గత పది సంవత్సరాల కాలం నుండి హోండా మోటార్ కంపెనీ, భారతీయ కొనుగోలుదారుల నమ్మకాన్ని మరియు అంచనాలను నిలకడగా నిలబెట్టుకుంది. ఇది 1948 లో స్థాపించబడింది మరియు దాని మొదటి మోటార్ సైకిల్‌ను 1949లో పరిచయం చేసింది - ది 'డ్రీమ్' D-టైప్. 1984 లో హీరో గ్రూప్ సహకారంతో హోండా తన భారతీయ కార్యకలాపాలను ప్రారంభించింది. 2001 లో, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) ప్రైవేట్ లిమిటెడ్ ఉద్భవించింది, మరియు దాని మొదటి మోడల్ - హోండా యాక్టివాతో, కంపెనీ భారతీయ మార్కెట్లో బలమైన పట్టు సాధించడాన్ని ప్రారంభించింది. పది సంవత్సరాల తర్వాత, 2011లో, అది అధికారికంగా హీరో గ్రూప్‌తో విభజించబడింది. హోండా మోటార్‌సైకిళ్లు తక్కువ నిర్వహణ ఖర్చును పరిగణనలోకి తీసుకుంటే కొనుగోలు చేయదగినవి, మరియు మీరు హోండా మోటార్ సైకిల్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, హోండా టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం మంచిది.
హోండా ఇప్పుడు భారతదేశంలో నాలుగు తయారీ సౌకర్యాలను కలిగి ఉంది, దేశంలో రెండవ అతిపెద్ద టూ వీలర్ తయారీదారు మరియు ప్రపంచంలోనే అతిపెద్దది. యాక్టివా కాకుండా, హోండా ప్రసిద్ధి చెందిన మోడల్స్ యూనికార్న్, డియో, షైన్ మొదలైనవి. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్, జీరో డిప్రిసియేషన్ మొదలైనటువంటి వివిధ యాడ్ ఆన్ కవర్లతో హోండా బైక్ ఇన్సూరెన్స్ అందిస్తుంది.
కేవలం బైక్ ఉంటే సరిపోదు, మీకు బైక్ ఇన్సూరెన్స్ కూడా అవసరం. మరింత వివరంగా చెప్పాలంటే, భారతీయ రోడ్లపై మీకు నచ్చినట్లుగా మీ టూ వీలర్‌ను నడపాలంటే హోండా బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగివుండటం తప్పనిసరి. అయితే, ఇది కేవలం చట్టపరమైన అవసరం మాత్రమే కాదు; ఇది ఆర్థికంగా మీరు తీసుకునే ఒక మంచి నిర్ణయం కూడా. ఒక ప్రాథమిక థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ నుండి మొదలుకొని దీర్ఘకాలిక టూ వీలర్ సమగ్ర ఇన్సూరెన్స్ ప్యాకేజీ వరకు, అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మీ పాలసీ ఒక ఆర్థిక భద్రతా కవచంగా పనిచేస్తుంది. ఇక్కడ మీకు ఆప్షన్లు ఇవ్వబడ్డాయి:
ఇది థర్డ్-పార్టీ లయబిలిటీ, పర్సనల్ యాక్సిడెంట్ కవర్ మరియు ముఖ్యంగా - ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ కవర్‌ను కలిగి ఉన్నందున అత్యంత సిఫార్సు చేయబడిన ఎంపిక. ఒకవేళ, ఒక యాక్సిడెంట్‌లో మీరు దోషిగా నిర్ధారించబడితే ఇది మీకు, మీ బైక్‌కు సంబంధించిన బాధ్యతలన్నింటికీ అన్ని-విధాల ఆర్థిక రక్షణను అందిస్తుంది. మీరు ఎంచుకున్న యాడ్-ఆన్‌లతో మీ కవరేజీని మరింత మెరుగుపరచుకోవచ్చు.
యాక్సిడెంట్, దొంగతనం, అగ్నిప్రమాదం మొదలైనవి.
