మీకు ఇష్టమైన హోండా కారును కొనడంతో మీ కల నెరవేరినట్లు కాదు; ఏవైనా దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు మీ వాహనాన్ని ఆర్థికంగా రక్షించే హోండా కార్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం. ప్రాథమిక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ నుండి మల్టీ-ఇయర్ కాంప్రిహెన్సివ్ ప్యాకేజ్ వరకు మీ వాహనాన్ని సరైన హోండా ఇన్సూరెన్స్‌తో సురక్షితం చేసుకోండి.
స్వంత డ్యామేజీ కవర్, థర్డ్-పార్టీ లయబిలిటీ మరియు పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌తో సహా, ఈ ఏక సంవత్సరం సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీ మీకు మరియు మీ వాహనానికి ఆల్-రౌండ్ రక్షణ అందిస్తుంది. అనేక యాడ్-ఆన్‌లతో మీ కార్ ఇన్సూరెన్స్ కవరేజీని మీరు మరింత మెరుగుపరచవచ్చు.
ప్రమాదం
పర్సనల్ యాక్సిడెంట్ కవర్
ప్రకృతి వైపరీత్యాలు
థర్డ్-పార్టీ లయబిలిటీ
యాడ్-ఆన్‌ల ఎంపిక
దొంగతనం
భారతదేశపు రహదారుల మీద డ్రైవ్ చేయగలగడానికి థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది చట్టపరంగా తప్పనిసరిగా ఉండాలి. మీ వాహనం కారణంగా జరిగిన యాక్సిడెంట్ ఫలితంగా థర్డ్ పార్టీ వ్యక్తి లేదా ఆస్తికి సంభవించిన ఏదైనా నష్టానికి ఆర్థిక బాధ్యత నుండి ఇది మిమ్మల్ని కవర్ చేస్తుంది.
పర్సనల్ యాక్సిడెంట్ కవర్
థర్డ్-పార్టీ ఆస్తి నష్టం
థర్డ్-పార్టీ వ్యక్తికి ఏర్పడిన గాయాలు
యాక్సిడెంట్ లేదా ప్రకృతి లేదా మానవ జోక్యంతో జరిగే విపత్తు సందర్భంలో, మీ స్వంత వాహనానికి జరిగిన నష్టానికి స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ కవర్ అనేది ఆర్థిక కవరేజీ అందిస్తుంది. దొంగతనం నుండి కూడా ఇది రక్షిస్తుంది. ఇది మీ థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీకి సరైన భాగస్వామిగా ఉంటుంది. యాడ్-ఆన్‌ల ఎంపిక అనేది మీ కవరేజీని మరింత మెరుగుపరుస్తుంది.
ప్రమాదం
ప్రకృతి వైపరీత్యాలు
అగ్ని
యాడ్-ఆన్‌ల ఎంపిక
దొంగతనం
మీ సౌలభ్యం కోసం నిపుణులు ఈ ప్లాన్ రూపొందించారు. మీ స్వంత నష్టం కవర్ గడువు ముగిసినప్పుడు కూడా మీకు అవాంతరాలు లేని రక్షణ లభిస్తుందని నిర్ధారించుకోవడానికి ఒక ప్యాకేజీలో 3-సంవత్సరాల థర్డ్-పార్టీ కవర్ మరియు ఒక వార్షిక ఓన్ డ్యామేజ్ కవర్ పొందండి. సమగ్ర రక్షణను ఆస్వాదించడం కోసం స్వంత నష్టం కవర్‌ను రెన్యూవల్ చేసుకోండి.
ప్రమాదం
ప్రకృతి వైపరీత్యాలు
పర్సనల్ యాక్సిడెంట్
థర్డ్-పార్టీ లయబిలిటీ
యాడ్-ఆన్‌ల ఎంపిక
దొంగతనం
మీరు పొందే కవరేజ్ పరిధి మీ హోండా కార్ కోసం మీరు ఎంచుకున్న ప్లాన్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక సమగ్ర హోండా కార్ ఇన్సూరెన్స్ పాలసీ సాధారణంగా ఈ క్రింది వాటిని కలిగి ఉంటుంది:
ప్రమాదం కారణంగా ఉత్పన్నమయ్యే ఆర్థిక నష్టాలను మేము కవర్ చేస్తాము.
మీ కారుకు ఎదురయ్యే అగ్నిప్రమాదాలు మరియు విస్ఫోటనాల నుండి మీకు ఆర్థికంగా రక్షణ లభిస్తుంది.
మీ కారు దొంగతనానికి గురికావడం అనేది మీకు పీడకల లాంటిది. ఇలాంటి పరిస్థితుల్లోనూ మీరు ప్రశాంతంగా ఉండే అవకాశాన్ని మేము అందిస్తాము.
