భారతదేశంలో జనరల్ ఇన్సూరెన్స్ పరిధి తక్కువగా ఉన్నందున, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఒక అడుగు ముందుకేసి, భారతదేశ వ్యాప్తంగా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఇన్సూరెన్స్ అవేర్‌నెస్ అవార్డ్ జూనియర్ పేరుతో ఒక క్విజ్ పోటీని నిర్వహించింది, తద్వారా జనరల్ ఇన్సూరెన్స్ గురించి అవగాహన కల్పిస్తూ యువతకు చేరువైంది. ఈ క్విజ్ నిర్వహణ వెనుకన ఆలోచన ఏమిటంటే, స్కూల్ విద్యార్థులకు సరదాగా మరియు అర్థం చేసుకోవడానికి వీలుగా ఒక సవాలు రూపంలో ఇన్సూరెన్స్ పై అవగాహన కల్పించడం.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఇన్సూరెన్స్ అవేర్‌నెస్ అవార్డ్ జూనియర్ అనేది ఇన్సూరెన్స్ పై అవగాహన మరియు సాధికారత కోసం ప్రత్యేకించిన ఒక అభ్యాస కార్యక్రమం, ఇన్సూరెన్స్ అక్షరాస్యతను అవసరమైన జీవిత నైపుణ్యంగా ప్రోత్సహించడానికి మరియు దానిని వ్యాప్తి చేయడానికి తీసుకున్న ఒక చొరవ. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో చేపట్టిన ఈ తరహా చొరవలో ఇదే మొదటిది.
2016 లో నిర్వహించబడిన మొదటి ఎడిషన్‌లో క్విజ్ రెండు రౌండ్లలో అంటే సెమీ ఫైనల్ ఎలిమినేషన్ రౌండ్ (ఒక MCQ రిటెన్ ఛాలెంజ్) మరియు గ్రాండ్ ఫినాలే క్విజ్ కాంపిటీషన్ గా నిర్వహించబడింది. క్విజ్ అనేక దశలలో నిర్వహించబడింది, ఇందులో ముంబైలోని ఉత్తమ పాఠశాలలు మొదటి దశలో ప్రాథమిక రౌండ్ల కోసం మూడు విద్యార్థుల బృందాన్ని నామినేట్ చేయడానికి ఆహ్వానించబడ్డాయి. ఈ దశలో భాగంగా, పాల్గొనే పాఠశాలల ప్రాంగణంలో ఇన్సూరెన్స్ గురించి వివరిస్తూ హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ప్రతినిధులు ఇన్సూరెన్స్ అవగాహన వర్క్‌షాప్‌లను నిర్వహించారు. వర్క్‌షాప్‌ల సమయంలో, విషయాన్ని మరింత వివరంగా అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడటానికి విద్యార్థులకు ఇన్సూరెన్స్‌పై బుక్‌లెట్లు కూడా అందించబడ్డాయి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఇన్సూరెన్స్ అవేర్‌నెస్ అవార్డ్ జూనియర్ యొక్క మొదటి ఎడిషన్ యొక్క గ్రాండ్ ఫినాలే, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో యొక్క ఫౌండేషన్ డే అయిన 27 సెప్టెంబర్ 2016 నాడు నిర్వహించబడింది.
ముంబైలోని పాఠశాలలలో మొట్టమొదటి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఇన్సూరెన్స్ అవేర్‌నెస్ అవార్డు జూనియర్‌కు అద్భుతమైన ప్రతిస్పందన లభించడంతో, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 2017 లో ఈ పోటీని ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై మరియు బెంగళూరు నగరాల్లో నాలుగు నగరాలకు విస్తరించి దీనిని ఒక జాతీయ పోటీగా మార్చింది.
మా ఇన్సూరెన్స్ నిపుణుల ద్వారా నిర్వహించబడిన పాఠశాలలు
5 నగరాల్లోని పాఠశాలలు పాల్గొన్నాయి.
8వ, 9వ తరగతి విద్యార్థులకు ప్రాథమిక ఇన్సూరెన్స్ పై అవగాహన కల్పించబడింది