పర్సనల్ యాక్సిడెంట్ కవర్
ప్రకృతి వైపరీత్యాలు
థర్డ్-పార్టీ లయబిలిటీ
యాడ్-ఆన్‌ల ఎంపిక
మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం ఇది తప్పనిసరిగా అవసరమైన ఇన్సూరెన్స్ రకం. ఇది థర్డ్ పార్టీ వ్యక్తి గాయపడినా, మరణించినా లేదా అంగవైకల్యం కలిగినా లేదా వారి ఆస్తికి జరిగిన నష్టం కారణంగా తలెత్తే ఏవైనా సమస్యల నుండి మిమ్మల్ని ఆర్థికంగా కవర్ చేస్తుంది. ఇది యాక్సిడెంట్ కారణంగా మీరు ఎదుర్కొనే చట్టపరమైన బాధ్యతల నుండి కూడా మిమ్మల్ని కవర్ చేస్తుంది.
పర్సనల్ యాక్సిడెంట్ కవర్
థర్డ్-పార్టీ ఆస్తి నష్టం
థర్డ్-పార్టీ వ్యక్తికి ఏర్పడిన గాయాలు
ఇప్పటికే థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉన్న మరియు కవరేజ్ పరిధిని పెంచాలనుకునే వారికి స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ పాలసీ అనువైనది. ఇది యాక్సిడెంట్ కారణంగా మీ స్వంత వాహనం దెబ్బతినడం వల్ల కలిగే నష్టాలను కవర్ చేస్తుంది. అంతేకాకుండా, మీరు మీ కవరేజీని మరింత మెరుగుపరచుకోవడానికి యాడ్-ఆన్ ఆప్షన్‌లను ఎంచుకోవచ్చు.
యాక్సిడెంట్, దొంగతనం, అగ్నిప్రమాదం మొదలైనవి
ప్రకృతి వైపరీత్యాలు
యాడ్-ఆన్‌ల ఎంపిక
మీ బైక్ యాజమాన్య అనుభవానికి తగిన సౌలభ్యాన్ని, ఆల్-రౌండ్ ప్రొటెక్షన్‌ను అందించడానికి రూపొందించబడిన ఒక ప్లాన్, ఈ మల్టీ-ఇయర్ హోండా బైక్ ఇన్సూరెన్స్ ప్యాకేజీలో ఐదు సంవత్సరాల థర్డ్-పార్టీ లయబిలిటీ కవరేజ్ మరియు వార్షికంగా రెన్యూ చేయదగిన ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ వంటి అంశాలు ఉన్నాయి. ఒకవేళ, మీరు మీ ఓన్ డ్యామేజ్ కవర్‌ను సమయానికి రెన్యూ చేయడం మర్చిపోయినా, మీరు ఇప్పటికీ ఆర్థికంగా కవర్ చేయబడతారు.
యాక్సిడెంట్, దొంగతనం, అగ్నిప్రమాదం మొదలైనవి
ప్రకృతి వైపరీత్యాలు
పర్సనల్ యాక్సిడెంట్
థర్డ్-పార్టీ లయబిలిటీ
యాడ్-ఆన్‌ల ఎంపిక
మీ హోండా బైక్ ఇన్సూరెన్స్ పాలసీ మీ పాలసీ రకాన్ని బట్టి కవరేజీని అందిస్తుంది. థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ థర్డ్-పార్టీ ఒక వ్యక్తికి లేదా ఆస్తికి జరిగిన నష్టానికి మాత్రమే కవరేజీని అందిస్తుంది. అయితే, హోండా కోసం ఒక సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ కింది వాటిని కవర్ చేస్తుంది:
ఒక ప్రమాదం కారణంగా మీ స్వంత బైక్‌కు జరిగిన నష్టం వలన తలెత్తే ఆర్థిక నష్టాలను కవర్ చేస్తాయి.
