చాలామందికి నచ్చిన క్వాలీస్ స్థానంలో 2005లో ఇన్నోవా అందుబాటులోకి వచ్చింది. ఈ కాంపాక్ట్ MPVని చూసిన వెంటనే భారతీయులు దీని ప్రేమలో పడిపోయారు, హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కాని ఒక కారు కోసం ఇలాంటి ప్రేమ వ్యక్తం కావడం అరుదైన విషయం. భారతీయ మార్కెట్లో ఇది మొట్టమొదటి మూడు-వరుసల సీట్లు కలిగిన కారుగా ఉంటోంది, అందుకే, ఇది ఇంతలా విజయవంతం కావడం ఆశ్చర్యమేమీ అనిపించదు.
మరిన్ని ప్రీమియం ఇంటీరియర్ మరియు విలాసవంతమైన ఫీచర్‌లతో రెండవ-తరం ఇన్నోవా క్రిస్టా 2016లో అందుబాటులోకి వచ్చింది. రీడిజైన్ చేయబడిన గ్రిల్ మరియు బంపర్, అలాయ్ వీల్స్ మరియు ఇతర సూక్ష్మమైన ఇంటీరియర్ మెరుగుదలలతో 2020లో ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్ చేయబడింది.
టోయోటా ఇన్నోవా క్రిస్టా రెండు ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది - 2.7-litre పెట్రోల్ ఇంజిన్ మరియు 2.4-litre డీజిల్ ఇంజన్లు వరుసగా 164bhp మరియు 148bhpని ఉత్పత్తి చేస్తాయి. మూడు ట్రిమ్‌లు అందుబాటులో ఉన్నాయి - GX, VX, మరియు ZX, డీజిల్-ఇంజిన్ వేరియంట్లు కూడా G మరియు G ప్లస్ ట్రిమ్ పొందుతున్నాయి. 7-సీటర్ (7 STR) మరియు 8-సీటర్ (8 STR) ఎంపిక కూడా అందుబాటులో ఉంది. GX మరియు ZX సిరీస్‌లో కూడా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపిక అందుబాటులో ఉంది.
పెట్రోల్ (2.7l) | డీజిల్ (2.4l) |
ఇన్నోవా క్రిస్టా ZX 7 STR AT | ఇన్నోవా క్రిస్టా ZX 7 STR |
ఇన్నోవా క్రిస్టా ZX 7 STR | ఇన్నోవా క్రిస్టా VX 8 STR |
ఇన్నోవా క్రిస్టా GX 8 STR AT | ఇన్నోవా క్రిస్టా G ప్లస్ 7 STR |
ఇన్నోవా క్రిస్టా అనేది ఎక్కువ మంది ఇష్టపడే MPV. ఇది కుటుంబం మొత్తానికి ఒక విలాసవంతమైన ప్రయాణం అందిస్తుంది. మీ వద్ద ఇన్నోవా ఉంటే, మీ కుటుంబం పెద్దదై ఉండే అవకాశం ఉంది కాబట్టి, వారందరి భద్రత అనేది ఒక ప్రధాన ఆందోళనగా ఉంటుంది. ఇన్నోవాలో డ్రైవర్ మరియు ప్రయాణీకుల ఎయిర్‌బ్యాగులు కూడా ఉన్నప్పటికీ, ఏదైనా దురదృష్టకరమైన సంఘటన నుండి మీకు మరియు మీ కారుకు పటిష్టమైన రక్షణ కోసం కార్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి. మీ కోసం ఈ క్రింది ఎంపికలు అందుబాటులో ఉన్నాయి:
ఇన్నోవా కోసం ఒక సంవత్సరం సమగ్ర ఇన్సూరెన్స్ సొంత డ్యామేజీ కవర్ మరియు థర్డ్-పార్టీ లయబిలిటీ కవర్‌తో ఏటా రెన్యూవల్ చేసేలా అందుబాటులో ఉన్న ఈ పాలసీ యాక్సిడెంటల్ డ్యామేజీ, దొంగతనం, మరియు సహజ మరియు మానవ జోక్యంతో జరిగే విపత్తుల కారణంగా ఏర్పడే డ్యామేజీల నుండి మిమ్మల్నిఆర్థికంగా రక్షిస్తుంది. అలాగే, ఏదైనా యాక్సిడెంట్ జరిగిన సమయంలో, మీ చికిత్స కోసం అయ్యే ఖర్చులకు ఇబ్బంది లేకుండా ₹15 లక్షలతో వ్యక్తిగత యాక్సిడెంట్ కవర్ కూడా అందిస్తుంది.
