అసాధారణమైన కస్టమర్ ఎంగేజ్‌మెంట్ వ్యూహాలు మరియు పద్ధతులను గుర్తించే ప్రముఖ ప్లాట్‌ఫారం 13వ ACEF గ్లోబల్ కస్టమర్ ఎంగేజ్‌మెంట్ అవార్డులలో మా హియర్ యాప్ గోల్డ్ గెలుచుకుంది. ఇది అవాంతరాలు లేని కస్టమర్ అనుభవాన్ని అందించడానికి మా ఇన్నోవేషన్ మార్గంపై కొనసాగడానికి మాకు ఒక ప్రేరణగా పనిచేస్తుంది.
3వ వార్షిక శ్రేష్ఠత అవార్డులు 2024 వద్ద ఇన్సూరెన్స్‌లో సంవత్సరం యొక్క ఉత్తమ కస్టమర్ రిటెన్షన్ ఇనీషియేటివ్ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోకు సిఎక్స్ ఎక్సలెన్స్ అవార్డు అందించబడింది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఇన్సూరెన్స్ అలర్ట్స్ ద్వారా నిర్వహించబడిన 7వ వార్షిక ఇన్సూరెన్స్ కాంక్లేవ్ మరియు అవార్డులలో 'ఉత్తమ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ'గా గుర్తించబడింది.
భారతీయ బిజినెస్ కౌన్సిల్ ద్వారా నిర్వహించబడిన డిజిటల్ డ్రాగన్ అవార్డులలో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 'హియర్' యాప్ 'అత్యంత ఇన్నోవేటివ్ మొబైల్ యాప్'గా గుర్తించబడింది.
బ్యాంకింగ్ ఫ్రంటియర్స్ ద్వారా నిర్వహించబడిన ఇన్సూరెన్స్ కాన్ఫరెన్స్ మరియు అవార్డ్స్ 2024 వద్ద హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 'ఉత్తమ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ది ఇయర్' గా గౌరవించబడింది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 4వ ICC ఎమర్జింగ్ ఆసియా ఇన్సూరెన్స్ కాంక్లేవ్ 2023 వద్ద 'ఉత్తమ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ' మరియు 'ఉత్తమ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ' వంటి ప్రతిష్టాత్మక టైటిల్స్‌ను గెలుచుకుంది
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోకు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందించబడ్డాయి- 10వ ET ఎడ్జ్ ఇన్సూరెన్స్ సమ్మిట్‌లో స్మార్ట్ ఇన్సూరర్, స్విఫ్ట్ మరియు ప్రాంప్ట్ ఇన్సూరర్
క్రిప్టాన్ ఇండియా ద్వారా నిర్వహించబడిన BFSI లీడర్‌షిప్ అవార్డులు 2022 వద్ద సైబర్ ఇన్సూరెన్స్ మరియు ఆప్టిమా సెక్యూర్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 'ప్రోడక్ట్ ఇన్నోవేటర్' కేటగిరీ కింద రెండు అవార్డులను గెలుచుకుంది. ఈ అవార్డు BFSI రంగంలోని పథనిర్దేశకులను గుర్తించి, అభినందిస్తుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మొబైల్ అప్లికేషన్ ద్వారా చేపట్టిన 'టెలి క్లినిక్ సర్వీస్' చొరవ, లాక్‌డౌన్ సమయంలో ప్రవేశ పెట్టిన మోటార్ జంప్-స్టార్ట్ సర్వీస్ మరియు డిజిటల్ పాలసీ సేవలను బలోపేతం చేసినందుకు గాను, ET BFSI ఎక్సలెన్స్ అవార్డ్స్ 2021లో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో “ఉత్తమ కోవిడ్ వ్యూహం అమలు - కస్టమర్ అనుభవం [ఇన్సూరెన్స్]” విభాగంలో గొప్ప అవార్డును దక్కించుకుంది'. ఇది పరిశ్రమకు సహకరించిన ప్రతి సంస్థ విజయాలను గుర్తించి వారికి రివార్డును అందించే ప్రతిష్టాత్మకమైన అవార్డు.
FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డులు, 2021 వద్ద హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో "క్లెయిమ్స్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్" కేటగిరీ కింద అవార్డు గెలుచుకుంది. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు, భారతీయ ఇన్సూరెన్స్ పరిశ్రమలోనే అద్భుతమైన పనితీరును కనబరిచినందుకు గాను పొందే గొప్ప గుర్తింపు.
