హెల్త్ ఇన్సూరెన్స్ తరచుగా FAQలు
అవును. సంస్థలో మీరు ఉపాధి పొందే సమయం వరకు మాత్రమే మీ ఎంప్లాయి హెల్త్ ఇన్సూరెన్స్ మీ వైద్య ఖర్చులకు కవరేజ్ అందిస్తుంది మరియు మీరు ఉద్యోగం వదిలేసిన మరుక్షణమే మీ పాలసీ వ్యవధి ముగుస్తుంది గనుక మీకు ఖచ్చితంగా ఒక పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అవసరం అవుతుంది. వైద్య ద్రవ్యోల్బణం పరంగా చూసుకుంటే, సాధారణంగా ఉద్యోగులందరినీ దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ప్రత్యేక కార్పొరేట్ హెల్త్ ప్లాన్ వలె కాకుండా, మీ వైద్య అవసరాలకు అనుగుణంగా మీరు ఎంచుకునే పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉండటం ముఖ్యం.
పోర్టబిలిటీ మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను మార్చడంలో మీకు సహాయపడుతుంది, తద్వారా మీరు మళ్లీ కొత్త వెయిటింగ్ పీరియడ్ వ్యవధిని పొందాల్సిన అవసరం లేదు, అదేవిధంగా, మీ ప్రస్తుత ప్లాన్ పెరుగుతున్న వైద్య ఖర్చులను కవర్ చేయడంలో మీకు సహాయం చేయనట్లయితే, ఒక ఇన్సూరెన్స్ సంస్థ నుండి మరొకరికి సాఫీగా మారవచ్చు.
ముందుగా ఉన్న వ్యాధి అనేది మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసే సమయంలో ప్రస్తుతం ఉన్న మీ ఆరోగ్య పరిస్థితి, అనారోగ్యం లేదా గాయం. అయితే, ఈ PEDలు సాధారణంగా పాలసీ కవరేజీ నుండి ప్రారంభ వెయిటింగ్ పీరియడ్స్ వరకు మినహాయించబడతాయి. PEDలు డయాబెటిస్, హైపర్‌టెన్షన్, థైరాయిడ్, అస్థమా మొదలైనవి కావచ్చు
నగదురహిత హాస్పిటలైజేషన్ అనగా, హాస్పిటలైజేషన్ లేదా సర్జరీ వంటి సందర్భంలో ఎక్కడా కూడా ఇన్సూర్ చేయబడిన వ్యక్తి తన స్వంత డబ్బును ఉపయోగించి ఖర్చుల కోసం చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే, డిశ్చార్జ్ సమయంలో కేవలం కొన్ని మినహాయింపులను లేదా వైద్యేతర ఖర్చులను చెల్లించాల్సి రావచ్చు.
మీరు ఒక సర్జరీని ప్లాన్ చేసుకున్నప్పుడు హాస్పిటలైజేషన్‌కి ముందు డయాగ్నోసిస్ ఖర్చు, కన్సల్టేషన్లు మొదలైనవి ఉంటాయి, అలాగే డిశ్చార్జ్ అయిన తరువాత ఇన్సూర్ చేయబడిన పేషంట్ యొక్క ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ఇటువంటి ఖర్చులు ఉంటాయి, ఇటువంటి ఖర్చులను హాస్పిటలైజేషన్‌కి ముందు మరియు తరువాతి ఖర్చులుగా పేర్కొంటారు.
అవును, మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడానికి ముందు వైద్య పరీక్షలను చేయించుకోవలసిన అవసరం ఉండవచ్చు. అలాగే, కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు మీరు ఇప్పటికే ఉన్న ఒక వ్యాధితో బాధపడుతున్నా లేదా మీరు 40 సంవత్సరాల కన్నా ఎక్కువ వయస్సును కలిగి ఉన్నప్పుడు మాత్రమే వీటిని కోరతాయి.
పాలసీ కొనుగోలు సమయంలో లేదా రెన్యూవల్ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులను జోడించవచ్చు.
పుట్టిన 90 రోజుల తర్వాత నుండి 21 సంవత్సరాల వరకు వయస్సు గల మీ పిల్లలను పాలసీలో చేర్చవచ్చు.
మీరు తక్కువ ప్రీమియంను చెల్లించవచ్చు, అధిక ప్రయోజనాలను పొందవచ్చు. ముందుగా అనారోగ్యం ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది కావున, వెయిటింగ్ పీరియడ్ కూడా మిమ్మల్ని ప్రభావితం చేయకపోవచ్చు. అలాగే, ఫ్లూ మరియు ప్రమాదం కారణంగా కలిగే గాయం వంటి సాధారణ అనారోగ్యాలు ఏ వయస్సులోనైనా సంభవించవచ్చు కాబట్టి, మీరు చిన్న వయస్సులో ఉన్నప్పుడు కూడా దానిని కవర్ చేయడం ముఖ్యం.
