అగ్నిప్రమాదం, దొంగతనం, వరద, భూకంపం మొదలైనటువంటి ఊహించని సంఘటనల కారణంగా తలెత్తే నష్టాల నుండి కార్ ఇన్సూరెన్స్ పాలసీ మిమ్మల్ని రక్షిస్తుంది. అంతేకాకుండా, మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం, మీ వాహనం కోసం కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. అయితే, మీ టొయోటా కారు కోసం స్వంత నష్టం మరియు థర్డ్ పార్టీ బాధ్యతల కోసం కవరేజ్ పొందడానికి సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవలసిందిగా మేము మీకు సలహా ఇస్తున్నాము. టొయోటా కోసం కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి కొన్ని కారణాలను చూద్దాం.
కార్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది థర్డ్ పార్టీ కవర్‌తో వస్తుంది, ఇది థర్డ్ పార్టీ బాధ్యతల నుండి రక్షిస్తుంది. దీనివల్ల, మీ టొయోటా కారు కారణంగా థర్డ్ పార్టీ వ్యక్తికి లేదా ఆస్తికి జరిగే ఏవైనా నష్టాలకు కూడా కవరేజీ పొందడానికి మీరు అర్హులవుతారు.
కార్ ఇన్సూరెన్స్ పాలసీతో, మీ టొయోటా కారుకి ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు లేదా మానవ జోక్యంతో జరిగే విపత్తుల కారణంగా తలెత్తే నష్టాలకు కవరేజీ లభిస్తుంది. ఈ ఊహించని సందర్భాల కారణంగా జరిగే నష్టాలనేవి భారీ ఖర్చులకు దారితీయవచ్చు కాబట్టి, కార్ ఇన్సూరెన్స్ పాలసీని సకాలంలో రెన్యూ చేయడం మంచిది. ఇన్సూరెన్స్ చేయదగిన ఏవైనా ప్రమాదాల కారణంగా జరిగిన నష్టాల నుండి పూర్తి రక్షణ పొందడానికి మీ టొయోటా కారు కోసం సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంచుకోవడం మంచిది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి 8000+ నగదురహిత గ్యారేజీల్లో కూడా మీరు మీ టొయోటా కారుని మరమ్మత్తు చేసుకోవచ్చు.
కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నప్పుడు, చట్టపరమైన సమస్యల గురించి మీరు ఎలాంటి ఆందోళన లేకుండా మీ టొయోటా కారు నడపవచ్చు. అన్ని వాహనాలకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ ఉండటం తప్పనిసరి, అది లేకుండా డ్రైవింగ్ చేయడమనేది RTO నుండి భారీ జరిమానాలకు దారితీయవచ్చు. అంతేకాకుండా, చాలా వరకు రోడ్డు ప్రమాదాల్లో మీ తప్పు లేకపోవచ్చు. ఈ విధంగా చూసినప్పుడు, ఏదైనా సంఘటన నుండి మీకు రక్షణ ఉందని గ్రహించడం ద్వారా, మీరు ఒత్తిడి లేకుండా డ్రైవ్ చేయవచ్చు.
అద్భుతమైన కోట్‌లు కేవలం ఒక క్లిక్ దూరంలో ఉన్నప్పుడు, మరెక్కడో ఎందుకు చూడాలి?
దేశవ్యాప్తంగా విస్తరించబడిన 8000+ నెట్‌వర్క్ గ్యారేజీలు ఉన్నాయి, ఇది చాలా పెద్ద సంఖ్య కదా? ఇది మాత్రమే కాదు, IPO యాప్ మరియు వెబ్‌సైట్ ద్వారా క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోవడానికి మేము మిమ్మల్ని అనుమతిస్తాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అపరిమిత క్లెయిమ్‌లకు అవకాశం ఇస్తుంది! మీరు జాగ్రత్తగానే డ్రైవ్ చేస్తారని మేము విశ్వసిస్తున్నప్పటికీ, ఏదైనా క్లెయిమ్‌ను మీరు రిజిస్టర్ చేయాలనుకున్నప్పుడు మేము మిమ్మల్ని నిరోధించము.