ప్రమాదం
పర్సనల్ యాక్సిడెంట్ కవర్
ప్రకృతి వైపరీత్యాలు
థర్డ్-పార్టీ లయబిలిటీ
యాడ్-ఆన్‌ల ఎంపిక
దొంగతనం
రోడ్డు మీదకు వచ్చే ఏ కారు కోసమైనా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్
పర్సనల్ యాక్సిడెంట్ కవర్
థర్డ్-పార్టీ ఆస్తి నష్టం
థర్డ్-పార్టీ వ్యక్తికి ఏర్పడిన గాయాలు
ఒక సమగ్రమైన కవర్‌లో ఇది ఒక భాగంగా లభించడమే కాకుండా, మీ వాహనం కోసం మీ వద్ద ఇప్పటికే థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ఉంటే, దీనిని ఒక ఒంటరి పాలసీగా కూడా కొనుగోలు చేయవచ్చు. యాక్సిడెంట్ లేదా ప్రకృతి మరియు మానవ నిర్మిత విపత్తుల ఫలితంగా మీ స్వంత వాహనానికి జరిగిన నష్టాన్ని ఈ పాలసీ కవర్ చేస్తుంది. తిరిగి పొందలేని దొంగతనం జరిగిన సందర్భంలో మీకు ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV) అందించే దొంగతనం కవర్‌తో కూడా ఇది వస్తుంది.
ప్రమాదం
ప్రకృతి వైపరీత్యాలు
అగ్ని
యాడ్-ఆన్‌ల ఎంపిక
దొంగతనం
ఇది అత్యంత సిఫార్సు చేయబడిన పాలసీ మరియు కొత్త వాహనం కొనుగోలు సమయంలో దీనిని మీరు తప్పకుండా ఎంచుకోవాలి. ఇది మూడు సంవత్సరాల థర్డ్-పార్టీ లయబిలిటీ కవర్ మరియు ఏటా రెన్యూవల్ చేయగలిగిన స్వీయ డ్యామేజీ కవర్‌తో లభిస్తుంది కాబట్టి, పొడిగించబడిన వ్యవధి కోసం మీరు కవర్ చేయబడతారు. ఒక వ్యక్తిగత యాక్సిడెంట్ కవర్, దొంగతనం నుండి రక్షణ మరియు యాడ్-ఆన్ కవర్‌ల ఎంపికతో కూడా ఇది లభిస్తుంది.
ప్రమాదం
ప్రకృతి వైపరీత్యాలు
పర్సనల్ యాక్సిడెంట్
థర్డ్-పార్టీ లయబిలిటీ
యాడ్-ఆన్‌ల ఎంపిక
దొంగతనం
ఒక సమగ్రమైన ఇన్నోవా క్రిస్టా కార్ ఇన్సూరెన్స్ పాలసీతో, ఏదైనా ప్రమాదం, లేదా భూకంపాలు, అగ్నిప్రమాదాలు, తుఫాన్లు, అల్లర్లు మరియు విధ్వంసం వంటి ప్రకృతిసిద్ధ మరియు మానవ జోక్యంతో జరిగే విపత్తుల ఫలితంగా మీ వాహహానికి ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు మీకు కవరేజీ లభిస్తుంది. హాస్పిటలైజేషన్ సమయంలో చికిత్స ఛార్జీలతో పాటు ఇతర ఖర్చుల కోసం కూడా మీకు కవర్ లభిస్తుంది. అంతేకాకుండా, థర్డ్-పార్టీ వ్యక్తికి సంభవించిన ఏదైనా నష్టం విషయంలో మీ ఆర్థిక బాధ్యతలు కూడా నెరవేర్చబడడం ద్వారా, ఆల్-రౌండ్ రక్షణను నిర్ధారిస్తుంది.
