అల్జీమర్స్ వ్యాధి కోసం క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్
భారతదేశంలో 4 మిలియన్ కన్నా ఎక్కువ మంది ప్రజలు అల్జీమర్స్ వ్యాధి సంబంధిత కొన్ని లేదా ఇతర రకాలతో బాధపడుతున్నారు. అయితే, అందరూ ఊహించిన విధంగా ఈ వ్యాధికి కేవలం వయోజనులు మాత్రమే కాకుండా, 65 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు గల వారు కూడా ఈ వ్యాధి బారిన పడిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి (అల్జీమర్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా). ఇది మెమరీ లాస్‌కు దారితీసే డిమెన్షియా యొక్క సాధారణ రకం. ఇది క్రమంగా తీవ్రం అవుతుంది, డిమెన్షియా లక్షణాలు కాలక్రమేణా మరింత తీవ్రమవుతాయి. ప్రారంభ దశల్లో, రోగి మాట్లాడే ధోరణిలో మార్పు రావచ్చు లేదా వారు పర్యావరణానికి ప్రతిస్పందించడం మానేయవచ్చు; అయితే, తరువాతి దశల్లో అది మరణానికి కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయి. అల్జీమర్స్ వ్యాధికి చికిత్స చేయడం కోసం ఒక నిర్దిష్ట చికిత్స విధానం లేనప్పటికీ, నేడు వైద్య శాస్త్రంలో పురోగతి కారణంగా డిమెన్షియా చికిత్సకు మెరుగైన మార్గాలను కనుగొనడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న రోగికి మెరుగైన జీవితాన్ని అందించడం కోసం ఏకైక మార్గం, వారిని వృత్తిపరమైన శిక్షణ పొందిన సంరక్షకుల, వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉంచడం, తగిన జాగ్రత్తలు పాటించేలా చూసుకోవడం.
అల్జీమర్స్ అనేది క్రమంగా తీవ్రతరం అయ్యే, దీర్ఘకాలిక, అశక్తులను చేసే వ్యాధి, ఇది రోగిని మాత్రమే ప్రభావితం చేయకుండా ఆర్థికంగా, మానసికంగా రోగి కుటుంబంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మెదడు వ్యాధితో పోరాడడం అంత సులభం కాదు. , అలాంటి సమయంలో మీ కుటుంబసభ్యులు నిధుల నిర్వహణలో బిజీగా ఉండకుండా, మీకు తోడుగా నిలబడాలని మీరు కోరుకుంటారు. అందువలన, అల్జీమర్స్ వ్యాధికి సంబంధించిన వైద్య ఖర్చులను కవర్ చేసే క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది.
మెమరీ లాస్ మినహా ఇతర అల్జీమర్స్ వ్యాధి యొక్క సాధారణ లక్షణాలు:
- సమస్యను పరిషరించడంలో ఇబ్బంది
- పని పూర్తి చేయడంలో ఇబ్బంది
- మానసిక స్థితి, వ్యక్తిత్వంలో మార్పు
- స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి ఆకస్మికంగా దూరం జరుగుతారు
- మాటల్లో, రాయడం ద్వారా భావాలను వ్యక్తపరచడంలో సమస్యలు
మీరు ఒక ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉన్నప్పటికీ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం ఎందుకు ముఖ్యం?
క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ అనేది ఒక సాధారణ ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మాదిరిగా కాకుండా ఒక సంపూర్ణ బెనిఫిట్-ప్లాన్. పాలసీలో కవర్ అయ్యేలా జాబితా చేయబడిన ఏదైనా తీవ్రమైన అనారోగ్యం నిర్ధారణ చేయబడిన తర్వాత మాత్రమే ఏకమొత్తం (బీమా చేయబడిన మొత్తం) చెల్లించబడుతుంది. ఒకవేళ, మీకు చికిత్స చేసే వైద్యుడు ఒక నిర్దిష్ట చికిత్స పద్ధతిని సిఫార్సు చేసినప్పుడు, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్ మీకు చికిత్స, సంరక్షణ మరియు రికవరీ కోసం చెల్లించడానికి ఉపయోగించేలా ఒకే లావాదేవీలో ఏకమొత్తం ప్రయోజనం అందిస్తుంది. అప్పులు చెల్లించడానికి, కోల్పోయిన ఆదాయానికి ప్రత్యామ్నాయంగా లేదా కొన్ని సందర్భాల్లో జీవనశైలి మార్పులు అనుసరించడానికి కూడా ఈ డబ్బు ఉపయోగపడవచ్చు. ఒక తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స తీసుకునే క్రమంలో మీ పొదుపులు ఖర్చు అయిపోవచ్చు, పని చేయడం మరియు సంపాదన పరిమితం కావచ్చు మరియు మీ సాధారణ జీవనశైలి ప్రభావితం కావచ్చు, కాబట్టి, ఇలాంటి కష్ట సమయాల్లో మీరు ఎంచుకున్న కవర్ ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం చేకూర్చడం ఉత్తమంగా ఉంటుంది. మీ ప్రస్తుత హెల్త్ కవర్ లేదా ఉద్యోగి హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి మీ వైద్య ఖర్చులను ఒక నిర్దిష్ట పరిధి వరకే కవర్ చేస్తాయి, అయితే, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ అనేది మీకు మొదటి రోగనిర్ధారణ లేదా వైద్య నిపుణుల సలహా మేరకు ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం అందిస్తుంది.
అల్జీమర్స్ వ్యాధి కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్‌ను ఎందుకు ఎంచుకోవాలి?
మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టవచ్చు, మరియు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ ఫండ్స్ బాధ్యతను చేపడుతుంది. అంతే కాకుండా, మీరు చికిత్స పొందడంలో బిజీగా ఉన్నపుడు, ఆదాయ నష్టం సంభవించినట్లయితే, ఇన్సూరెన్స్ సంస్థ మీ కుటుంబానికి నగదు రూపంలో సహాయం చేస్తుంది. 30 రోజుల సర్వైవల్ వ్యవధి ముగిసిన తర్వాత మొదటిసారి జరిగిన రోగనిర్ధారణపై ఒక్క లావాదేవీలో పూర్తి మొత్తం చెల్లించబడుతుంది. ఈ ఏక మొత్తాన్ని సంరక్షణ, చికిత్స, రికవరీ ఖర్చులు, అప్పులు చెల్లించడం లేదా సంపాదించే సామర్థ్యం తగ్గడం వల్ల కోల్పోయిన ఆదాయానికి నిధులను సమకూర్చడం కోసం ఉపయోగించవచ్చు. అదనంగా, క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ కవర్లను ఎంచుకోవడం వలన మీరు సెక్షన్ 80D కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.