అగ్నిప్రమాదాలు లేదా పేలుడు వలన మీ బైక్‌కు జరిగిన నష్టం కవర్ చేయబడుతుంది.
మీ బైక్ చోరీకి గురైతే, మీరు బైక్ ఐడివి నుండి పరిహారం పొందుతారు.
భూకంపాలు, తుఫానులు, వరదలు, అల్లర్లు మరియు విధ్వంసం వంటి ప్రకృతి మరియు మానవ నిర్మిత విపత్తులు కవర్ చేయబడతాయి.
మీ చికిత్స సంబంధిత ఛార్జీలు అన్నీ ₹15 లక్షల వరకు కవర్ చేయబడతాయి.
థర్డ్-పార్టీ వ్యక్తికి జరిగిన గాయం, వైకల్యం లేదా మరణం మరియు వారి ఆస్తికి జరిగిన నష్టాలు కూడా కవర్ చేయబడతాయి.
ముఖ్యమైన ఫీచర్లు | హోండా టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు |
ఓన్ డ్యామేజ్ కవర్ | ఇన్సూరెన్స్ చేయదగిన ప్రమాదాలుగా పేర్కొనబడిన ఏదైనా ఊహించని సంఘటనల కారణంగా బైక్‌కు జరిగే నష్టాలను కవర్ చేస్తుంది. |
థర్డ్ పార్టీ డ్యామేజ్ కవర్ | థర్డ్ పార్టీ గాయాలు మరియు ఆస్తి నష్టాలను కవర్ చేస్తుంది. |
ప్రత్యేక యాడ్-ఆన్లకు ఎంపిక | జీరో డిప్రిసియేషన్, ఎమర్జెన్సీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ మొదలైనటువంటి యాడ్-ఆన్‌ల ఎంపికను ఎంచుకోవడం ద్వారా హోండా బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కస్టమైజ్ చేయండి. |
క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి | 100% క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి^ |
నగదురహిత గ్యారేజ్ నెట్‌వర్క్ | భారతదేశ వ్యాప్తంగా 2000+ |
పాలసీ కొనుగోలు సమయం | 3 నిమిషాల కంటే తక్కువ |
బైక్ మోడల్స్ | ధర |
హోండా యాక్టివా 6G | ₹96,116 (ఆన్-రోడ్ ధర ముంబై) |
హోండా డియో | ₹92,227 (ఆన్-రోడ్ ధర ముంబై) |
హోండా గ్రేజియా | ₹99,852 (ఆన్-రోడ్ ధర ముంబై) |
హోండా యాక్టివా 125 | ₹1,01,055 (ఆన్-రోడ్ ధర ముంబై) |
హోండా CD 110 డ్రీమ్ | ₹91,669 (ఆన్-రోడ్ ధర ముంబై) |
హోండా SP 125 | ₹1,06,540 (ఆన్-రోడ్ ధర ముంబై) |
హోండా షైన్ | ₹1,00,107 (ఆన్-రోడ్ ధర ముంబై) |
హోండా యునికార్న్ | ₹1,36,965 (ఆన్-రోడ్ ధర ముంబై) |
హోండా నెస్ CB350 | ₹2,53,633 (ఆన్-రోడ్ ధర ముంబై) |
హోండా CB300R | ₹3,31,077 (ఆన్-రోడ్ ధర ముంబై) |
హోండా CBR 650R | ₹10,88,222 (ఆన్-రోడ్ ధర ముంబై) |
గమనిక: పైన పేర్కొన్న ధర హోండా కంపెనీ సేల్స్ స్ట్రాటజీ ప్రకారం మారుతూ ఉంటుంది.
మీరు హోండా మోటార్ సైకిల్ యజమాని అయితే, టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం లేదా రెన్యూ చేయడం తెలివైన నిర్ణయం. మీరు హోండా బైక్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో ఎలా కొనుగోలు చేయవచ్చో ఇక్కడ ఇవ్వబడింది:
దశ 1. మా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్ ద్వారా బైక్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్‌ను చూడండి, మీ బైక్ రిజిస్ట్రేషన్ నంబర్‌తో సహా వివరాలను పూరించండి మరియు తరువాత కోట్ పొందండి పై క్లిక్ చేయండి.