కేటగిరీ IV క్రింద 2015- 16 ఆర్థిక నివేదికలో ఉత్తమతకు గాను ICAI ద్వారా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కి ఒక అవార్డు లభించింది. ఆర్థిక నివేదికలో ఉత్తమతకు గాను ఇది మాకు వరుసగా 2 వ సంవత్సరంలో మరియు మా ప్రయాణంలో 4వ సారి లభించింది. ఇది ఈ సంవత్సరం నాన్-లైఫ్ కేటగిరీలో అందించబడిన ఏకైక అవార్డు.
ఈ SKOCH ఆర్డర్ ఆఫ్ మెరిట్ "భారతదేశంలో టాప్ 100 ప్రాజెక్టులకు" అందించబడుతుంది. ఎన్నో నామినేషన్లు మరియు ప్రెజెంటేషన్ల నుండి ప్రసిద్ధ నిపుణులతో కూడిన జ్యూరీ మరియు SKOCH సెక్రటేరియట్ చేత ప్రాజెక్టులు ఎంపిక చేయబడతాయి. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో యొక్క క్లెయిమ్ సర్వే మేనేజ్మెంట్ కి, 46వ Skoch సమ్మిట్ వద్ద "SKOCH ఆర్డర్-ఆఫ్-మెరిట్" అందించబడింది.
కస్టమర్ సంబంధాలను మెరుగుపరచడానికి మరియు దీర్ఘకాలంలో లాభదాయకతను పెంచడానికి కస్టమర్ సర్వీస్ మరియు కస్టమర్ అనుభవంలో సంస్థ చేసిన కృషిని ఈ అవార్డు గుర్తిస్తుంది. ఈ అవార్డు కోసం పరిగణించబడే ప్రాథమిక పారామితులు ఇలా ఉన్నాయి; కస్టమర్ సర్వీస్ ప్రక్రియలను సులభతరం చేయడానికి చేపట్టిన కార్యక్రమాలు, ఉత్తమ కస్టమర్ అనుభవాన్ని అందించడానికి ఆటోమేషన్ వినియోగం మరియు మార్పుల ద్వారా అందించబడిన ROI.
ఈ అవార్డ్ జ్యూరీలో రెగ్యులేటర్లకి చెందిన ప్రముఖ వ్యక్తులు మరియు పరిశ్రమ నిపుణులు ఉన్నారు మరియు దీనికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) మాజీ ఛైర్మన్ శ్రీ ఎం. దామోదరన్ నేతృత్వం వహించారు. ప్రతి కేటగిరిలో అకౌంటింగ్ ప్రమాణాలు, చట్టబద్దమైన మార్గదర్శకాలు మరియు సంబంధిత ఇతర ప్రకటనలతో సమ్మతి స్థాయి ప్రకారం మూల్యాంకనం యొక్క పారామితులు ఉంటాయి. కఠినమైన మూల్యాంకన ప్రక్రియ ఆధారంగా, పాల్గొన్న 175 మందిలో 12 మందికి అవార్డులు అందించబడ్డాయి; మరియు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మాత్రమే గోల్డ్ షీల్డ్ అందుకుంది. 2012-13 ఆర్థిక సంవత్సరం తర్వాత మళ్ళీ ఈ గోల్డ్ షీల్డ్‌ను అందుకున్నందుకు మేము గర్వపడుతున్నాము.
