ అయినప్పుడు, ఈ యాడ్ ఆన్ కవర్ అనేది అప్పటివరకు సంపాదించిన మీ నో క్లెయిమ్ బోనస్‌ను రక్షించడమే కాకుండా, ఆ మొత్తాన్ని తదుపరి NCB స్లాబ్‌కు కూడా తీసుకువస్తుంది.
మీ కారులోని ఏదైనా సాంకేతికత లేదా మెకానికల్ బ్రేక్‌డౌన్ సమస్యలను ఎదుర్కోవడానికి, మేము 24 గంటలూ మీకు సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాము! ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కవర్‌లో సైట్‌లో చిన్న రిపేరింగ్‌లు, లాస్ట్ కీ అసిస్టెన్స్, డూప్లికేట్ కీ సమస్య, టైర్ మార్పులు, బ్యాటరీ జంప్ స్టార్ట్‌లు, ఇంధన ట్యాంక్ ఖాళీ చేయడం, టోయింగ్ ఛార్జీలు ఉంటాయి!
మీ కారు దొంగిలించబడిందని లేదా పూర్తిగా డ్యామేజ్ అయిందని అనే మాట వినబడిన రోజు కన్నా బాధాకరమైన విషయం ఏముంటుంది? మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఎల్లప్పుడూ మీ వాహనపు IDV (ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ) ను చెల్లిస్తుంది. IDV అనేది ఫోక్స్‌వేగన్ కారుకు సంబంధించిన ప్రస్తుత మార్కెట్ ధరకు సమానంగా ఉంటుంది. కానీ, ఇన్‌వాయిస్ యాడ్-ఆన్ కు తిరిగి రావడంతో, మీరు ఇన్‌వాయిస్ విలువ మరియు IDV మధ్య వ్యత్యాసాన్ని కూడా పొందుతారు! మీరు FIR ఫైల్ చేయబడిందని, సంఘటన జరిగిన 90 రోజులలోపు కారును తిరిగి పొందలేదని నిర్ధారించుకోవాలి .
అధిక వర్షాలు లేదా వరద నీళ్లు రావడం లాంటివి సంభవించినప్పుడు, మీ ఫోక్స్‌వ్యాగన్ కారు గేర్ బాక్స్ మరియు ఇంజన్ అనేవి ఇంజన్ మరియు గేర్ బాక్స్ ప్రొటెక్షన్ కవర్ అనే రక్షణాత్మక కవరేజీ కలిగి ఉంటాయి! ఇది అన్ని చిన్న భాగాలు లేదా అంతర్గత భాగాల భర్తీ లేదా మరమ్మత్తు కోసం చెల్లిస్తుంది. అంతేకాకుండా, ఇది లేబర్ ఖర్చులు, కంప్రెషన్ టెస్టుల ఖర్చులు, మెషిన్ ఛార్జీలు, ఇంజన్ సిలిండర్ రీ-బోరింగ్‌లను మరింత కవర్ చేస్తుంది.
మీ కారు తాళం చెవులు దొంగిలించబడ్డాయా లేదా మీరే పోగొట్టుకున్నారా? వీలైనంత త్వరగా మీరు రీప్లేస్‌మెంట్ కీస్ పొందడానికి ఈ యాడ్-ఆన్ మీకు సహాయపడుతుంది!
మీ కారులో ఉపయోగించే అన్ని వినియోగ వస్తువులను కవర్ చేసే వినియోగించదగిన వస్తువుల కవర్ ఇక్కడ ఇవ్వబడింది! అవును! మీకు ప్రస్తుతం ఇది అవసరం! నట్స్, బోల్టులు వంటి మళ్లీ ఉపయోగించడానికి వీలుకాని అన్ని వినియోగ వస్తువుల కోసం ఇది చెల్లిస్తుంది....
మీ కారు రిపేర్‌లో ఉన్నప్పుడు క్యాబ్స్ కోసం చెల్లించారా? డౌన్‌టైమ్ ప్రొటెక్షన్ ఇక్కడ ఉంది! రోజువారీ ప్రయాణం కోసం ఇతర రవాణా మార్గాలను ఉపయోగించడానికి కస్టమర్ చేసిన ఖర్చుకు క్యాష్ అలవెన్స్ ప్రయోజనాన్ని అందిస్తుంది .
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో పై ఆన్‌లైన్‌లో మీ కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ వేగవంతమైనది మరియు సులభమైనది. దీనికి అవసరం అయ్యే పేపర్‌వర్క్ చాలా తక్కువగా ఉంటుంది. మీరు చేయవలసిందల్లా ఇక్కడ క్లిక్ చేయడం మరియు మీ గడువు ముగిసే పాలసీ వివరాలను ఆన్‌లైన్‌లో ఇవ్వడం, కొత్త పాలసీ వివరాలను చూడడం మరియు అనేక సెక్యూర్డ్ చెల్లింపు ఎంపికల ద్వారా తక్షణ ఆన్‌లైన్ చెల్లింపు చేయడం. అంతే!
మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి ఆన్‌లైన్‌లో ఫోక్స్‌వ్యాగన్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినప్పుడు సరళమైన విధానాలు, వేగవంతమైన పంపిణీ మరియు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. కాబట్టి, ఏదైనా ఊహించని దుర్ఘటన జరిగిన తర్వాత, మీరు సురక్షితంగా మరియు వెంటనే డ్రైవింగ్ చేయాలని అనుకుంటే, అప్పుడు మీ ఇన్సూరెన్స్ భాగస్వామిగా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోను ఎంచుకోండి!
మీలో ఎక్కువ మందికి దీనిని అర్థం చేసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. కానీ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఈ అపోహను తొలగించింది. ఇది క్లెయిమ్ ప్రాసెస్‌ను వేగంగా, సులభంగా మరియు సరళంగా మార్చేసింది. మీరు చేయవలసిందల్లా, ఈ కంపెనీ మొబైల్ యాప్, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఇన్సూరెన్స్ పోర్ట్‌ఫోలియో ఆర్గనైజర్ (IPO) లేదా టోల్ ఫ్రీ నంబర్ 022 6234 6234 ద్వారా మీ క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోవడం. క్లెయిమ్ ప్రాసెస్ గురించి వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
అన్ని రకాల వాహనాలు | ఓన్ డ్యామేజ్ ప్రీమియంపై % తగ్గింపు |
---|---|
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి పూర్తి సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు | 20% |
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 2 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు | 25% |
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 3 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు | 35% |
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 4 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు | 45% |
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 5 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు | 50% |
వాహనం యొక్క వయస్సు | IDV నిర్ణయించడానికి % లో డిప్రిసియేషన్ |
---|---|
6 నెలలకు మించనిది | 5% |
6 నెలలకు మించి కానీ 1 సంవత్సరం మించనిది | 15% |
1 సంవత్సరం మించి కానీ 2 సంవత్సరాలు మించనిది | 20% |
2 సంవత్సరాలు మించి కానీ 3 సంవత్సరాలు మించనిది | 30% |
3 సంవత్సరాలు మించి కానీ 4 సంవత్సరాలు మించనిది | 40% |
4 సంవత్సరాలు మించి కానీ 5 సంవత్సరాలు మించనిది | 50% |