యమహా మోటార్స్ జపాన్‌లోని షిజుకాలో ప్రధాన కార్యాలయం కలిగిన జపనీస్ బహుళజాతి సంస్థ. ఈ ప్రతిష్టాత్మక కంపెనీని తోరకుసు యమహా 1887లో నిప్పాన్ గాక్కి కో. లిమిటెడ్‌గా స్థాపించారు, తదుపరి ఇది 1955లో యమహా మోటార్స్‌లో విలీనం చేయబడింది. ఇది మోటార్‌సైకిళ్లు, స్నోమొబైల్స్, ఔట్‌బోర్డ్ మోటార్లు, పర్సనల్ వాటర్‌క్రాఫ్ట్ మరియు ప్రపంచవ్యాప్తంగా విక్రయించబడే ఇతర చిన్న ఇంజిన్ ప్రొడక్టుల తయారీలో ప్రత్యేకతను కలిగి ఉంది. 1985లో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుండి యమహా బ్రాండ్ మోటార్‌బైక్‌లు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ వాహనాల్లో ఒకటిగా నిలిచాయి. కంపెనీ చాలా కాలం నుండి ఉనికిలో ఉంది మరియు దేశంలోని ప్రముఖ మోటార్ బైక్ మ్యానుఫ్యాక్చరర్‌లలో ఒకరిగా అభివృద్ధి చెందింది. యమహా బైక్‌కి సరికొత్త జోడింపు YZF-R3, ఇది సరసమైన ధర, శక్తివంతమైన ఇంజన్ పనితీరుతో భారతీయ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న గొప్ప స్పోర్ట్స్ బైక్.
సరైన బైక్ ఇన్సూరెన్స్ పాలసీతో మీరు మీ వాహనాన్ని మనశ్శాంతితో రైడ్ చేయవచ్చు. యమహా టూ వీలర్ ఇన్సూరెన్స్ బైక్ యజమానుల విభిన్న అవసరాలను తీర్చే అనేక ప్రయోజనాలను అందిస్తుంది. యమహా ఇన్సూరెన్స్‌ను ఉత్తమంగా చేసే కొన్ని కీలక ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
ప్రయోజనాలు | వివరణ |
AI-ఆధారిత క్లెయిమ్ సహాయం | మీ యమహా బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ప్రాసెస్ చేయడానికి AI-ఎనేబుల్డ్ టూల్ ఐడియాలు నగదురహిత క్లెయిమ్ సెటిల్‌మెంట్ యొక్క మొత్తం ప్రాసెస్‌ను సులభతరం చేయడానికి సహాయపడతాయి. |
ఆన్‌లైన్ కొనుగోలు మరియు రెన్యూవల్ | హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే యమహా బైక్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ సేవలు అవాంతరాలు లేకుండా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. |
దీర్ఘకాలిక కవర్ | యమహా టూ-వీలర్ ఇన్సూరెన్స్ దీర్ఘకాలిక కవరేజీని అందిస్తుంది, వార్షిక రెన్యూవల్స్ అవసరం లేకుండా పొడిగించబడిన వ్యవధుల కోసం మీ బైక్‌ను సురక్షితం చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. |
తనిఖీ లేకుండా రెన్యూ చేసుకోండి | మీ కవరేజ్ అంతరాయం లేకుండా ఉండేలాగా నిర్ధారించడానికి వాహన తనిఖీ అవసరం లేకుండా మీరు యమహా బైక్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసుకోవచ్చు. |
24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ | యమహా టూ వీలర్ ఇన్సూరెన్స్ అవసరమైనప్పుడు సహాయం అందించడానికి 24x7 ఎమర్జెన్సీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌తో వస్తుంది. |
నగదురహిత క్లెయిములు | హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో యొక్క 2000+ అధీకృత గ్యారేజీల విస్తృతమైన నెట్‌వర్క్‌తో, మీరు ముందుగానే చెల్లించవలసిన అవసరం లేకుండా మీ యమహాను రిపేర్ చేయించుకోవచ్చు. |
ఇది ఉత్తమ కవరేజీని అందిస్తుంది కావున అత్యంత సిఫార్సు చేయబడే ప్లాన్. ఇది థెఫ్ట్ కవర్‌తో పాటు ప్రకృతి లేదా మానవ నిర్మిత విపత్తుల వల్ల జరిగే నష్టాల నుండి అన్నివిధాలా రక్షణ కల్పిస్తుంది, అలాగే మరొక వ్యక్తి గాయపడిన సందర్భంలో పరిహారాన్ని నిర్ధారించే థర్డ్ పార్టీ బాధ్యత కవరేజ్‌ను కూడా అందిస్తుంది. అంతేకాదు, మీరు యాడ్ ఆన్‌లతో మీ రక్షణను మరింత పటిష్టం చేసుకోవడాన్ని కూడా ఎంచుకోవచ్చు.