అవును. ప్రతి ప్లాన్ విభిన్నంగా పని చేస్తుంది, విభిన్న ప్రయోజనాలను అందిస్తోంది కావున, మీరు ఎల్లప్పుడూ మీ అవసరాలను, కవరేజ్‌ను బట్టి ఒకటి కన్నా ఎక్కువ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను కలిగి ఉండవచ్చు.
వెయిటింగ్ పీరియడ్ అనేది, ఒక నిర్దిష్ట అనారోగ్యం కోసం మీరు మీ ఇన్సూరెన్స్ ప్రదాత నుండి హెల్త్ ఇన్సూరెన్స్‌లోని కొన్ని లేదా అన్ని ప్రయోజనాలను పొందడం కోసం క్లెయిమ్‌ను నమోదు చేసుకోలేని కాల వ్యవధి. దీని అర్థం మీరు ఒక క్లెయిమ్ చేయడానికి ముందు నిర్దిష్ట సమయం వరకు వేచి ఉండాలి.
ఈ ఫ్రీ లుక్ వ్యవధిలో, మీ పాలసీ ప్రయోజనకరంగా లేదని భావిస్తే జరిమానా లేకుండా, పాలసీని రద్దు చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీ మరియు అది అందించే ప్లాన్‌పై ఆధారపడి, ఉచిత లుక్ వ్యవధి 10-15 రోజులు లేదా అంతకన్నా ఎక్కువగా ఉండవచ్చు.
తరచుగా నగదురహిత ఆసుపత్రులు అని పిలువబడే నెట్‌వర్క్ ఆసుపత్రులు మీ ఇన్సూరెన్స్ కంపెనీతో ముడిపడి ఉంటాయి, కావున, మీరు నగదురహిత ఆసుపత్రి ప్రయోజనాన్ని సులభంగా పొందవచ్చు, అయితే, నాన్-నెట్‌వర్క్ ఆసుపత్రిలో చేరినప్పుడల్లా మీరు ముందుగా బిల్లులను చెల్లించాల్సి ఉంటుంది, అలాగే, వాటిని తర్వాత రీయింబర్స్‌మెంట్ కోసం క్లెయిమ్ చేయాలి. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వంటి 10,000+ నగదురహిత ఆసుపత్రులు గల పెద్ద నెట్‌వర్క్‌తో టై-అప్‌ను కలిగి ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని ఎల్లప్పుడూ ఎంచుకోండి.
ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తిని ఒక ఆసుపత్రికి తరలించలేనపుడు లేదా ఆసుపత్రిలో గది అందుబాటులో లేనందున ఇంటి వద్ద చికిత్స తీసుకోవాల్సి వచ్చినపుడు, ఆ చికిత్సను డొమిసిలియరీ హాస్పిటలైజేషన్ అని పిలుస్తారు.
హాస్పిటలైజేషన్ కవర్ విషయంలో మేము మీ డయాగ్నోస్టిక్ టెస్టులు, కన్సల్టేషన్లు మరియు మందుల ఖర్చుల కోసం హాస్పిటలైజేషన్ ముందు మరియు తర్వాత ఖర్చులను కవర్ చేస్తాము. మేము ICU, బెడ్ ఛార్జీలు, మందుల ఖర్చు, నర్సింగ్ ఛార్జీలు మరియు ఆపరేషన్ థియేటర్ ఖర్చులను కూడా కవర్ చేస్తాము.
మీరు 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత మీ కోసం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేయవచ్చు, దానికి ముందు మిమ్మల్ని మీరు ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ క్రింద కవర్ చేసుకోవచ్చు.
లేదు. ఒక మైనర్ విడిగా హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయలేరు, అయితే తల్లిదండ్రులు తమ కుటుంబ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద పిల్లలను కవర్ చేయవచ్చు.
మీరు ఒక నాన్-నెట్‌వర్క్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పుడు మీరు మొదట బిల్లులు చెల్లించాలి మరియు తరువాత రీయింబర్స్‌మెంట్ కోసం క్లెయిమ్ చేయాలి. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వంటి 10,000+ నగదురహిత ఆసుపత్రులు గల పెద్ద నెట్‌వర్క్‌తో టై-అప్‌ను కలిగి ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని ఎల్లప్పుడూ ఎంచుకోండి.
మీరు మీ బ్యాంక్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాలెట్/క్యాష్ కార్డ్, EMI, UPI (జీపే, ఫోన్‌పే, పేటిఎం మొదలైనవి), QR కోడ్ ద్వారా జారీ చేయబడిన డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ ద్వారా మీ పాలసీ ప్రీమియంను చెల్లించవచ్చు. దయచేసి గమనించండి, మేము ఏదైనా క్లబ్ కార్డ్ లేదా డైనర్స్ కార్డ్ ద్వారా చెల్లింపును అంగీకరించము.