గుండె పోటు (మయోకార్డియల్ ఇన్‌ఫార్క్‌షన్) - క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్
గుండె అనేది గుండె కండరాలకు సంబంధించిన వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన భాగం. ఎందుకంటే, మొత్తం శరీరానికి ఇదే రక్తాన్ని పంప్ చేయాలి. ఇది ఒక కండరయుత అవయవం మరియు దీనికి ఆక్సిజన్-సంవృద్ధ రక్తం అవసరం. కరోనరీ ధమనులనేవి హృదయానికి రక్త సరఫరా చేసే నాళాలు. గుండె ఆరోగ్యంగా పనిచేయడంలో ఈ ధమనుల పనితీరు కీలకం. ఈ ధమనులు మరియు దాని ఉప నాళాల్లో కొన్ని అంశాల కారణంగా అడ్డంకులు ఏర్పడితే, ఆ పరిస్థితి అనేది మయోకార్డియల్ ఇన్‌ఫార్క్‌షన్ లేదా గుండెపోటుకు దారితీయవచ్చు.
మయోకార్డియల్ ఇన్‌ఫార్క్‌షన్) అంటే, హృదయ కండరాల మరణం అని అర్థం. అకస్మాత్తుగా ఇబ్బందిగా అనిపించడం, చెమటలు పట్టడం, మరియు శ్వాస ఆడకపోవడం, దవడ నొప్పి, ఎడమచేయి నొప్పి లేదా ఛాతీలో నొప్పి లాంటివి దీని లక్షణాలుగా ఉంటాయి. గుండెకు కలిగే నష్టాన్ని కనీస స్థాయికి తగ్గించడం కోసం తక్షణ వైద్య సహాయం అత్యంత కీలకం. నష్ట తీవ్రతను బట్టి, వైద్య నిర్వహణ (అంటే, రక్తాన్ని పలుచన చేసే ఔషధాలు), కరోనరీ ధమనుల యాంజియోప్లాస్టీ లేదా ఓపెన్ హార్ట్ శస్తచికిత్స, లాంటి వాటిని గుండె వైద్య నిపుణులు సూచిస్తారు. ఓపెన్ హార్డ్ శస్త్రచికిత్సను సాధారణంగా CABG (కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్) అంటారు. చికిత్స ఏ రకమైనది అయినప్పటికీ , గుండెపోటు వచ్చినవారు కనీసం 1-2 నెలలు పూర్తి స్థాయి విశ్రాంతి తీసుకోవాలి. అంటే, ఈ సమయంలో రోగి తన సాధారణ కార్యకలాపాలు నిర్వహించలేరు మరియు జీవనం కోసం సంపాదించలేరు.
మీరు ఒక ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉన్నప్పటికీ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం ఎందుకు ముఖ్యం?
క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ సంప్రదాయ నష్టపరిహార హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు లాగా కాకుండా ఒక ప్రయోజనకరమైన ప్లాన్. పాలసీలో కవర్ అయ్యేలా జాబితా చేయబడిన ఏదైనా క్లిష్టమైన అనారోగ్యం నిర్ధారణ చేయబడిన తర్వాత మాత్రమే ఏకమొత్తం (బీమా చేయబడిన మొత్తం) చెల్లించబడుతుంది. ఒకవేళ, మీకు చికిత్స చేసే వైద్యుడు ఒక నిర్దిష్ట చికిత్స పద్ధతిని సిఫార్సు చేసినప్పుడు, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్ మీకు చికిత్స, సంరక్షణ మరియు రికవరీ కోసం చెల్లించడానికి ఉపయోగించేలా ఒకే లావాదేవీలో ఏకమొత్తం ప్రయోజనం అందిస్తుంది. అప్పులు చెల్లించడానికి, కోల్పోయిన ఆదాయానికి ప్రత్యామ్నాయంగా లేదా కొన్ని సందర్భాల్లో జీవనశైలి మార్పులు అనుసరించడానికి కూడా ఈ డబ్బు ఉపయోగపడవచ్చు. ఒక తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స తీసుకునే క్రమంలో మీ పొదుపులు ఖర్చు అయిపోవచ్చు, పని చేయడం మరియు సంపాదన పరిమితం అవ్వచ్చు మరియు మీ సాధారణ జీవనశైలి ప్రభావితం కావచ్చు, కాబట్టి, ఇలాంటి కష్ట సమయాల్లో మీరు ఎంచుకున్న కవర్ వరకు ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం లభించడం ఉత్తమంగా ఉంటుంది. మీ ప్రస్తుత హెల్త్ కవర్ లేదా ఉద్యోగి హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి మీ వైద్య ఖర్చులను ఒక నిర్దిష్ట పరిధి వరకే కవర్ చేస్తాయి, అయితే, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ అనేది మీకు మొదటి రోగనిర్ధారణ లేదా వైద్య నిపుణుల సలహా మేరకు ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం అందిస్తుంది.
గుండెపోటు (మయోకార్డియల్ ఇన్‌ఫార్క్‌షన్) కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్ ఎందుకు ఎంచుకోవాలి?
మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టవచ్చు, మరియు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ ఫండ్స్ బాధ్యతను చేపడుతుంది. అంతే కాకుండా, మీరు చికిత్స పొందడంలో బిజీగా ఉన్నపుడు, ఆదాయ నష్టం సంభవించినట్లయితే, ఇన్సూరెన్స్ సంస్థ మీ కుటుంబానికి నగదు రూపంలో సహాయం చేస్తుంది. 30 రోజుల సర్వైవల్ వ్యవధి ముగిసిన తర్వాత మొదటిసారి జరిగిన రోగనిర్ధారణపై ఒక్క లావాదేవీలో పూర్తి మొత్తం చెల్లించబడుతుంది. ఈ ఏక మొత్తాన్ని సంరక్షణ, చికిత్స, రికవరీ ఖర్చులు, అప్పులు చెల్లించడం లేదా సంపాదించే సామర్థ్యం తగ్గడం వల్ల కోల్పోయిన ఆదాయానికి నిధులను సమకూర్చడం కోసం ఉపయోగించవచ్చు. అదనంగా, క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ కవర్లను ఎంచుకోవడం వలన మీరు సెక్షన్ 80D కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.