యాక్సిడెంట్లు తరచుగా ఊహించలేనివి, మరియు కొన్నిసార్లు నివారించలేనివి. అయితే, స్వంత డ్యామేజీ కవర్‌తో మీ వాహనం మరమ్మత్తు కోసం అయ్యే ఖర్చును తగ్గించవచ్చు.
విపత్తులనేవి హెచ్చరిక లేకుండా సంభవిస్తాయి. భూకంపాలు, వరదలు, తుఫాన్లు, అగ్నిప్రమాదాలు, విధ్వంసం, అల్లర్లు మొదలైన వాటి నుండి మీ కారును ఆర్థికంగా రక్షించుకోండి.
మీకు కారు ఇన్సూరెన్స్ లేకపోతే, మీ ఇన్నోవా దొంగతనానికి గురైతే అది మీకు గణనీయమైన ఆర్థిక నష్టానికి దారితీస్తుంది. అయితే, ఇన్సూరెన్స్‌తో, మీరు మీ వాహనానికి IDV పొందుతారు, మరియు మీకు రిటర్న్ టూ ఇన్వాయిస్ కవర్ ఉంటే, కారుకు సంబంధించిన పూర్తి ఆన్-రోడ్ ధర కూడా తిరిగి వస్తుంది.
ఏదైనా యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో చికిత్స ఖర్చును తగ్గించడం కోసం, యజమానులందరికీ కనీసం ₹15 లక్షల వ్యక్తిగత యాక్సిడెంట్ కవర్ తప్పక ఉండాలి.
ఒకవేళ మీ వల్ల థర్డ్-పార్టీ వ్యక్తి లేదా ఆస్తికి గాయాలు లేదా నష్టం ఏర్పడితే, అప్పుడు మీకు ఎదురయ్యే ఆర్థిక బాధ్యతలను ఇది తీసుకుంటుంది.
కార్లు స్మార్ట్‌గా మారుతుతున్నాయి మరియు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా. ఇన్సూరర్ కార్యాలయంలో వరుసలో నిలబడే రోజులు ఎప్పుడో పాతబడిపోయాయి. మీరు ఇప్పుడు మీ టొయోటా ఇన్నోవా కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో నిమిషాల్లోనే సౌకర్యవంతంగా రెన్యూవల్ చేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి:
ఒక ఇన్సూరర్‌ను ఎంచుకునే సమయంలో, మీరు వారి క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ నిష్పత్తి మరియు ప్రాసెస్, కస్టమర్ బేస్ మరియు మీ ప్రాంతంలో వారి ఉనికి లాంటి అంశాలు తనిఖీ చేయాలి. అప్పుడు మాత్రమే ఒక గొప్ప అనుభవం కోసం మీకు హామీ లభిస్తుంది. మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోను ఎందుకు ఎంచుకోవాలో ఇక్కడ చదవండి:
మా నగదురహిత గ్యారేజీలతో మీ స్వంత ఆర్థిక పొదుపులను తాత్కాలికంగా వెచ్చించే అవసరం లేకుండానే మీ కారును మరమ్మత్తు చేయించుకోండి. దేశవ్యాప్తంగా 8700 నగదురహిత గ్యారేజీలతో, మీరు ఎల్లప్పుడూ కవర్ చేయబడతారు.
80% కంటే ఎక్కువ కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను మేము దాఖలు చేసిన అదే రోజున ప్రాసెస్ పూర్తి చేస్తాము. మీ కారు దెబ్బతినడం మరియు దాని మరమ్మత్తు పూర్తి కావడం మధ్య కనీస సమయం మాత్రమే వ్యర్థమయ్యేలా ఇది నిర్ధారిస్తుంది.
మా విశిష్టమైన ఓవర్‌నైట్ రిపేర్ సర్వీస్‌తో, ఏదైనా యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో మీరు రాత్రి నిద్రపోయి, ఉదయం లేచే సరికి మీ కారుకు సంబంధించిన చిన్నపాటి మరమ్మత్తులు పూర్తి చేయబడుతాయి. మరుసటి రోజున మీ అవసరాలకు కారు సిద్ధంగా ఉంటుంది.
బ్రేక్డౌన్లు, టో చేయాల్సిన సమయాల్లో మీకు సహాయం అందించడానికి మా 24x7 సహాయ సేవతో మీరు ఎక్కడా చిక్కుకుపోయే పరిస్థితి ఉండదు.