చబ్ మల్టీనేషనల్ సొల్యూషన్స్‌తో మా సమర్థవంతమైన సేవలను మరియు నిరంతర మద్దతును ఈ అవార్డు అభినందిస్తుంది. ఇది పరస్పర కస్టమర్లకు అందించిన మా అత్యుత్తమ సేవలకి నాంది పలుకుతుంది. ఈ క్రింద పేర్కొన్న వాటిలో అద్భుతమైన పనితీరును ఈ అవార్డు గుర్తిస్తుంది:
1) పాలసీ జారీ మరియు సర్వీస్ స్థాయిలు
2) చబ్‌తో సంబంధం యొక్క వ్యవధి
3) చబ్ మల్టీనేషనల్ అకౌంట్ కోఆర్డినేటర్ల ద్వారా నామినేషన్
4) అఫిలియేట్ నెట్‌వర్క్ మేనేజర్ల సిఫార్సు
ICRA (మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ యొక్క అనుబంధ సంస్థ) ద్వారా సంస్థకి iAAA రేటింగ్ అందించబడింది, ఇది అత్యధిక క్లెయిమ్ చెల్లింపు సామర్థ్యాన్ని సూచిస్తుంది. కంపెనీ యొక్క బలమైన స్థితిని మరియు పాలసీదారు పట్ల బాధ్యతలను ఉత్తమంగా నెరవేర్చడాన్ని ఈ రేటింగ్ సూచిస్తుంది. సంస్థ యొక్క బలమైన పునాది, దేశంలోని ప్రైవేట్ సెక్టార్ జనరల్ ఇన్సూరర్లలో దాని నాయకత్వ స్థానం, సమతుల్య మరియు విభిన్నమైన పోర్ట్‌ఫోలియో, విజ్ఞత కలిగి ఉన్న అండర్‌రైటింగ్ విధానం మరియు రీఇన్సూరెన్స్ వ్యూహాన్ని రేటింగ్ పరిగణనలోకి తీసుకుంటుంది.
ఈ క్రింద పేర్కొనబడిన విధులకు సంబంధించిన ప్రక్రియల కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కి ISO 9001:2015 సర్టిఫికేషన్ అందించబడింది:
1) ప్రమాదం & నష్టం తగ్గింపు మరియు ఖర్చు నిర్వహణ విభాగం.
ఈ సర్టిఫికేషన్ నాణ్యత వ్యవస్థలు మరియు ప్రమాదం & నష్టం తగ్గింపు మరియు ఖర్చు నిర్వహణ విధిలో హామీ కోసం అంతర్జాతీయంగా స్థాపించబడిన ప్రమాణాలతో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో యొక్క అనుగుణ్యతను ధృవీకరిస్తుంది. సర్టిఫికేషన్ అనేది కస్టమర్ల అవసరాలు మరియు అంచనాలను నెరవేర్చడానికి ఏర్పాటు చేయబడిన నియంత్రణల యొక్క ధృవీకరణ. ఈ సర్టిఫికేషన్ కంపెనీ యొక్క ఉత్పత్తులు మరియు సేవలు ఇప్పటికే ఉన్న మార్కెట్ ప్రమాణాలు మరియు అవసరాలకు అత్యంత అనుగుణంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది.
పైన నిర్వచించబడిన ప్రమాదం & నష్టం తగ్గింపు మరియు ఖర్చు నిర్వహణ విధుల కోసం ISO సర్టిఫికేషన్ ఈ క్రింద నిర్వచించబడిన పరిధి కోసం అందించబడింది:
ప్రమాదం మరియు నష్టం తగ్గింపు, ఖర్చు నిర్వహణ వ్యూహం సంబంధిత ప్రక్రియల అమలుకు సంబంధించిన సేవలు.
ఈ సర్టిఫికేషన్ క్రింద కవర్ చేయబడే ప్రక్రియల్లో ఇవి ఉంటాయి:
1) డేటా విశ్లేషణ ద్వారా సపోర్ట్ చేయబడిన రిఫర్ చేయబడిన క్లెయిముల పరిశోధన మరియు రికవరీలు.
2) యాంటీ ఫ్రాడ్ పాలసీ, ప్రజా వేగు పాలసీ మరియు విశ్లేషణ సమాచారం ద్వారా సపోర్ట్ చేయబడే అటువంటి సంబంధిత పాలసీలను కలిగి ఉన్న ఫ్రాడ్ మేనేజ్మెంట్ ఫ్రేమ్‌వర్క్‌ను సంస్థ అమలు చేయడం.
3) ఖర్చును తగ్గించడానికి బాహ్య ఏజెన్సీలతో సమగ్ర పరిశీలన మరియు చర్చలను నిర్వహించడం.
