ప్రధాన అవయవ మార్పిడి కోసం క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్
మన శరీరం రోజువారి పనితీరులో మన అవయవాలు కీలక పాత్రను పోషిస్తాయి. మీ శరీరంలోని ప్రధాన అవయవం లేని ఒక రోజును ఒకసారి ఊహించుకోండి, భయంకరంగా ఉంది కదూ? అవయవం వైఫల్యం ప్రభావం కూడా అలాంటిదే, ఏదైనా పెద్ద అవయవం అసాధారణంగా ప్రవర్తించినప్పుడు శరీర వ్యవస్థ దెబ్బతింటుంది, మీ జీవనశైలిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. వైద్య శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందడం వలన ప్రపంచవ్యాప్తంగా ప్రధాన అవయవ మార్పిడి అనేది విజయవంతంగా జరుగుతోంది. ఈ ప్రక్రియలో జీవించి ఉన్న లేదా చనిపోయిన దాత శరీరం నుండి ఒక అవయవం సేకరించబడుతుంది, దానిని గ్రహీత శరీరం లోపల అమర్చడం జరుగుతుంది. అవయవ దాత, గ్రహీత అవయవ మార్పిడికి అనుకూలంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి అనేక పరీక్షలు నిర్వహించిన తర్వాత, అంతిమంగా ఇది నిర్వహించడం జరుగుతుంది.
గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్లోమం, ఎముక మజ్జ మరియు మరెన్నో అవయవాల కోసం ట్రాన్స్‌ప్లాంటేషన్ సాధ్యమవుతుంది. ఒక అవయవ మార్పిడి ప్రక్రియ కోసం వైద్య ఖర్చు భారీగా ఉంటుంది, ఇది సుమారు ₹5-20 లక్షల వరకు ఉండవచ్చు. ఇలాంటి ఊహించని వైద్య ఖర్చులను అధిగమించడానికి, మీరు మీ పొదుపులను వెచ్చించాల్సి వస్తుంది, అప్పులు చేయడం లేదా ఆస్తులను తనఖా పెట్టడం వంటివి చేయాల్సివస్తుంది. అలాంటి ఊహించని అనారోగ్యాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం కోసం అవయవం మార్పిడిని ఎంచుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం హెల్త్ ఇన్సూరెన్స్ కవర్.
సర్జరీ సమయంలో మరియు తరువాత కూడా ప్రమాదాలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సర్జరీ తర్వాత నిరంతర పర్యవేక్షణ, ఇన్వెస్టిగేషన్స్, చికిత్స ప్రబలంగా ఉంటాయి, ఇవన్నీ కూడా చివరికి హాస్పిటలైజేషన్ మొత్తం ఖర్చును పెంచుతాయి.
మీరు ఒక ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉన్నప్పటికీ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం ఎందుకు ముఖ్యం?
క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ అనేది ఒక సాధారణ ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మాదిరిగా కాకుండా ఒక సంపూర్ణ బెనిఫిట్-ప్లాన్. పాలసీలో కవర్ అయ్యేలా జాబితా చేయబడిన ఏదైనా తీవ్రమైన అనారోగ్యం నిర్ధారణ చేయబడిన తర్వాత మాత్రమే ఏకమొత్తం (బీమా చేయబడిన మొత్తం) చెల్లించబడుతుంది. ఒకవేళ, మీకు చికిత్స చేసే వైద్యుడు ఒక నిర్దిష్ట చికిత్స పద్ధతిని సిఫార్సు చేసినప్పుడు, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్ మీకు చికిత్స, సంరక్షణ మరియు రికవరీ కోసం చెల్లించడానికి ఉపయోగించేలా ఒకే లావాదేవీలో ఏకమొత్తం ప్రయోజనం అందిస్తుంది. అప్పులు చెల్లించడానికి, కోల్పోయిన ఆదాయానికి ప్రత్యామ్నాయంగా లేదా కొన్ని సందర్భాల్లో జీవనశైలి మార్పులు అనుసరించడానికి కూడా ఈ డబ్బు ఉపయోగపడవచ్చు. ఒక తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స తీసుకునే క్రమంలో మీ పొదుపులు ఖర్చు అయిపోవచ్చు, పని చేయడం మరియు సంపాదన పరిమితం కావచ్చు మరియు మీ సాధారణ జీవనశైలి ప్రభావితం కావచ్చు, కాబట్టి, ఇలాంటి కష్ట సమయాల్లో మీరు ఎంచుకున్న కవర్ ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం చేకూర్చడం ఉత్తమంగా ఉంటుంది. మీ ప్రస్తుత హెల్త్ కవర్ లేదా ఉద్యోగి హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి మీ వైద్య ఖర్చులను ఒక నిర్దిష్ట పరిధి వరకే కవర్ చేస్తాయి, అయితే, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ అనేది మీకు మొదటి రోగనిర్ధారణ లేదా వైద్య నిపుణుల సలహా మేరకు ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం అందిస్తుంది.
ప్రధాన అవయవ మార్పిడి కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్‌ను ఎందుకు ఎంచుకోవాలి?
మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టవచ్చు, మరియు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ ఫండ్స్ బాధ్యతను చేపడుతుంది. అంతే కాకుండా, మీరు చికిత్స పొందడంలో బిజీగా ఉన్నపుడు, ఆదాయ నష్టం సంభవించినట్లయితే, ఇన్సూరెన్స్ సంస్థ మీ కుటుంబానికి నగదు రూపంలో సహాయం చేస్తుంది. 30 రోజుల సర్వైవల్ వ్యవధి ముగిసిన తర్వాత మొదటిసారి జరిగిన రోగనిర్ధారణపై ఒక్క లావాదేవీలో పూర్తి మొత్తం చెల్లించబడుతుంది. ఈ ఏక మొత్తాన్ని సంరక్షణ, చికిత్స, రికవరీ ఖర్చులు, అప్పులు చెల్లించడం లేదా సంపాదించే సామర్థ్యం తగ్గడం వల్ల కోల్పోయిన ఆదాయానికి నిధులను సమకూర్చడం కోసం ఉపయోగించవచ్చు. అదనంగా, క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ కవర్లను ఎంచుకోవడం వలన మీరు సెక్షన్ 80D కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.