బెనిన్ ట్యూమర్ కోసం క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్
బెనిన్ బ్రెయిన్ ట్యూమర్ అనేది కణాల సమూహం, ఇందులో అసాధారణ రీతిలో కణ విభజన మరియు అభివృద్ధి ఆకృతులు ఉంటాయి, ఇవి కణాల సమూహంగా అభివృద్ధి చెందుతాయి ఇందులో క్యాన్సర్ లక్షణాలు ఉండవు. ఈ కణితులు నెమ్మదిగా పెరుగుతాయి మరియు పొరుగున ఉన్న కణజాలాలను ఆక్రమించవు లేదా ఇతర అవయవాలకు విస్తరించవు. బెనిన్ ట్యూమర్‌ని తొలగించవచ్చు మరియు మళ్ళీ ఏర్పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, మెదడు కణజాలాన్ని మరియు పుర్రెలో ఇతర భాగాల పై ఒత్తిడిని కలిగిస్తున్నందున ఇది ప్రాణాంతకం అవ్వచ్చు. రోగి వయస్సు మరియు ట్యూమర్ లొకేషన్ ఆధారంగా, నిపుణులు అనేక చికిత్స విధానాలను సూచిస్తారు.
ఒక న్యూరోసర్జన్ సర్జరీని నిర్వహించవచ్చు మరియు ట్యూమర్‌ను తొలగించవచ్చు, చుట్టూ ఉన్న కణజాలాన్ని దెబ్బతీయకుండా ట్యూమర్‌ను తొలగించడమే లక్ష్యం. ఇది ప్రాణాంతక వ్యాధి, ఇది దృష్టి సమస్య, బలాన్ని కోల్పోవడం మరియు మాట్లాడే ఇబ్బందులకు దారితీయవచ్చు. మెదడు వ్యాధితో పోరాడడం అంత సులభం కాదు. , అలాంటి సమయంలో మీ కుటుంబసభ్యులు నిధుల నిర్వహణలో బిజీగా ఉండకుండా, మీకు తోడుగా నిలబడాలని మీరు కోరుకుంటారు. అందువల్లనే, క్రిటికల్ ఇల్నెస్ పాలసీని సూచించడం జరిగింది హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఇది అటువంటి మెదడు కణితుల చికిత్స కోసం వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది.
బెనిన్ ట్యూమర్‌కు దారితీసే కారణాలు
- రేడియేషన్‌కు గురి అవ్వడం వంటి పర్యావరణ టాక్సిన్లు
- జెనెటిక్స్
- ఆహారపు అలవాట్లు
- ఒత్తిడి
- లోకల్ ట్రామా లేదా గాయం
- ఇన్ఫ్లమేషన్ లేదా ఇన్ఫెక్షన్
మీరు ఒక ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉన్నప్పటికీ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం ఎందుకు ముఖ్యం?
క్రిటికల్ ఇల్నెస్ పాలసీ అనేది ఒక సాధారణ ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మాదిరిగా కాకుండా ఒక సంపూర్ణ బెనిఫిట్-ప్లాన్. పాలసీలో కవర్ అయ్యేలా జాబితా చేయబడిన ఏదైనా తీవ్రమైన అనారోగ్యం నిర్ధారణ చేయబడిన తర్వాత మాత్రమే ఏకమొత్తం (బీమా చేయబడిన మొత్తం) చెల్లించబడుతుంది. ఒకవేళ, మీకు చికిత్స చేసే వైద్యుడు ఒక నిర్దిష్ట చికిత్స పద్ధతిని సిఫార్సు చేసినప్పుడు, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ మీకు చికిత్స, సంరక్షణ మరియు రికవరీ కోసం చెల్లించడానికి ఉపయోగించేలా ఒకే లావాదేవీలో ఏకమొత్తం ప్రయోజనం అందిస్తుంది. అప్పులు చెల్లించడానికి, కోల్పోయిన ఆదాయానికి ప్రత్యామ్నాయంగా లేదా కొన్ని సందర్భాల్లో జీవనశైలి మార్పులు అనుసరించడానికి కూడా ఈ డబ్బు ఉపయోగపడవచ్చు. ఒక తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స తీసుకునే క్రమంలో మీ పొదుపులు ఖర్చు అయిపోవచ్చు, పని చేయడం మరియు సంపాదన పరిమితం కావచ్చు మరియు మీ సాధారణ జీవనశైలి ప్రభావితం కావచ్చు, కాబట్టి, ఇలాంటి కష్ట సమయాల్లో మీరు ఎంచుకున్న కవర్ ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం చేకూర్చడం ఉత్తమంగా ఉంటుంది. మీ ప్రస్తుత హెల్త్ కవర్ లేదా ఉద్యోగి హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి మీ వైద్య ఖర్చులను ఒక నిర్దిష్ట పరిధి వరకే కవర్ చేస్తాయి, అయితే, క్రిటికల్ ఇల్నెస్ కవర్ అనేది మీకు మొదటి రోగనిర్ధారణ లేదా వైద్య నిపుణుల సలహా మేరకు ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం అందిస్తుంది.
బెనిన్ ట్యూమర్ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందిస్తున్న క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్‌ను ఎందుకు ఎంచుకోవాలి?
మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టవచ్చు, మరియు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్నెస్ కవర్ ఫండ్స్ బాధ్యతను చేపడుతుంది. అంతే కాకుండా, మీరు చికిత్స పొందడంలో బిజీగా ఉన్నపుడు, ఆదాయ నష్టం సంభవించినట్లయితే, ఇన్సూరెన్స్ సంస్థ మీ కుటుంబానికి నగదు రూపంలో సహాయం చేస్తుంది. 30 రోజుల సర్వైవల్ వ్యవధి ముగిసిన తర్వాత మొదటిసారి జరిగిన రోగనిర్ధారణపై ఒక్క లావాదేవీలో పూర్తి మొత్తం చెల్లించబడుతుంది. ఈ ఏక మొత్తాన్ని సంరక్షణ, చికిత్స, రికవరీ ఖర్చులు, అప్పులు చెల్లించడం లేదా సంపాదించే సామర్థ్యం తగ్గడం వల్ల కోల్పోయిన ఆదాయానికి నిధులను సమకూర్చడం కోసం ఉపయోగించవచ్చు. అదనంగా, క్రిటికల్ ఇల్నెస్ హెల్త్ కవర్లను ఎంచుకోవడం వలన మీరు సెక్షన్ 80D కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.