మేము సాయంత్రం నుండి తెల్లవారుజాము వరకు ఎటువంటి అవాంతరాలు లేకుండా చిన్న చిన్న యాక్సిడెంటల్ నష్టాలను సరిచేస్తాము. మీరు సులభంగా మమ్మల్ని సంప్రదించవచ్చు; మేము మీ కారును రాత్రి సమయంలో పికప్ చేసుకుని, దాని మరమ్మత్తు పూర్తి చేసి, ఉదయానికి మీ ఇంటి వద్దకే దానిని డెలివరీ చేస్తాము.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి సింగిల్ ఇయర్ కాంప్రిహెన్సివ్ కవర్ అనేది మీ టొయోటా కారుని మనశ్శాంతితో నడపడంలో మీకు సహాయపడుతుంది. ఈ ప్లాన్‌లో మీ కారుకు జరిగే నష్టాలతో పాటు థర్డ్ పార్టీ వ్యక్తి/ఆస్తికి జరిగే నష్టాలకు కూడా కవర్ లభిస్తుంది. మీకు నచ్చిన యాడ్-ఆన్‌లతో మీరు మీ కవర్‌ను మరింత కస్టమైజ్ చేసుకోవచ్చు.
ప్రమాదం
పర్సనల్ యాక్సిడెంట్ కవర్
ప్రకృతి వైపరీత్యాలు
థర్డ్-పార్టీ లయబిలిటీ
యాడ్-ఆన్‌ల ఎంపిక
దొంగతనం
1988 మోటారు వాహనాల చట్టం ప్రకారం థర్డ్-పార్టీ కవర్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. మీరు మీ టొయోటా కారుని తరచుగా ఉపయోగించకపోతే, ఈ ప్రాథమిక కవర్‌తో ప్రారంభించడమనేది మంచి ఆలోచనగా ఉంటుంది మరియు జరిమానాలు చెల్లించడం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. థర్డ్ పార్టీ కవర్ కింద, థర్డ్ పార్టీ నష్టం, గాయం లేదా నష్టం నుండి ఉత్పన్నమయ్యే బాధ్యతల నుండి రక్షణతో పాటు మీ కోసం ఒక పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కూడా మేము అందిస్తాము.
పర్సనల్ యాక్సిడెంట్ కవర్
థర్డ్-పార్టీ ఆస్తి నష్టం
థర్డ్-పార్టీ వ్యక్తికి ఏర్పడిన గాయాలు
యాక్సిడెంట్లు, వరదలు, భూకంపాలు, అల్లర్లు, అగ్నిప్రమాదాలు మరియు దొంగతనం కారణంగా మీ కారుకు జరిగిన నష్టాల కోసం మీ ఖర్చులని కవర్ చేస్తుంది. అదనపు రక్షణను మీరు ఆస్వాదించాలనుకుంటే, తప్పనిసరి థర్డ్ పార్టీ కవర్‌కు మించి మరియు అంతకంటే ఎక్కువ యాడ్-ఆన్‌లతో ఈ ఆప్షనల్ కవర్‌ను మీరు ఎంచుకోవచ్చు.
ప్రమాదం
ప్రకృతి వైపరీత్యాలు
అగ్ని
యాడ్-ఆన్‌ల ఎంపిక
దొంగతనం
మీ వద్ద ఒక సరికొత్త టొయోటా కారు ఉంటే, కొత్త కార్ల కోసం మా కవర్ అనేది మీ కొత్త ఆస్తిని సురక్షితం చేయడానికి మీకు అవసరమైనదిగా ఉంటుంది. ఈ ప్లాన్ స్వంత నష్టానికి 1-సంవత్సరాల కవరేజ్ అందిస్తుంది. ఇది థర్డ్-పార్టీ వ్యక్తి/ఆస్తికి జరిగిన నష్టాల నుండి మీకు 3-సంవత్సరాల కవర్ కూడా అందిస్తుంది.
