FAQs

కారు ఇన్సూరెన్స్ అనేది మీ వాహనానికి ఆర్థిక నష్టం కలిగించే ఏదైనా నష్టం నుండి రక్షణ కల్పించడానికి అవసరమైన ఒక రకమైన ఇన్సూరెన్స్ పాలసీ. దీనికి అదనంగా, మీ వాహనం ఉపయోగించడం వల్ల ఉత్పన్నమయ్యే ఏదైనా థర్డ్ పార్టీ బాధ్యత కారు ఇన్సూరెన్స్ క్రింద కవర్ చేయబడుతుంది. మోటార్ వాహన చట్టం ప్రకారం, బాధ్యత మాత్రమే కలిగిన పాలసీని కొనుగోలు చేయడం తప్పనిసరి, ఇది లేకుండా రోడ్డుపై వాహనాన్ని ఉపయోగించలేరు.
ఒక సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీ ఏదైనా డీకొనడం వలన జరిగే నష్టం, అగ్నిప్రమాదం, దొంగతనం, భూకంపం మొదలైన వాటి వలన మీ వాహనానికి రక్షణను అందిస్తుంది. దీనితో పాటు, మరణం, శారీరక గాయం మరియు థర్డ్ పార్టీ ఆస్తి నష్టం విషయంలో ఏదైనా థర్డ్ పార్టీ బాధ్యతకు ఇది కవర్‌ను అందిస్తుంది.
చట్టం ప్రకారం, థర్డ్ పార్టీ లయబిలిటీ ఓన్లీ పాలసీ మాత్రమే అవసరం, అది లేకుండా రోడ్డుపై వాహనాన్ని ఉపయోగించలేరు. అయితే, థర్డ్ పార్టీ లయబిలిటీ ఓన్లీ పాలసీ క్రింద, అగ్నిప్రమాదం, దొంగతనం, భూకంపం, తీవ్రవాదం మొదలైన వాటి కారణంగా మీ వాహనానికి ఏదైనా నష్టం కవర్ చేయబడదు మరియు అది భారీ ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు. అందువల్ల, థర్డ్ పార్టీ బాధ్యత నుండి రక్షణతో పాటు ఆర్థిక రక్షణను అందిస్తుంది కాబట్టి ఒక సమగ్ర కవర్ కొనుగోలు చేయమని సిఫార్సు చేయబడుతుంది.
రెండు రకాల కార్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి - సమగ్ర మరియు లయబిలిటీ ఓన్లీ పాలసీ
సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారం, 1సెప్టెంబర్, 2018 నుండి ప్రతి కొత్త కారు యజమాని దీర్ఘకాలిక పాలసీని కొనుగోలు చేయాలి. మీ అత్యంత విలువైన వస్తువు కోసం మీరు క్రింది దీర్ఘకాలిక పాలసీల నుండి ఎంచుకోవచ్చు:
  1. 3 సంవత్సరాల పాలసీ వ్యవధి కోసం లయబిలిటీ ఓన్లీ పాలసీ
  2. 3 సంవత్సరాల పాలసీ వ్యవధి కోసం ప్యాకేజ్ పాలసీ
  3. 3 సంవత్సరాల లయబిలిటీ కవర్ మరియు 1 సంవత్సరం పాటు స్వంత నష్టానికి కవర్‌ లతో బండిల్డ్ పాలసీ
అవును, రోడ్డుపై తిరిగే ప్రతి మోటారు వాహనం కనీసం లయబిలిటీ ఓన్లీ పాలసీతో ఇన్సూరెన్స్ చేయబడాలి అని మోటార్ వాహన చట్టం పేర్కొంది.
జీరో డిప్రిసియేషన్ అనేది ఒక యాడ్-ఆన్ కవర్ మరియు అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా కొనుగోలు చేయాలి. ఇది డిప్రిసియేషన్‌తో సంబంధం లేకుండా మీ వాహనానికి పూర్తి కవరేజ్ అందిస్తుంది. ఉదాహరణకు, మీ వాహనం బాగా దెబ్బతిన్నట్లయితే, మీరు ఎటువంటి డిప్రిసియేషన్ ఛార్జీలు చెల్లించవలసిన అవసరం లేదు, పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతులకు లోబడి పూర్తి క్లెయిమ్ మొత్తానికి అర్హులు.
ఎమర్జెన్సీ సహాయం అనేది ఒక యాడ్-ఆన్ కవర్ మరియు అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా కొనుగోలు చేయాలి. ఇది బ్రేక్‌డౌన్, టైర్ రీప్లేస్‌మెంట్, టోయింగ్, ఫ్యూయల్ రీప్లేస్‌మెంట్ మొదలైన సందర్భాల్లో సహాయం వంటి బహుళ ప్రయోజనాలను కలిగి ఉంది, వీటిని పాలసీ వ్యవధిలో పొందవచ్చు. ఈ ప్రయోజనాలను పొందడానికి పాలసీలో పేర్కొన్న కస్టమర్ కేర్ నంబర్‌కు కస్టమర్లు కాల్ చేయాలి.