దశ 2: సమగ్ర మరియు థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్ మధ్య ఎంచుకోండి. మీరు ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వరకు ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.
దశ 3: మీరు ప్రయాణీకులు మరియు పెయిడ్ డ్రైవర్ కోసం పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ను కూడా జోడించవచ్చు. అంతేకాకుండా, నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్ కవర్, జీరో డిప్రిసియేషన్ మొదలైనటువంటి యాడ్-ఆన్‌ను ఎంచుకోవడం ద్వారా మీరు పాలసీని కస్టమైజ్ చేయవచ్చు
దశ 4: మీ చివరి బైక్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి వివరాలు ఇవ్వండి. ఉదా. మునుపటి పాలసీ రకం (సమగ్ర లేదా థర్డ్ పార్టీ, పాలసీ గడువు తేదీ, చేసిన మీ క్లెయిముల వివరాలు, ఏవైనా ఉంటే)
దశ 5: మీరు ఇప్పుడు మీ హోండా బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను చూడవచ్చు
సెక్యూర్డ్ పేమెంట్ గేట్‌వే ద్వారా ప్రీమియంను చెల్లించండి.
హోండా టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ చిరునామాకు లేదా వాట్సాప్ ద్వారా పంపబడుతుంది.
మీరు సెకండ్‌హ్యాండ్ హోండా బైక్‌ను కొనుగోలు చేసినప్పటికీ, దాని కోసం మీరు ఒక టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండాలి. 1988 మోటార్ వాహనాల చట్టం ప్రకారం చెల్లుబాటు అయ్యే బైక్ ఇన్సూరెన్స్ పాలసీ లేకుండా రైడింగ్ చట్టవిరుద్ధం.
కావున, సెకండ్-హ్యాండ్ బైక్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడానికి ముందుగా, ఈ క్రింది విషయాలను గుర్తుంచుకోండి:
• కొత్త RC, కొత్త యజమాని పేరు మీద ఉందని నిర్ధారించాలి
• ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువను (IDV) చెక్ చేయండి
• మీరు ఇప్పటికే బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉన్నట్లయితే, డిస్కౌంట్ పొందడానికి నో క్లెయిమ్ బోనస్ (NCB)ను బదిలీ చేసుకోండి
• అనేక యాడ్-ఆన్ కవర్‌ల నుండి ఎంచుకోండి (ఎమర్జెన్సీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్, నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్, జీరో డిప్రిసియేషన్ కవర్ మొదలైనవి)
ఇప్పుడు సెకండ్ హ్యాండ్ హోండా బైక్‌ల కోసం హోండా టూ వీలర్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి దశలను చూద్దాం
దశ 1. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్ బైక్ ఇన్సూరెన్స్ విభాగాన్ని సందర్శించండి, మీ సెకండ్‌హ్యాండ్ హోండా బైక్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయండి, మరియు కోట్ పొందండి పై క్లిక్ చేయండి.
దశ 2: మీ సెకండ్‌హ్యాండ్ బైక్ మేక్ మరియు మోడల్‌ను ఎంటర్ చేయండి.
దశ 3: మీ చివరి సెకండ్‌హ్యాండ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి వివరాలు ఇవ్వండి.
దశ 4: థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ మరియు సమగ్ర కవర్ మధ్య ఎంచుకోండి.
దశ 5: మీరు ఇప్పుడు మీ హోండా బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను చూడవచ్చు.
మీ హోండా బైక్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ కోసం కేవలం కొన్ని నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. మీ ఇంటి సౌలభ్యం నుండి దీనిని కేవలం కొన్ని క్లిక్‌లతో పూర్తి చేయవచ్చు. దిగువ పేర్కొన్న నాలుగు దశల ప్రక్రియను అనుసరించండి మరియు క్షణాల్లో కవరేజ్ పొందండి!