ప్రకృతి లేదా మానవ జోక్యంతో జరిగే విపత్తులు ఏవైనప్పటికీ, అలాంటి విస్తృత శ్రేణి వైపరీత్యాల కోసం మేము ఆర్థిక కవరేజ్ అందిస్తాము.
ఏదైనా యాక్సిడెంట్ సమయంలో, మీ చికిత్స కోసం ఖర్చులను మేము చూసుకుంటాము.
ఎవరైనా థర్డ్-పార్టీ వ్యక్తికి లేదా వారి ఆస్తికి జరిగిన గాయాలు లేదా నష్టం కూడా కవర్ చేయబడతాయి.
కొత్త హోండా కార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూవల్ చేయడం లేదా కొనుగోలు చేయడం చాలా సులభమైన మరియు వేగవంతమైన ప్రక్రియ. మరియు మీరు కేవలం కొన్ని క్లిక్స్‌తో ఈ పనిచేయవచ్చు. నిజానికి, ఇప్పుడు మీరు కొన్ని నిమిషాల్లోనే మీ పాలసీ పొందవచ్చు. మీకోసం కవర్ పొందడానికి క్రింది నాలుగు దశలు అనుసరించండి.
కార్ ఇన్సూరెన్స్ అనేది కార్ యాజమాన్యపు ఒక ముఖ్యమైన అవసరం. ప్రమాదాలనేవి ఎలాంటి ముందస్తు సంకేతం లేకుండా జరుగుతాయి కాబట్టి, ఇది తప్పనిసరి మాత్రమే కాకుండా, ఆర్థికంగా వివేకవంతమైన నిర్ణయం కూడా. అంతేకాకుండా, రోడ్డు మీద మీ భద్రత అనేది ఇతర డ్రైవర్‌ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే, కారు డ్యామేజీలనేవి సాధారణంగా మరమ్మత్తు చేయడం ఖరీదైన వ్యవహారంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే కార్ ఇన్సూరెన్స్ సహాయకరంగా ఉంటుంది. .ఇది ఊహించని ఆర్థిక నష్టాలను నివారిస్తుంది మరియు మిమ్మల్ని సురక్షితంగా మరియు భద్రంగా ఉంచుతుంది. మీ హోండా కార్ ఇన్సూరెన్స్ కోసం మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోను ఎందుకు ఎంచుకోవాలో ఇక్కడ తెలుసుకోండి:
వర్క్ షాప్‌తో నేరుగా నగదురహిత సెటిల్‌మెంట్ చేయడం ద్వారా మీరు స్వంతంగా డబ్బును ఖర్చు చేయడం తగ్గుతుంది. మరియు దేశవ్యాప్తంగా ఉన్న 8700 నగదురహిత గ్యారేజీలతో, మీకోసం సహాయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ అనేది కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటుంది కాబట్టి, మీరెప్పుడూ నిస్సహాయంగా నిల్చిపోయే పరిస్థితి రాదు.
1.6 కోట్లకు పైగా సంతోషకరమైన వినియోగదారులతో మీ ఖచ్చితమైన అవసరాలేమిటో మాకు తెలుసు కాబట్టే, లక్షలాది మంది ముఖాల మీద చిరునవ్వులు పూయించాము. కాబట్టి, మీ ఆందోళనలు పక్కన పెట్టండి మరియు క్లబ్‌లో చేరండి!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఓవర్‌నైట్ సర్వీస్ రిపెయిర్స్ ద్వారా, చిన్నపాటి యాక్సిడెంటల్ డ్యామేజీ లేదా బ్రేక్‌డౌన్‌లు జరిగినప్పుడు మీకు కారు మరుసటిరోజుకు మళ్లీ సిద్ధంగా ఉండేలా నిర్ధారించబడుతుంది. తద్వారా, మీ రోజువారీ పనులకు ఎలాంటి ఆటంకం ఉండదు. మీరు రాత్రివేళ చక్కగా నిద్రపోండి మరియు ఉదయానికి మీ కారును సిద్ధం చేయడానికి మాకు అనుమతి ఇవ్వండి.
క్లెయిమ్‌లు చేయడమనేది సులభమైన మరియు వేగవంతమైన ప్రక్రియ. మేము ఈ ప్రక్రియను కాగితరహితంగా చేస్తాము, స్వీయ-తనిఖీ కోసం అనుమతిస్తాము మరియు మీ ఆందోళనల దూరం చేయడం కోసం వేగవంతమైన సెటిల్‌మెంట్ అందిస్తాము