కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ - క్రిటికల్ ఇల్‌నెస్
కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ లేదా సిఎబిజి అనేది మీ గుండెకు రక్త ప్రసరణను మెరుగుపరిచే ఒక రకమైన శస్త్రచికిత్స. కరోనరీ ధమనుల లోపల ప్లేక్ అని పిలువబడే మైనపు పదార్థం ఏర్పడినప్పుడు, ఈ శస్త్రచికిత్స సిఫార్సు చేయబడుతుంది. ఈ ధమనులు ఆక్సిజన్ సమృద్ధిగా ఉండే రక్తాన్ని మీ గుండెకు సరఫరా చేస్తాయి. ధమనుల లోపల ఫ్లేక్ చేరడం, గట్టిపడటం వలన గుండెకు రక్త ప్రవాహం తగ్గిపోతుంది, ఇది అసౌకర్యం లేదా తీవ్రమైన ఛాతీ నొప్పికి దారితీస్తుంది. సిఎబిజి సమయంలో ఒక ఆరోగ్యకరమైన ధమని లేదా సిర అనేది శరీరంలోని ఇతర భాగాల నుండి సేకరించబడుతుంది, గుండె కండరాలకు రక్త ప్రవాహాన్ని నిర్ధారించడానికి కొత్త మార్గాన్ని సృష్టించడం కోసం, తొలగించిన కరోనరీ ఆర్టరీకి గ్రాఫ్ట్ చేయబడుతుంది.
సిఎబిజి అనేది అత్యంత సాధారణమైన ఓపెన్ హార్ట్ సర్జరీ. రికవరీ కాలం వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటుంది. ఈ కాలంలో రోగికి అత్యధిక సంరక్షణ మరియు శ్రద్ధ అవసరం. ఇది వారి జీవనోపాధిని సంపాదించుకునే సామర్థ్యాన్ని కొంత కాలం వరకు ప్రభావితం చేస్తుంది.
మీరు ఒక ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉన్నప్పటికీ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం ఎందుకు ముఖ్యం?
క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ అనేది ఒక సాధారణ ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మాదిరిగా కాకుండా ఒక సంపూర్ణ బెనిఫిట్-ప్లాన్. పాలసీలో కవర్ అయ్యేలా జాబితా చేయబడిన ఏదైనా తీవ్రమైన అనారోగ్యం నిర్ధారణ చేయబడిన తర్వాత మాత్రమే ఏకమొత్తం (బీమా చేయబడిన మొత్తం) చెల్లించబడుతుంది. ఒకవేళ, మీకు చికిత్స చేసే వైద్యుడు ఒక నిర్దిష్ట చికిత్స పద్ధతిని సిఫార్సు చేసినప్పుడు, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్ మీకు చికిత్స, సంరక్షణ మరియు రికవరీ కోసం చెల్లించడానికి ఉపయోగించేలా ఒకే లావాదేవీలో ఏకమొత్తం ప్రయోజనం అందిస్తుంది. అప్పులు చెల్లించడానికి, కోల్పోయిన ఆదాయానికి ప్రత్యామ్నాయంగా లేదా కొన్ని సందర్భాల్లో జీవనశైలి మార్పులు అనుసరించడానికి కూడా ఈ డబ్బు ఉపయోగపడవచ్చు. ఒక తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స తీసుకునే క్రమంలో మీ పొదుపులు ఖర్చు అయిపోవచ్చు, పని చేయడం మరియు సంపాదన పరిమితం కావచ్చు మరియు మీ సాధారణ జీవనశైలి ప్రభావితం కావచ్చు, కాబట్టి, ఇలాంటి కష్ట సమయాల్లో మీరు ఎంచుకున్న కవర్ ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం చేకూర్చడం ఉత్తమంగా ఉంటుంది. మీ ప్రస్తుత హెల్త్ కవర్ లేదా ఉద్యోగి హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి మీ వైద్య ఖర్చులను ఒక నిర్దిష్ట పరిధి వరకే కవర్ చేస్తాయి, అయితే, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ అనేది మీకు మొదటి రోగనిర్ధారణ లేదా వైద్య నిపుణుల సలహా మేరకు ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం అందిస్తుంది.
కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్‌ను ఎందుకు ఎంచుకోవాలి?
మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టవచ్చు, మరియు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ ఫండ్స్ బాధ్యతను చేపడుతుంది. అంతే కాకుండా, మీరు చికిత్స పొందడంలో బిజీగా ఉన్నపుడు, ఆదాయ నష్టం సంభవించినట్లయితే, ఇన్సూరెన్స్ సంస్థ మీ కుటుంబానికి నగదు రూపంలో సహాయం చేస్తుంది. 30 రోజుల సర్వైవల్ వ్యవధి ముగిసిన తర్వాత మొదటిసారి జరిగిన రోగనిర్ధారణపై ఒక్క లావాదేవీలో పూర్తి మొత్తం చెల్లించబడుతుంది. ఈ ఏక మొత్తాన్ని సంరక్షణ, చికిత్స, రికవరీ ఖర్చులు, అప్పులు చెల్లించడం లేదా సంపాదించే సామర్థ్యం తగ్గడం వల్ల కోల్పోయిన ఆదాయానికి నిధులను సమకూర్చడం కోసం ఉపయోగించవచ్చు. అదనంగా, క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ కవర్లను ఎంచుకోవడం వలన మీరు సెక్షన్ 80D కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.