మీ హోండా బైక్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగిసినట్లయితే, RTO కు భారీ జరిమానాలు చెల్లించడాన్ని నివారించడానికి దానిని రెన్యూ చేయడం మంచిది. 1988 మోటార్ వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహన యజమానికి మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క కనీసం థర్డ్ పార్టీ కవర్ ఉండాలి.
ఇప్పుడు హోండా టూ వీలర్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ కోసం దశలను చూద్దాం.
దశ1: హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్‌లోని బైక్ ఇన్సూరెన్స్ విభాగాన్ని సందర్శించండి మరియు మీ మునుపటి పాలసీ హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో ఉన్నట్లయితే, రెన్యూ పాలసీని ఎంచుకోండి. మీ హోండా బైక్ ఇన్సూరెన్స్ పాలసీ మరొక ఇన్సూరర్‌తో ఉంటే, మీరు మీ టూ-వీలర్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయాలి.
Step 2: Enter details associated with your HDFC ERGO policy that you want to renew, include or exclude add-on covers, and complete the journey by paying the bike insurance premium online. Choose comprehensive or third-party cover if your policy was with another insurer. After that, you can select add-ons if you opt for comprehensive cover.
దశ 3: రెన్యూ చేయబడిన బైక్ ఇన్సూరెన్స్ పాలసీ మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మీ వాట్సాప్‌కు మెయిల్ చేయబడుతుంది.
మీరు మీ హోండా టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీపై నగదురహిత క్లెయిమ్ చేయాలనుకుంటే, అప్పుడు మీరు ఈ క్రింది దశలను అనుసరించాలి:
• మా హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం లేదా 8169500500 పై వాట్సాప్‌లో మెసేజ్ పంపడం ద్వారా సంఘటనకు సంబంధించి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్లెయిమ్ బృందానికి తెలియజేయండి.
• మీ టూ-వీలర్‌ను హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్యాష్‌లెస్ నెట్‌వర్క్ గ్యారేజీకి తీసుకువెళ్ళండి. ఇక్కడ, ఇన్సూరర్ నియమించిన వ్యక్తి ద్వారా మీ వాహనం తనిఖీ చేయబడుతుంది.
• మా అప్రూవల్ అందుకున్న తర్వాత, గ్యారేజీ మీ బైక్‌ను రిపేర్ చేయడం ప్రారంభిస్తుంది.
• ఈ సమయంలో, అవసరమైన డాక్యుమెంట్లు మరియు సరిగ్గా నింపబడిన క్లెయిమ్ ఫారంను మాకు సబ్మిట్ చేయండి. ఏదైనా నిర్దిష్ట డాక్యుమెంట్ అవసరమైతే, మేము దాని గురించి మీకు తెలియజేస్తాము.
• హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్లెయిమ్ బృందం బైక్ ఇన్సూరెన్స్‌లోని నగదురహిత క్లెయిమ్ వివరాలను ధృవీకరిస్తుంది మరియు క్లెయిమ్‌ను అంగీకరిస్తుంది లేదా తిరస్కరిస్తుంది.
• విజయవంతమైన ధృవీకరణ తర్వాత, మరమ్మత్తు ఖర్చులను నేరుగా గ్యారేజీకి చెల్లించడం ద్వారా మేము నగదురహిత బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను సెటిల్ చేస్తాము. మీరు వర్తించే మినహాయింపులు, ఏవైనా ఉంటే, మీ స్వంత ఖర్చుతో చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి.
గమనిక: థర్డ్-పార్టీ నష్టం జరిగిన సందర్భంలో, మీరు యాక్సిడెంట్‌లో ప్రమేయం ఉన్న ఇతర వాహన యజమాని వివరాలను తీసుకోవచ్చు. అయితే, మీ మీ వాహనానికి పెద్ద నష్టం జరిగినప్పుడు లేదా దొంగతనం చేయబడినప్పుడు, నగదురహిత బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియను ప్రారంభించడానికి ముందు మీరు సమీప పోలీస్ స్టేషన్‌లో FIR రిపోర్ట్‌ను ఫైల్ చేయాలి.