ఈ క్రింద పేర్కొనబడిన విధులకు సంబంధించిన ప్రక్రియల కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కి ISO 9001:2008 సర్టిఫికేషన్ అందించబడింది:
1) ఆపరేషన్స్ మరియు సర్వీసెస్
2) కస్టమర్ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్
3) క్లెయిమ్స్ మేనేజ్మెంట్
ఈ సర్టిఫికేషన్ నాణ్యతా వ్యవస్థలు మరియు కార్యకలాపాలు, క్లెయిమ్ ప్రాసెసింగ్ మరియు కస్టమర్ సేవలో హామీ కోసం అంతర్జాతీయంగా స్థాపించబడిన ప్రమాణాలతో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో యొక్క అనుగుణ్యతను ధృవీకరిస్తుంది. సర్టిఫికేషన్ అనేది కస్టమర్ల అవసరాలు మరియు అంచనాలను నెరవేర్చడానికి ఏర్పాటు చేయబడిన నియంత్రణల యొక్క ధృవీకరణ. ఈ సర్టిఫికేషన్ కంపెనీ యొక్క ఉత్పత్తులు మరియు సేవలు ఇప్పటికే ఉన్న మార్కెట్ ప్రమాణాలు మరియు అవసరాలకు అత్యంత అనుగుణంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది.
పైన నిర్వచించబడిన విధులకు ISO సర్టిఫికేషన్ దిగువ నిర్వచించబడిన స్కోప్ కోసం అందించబడింది:
a) కస్టమర్ అనుభవ నిర్వహణ – కాల్ సెంటర్ మరియు సంబంధిత ప్రక్రియల ద్వారా కస్టమర్ ప్రశ్నలు మరియు ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన సేవలు
CEM సర్టిఫికేషన్ కింద కవర్ చేయబడే ప్రక్రియల్లో ఇవి ఉంటాయి:
1) ఇన్‌బౌండ్ కాల్ సెంటర్ మరియు ఇమెయిల్ నిర్వహణ
2) నాణ్యత మరియు శిక్షణ
3) ఫిర్యాదు నిర్వహణ
b) క్లెయిమ్‌లు – ఇన్ హౌస్ హెల్త్ క్లెయిమ్స్ సేవలు, సర్వేయర్ల నెట్‌వర్క్, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లు మరియు ఇతర ఏజెన్సీల ద్వారా మా జనరల్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ కోసం మా కస్టమర్లు దాఖలు చేసిన క్లెయిమ్‌లకు సంబంధించిన సేవలను అందించడం
క్లెయిమ్స్ సర్టిఫికేషన్ క్రింద కవర్ చేయబడే ప్రక్రియల్లో ఇవి ఉంటాయి:
1) మోటార్ OD మరియు TP క్లెయిమ్స్ నిర్వహణ
2) రిటైల్, కార్పొరేట్, ట్రావెల్, ఫైర్ మెరైన్ మరియు ఇంజనీరింగ్ కోసం క్లెయిమ్‌ల నిర్వహణ
3) హెల్త్ క్లెయిమ్స్ సర్వీసులు
c) కార్యకలాపాలు మరియు సర్వీసులు – ప్రొక్యూర్‌మెంట్ మరియు అడ్మినిస్ట్రేషన్‌తో సహా రిటైల్ మరియు కార్పొరేట్ క్లయింట్లు మరియు సౌకర్యాల నిర్వహణ కోసం మా జనరల్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ యొక్క పాలసీ జారీ మరియు సర్వీసింగ్
O&S సర్టిఫికేషన్ కింద కవర్ చేయబడే ప్రక్రియల్లో ఇవి ఉంటాయి:
1) రిటైల్, కార్పొరేట్, బ్యాంక్ హామీ, రూరల్ లైన్ కార్యకలాపాల కోసం పాలసీ మరియు ఎండార్స్‌మెంట్ జారీతో సహా అన్ని కేంద్ర O&S కార్యకలాపాలు 2) లాజిస్టిక్స్ కంట్రోల్ యూనిట్
3) ఇన్‌వార్డింగ్, ప్రీమియం చెక్ మేనేజ్‌మెంట్, వాక్-ఇన్ కస్టమర్ మేనేజ్‌మెంట్, కవర్ నోట్ మేనేజ్‌మెంట్, పాలసీ / ఎండార్స్‌మెంట్ జారీతో సహా బ్రాంచ్ ఆపరేషన్స్ ఫంక్షన్
4) బ్యాంకింగ్ కార్యకలాపాలు
5) సౌకర్యాల నిర్వహణ మరియు బ్రాంచ్ అడ్మినిస్ట్రేషన్ లతో సహా అడ్మిన్ మరియు ప్రొక్యూర్‌మెంట్
సర్టిఫికేషన్ క్రింద కవర్ చేయబడిన లొకేషన్లు క్రింద ఇవ్వబడ్డాయి:
1) కార్పొరేట్ ఆఫీస్, ముంబై
2) స్థానిక శాఖలు
a) లోవర్ పరేల్, ముంబై
బి) బోరివలి, ముంబై
సి) చెన్నై, మైలాపూర్
డి) చెన్నై, తేనంపేట్టై
e) బెంగుళూరు
f) కన్నాట్ ప్లేస్, న్యూఢిల్లీ
జి) నెహ్రూ ప్లేస్, న్యూఢిల్లీ
కస్టమర్ సంతృప్తి కొరకు ఏర్పాటు చేయబడిన ప్రమాణాలను అనుసరించి సంస్థ యొక్క అంతర్గత ప్రక్రియలు ఉన్నాయి అని పరిగణనలోకి తీసుకొని ఈ ISO సర్టిఫికేషన్ అందించబడింది. అన్ని శాఖలు మరియు ప్రదేశాలలో అనుసరించబడుతున్న ప్రక్రియల ప్రమాణీకరణ మరియు సమరూపతను ఇది ప్రతిబింబిస్తుంది.