యాక్సిడెంట్, దొంగతనం, అగ్నిప్రమాదం మొదలైనవి.
పర్సనల్ యాక్సిడెంట్ కవర్
ప్రకృతి వైపరీత్యాలు
థర్డ్-పార్టీ లయబిలిటీ
యాడ్-ఆన్‌ల ఎంపిక
ఈ పాలసీలో ఒక పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కూడా ఉంటుంది, అది మీరు యాక్సిడెంట్‌కు గురైన సందర్భంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ థర్డ్ పార్టీకి జరిగిన గాయాలు, ఆస్తి నష్టం, మరణం, వైకల్యం కారణంగా అయ్యే ఖర్చులను కూడా కవర్ చేస్తుంది. అంతేకాకుండా, మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం ఇది తప్పనిసరి కవర్ ప్లాన్.
పర్సనల్ యాక్సిడెంట్ కవర్
థర్డ్-పార్టీ ఆస్తి నష్టం
థర్డ్-పార్టీ వ్యక్తికి ఏర్పడిన గాయాలు
ఈ స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కీలక ఫీచర్ ఏంటంటే దీనిని థర్డ్-పార్టీ లయబిలిటీ కవరేజ్ ప్లాన్‌కు అదనంగా ఉపయోగించవచ్చు. ఇది ప్రధానంగా యాక్సిడెంట్‌ల కారణంగా తలెత్తే వ్యక్తిగత నష్టాల నుండి రక్షిస్తుంది. అంతేకాకుండా, మీరు యాడ్ ఆన్‌లను ఎంచుకోవడంతో ప్లాన్‌ను మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.
యాక్సిడెంట్, దొంగతనం, అగ్నిప్రమాదం మొదలైనవి
ప్రకృతి వైపరీత్యాలు
యాడ్-ఆన్‌ల ఎంపిక
కొత్తగా బైక్ కొనుగోలు చేసిన వారి కోసం ఈ తరహా ప్లాన్ సరైనది. ఇది మీ బైక్‌కు సంభవించే ఏదైనా నష్టానికి ఒక సంవత్సరం పాటు కవరేజీని అందిస్తుంది, అలాగే థర్డ్ పార్టీ వ్యక్తికి/ ఆస్తికి సంభవించే నష్టాలకు ఐదు సంవత్సరాల పాటు రక్షణను అందిస్తుంది.
యాక్సిడెంట్, దొంగతనం, అగ్నిప్రమాదం మొదలైనవి
ప్రకృతి వైపరీత్యాలు
పర్సనల్ యాక్సిడెంట్
థర్డ్-పార్టీ లయబిలిటీ
యాడ్-ఆన్‌ల ఎంపిక
అత్యంత జాగ్రత్తగా ఉన్న డ్రైవర్లు కూడా ప్రమాదాలు మరియు ఆస్తికి నష్టం వంటి దురదృష్టకర సంఘటనలను ఎదుర్కోవచ్చు. యమహా బైక్ ఇన్సూరెన్స్ పాలసీ అటువంటి అన్ని సంఘటనలను కవర్ చేస్తుంది, అయితే, మీరు మీ పాలసీ రకాన్ని బట్టి కవరేజ్ పొందుతారు. ఉదాహరణకు, థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్ థర్డ్ పార్టీ వ్యక్తి/ఆస్తికి జరిగిన నష్టాల నుండి మాత్రమే రక్షణ అందిస్తుంది. అయితే, సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఈ క్రింది వాటిని కవర్ చేస్తుంది:
మీ బైక్ దెబ్బతినడం వలన జరిగిన యాక్సిడెంట్ కారణంగా తలెత్తిన ఆర్థిక నష్టాలను కవర్ చేస్తుంది.