హోండా బైక్ ఇన్సూరెన్స్ లేదా హోండా స్కూటీ ఇన్సూరెన్స్ పాలసీ కోసం రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ ఫైల్ చేసేటప్పుడు, మీరు ఈ క్రింది దశలను అనుసరించాలి
• దశ 1: కాల్ లేదా మా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయడం ద్వారా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోని సంప్రదించడం ద్వారా సంఘటనకు సంబంధించి క్లెయిమ్ బృందానికి క్లెయిమ్ సమాచారాన్ని తెలియజేయండి. మా హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా 8169500500 పై వాట్సాప్‌లో మెసేజ్ పంపడం ద్వారా మా క్లెయిమ్ బృందాన్ని సంప్రదించండి. మా ఏజెంట్ అందించిన లింక్‌తో మీరు డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. మీరు సెల్ఫ్ ఇన్‌స్పెక్షన్‌ను లేదా సర్వేయర్ లేదా వర్క్‌షాప్ పార్ట్‌నర్ ద్వారా యాప్ ఎనేబుల్ చేయబడిన డిజిటల్ ఇన్‌స్పెక్షన్‌ను ఎంచుకోవచ్చు.
• దశ 2: ప్రమాదంలో ప్రమేయం గల వాహనం/ల రిజిస్ట్రేషన్ నంబర్‌ను గమనించండి.
• దశ 3: అవసరమైతే, సమీప పోలీస్ స్టేషన్‌లో FIR ను ఫైల్ చేయండి. క్లెయిమ్ ఫైల్ చేయడానికి FIR కాపీ అవసరం కావచ్చు.
• దశ 4: సమయం మరియు లొకేషన్ వంటి ప్రమాదం వివరాలను గమనించండి. ఏవైనా సాక్షుల పేరు మరియు సంప్రదింపు వివరాలను గమనించండి.
•
దశ 5: క్లెయిమ్ ట్రాకర్ ద్వారా మీ క్లెయిమ్ స్థితిని ట్రాక్ చేయండి.
• దశ 6: మీ క్లెయిమ్ ఆమోదించబడినప్పుడు మీరు మెసేజ్ ద్వారా నోటిఫికేషన్ పొందుతారు.
బైక్ యాజమాన్యంలో బైక్ ఇన్సూరెన్స్ ఒక ప్రధాన అంశం. చట్టబద్ధంగా రైడ్ చేయడానికి ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం తప్పనిసరి మాత్రమే కాదు, ఎలాంటి హెచ్చరిక లేకుండా జరిగే యాక్సిడెంట్లు జరుగుతాయి కనుక ఇది ఒక తెలివైన ఆర్థిక నిర్ణయం అవుతుంది. అంతేకాకుండా, మీరు ఒక సురక్షితమైన డ్రైవర్ అయినప్పటికీ, మీ భద్రత అనేది రోడ్డుపైనున్న ఇతరులపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే, దాని వలన అయ్యే రిపేర్ ఖర్చులు మిమ్మల్ని తీవ్ర ఇబ్బందికి గురిచేస్తాయి. కావున, ఇలాంటి ఊహించని అదనపు ఖర్చులను నివారించడం ద్వారా బైక్ ఇన్సూరెన్స్ మీకు ఎంతగానో మేలుచేస్తుంది. ఆ తరువాత సరైన ఇన్సూరెన్స్ సంస్థను ఎంచుకునే దశ ప్రారంభం అవుతుంది. మీరు మీ హోండా బైక్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోను ఎందుకు ఎంచుకోవాలి అనేది ఇక్కడ ఇవ్వబడింది
మీరు ఉన్న ప్రాంతం లేదా దేశంలో గణనీయమైన ఉనికిని కలిగి ఉన్న ఇన్సూరెన్స్ సంస్థ మీకు అవసరం. మరియు భారతదేశ వ్యాప్తంగా ఉన్న 7100 పైగా నగదురహిత గ్యారేజీలతో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో, ఎల్లప్పుడూ మీకు సహాయం అందుబాటులో ఉండేలా చేస్తుంది.
