పార్కిన్సన్స్ వ్యాధి కోసం క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్
పార్కిన్సన్ వ్యాధి శరీర కదలికలను ప్రభావితం చేస్తూ క్రమంగా తీవ్రం అయ్యే నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. పార్కిన్సన్స్ వ్యాధి, కేంద్ర నాడీ వ్యవస్థలోని కణాలను ప్రభావితం చేసే రెండవ అత్యంత సాధారణ వ్యాధి, ఇది మెదడులోని నిర్దిష్ట ప్రాంతంలో డోపమైన్-ఉత్పత్తి చేసే ("డోపమినెర్జిక్") న్యూరాన్‌లను అనగా సబ్‌స్టాంటియా నిగ్రాను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సరళంగా చెప్పాలంటే, ఇది డోపమైన్‌ను ఉత్పత్తి చేసే మెదడులోని నాడీ కణాలను ప్రభావితం చేస్తుంది (డోపమైన్ శరీరంలోని ఇతర నాడీ కణాలకు సంకేతాలను పంపే, నాడీ వ్యవస్థ నుండి విడుదలయ్యే ఒక న్యూరోట్రాన్స్‌మీటర్ (కెమికల్)). ఈ వ్యాధి ఎటువంటి కారణం లేకుండా రావచ్చు, అంటే ఇడియోపతిక్. పార్కిన్సన్స్ వ్యాధి కండరాలు పట్టేయడం, వణుకు, ప్రసంగం మరియు నడకలో మార్పులను, అలాగే మరెన్నో వంటి లక్షణాలను చూపుతుంది. రోగనిర్ధారణ తర్వాత నిర్వహించే చికిత్సలు వ్యాధి లక్షణాలకు ఉపశమనం కలిగించవచ్చు, కానీ దానిని నయం చేయలేవు. ఇలాంటి తీవ్రమైన ప్రభావం చూపే వ్యాధితో బాధపడుతున్న రోగికి మెరుగైన జీవితాన్ని అందించడానికి ఏకైక మార్గం, శిక్షణ పొందిన సంరక్షకులు మరియు మెడికల్ ప్రాక్టీషనర్స్ నుండి వారికి తగిన సంరక్షణను కల్పించడం.
పార్కిన్సన్స్ వ్యాధి 60 సంవత్సరాలు గల లేదా అంతకు పైబడిన వారిలో నిర్ధారించబడినప్పటికీ, కొన్ని సందర్భాల్లో దానిని ముందస్తుగా గుర్తించడం సాధ్యమవుతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న రోగికి నడవడం, మాట్లాడటం, సాధారణ పనులను పూర్తి చేయడం కూడా కష్టంగా మారుతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి తిరిగి తన సాధారణ దినచర్యకు రాలేడు లేదా ఒక సాధారణ వ్యక్తిలా పనులను పూర్తిచేయలేడు. పార్కిన్సన్స్ వ్యాధి రోగిని ప్రభావితం చేయడమే కాకుండా ఆర్థికంగా, మానసికంగా వారి కుటుంబంపై తీవ్ర ప్రభావాలను చూపుతుంది.
మీరు ఒక ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉన్నప్పటికీ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం ఎందుకు ముఖ్యం?
క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ అనేది ఒక బెనిఫిట్ ప్లాన్, ఇది వీటి లాంటిది కాదు: సాంప్రదాయ నష్టపరిహార హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు . పాలసీలో కవర్ అయ్యేలా జాబితా చేయబడిన ఏదైనా తీవ్రమైన అనారోగ్యం నిర్ధారణ చేయబడిన తర్వాత మాత్రమే ఏకమొత్తం (బీమా చేయబడిన మొత్తం) చెల్లించబడుతుంది. ఒకవేళ, మీకు చికిత్స చేసే వైద్యుడు ఒక నిర్దిష్ట చికిత్స పద్ధతిని సిఫార్సు చేసినప్పుడు, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్ మీకు చికిత్స, సంరక్షణ మరియు రికవరీ కోసం చెల్లించడానికి ఉపయోగించేలా ఒకే లావాదేవీలో ఏకమొత్తం ప్రయోజనం అందిస్తుంది. అప్పులు చెల్లించడానికి, కోల్పోయిన ఆదాయానికి ప్రత్యామ్నాయంగా లేదా కొన్ని సందర్భాల్లో జీవనశైలి మార్పులు అనుసరించడానికి కూడా ఈ డబ్బు ఉపయోగపడవచ్చు. ఒక క్లిష్టమైన అనారోగ్యానికి చికిత్స తీసుకునే క్రమంలో మీ పొదుపులు ఖాళీ కావచ్చు, పని చేయడం మరియు సంపాదించడం నుండి మీరు పరిమితం కావాల్సి రావచ్చు మరియు మీ సాధారణ జీవనశైలి ప్రభావితం కావచ్చు, కాబట్టి, ఇలాంటి కష్ట సమయాల్లో మీరు ఎంచుకున్న కవర్ వరకు ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం లభించడం ఉత్తమంగా ఉంటుంది. మీ ప్రస్తుత హెల్త్ కవర్ లేదా ఉద్యోగి హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి మీ వైద్య ఖర్చులను ఒక నిర్దిష్ట పరిధి వరకే కవర్ చేస్తాయి, అయితే, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ అనేది మీకు మొదటి రోగనిర్ధారణ లేదా వైద్య నిపుణుల సలహా మేరకు ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం అందిస్తుంది.
పార్కిన్సన్ వ్యాధి కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్‌ను ఎందుకు ఎంచుకోవాలి?
మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టవచ్చు, మరియు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ ఫండ్స్ బాధ్యతను చేపడుతుంది. అంతే కాకుండా, మీరు చికిత్స పొందడంలో బిజీగా ఉన్నపుడు, ఆదాయ నష్టం సంభవించినట్లయితే, ఇన్సూరెన్స్ సంస్థ మీ కుటుంబానికి నగదు రూపంలో సహాయం చేస్తుంది. 30 రోజుల సర్వైవల్ వ్యవధి ముగిసిన తర్వాత మొదటిసారి జరిగిన రోగనిర్ధారణపై ఒక్క లావాదేవీలో పూర్తి మొత్తం చెల్లించబడుతుంది. ఈ ఏక మొత్తాన్ని సంరక్షణ, చికిత్స, రికవరీ ఖర్చులు, అప్పులు చెల్లించడం లేదా సంపాదించే సామర్థ్యం తగ్గడం వల్ల కోల్పోయిన ఆదాయానికి నిధులను సమకూర్చడం కోసం ఉపయోగించవచ్చు. అదనంగా, క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ కవర్లను ఎంచుకోవడం వలన మీరు సెక్షన్ 80D కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.