అగ్నిప్రమాదం మరియు విస్ఫోటనం వంటి సంఘటనల కారణంగా మీ బైక్‌కు జరిగిన నష్టాన్ని కవర్ చేస్తుంది.
దొంగతనం జరిగిన సందర్భంలో, మీకు బైక్ IDVతో పరిహారం లభిస్తుంది.
భూకంపాలు, వరదలు, అల్లర్లు మరియు ఇటువంటి మరెన్నో సహజ, మానవ నిర్మిత విపత్తుల నుండి కవర్ చేస్తుంది.
₹ 15 లక్షల వరకు మీ వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది
థర్డ్ పార్టీకి జరిగిన గాయం, మరణం, వైకల్యం మరియు ఆస్తి నష్టాన్ని కవర్ చేస్తుంది.
కొత్త యమహా బైక్‌ను కొనుగోలు చేయడం ఖరీదైనదని చెప్పడంలో సందేహం లేదు. భారతదేశంలో టాప్-ఎండ్ మోడల్‌ల ధర ₹30 లక్షల వరకు ఉండవచ్చు. మీరు వీటిలో ఒకదానిపై స్వారీ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, అప్పుడు సరైన ఇన్సూరెన్స్‌తో దానిని ఎందుకు రక్షించకూడదు? మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో యమహా బైక్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి కొన్ని ప్రధాన కారణాలు ఇలా ఉన్నాయి:
సమగ్ర ఇన్సూరెన్స్ కవర్ దొంగతనం, అగ్నిప్రమాదాలు, యాక్సిడెంట్లు, థర్డ్ పార్టీ లయబిలిటీ మరియు భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను కవర్ చేస్తుంది. ఈ విధంగా మీరు మీ యమహాకు ఎలాంటి హాని జరగదని నిశ్చింతగా ఉండవచ్చు, దానిపై రైడ్‌ను ఆనందంగా ఆస్వాదించవచ్చు. అది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో పాలసీ ప్రత్యేకత. ఇది ఊహించని సంఘటనల నుండి మీకు పూర్తి రక్షణను అందిస్తుంది.
మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో యమహా బైక్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడానికి మరొక కారణం, ప్రమాదం కారణంగా జరిగే నష్టాన్ని మేము కవర్ చేస్తాము. మీ వాహనం యాక్సిడెంట్‌కు గురైనప్పుడు లేదా రవాణా సమయంలో దాని టైర్ పేలిపోయినప్పుడు లేదా విధ్వంసక చర్యల కారణంగా ఏదైనా నష్టం జరిగిన సందర్భంలో ఇది చాలా అవసరం అవుతుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో గురించిన ఉత్తమమైన విషయాల్లో ముఖ్యమైనది మేము ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాము. మా వేగవంతమైన టర్న్‌అరౌండ్ టైమ్, తక్షణ పరిష్కారం మమ్మల్ని భారతదేశంలోనే అతిపెద్ద టూ వీలర్ వెహికల్ ఇన్సూరెన్స్ సంస్థగా మార్చింది. దాదాపుగా 50% క్లెయిములు మొదటి రోజున ప్రాసెస్ చేయబడతాయి.
మీ బైక్ లాగానే, యమహా బైక్ ఇన్సూరెన్స్ పాలసీలను కూడా మీ అవసరాలకు తగినట్లుగా రూపొందించుకోవచ్చు.
ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల నగదురహిత పరిష్కారం అనేది మా పాలసీదారులకు పూర్తి ప్రాసెస్‌ను సులభతరం చేసింది మరియు అవాంతరాలు లేకుండా చేసింది. ఈ విధంగా మీరు మీ క్లెయిమ్ మొత్తాన్ని నేరుగా మీ బ్యాంక్ అకౌంటులోకి బదిలీ చేసుకోవచ్చు, ఆర్థిక వనరులలోని కనిష్ట నష్టంతో తిరిగి ట్రాక్‌లోకి రావడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది.
బైక్‌తో తప్పు జరిగే విషయాలలో ఒకటి, అకస్మాత్తుగా ఏకాంత ప్రదేశంలో చిక్కుకుపోవడం. మా మోటార్‌సైకిల్ ఇన్సూరెన్స్‌తో, మీరు 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ పొందుతారు, ఇక్కడ మేము మీ సమస్యను పరిష్కరించడానికి లేదా మీ బైక్‌ను భద్రంగా తిరిగి తరలించడానికి ఒక నిపుణుడిని పంపుతాము.
