ప్రైమరీ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్ - ఒక తీవ్రమైన అనారోగ్యం
ప్రైమరీ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్ (PAH) ఒక ప్రాణాంతక వ్యాధి, ఇందులో ఎలాంటి నిర్ధిష్ట కారణం లేకుండా పల్మనరీ ఆర్టరీ ప్రెషర్ పెరుగుతుంది. ఇది సాధారణ అధిక రక్తపోటుకు భిన్నంగా ఉంటుంది. పల్మనరీ ఆర్టరీలు గుండె కుడి వైపు నుండి ఊపిరితిత్తుల గుండా రక్తాన్ని తీసుకువెళ్లే రక్త నాళాలు. వైద్యులు రక్త నాళాలు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడే లేదా మీ ధమనులలో అదనపు కణాల పెరుగుదలను తగ్గించే మందులను సూచించవచ్చు; కానీ, వ్యాధి పూర్తిగా నయం చేయడం కుదరదు. PAH సాధారణంగా 30-60 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది, అయితే, మరి కొందరు వ్యక్తులు తేలికపాటి లక్షణాలతో సాధారణ జీవితాన్ని గడుపుతారు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి నొప్పి, అలసట, చీలమండలు, కాళ్ల వాపులు వంటివి కొన్ని కనిపించే ప్రధాన లక్షణాలు. నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిజార్డర్స్ ప్రకారం, PAH ఉన్న రోగులలో దాదాపు 15-20% మంది ప్రజలకి PAH వారసత్వంగా వస్తుంది. అయితే, PAHని ప్రేరేపించే అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి. గుండె జబ్బుతో పోరాడటం అనేది అంత సులభమైన విషయం కాదు. అలాంటి సమయంలో మీ కుటుంబసభ్యులు నిధుల నిర్వహణలో బిజీగా ఉండకుండా, మీకు తోడుగా నిలబడాలని మీరు కోరుకుంటారు. అందువల్ల, ప్రైమరీ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్ కోసం వైద్య ఖర్చులను కవర్ చేసే క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది.
మీరు ఒక ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉన్నప్పటికీ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం ఎందుకు ముఖ్యం?
క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ అనేది ఒక సాధారణ ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మాదిరిగా కాకుండా ఒక సంపూర్ణ బెనిఫిట్-ప్లాన్. పాలసీలో కవర్ అయ్యేలా జాబితా చేయబడిన ఏదైనా తీవ్రమైన అనారోగ్యం నిర్ధారణ చేయబడిన తర్వాత మాత్రమే ఏకమొత్తం (బీమా చేయబడిన మొత్తం) చెల్లించబడుతుంది. ఒకవేళ, మీకు చికిత్స చేసే వైద్యుడు ఒక నిర్దిష్ట చికిత్స పద్ధతిని సిఫార్సు చేసినప్పుడు, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్ మీకు చికిత్స, సంరక్షణ మరియు రికవరీ కోసం చెల్లించడానికి ఉపయోగించేలా ఒకే లావాదేవీలో ఏకమొత్తం ప్రయోజనం అందిస్తుంది. అప్పులు చెల్లించడానికి, కోల్పోయిన ఆదాయానికి ప్రత్యామ్నాయంగా లేదా కొన్ని సందర్భాల్లో జీవనశైలి మార్పులు అనుసరించడానికి కూడా ఈ డబ్బు ఉపయోగపడవచ్చు. ఒక తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స తీసుకునే క్రమంలో మీ పొదుపులు ఖర్చు అయిపోవచ్చు, పని చేయడం మరియు సంపాదన పరిమితం కావచ్చు మరియు మీ సాధారణ జీవనశైలి ప్రభావితం కావచ్చు, కాబట్టి, ఇలాంటి కష్ట సమయాల్లో మీరు ఎంచుకున్న కవర్ ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం చేకూర్చడం ఉత్తమంగా ఉంటుంది. మీ ప్రస్తుత హెల్త్ కవర్ లేదా ఉద్యోగి హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి మీ వైద్య ఖర్చులను ఒక నిర్దిష్ట పరిధి వరకే కవర్ చేస్తాయి, అయితే, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ అనేది మీకు మొదటి రోగనిర్ధారణ లేదా వైద్య నిపుణుల సలహా మేరకు ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం అందిస్తుంది.
ప్రైమరీ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్‌ను ఎందుకు ఎంచుకోవాలి?
మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టవచ్చు, మరియు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ ఫండ్స్ బాధ్యతను చేపడుతుంది. అంతే కాకుండా, మీరు చికిత్స పొందడంలో బిజీగా ఉన్నపుడు, ఆదాయ నష్టం సంభవించినట్లయితే, ఇన్సూరెన్స్ సంస్థ మీ కుటుంబానికి నగదు రూపంలో సహాయం చేస్తుంది. 30 రోజుల సర్వైవల్ వ్యవధి ముగిసిన తర్వాత మొదటిసారి జరిగిన రోగనిర్ధారణపై ఒక్క లావాదేవీలో పూర్తి మొత్తం చెల్లించబడుతుంది. ఈ ఏక మొత్తాన్ని సంరక్షణ, చికిత్స, రికవరీ ఖర్చులు, అప్పులు చెల్లించడం లేదా సంపాదించే సామర్థ్యం తగ్గడం వల్ల కోల్పోయిన ఆదాయానికి నిధులను సమకూర్చడం కోసం ఉపయోగించవచ్చు. అదనంగా, క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ కవర్లను ఎంచుకోవడం వలన మీరు సెక్షన్ 80D కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.