ప్రమాదం
ప్రకృతి వైపరీత్యాలు
పర్సనల్ యాక్సిడెంట్
థర్డ్-పార్టీ లయబిలిటీ
యాడ్-ఆన్‌ల ఎంపిక
దొంగతనం
మీరు మీ టొయోటా కారు కోసం థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ కవర్ కొనుగోలు చేస్తే, మీరు థర్డ్ పార్టీ బాధ్యతలకు మాత్రమే కవరేజ్ పొందుతారు. అయితే, మీరు ఓన్ డ్యామేజ్ కవర్‌ను ఎంచుకుంటే, ఊహించని సంఘటనల కారణంగా వాహనానికి జరిగిన నష్టాలను ఇన్సూరర్ భరిస్తారు. దిగువన ఈ వ్యత్యాసాన్ని పరిశీలిద్దాం
థర్డ్ పార్టీ ప్రీమియం | స్వంత డామేజి ప్రీమియం |
కవరేజీ పరిమితంగా ఉంటుంది కాబట్టి, దీని ధర కూడా తక్కువగా ఉంటుంది. | థర్డ్ పార్టీ కవర్‌తో పోలిస్తే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. |
ఇది థర్డ్ పార్టీ ఆస్తి లేదా వ్యక్తికి జరిగిన నష్టాలకు మాత్రమే కవరేజీని అందిస్తుంది. | వరదలు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు, దొంగతనం మొదలైన అనవసరమైన సంఘటనల కారణంగా వాహనానికి జరిగిన ఏదైనా నష్టానికి కవరేజ్. |
IRDAI నిబంధనల ప్రకారం ప్రీమియం ఫిక్స్ చేయబడుతుంది. | వయస్సు ఆధారంగా ప్రీమియం మారుతుంది వాహనం, ఇంజిన్ సామర్థ్యం, లొకేషన్, ఎంచుకున్న యాడ్-ఆన్‌లు, వాహనం మోడల్ మొదలైనవి. |
ప్రపంచం డిజిటల్‌గా మారిపోయింది. ఈ నాలుగు వేగవంతమైన, అనుసరించడానికి సులభమైన దశలతో మా క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ కూడా అదేవిధంగా మారింది.
మీరు ఎక్కడికి వెళ్లినప్పటికీ, మా కార్ ఇన్సూరెన్స్ పాలసీ మీ కారును సురక్షితం చేస్తుంది. మీ టొయోటా కోసం దేశవ్యాప్తంగా ఉన్న మా 8000+ ప్రత్యేకమైన నగదురహిత గ్యారేజీల విస్తృత నెట్‌వర్క్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఊహించని అత్యవసర సహాయం లేదా మరమ్మత్తుల కోసం నగదు రూపంలో చెల్లించడం గురించి ఆందోళన చెందకుండా ఉండేందుకు మీరు మా నైపుణ్య సహాయం పై ఆధారపడవచ్చు.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే నగదురహిత గ్యారేజ్ సౌకర్యంతో, మీ టొయోటా కారు కోసం మా నెట్‌వర్క్ గ్యారేజీలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని మీరు నిశ్చింతగా ఉండవచ్చు. కాబట్టి, మీ కారు ఎక్కడైనా బ్రేక్‌డౌన్ అయితే దాని మరమ్మత్తు గురించి ఆందోళన చెందకుండా మీరు ప్రశాంతంగా మీ గమ్యస్థానానికి డ్రైవ్ చేయవచ్చు.
జులైలో టొయోటా అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది, 21k కంటే ఎక్కువ యూనిట్లు విక్రయించింది
టొయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) గత కొన్ని నెలలుగా అనుకూల సేల్స్ గణాంకాలను నమోదు చేస్తోంది. ఈ బ్రాండ్ తన అధికారిక పత్రికా ప్రకటన ద్వారా తన అమ్మకాల సంఖ్యలు పంచుకుంది. జులైలో ఉత్తమ అమ్మకాలు నమోదు చేసినట్లు పేర్కొంది. కంపెనీ పంచుకున్న వివరాల ప్రకారం, అది గత నెల 21,911 యూనిట్లు విక్రయించింది. మొత్తం దేశీయ అమ్మకాల సంఖ్య 20,759 యూనిట్లకు చేరుకోగా, ఎగుమతుల సంఖ్య 1152 యూనిట్లకి చేరుకుంది.
ప్రచురించబడిన తేదీ: ఆగస్ట్ 01, 2023
భారతదేశంలో టొయోటా ఇన్నోవా క్రిస్టా ధరలు రూ. 37,000 వరకు పెరిగాయి
తక్షణం ప్రభావంలోకి వచ్చే విధంగా, టొయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తన ఇన్నోవా క్రిస్టా రేంజ్‌లోని ఎంపిక చేయబడిన వేరియంట్‌ల ధరలు పెంచింది. భారతదేశంలో ప్రస్తుతం ఈ మోడల్ ధర రూ. 19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతోంది మరియు ఐదు రంగులు మరియు మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
ప్రచురించబడిన తేదీ: ఆగస్ట్ 01, 2023