చాలా సులభంగా, క్లెయిమ్-రహిత సంవత్సరం తర్వాత మీ పాలసీని రెన్యూ చేసేటప్పుడు చెల్లించవలసిన స్వంత డ్యామేజ్ ప్రీమియంలో ఇది ఒక డిస్కౌంట్. ఇది జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడానికి, ప్రమాదాలను నివారించడానికి ఒక ప్రోత్సాహకం.

అన్ని రకాల వాహనాలుఓన్ డ్యామేజ్ ప్రీమియంపై % తగ్గింపు
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి పూర్తి సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు20%
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 2 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు25%
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 3 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు35%
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 4 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు45%
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 5 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు50%
మీరు మీ గడువు ముగిసిన పాలసీని ఆన్‌లైన్‌లో సులభంగా రెన్యూ చేసుకోవచ్చు. మీరు సెల్ఫ్ ఇన్‌స్పెక్షన్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసి, డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి, ఒకసారి డాక్యుమెంట్‌లు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా ఆమోదించబడిన తర్వాత, ఒక చెల్లింపు లింక్ పంపబడుతుంది మరియు మీరు పాలసీని రెన్యూ చేయడానికి చెల్లింపు చేయవచ్చు. చెల్లింపు చేయబడిన తర్వాత, మీరు పాలసీ కాపీని అందుకుంటారు.
మునుపటి పాలసీ గడువు తేదీ నుండి 90 రోజుల వరకు నో క్లెయిమ్ బోనస్ చెల్లుతుంది. పాలసీ 90 రోజుల్లోపు రెన్యూ చేయబడకపోతే, నో క్లెయిమ్ బోనస్ 0% అవుతుంది మరియు రెన్యూ చేయబడిన పాలసీకి ఎటువంటి ప్రయోజనం అందజేయబడదు.

వాహనం యొక్క ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువ (IDV) 'ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం'గా పరిగణించబడుతుంది, ప్రతి ఇన్సూరెన్స్ చేయబడిన వాహనానికి ప్రతి పాలసీ వ్యవధి ప్రారంభంలో ఇది నిర్ణయించబడుతుంది.
వాహనం యొక్క IDV అనేది బ్రాండ్ యొక్క తయారీదారు జాబితా చేసిన అమ్మకం ధర మరియు ఇన్సూరెన్స్/ రెన్యూవల్ ప్రారంభంలో ఇన్సూరెన్స్ కోసం ప్రతిపాదించిన వాహనం మోడల్ ఆధారంగా నిర్ణయించబడుతుంది మరియు డిప్రిసియేషన్ కోసం సర్దుబాటు చేయబడుతుంది (క్రింద పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం). IDV అనేది సైడ్ కార్(లు) మరియు/లేదా యాక్సెసరీలు వాహనానికి అమర్చబడి ఉంటే, కానీ తయారీదారు జాబితా చేసిన వాహనం యొక్క అమ్మకం ధరలో చేర్చబడకపోతే కూడా అదే విధంగా నిర్ణయించబడుతుంది.