CEM ISO సర్టిఫికేట్‌ను చూడండి క్లెయిమ్స్ ISO సర్టిఫికేట్‌ను చూడండి O&S ISO సర్టిఫికేట్‌ను చూడండి
వ్యూహం, భద్రత, కస్టమర్ సర్వీస్ మరియు భవిష్యత్తు సాంకేతికత సవాళ్లు మరియు ఆవిష్కరణల ఆధారంగా BFSI పరిశ్రమలో ఉత్తమ విధానాలను ఈ అవార్డు ఉద్ఘాటిస్తుంది. కస్టమర్ పోల్ మరియు జ్యూరీ బెంచ్ ద్వారా విశ్లేషించబడిన తర్వాత ఈ అవార్డు ఎంపిక చేయబడింది.
ఈ ఈవెంట్ హాంకాంగ్ లో 28th Feb'14 నాడు ది ఎక్స్‌సెలెన్స్ ఇన్ గ్లోబల్ ఎకానమీ (4వ ఎడిషన్) చేత నిర్వహించబడింది. ఈ అవార్డు ఒక స్వతంత్ర సర్వే ఆధారంగా అందించబడింది మరియు నాయకత్వం, వినూత్న సేవలు మరియు కస్టమర్ అవసరాల కోసం ఒక క్రియాశీల పద్ధతిలో మరియు వివిధ ఉత్పత్తులతో అందించిన ప్రతిస్పందనను పరిగణనలోకి తీసుకొని విశ్లేషించబడింది.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ద్వారా కేటగిరీ III - ఇన్స్యూరెన్స్ సెక్టార్ కింద 2012-13 సంవత్సరం కోసం ఫైనాన్షియల్ రిపోర్టింగ్‌లో ఉత్తమత కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోకు గోల్డ్ షీల్డ్ ICAI అవార్డులు అందించబడ్డాయి. అకౌంటింగ్ ప్రమాణాలు, చట్టబద్దమైన మార్గదర్శకాలు మరియు ఇతర సంబంధిత ప్రకటనలతో సమ్మతి స్థాయి ప్రకారం జడ్జీల ప్యానెల్ ద్వారా ఈ అవార్డు ఎంపిక చేయబడింది. అవార్డ్ జ్యూరీ కమిటీ యొక్క ఛైర్మన్‌గా శ్రీ టి.ఎస్. విజయన్, ఛైర్మన్, IRDA వ్యవహరించారు.
ఈ అవార్డులు ఎంప్లాయర్ బ్రాండింగ్ ఇన్స్టిట్యూట్, వరల్డ్ HRD కాంగ్రెస్ మరియు ఇండస్ట్రీ గ్రూప్ యొక్క స్టార్స్ ద్వారా నిర్వహించబడతాయి. CMO ఆసియా ఒక వ్యూహాత్మక భాగస్వామిగా ఉంది మరియు ఆసియన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బిజినెస్ ద్వారా ఈ అవార్డులు ఎండార్స్ చేయబడ్డాయి. అత్యుత్తమ పనితీరు ప్రదర్శిస్తూ రోల్ మోడల్ మరియు ఆదర్శప్రాయమైన నాయకత్వానికి ఉదాహరణగా నిలిచిన వ్యక్తులు మరియు సంస్థలకు ఈ అవార్డులు అందించబడతాయి. నైపుణ్యం మరియు HR విధానాలకు ప్రమాణాలు నిర్దేశించడం దీని లక్ష్యం.
