కిడ్నీ ఫెయిల్యూర్ కోసం క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్
కిడ్నీ చిక్కుడు గింజ ఆకారంలో ఉండే ఒక అవయవం, ఇది రక్తం నుండి విషపదార్థాలను ఫిల్టర్ చేయడంలో సహాయపడుతుంది, మూత్రనాళం నుండి మూత్రాశయంలోకి వ్యర్థాలను మూత్రం రూపంలో పంపుతుంది. ఇది హైపర్‌టెన్షన్‌ను కూడా నియంత్రిస్తుంది, నీటి సమతుల్యతను కాపాడుతుంది. ఒక కిడ్నీ లేదా కిడ్నీ జత, శరీరంలోని ఈ కీలకమైన ప్రక్రియను నిర్వహించడంలో విఫలమైతే, అది ప్రాణాంతక ప్రభావాలకు దారితీయవచ్చు. మూత్రపిండము యొక్క అలాంటి రుగ్మతను లేదా పరిస్థితిని చివరి దశలోని కిడ్నీ వ్యాధి లేదా కిడ్నీ ఫెయిల్యూర్ అని పిలుస్తారు, దీనికి సాధారణ డయాలసిస్ లేదా మూత్రపిండ మార్పిడి అవసరం. దీర్ఘకాలిక డయాబెటిస్ మెల్లిటస్ మరియు హైపర్‌టెన్షన్‌లు ఈ పరిస్థితికి అత్యంత సాధారణ కారణాలు కావచ్చు.
ఇండియన్ రీనల్ ఫౌండేషన్ ప్రకారం, హిమోడయాలసిస్ (12 డయాలసిస్/ నెల) చేయించుకోవడానికి నెలకు దాదాపు ₹12-15,000/- ఖర్చవుతుంది, అయితే పెరిటోనియల్ డయాలసిస్ కోసం దాదాపు నెలకు ₹ 18 నుండి 20,000/- ఖర్చవుతుంది. ట్రాన్స్‌ప్లాంటేషన్ విషయంలో రోగి సుమారు ₹4 లక్షలను సగటున వెచ్చించాల్సి వస్తుంది, అదనంగా ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత మెడిసిన్స్, చికిత్సకు మరో ₹ 15-20 ఖర్చవుతాయి. కిడ్నీ ఫెయిల్యూర్ అయితే, ఇలాంటి భారీ వైద్య ఖర్చులను భరించడం కష్టం అవుతుంది. కిడ్నీ డయాలసిస్ లేదా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడం వలన, మీరు పోగుచేసిన పొదుపులు మొత్తం హరించుకుపోవడమే కాకుండా, మీ కుటుంబ సభ్యులపై మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది.
మీరు ఒక ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉన్నప్పటికీ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం ఎందుకు ముఖ్యం?
క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ అనేది ఒక బెనిఫిట్ ప్లాన్, ఇది వీటి లాంటిది కాదు: సాంప్రదాయ నష్టపరిహార హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు. పాలసీలో కవర్ అయ్యేలా జాబితా చేయబడిన ఏదైనా తీవ్రమైన అనారోగ్యం నిర్ధారణ చేయబడిన తర్వాత మాత్రమే ఏకమొత్తం (బీమా చేయబడిన మొత్తం) చెల్లించబడుతుంది. ఒకవేళ, మీకు చికిత్స చేసే వైద్యుడు ఒక నిర్దిష్ట చికిత్స పద్ధతిని సిఫార్సు చేసినప్పుడు, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్ మీకు చికిత్స, సంరక్షణ మరియు రికవరీ కోసం చెల్లించడానికి ఉపయోగించేలా ఒకే లావాదేవీలో ఏకమొత్తం ప్రయోజనం అందిస్తుంది. అప్పులు చెల్లించడానికి, కోల్పోయిన ఆదాయానికి ప్రత్యామ్నాయంగా లేదా కొన్ని సందర్భాల్లో జీవనశైలి మార్పులు అనుసరించడానికి కూడా ఈ డబ్బు ఉపయోగపడవచ్చు. ఒక తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స తీసుకునే క్రమంలో మీ పొదుపులు ఖర్చు అయిపోవచ్చు, పని చేయడం మరియు సంపాదన పరిమితం అవ్వచ్చు మరియు మీ సాధారణ జీవనశైలి ప్రభావితం కావచ్చు, కాబట్టి, ఇలాంటి కష్ట సమయాల్లో మీరు ఎంచుకున్న కవర్ ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం చేకూర్చడం ఉత్తమంగా ఉంటుంది. మీ ప్రస్తుత హెల్త్ కవర్ లేదా ఉద్యోగి హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి మీ వైద్య ఖర్చులను ఒక నిర్దిష్ట పరిధి వరకే కవర్ చేస్తాయి, అయితే, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ అనేది మీకు మొదటి రోగనిర్ధారణ లేదా వైద్య నిపుణుల సలహా మేరకు ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం అందిస్తుంది.
కిడ్నీ ఫెయిల్యూర్ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్‌ను ఎందుకు ఎంచుకోవాలి?
మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టవచ్చు, మరియు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ ఫండ్స్ బాధ్యతను చేపడుతుంది. అంతే కాకుండా, మీరు చికిత్స పొందడంలో బిజీగా ఉన్నపుడు, ఆదాయ నష్టం సంభవించినట్లయితే, ఇన్సూరెన్స్ సంస్థ మీ కుటుంబానికి నగదు రూపంలో సహాయం చేస్తుంది. 30 రోజుల సర్వైవల్ వ్యవధి ముగిసిన తర్వాత మొదటిసారి జరిగిన రోగనిర్ధారణపై ఒక్క లావాదేవీలో పూర్తి మొత్తం చెల్లించబడుతుంది. ఈ ఏక మొత్తాన్ని సంరక్షణ, చికిత్స, రికవరీ ఖర్చులు, అప్పులు చెల్లించడం లేదా సంపాదించే సామర్థ్యం తగ్గడం వల్ల కోల్పోయిన ఆదాయానికి నిధులను సమకూర్చడం కోసం ఉపయోగించవచ్చు. అదనంగా, క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ కవర్లను ఎంచుకోవడం వలన మీరు సెక్షన్ 80D కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.