ఎండ్ స్టేజ్ లివర్ వ్యాధి కోసం క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్
ప్రోటీన్ ఉత్పత్తి, బ్లడ్ క్లాటింగ్, గ్లూకోజ్, చక్కెర, ఐరన్ మరియు మెటబాలిజం వంటి శరీర ఫంక్షన్లలో లివర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది; అందువల్ల ఇది 'శరీరం యొక్క ప్రయోగశాల' అని పిలుస్తారు.. ఇది మానవ శరీరంలో అతిపెద్ద అంతర్గత అవయవం మరియు గ్లాండ్ మరియు సుమారుగా 3-3.5 పౌండ్ల బరువు ఉంటుంది, లివర్‌కు పునరుత్పత్తి లక్షణాలు కూడా ఉన్నాయి. అయితే వైరల్ హెపటైటిస్, ఆటోఇమ్యూన్ రుగ్మతలు, క్యాన్సర్, ఊబకాయం, మద్యం, మాదకద్రవ్యాలు, విష పదార్థాలు మరియు ఆనువంశిక రుగ్మతల కారణంగా కోలుకోలేని విధంగా లైవ్ పూర్తిగా పాడైపోవచ్చు.
అటువంటి పరిస్థితుల్లో, రోగికి చికిత్స చేయడానికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఏకైక మార్గం. చివరి దశ కాలేయ వ్యాధిని చికిత్స చేయకుండా వదిలేస్తే ప్రాణాంతకం మరియు మరణానికి దారితీయవచ్చు. ప్రస్తుతం, వైద్య విధానాల ఆధారంగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఖర్చు ₹5 లక్షల నుండి 30 లక్షల వరకు మారవచ్చు (మూలం: బయోటెక్నాలజీ సమాచారం కోసం జాతీయ కేంద్రం). అటువంటి అధిక ఖర్చు చేయడం అనేది ఎక్కువ ఆర్థిక ఒత్తిడిని సృష్టించవచ్చు. జీవితంలో అటువంటి ఆరోగ్య అనిశ్చిత పరిస్థితుల నుండి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్‌ను ఎంచుకోవడం మంచిది. దీర్ఘకాలిక వ్యాధితో పోరాడటం సులభం కాదు. , అలాంటి సమయంలో మీ కుటుంబసభ్యులు నిధుల నిర్వహణలో బిజీగా ఉండకుండా, మీకు తోడుగా నిలబడాలని మీరు కోరుకుంటారు. అందువల్ల, స్ట్రోక్ మరియు సంబంధిత ఆరోగ్య సమస్యల చికిత్స కోసం వైద్య ఖర్చులను కవర్ చేసే క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది.
ఎండ్-స్టేజ్ లివర్ వ్యాధి లక్షణాలలో ఇవి ఉండవచ్చు:
- రక్తస్రావం లేదా కమిలిన గాయం
- ఆకలి కోల్పోవడం
- వికారం
- ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తి లేకపోవడం
- ఫ్లూయిడ్ బిల్డ్ అప్ కారణంగా వాపు
- జాండిస్ లక్షణాలు (కళ్ళు మరియు చర్మం పసుపుపచ్చగా మారడం
లివర్ ఫంక్షన్ యొక్క శాశ్వత మరియు కోలుకోలేని విధంగా వైఫల్యం చెందడానికి ఈ కింది మూడు కారణాలు ఉంటాయి:
- శాశ్వత జాండిస్
- జలోదరము
- హెపటిక్ ఎన్సెఫలోపతి
మీరు ఒక ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉన్నప్పటికీ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం ఎందుకు ముఖ్యం?
క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ అనేది ఒక సాధారణ ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మాదిరిగా కాకుండా ఒక సంపూర్ణ బెనిఫిట్-ప్లాన్. పాలసీలో కవర్ అయ్యేలా జాబితా చేయబడిన ఏదైనా తీవ్రమైన అనారోగ్యం నిర్ధారణ చేయబడిన తర్వాత మాత్రమే ఏకమొత్తం (బీమా చేయబడిన మొత్తం) చెల్లించబడుతుంది. ఒకవేళ, మీకు చికిత్స చేసే వైద్యుడు ఒక నిర్దిష్ట చికిత్స పద్ధతిని సిఫార్సు చేసినప్పుడు, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్ మీకు చికిత్స, సంరక్షణ మరియు రికవరీ కోసం చెల్లించడానికి ఉపయోగించేలా ఒకే లావాదేవీలో ఏకమొత్తం ప్రయోజనం అందిస్తుంది. అప్పులు చెల్లించడానికి, కోల్పోయిన ఆదాయానికి ప్రత్యామ్నాయంగా లేదా కొన్ని సందర్భాల్లో జీవనశైలి మార్పులు అనుసరించడానికి కూడా ఈ డబ్బు ఉపయోగపడవచ్చు. ఒక తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స తీసుకునే క్రమంలో మీ పొదుపులు ఖర్చు అయిపోవచ్చు, పని చేయడం మరియు సంపాదన పరిమితం కావచ్చు మరియు మీ సాధారణ జీవనశైలి ప్రభావితం కావచ్చు, కాబట్టి, ఇలాంటి కష్ట సమయాల్లో మీరు ఎంచుకున్న కవర్ ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం చేకూర్చడం ఉత్తమంగా ఉంటుంది. మీ ప్రస్తుత హెల్త్ కవర్ లేదా ఉద్యోగి హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి మీ వైద్య ఖర్చులను ఒక నిర్దిష్ట పరిధి వరకే కవర్ చేస్తాయి, అయితే, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ అనేది మీకు మొదటి రోగనిర్ధారణ లేదా వైద్య నిపుణుల సలహా మేరకు ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం అందిస్తుంది.
ఎండ్ స్టేజ్ లివర్ వ్యాధి కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్‌ను ఎందుకు ఎంచుకోవాలి?
మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టవచ్చు, మరియు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ ఫండ్స్ బాధ్యతను చేపడుతుంది. అంతే కాకుండా, మీరు చికిత్స పొందడంలో బిజీగా ఉన్నపుడు, ఆదాయ నష్టం సంభవించినట్లయితే, ఇన్సూరెన్స్ సంస్థ మీ కుటుంబానికి నగదు రూపంలో సహాయం చేస్తుంది. 30 రోజుల సర్వైవల్ వ్యవధి ముగిసిన తర్వాత మొదటిసారి జరిగిన రోగనిర్ధారణపై ఒక్క లావాదేవీలో పూర్తి మొత్తం చెల్లించబడుతుంది. ఈ ఏక మొత్తాన్ని సంరక్షణ, చికిత్స, రికవరీ ఖర్చులు, అప్పులు చెల్లించడం లేదా సంపాదించే సామర్థ్యం తగ్గడం వల్ల కోల్పోయిన ఆదాయానికి నిధులను సమకూర్చడం కోసం ఉపయోగించవచ్చు. అదనంగా, క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ కవర్లను ఎంచుకోవడం వలన మీరు సెక్షన్ 80D కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.