వాహనం యొక్క వయస్సుIDV నిర్ణయించడానికి % లో డిప్రిసియేషన్
6 నెలలకు మించనిది5%
6 నెలలకు మించి కానీ 1 సంవత్సరం మించనిది15%
1 సంవత్సరం మించి కానీ 2 సంవత్సరాలు మించనిది20%
2 సంవత్సరాలు మించి కానీ 3 సంవత్సరాలు మించనిది30%
3 సంవత్సరాలు మించి కానీ 4 సంవత్సరాలు మించనిది40%
4 సంవత్సరాలు మించి కానీ 5 సంవత్సరాలు మించనిది50%
పేపర్ వర్క్, భౌతిక డాక్యుమెంటేషన్ అవసరం లేదు మరియు మీరు మీ పాలసీని తక్షణమే పొందుతారు.
కేవలం ఒక ఎండార్స్‌మెంట్‌ను పాస్ చేయడం ద్వారా మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలుదారు పేరు మీదకు బదిలీ చేయవచ్చు. అయితే, ప్రస్తుత పాలసీ కింద ఎండార్స్‌మెంట్ జారీ చేయడానికి సేల్ డీడ్/ఫారం 29/30/విక్రేత యొక్క NOC/NCB రికవరీ లాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు అవసరమవుతాయి.
లేదా
మీరు మీ ప్రస్తుత పాలసీని రద్దు చేయవచ్చు. పాలసీని రద్దు చేయడానికి సేల్ డీడ్/ఫారం 29/30 లాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు అవసరమవుతాయి.
ఇప్పటికే ఉన్న ఇన్సూరర్ ద్వారా జారీ చేయబడిన NCB రిజర్వింగ్ లెటర్ ఆధారంగా ఇప్పటికే ఉన్న వాహనాన్ని విక్రయించాలి. NCB రిజర్వింగ్ లెటర్ ఆధారంగా, ఈ ప్రయోజనాన్ని కొత్త వాహనానికి బదిలీ చేయవచ్చు
ఇన్సూరెన్స్ బదిలీ కోసం మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్లతో ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించాలి. సపోర్టింగ్ డాక్యుమెంట్లలో విక్రేత యొక్క సేల్ డీడ్/ఫారం 29/30/NOC, పాత RC కాపీ, బదిలీ చేయబడిన RC కాపీ మరియు NCB రికవరీ ఉంటాయి.
మీరు మీ గడువు ముగిసిన పాలసీని ఆన్‌లైన్‌లో సులభంగా రెన్యూ చేసుకోవచ్చు. మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి సెల్ఫ్ ఇన్‌స్పెక్షన్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి, ఒకసారి డాక్యుమెంట్లు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా ఆమోదించబడిన తర్వాత, చెల్లింపు లింక్ పంపబడుతుంది, మీరు పాలసీ రెన్యూవల్ కోసం చెల్లింపు చేయవచ్చు. చెల్లింపు చేయబడిన తర్వాత, మీరు పాలసీ కాపీని అందుకుంటారు.
మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్లో లేదా వారికి ఒక కాల్ చేయడం ద్వారా క్లెయిమ్‌ నమోదు చేయవచ్చు సెంటర్ లేదా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మొబైల్ యాప్ ద్వారా చేయవచ్చు
మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్లో లేదా వారికి ఒక కాల్ చేయడం ద్వారా క్లెయిమ్‌ నమోదు చేయవచ్చు సెంటర్ లేదా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మొబైల్ యాప్ ద్వారా చేయవచ్చు
ఓవర్‌నైట్ మరమ్మత్తు సౌకర్యంతో, చిన్న నష్టాల మరమ్మత్తు ఒక రాత్రిలో పూర్తి చేయబడుతుంది. సదుపాయం అనేది ప్రైవేట్ కార్లు మరియు ట్యాక్సీలకు మాత్రమే అందుబాటులో ఉంది. ఓవర్‌నైట్ మరమ్మత్తు సౌకర్యం కోసం ప్రక్రియ క్రింద పేర్కొనబడింది
  1. కాల్ సెంటర్ లేదా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మొబైల్ అప్లికేషన్ (IPO) ద్వారా క్లెయిమ్ తెలియజేయబడాలి.
  2. మా బృందం కస్టమర్‌ని సంప్రదించి, డ్యామేజ్ అయిన వాహన ఫోటోల కోసం అభ్యర్థిస్తుంది.
  3. 3 ప్యానెల్‌లకు పరిమితమైన నష్టాలు ఈ సర్వీస్ క్రింద అంగీకరించబడతాయి.
  4. వర్క్‌షాప్ అపాయింట్‌మెంట్ మరియు పికప్ అనేవి వాహన భాగం మరియు స్లాట్ లభ్యతకు లోబడి ఉంటాయి కాబట్టి వాహనం వెంటనే రిపెయిర్ చేయబడదు.
  5. గ్యారేజీకి వెళ్లి రావడానికి పట్టే డ్రైవింగ్ సమయాన్ని కస్టమర్ ఆదా చేస్తారు.
  6. ప్రస్తుతం ఈ సేవ ఢిల్లీ, ముంబై, పూణే, నాగ్‌పూర్, సూరత్, వడోదర, అహ్మదాబాద్, గుర్గావ్, జైపూర్, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా మరియు బెంగుళూరు వంటి 13 ఎంపిక చేయబడిన నగరాల్లో అందుబాటులో ఉంది.
మీరు మీ బ్యాంక్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాలెట్/క్యాష్ కార్డ్, EMI, UPI (జీపే, ఫోన్‌పే, పేటిఎం మొదలైనవి), QR కోడ్ ద్వారా జారీ చేయబడిన డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ ద్వారా మీ పాలసీ ప్రీమియంను చెల్లించవచ్చు. దయచేసి గమనించండి, మేము ఏదైనా క్లబ్ కార్డ్ లేదా డైనర్స్ కార్డ్ ద్వారా చెల్లింపును అంగీకరించము.
అవార్డులు మరియు గుర్తింపు
best_bfsi_2011 best_employer_brand best_employer_brand_2012 best_employer_brand_besi_2012 bfsi_2014 cfo_2014 iaaa icai_2013 icai_2014 icai_2015 icai_2016 iir_2012 iir_2016
x