ఈ ఈవెంట్ హాంకాంగ్ లో 22th Feb'13 నాడు ది ఎక్స్‌సెలెన్స్ ఇన్ గ్లోబల్ ఎకానమీ (3వ ఎడిషన్) చేత నిర్వహించబడింది. ఈ అవార్డు ఒక స్వతంత్ర సర్వే ఆధారంగా అందించబడింది మరియు నాయకత్వం, వినూత్న సేవలు మరియు కస్టమర్ అవసరాల కోసం ఒక క్రియాశీల పద్ధతిలో మరియు వివిధ ఉత్పత్తులతో అందించిన ప్రతిస్పందనను పరిగణనలోకి తీసుకొని విశ్లేషించబడింది.
మానవ వనరులలో అత్యుత్తమ పనితీరు ప్రదర్శిస్తూ రోల్ మోడల్ మరియు ఆదర్శప్రాయమైన నాయకత్వానికి ఉదాహరణగా నిలిచిన వ్యక్తులు మరియు సంస్థలకు ఈ అవార్డులు అందించబడతాయి. నైపుణ్యం మరియు HR విధానాలకు ప్రమాణాలు నిర్దేశించడం దీని లక్ష్యం.
UTV బ్లూమ్‌బర్గ్ - ఫైనాన్షియల్ లీడర్‌షిప్ అవార్డ్స్ 2012 ద్వారా "ఉత్తమ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మరియు కేటగిరీ ఎన్హాన్స్‌మెంట్ - ఇన్సూరెన్స్" కేటగిరీ కింద హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో విజేతగా ప్రకటించబడింది. పాలసీదారులకు అందించబడుతున్న వినూత్న ప్రోడక్టులు, ప్రస్తుతం ఉన్న మరియు భావి పాలసీదారులకు అవగాహన కల్పించడానికి చేపట్టిన కార్యక్రమాలు, వెబ్‌సైట్ నావిగేషన్‌లో సరళత, సమర్థవంతమైన క్లెయిమ్ సపోర్ట్, ఫిర్యాదు పరిష్కార రేటు మరియు సంస్థ యొక్క మార్కెట్ షేర్ ప్రకారం అందిన ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా ఈ కేటగిరిలో అవార్డు కోసం షార్ట్‌లిస్ట్ చేయబడతారు. ఎక్స్‌టర్నల్ జ్యూరీ ద్వారా విజేత పై తుది నిర్ణయం తీసుకోబడుతుంది. లైఫ్ మరియు జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల కోసం ఇది ఒక సింగిల్ అవార్డు.
ఈ ఈవెంట్ హాంకాంగ్ లో 22 నవంబర్ '13 నాడు ది ఎక్స్‌సెలెన్స్ ఇన్ గ్లోబల్ ఎకానమీ (4వ ఎడిషన్) చేత నిర్వహించబడింది. ఈ అవార్డు ఒక స్వతంత్ర సర్వే ఆధారంగా అందించబడింది మరియు సుస్థిరత, వ్యాపార ఫలితాలు, వ్యూహాత్మక అభివృద్ధి, సర్వీసులలో అత్యుత్తమ నాణ్యత పరిగణనలోకి తీసుకొని విశ్లేషించబడింది.
అకౌంటింగ్ ప్రమాణాలు, చట్టబద్దమైన మార్గదర్శకాలు మరియు ఇతర సంబంధిత ప్రకటనలతో సమ్మతి స్థాయి ప్రకారం జడ్జీల ప్యానెల్ ద్వారా ఈ అవార్డు ఎంపిక చేయబడింది. వారి ఆర్థిక పరిస్థితి మరియు కార్యనిర్వహణ పనితీరును పరిగణనలోకి తీసుకోకుండా ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ల తయారీలో పాల్గొంటున్న సంస్థలు అనుసరిస్తున్న అకౌంటింగ్ విధానాలు, ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లు మరియు వార్షిక రిపోర్టులలో ఉన్న ఇతర సమాచారం యొక్క డిస్‌క్లోజర్ మరియు ప్రెజెంటేషన్ కోసం అనుసరిస్తున్న పాలసీలను జడ్జీల ప్యానల్ సమీక్షించింది.