24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సదుపాయం, ఏదైనా బ్రేక్‌డౌన్ జరిగినప్పుడు మీరు ఎప్పుడు కూడా నిస్సహాయ స్థితిలోకి వెళ్లకుండా మీకు అండగా నిలుస్తుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 1.6 కోట్లకు పైగా హ్యాపీ కస్టమర్లను కలిగి ఉంది, అంటే మీ అవసరాలు ఖచ్చితంగా నెరవేర్చబడతాయని, మీరు నిశ్చింతగా ఉండవచ్చు.
మీ కారు సర్వీస్‌లో ఉన్నప్పుడు మీ రోజువారీ కార్యక్రమాలకు అంతరాయం కలగవచ్చు. అయితే, ఒక చిన్న ప్రమాదం కారణంగా తలెత్తిన రిపేర్ల కోసం మా ఓవర్‌నైట్ సర్వీస్‌తో మీ రాత్రి నిద్రను హాయిగా ఆస్వాదించండి, అలాగే, తెల్లవారుజామున మీరు బయలుదేరే సమయానికి మీ కారును మీ ఇంటి వద్దకే డెలివరీని పొందండి.
ఒక ఆదర్శవంతమైన ఇన్సూరెన్స్ సంస్థ క్లెయిమ్‌లను వేగంగా, సజావుగా ప్రాసెస్ చేయాలి. మేము మా పాలసీదారుల క్లెయిమ్‌లను సమర్ధవంతంగా ప్రాసెస్ చేస్తున్నప్పుడు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో దానిని చేస్తుంది. మాకు 100% క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి రికార్డ్ ఉంది.
Honda to Launch Its First E-Scooter on Nov 27
Honda Motorcycle and Scooter India plans to launch its first e-scooter on Nov 27. The new e-scooter is expected to be an electric variant of the Activa, showcasing updated features like a rectangular LED headlamp. Honda’s teaser titled “Electrify Your Dreams” provides a glimpse of the e-scooter’s LED headlamp and iconic logo, hinting at a stylish Activa design. Honda is expected to use Lithium Iron Phosphate (LFP) batteries offering a range of 100km on a single charge.
Published on: Nov 14, 2024
హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా హోల్‌సేల్స్‌లో హీరో మోటోకార్ప్‌ను ఓవర్‌టేక్ చేస్తుంది
హీరో మోటోకార్ప్ హోల్‌సేల్‌లో జపాన్ ప్రధాన ప్రత్యర్థి హోండా మోటార్‌సైకిల్స్ మరియు స్కూటర్ ఇండియా తర్వాత రెండవ స్థానానికి పడిపోయింది. అయితే, రిటైల్ సేల్స్‌లో, హీరో టూ-వీలర్ కింగ్‌గా ఉంటుంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) డేటా ప్రకారం, ఏప్రిల్-జులై కాలంలో హోండా కేవలం 18.53 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ దేశీయ హోల్‌సేల్‌లను సాధించింది, అయితే హీరో 18.31 లక్షల యూనిట్లను విక్రయించగలిగింది. "పండుగ సీజన్‌కు ముందు మరియు రికవరీ ప్రారంభ లక్షణాల ఆధారంగా, హోండా నెట్‌వర్క్‌కు సరఫరాలను నిర్ధారించింది", పరిశోధనా సంస్థ జాటో డైనమిక్స్ ప్రెసిడెంట్ రవి భాటియా చెప్పారు.
ప్రచురించబడిన తేదీ: ఆగస్ట్ 22, 2024