చట్టపరమైన సమ్మతిని నిర్వహించడానికి మరియు మీ రైడ్‌లను సురక్షితం చేయడానికి యమహా ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం అవసరం.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో యమహా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫైల్ చేయడానికి ప్రాసెస్‌ను సులభతరం చేసింది. మీ పాలసీ నంబర్, మొబైల్ నంబర్ లేదా రిజిస్టర్డ్ ఇమెయిల్ అడ్రస్‌తో క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోవడానికి మీరు https://selfhelp.hdfcergo.com/SelfHelp/Authentication/ClaimRegistration పై క్లిక్ చేయవచ్చు. ఆ తరువాత, అది ఒక OTP తో ధృవీకరించబడాలి, మరియు మీరు క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోవచ్చు.
1. మీరు మీ యమహా బైక్ ద్వారా ప్రమాదానికి గురైన వెంటనే, మీరు మీ వాహనాన్ని తీసుకెళ్లాలి, కస్టమర్ సర్వీస్‌కు తెలియజేయాలి లేదా బైక్‌ను సమీప నగదురహిత గ్యారేజీకి తరలించడానికి అత్యవసర రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ను ఎంచుకోవాలి.
2. వాహనం ఏదైనా నెట్‌వర్క్ గ్యారేజీలను చేరుకున్న తర్వాత, నష్టాలను అంచనా వేయడానికి ఒక సర్వేయర్ మీ బైక్‌ను పరీక్షిస్తారు.
3. అప్పుడు, మీరు ఒక బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫైల్ చేయాలి మరియు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అందించాలి.
4. క్లెయిమ్ ప్రాసెస్ ప్రతి దశలో మీకు SMS మరియు ఇమెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది.
5. మీ యమహా వాహనం సిద్ధంగా ఉన్న తర్వాత, మీరు తప్పనిసరి మినహాయింపు, తరుగుదల మొదలైన వాటితో సహా నేరుగా గ్యారేజీకి క్లెయిమ్‌లో మీ వాటాను చెల్లించవలసి ఉంటుంది. క్లెయిమ్ యొక్క ఆమోదించబడిన మొత్తం నేరుగా గ్యారేజీకి చెల్లించబడుతుంది.
6. మీ రికార్డుల కోసం సమగ్రమైన వివరాలతో మీరు ఒక క్లెయిమ్స్ కంప్యుటేషన్ షీట్ అందుకుంటారు.
7. మీ క్లెయిములను మీరు ఆన్‌లైన్‌లో కూడా ట్రాక్ చేయవచ్చు: https://selfhelp.hdfcergo.com/SelfHelp/Authentication/ClaimStatus.
యమహా బైక్ ఇన్సూరెన్స్‌ను YPU ఎలా కొనుగోలు చేయవచ్చో ఇక్కడ ఇవ్వబడింది:
1. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్ హోమ్ పేజీని సందర్శించిన తర్వాత, టూ వీలర్ ఇన్సూరెన్స్ పై క్లిక్ చేయండి.
2. మీ బైక్ నంబర్‌ను షేర్ చేయడం ద్వారా లేదా దానిని అందించకుండా యమహా ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడం ద్వారా మీరు ఆన్‌లైన్‌లో ప్రీమియంను కనుగొనవచ్చు.
3. మీరు బైక్ వివరాలను నమోదు చేయాలి, అవి:
a. యమహా బైక్ బ్రాండ్
B. మోడల్ మరియు దాని వేరియంట్
c. రిజిస్ట్రేషన్ నగరం మరియు RTO
d. రిజిస్ట్రేషన్ సంవత్సరం.
4. ఈ వివరాలు ఎంటర్ చేయబడిన తర్వాత, మీరు "కోట్ పొందండి" పై క్లిక్ చేయాలి
5. బైక్ IDV (ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ) రిజిస్ట్రేషన్ సంవత్సరం ప్రకారం ఇవ్వబడుతుంది, ఇది మీ వాహనం పరిస్థితి ప్రకారం మార్చబడవచ్చు.
6. పాత బైక్‌ల కోసం కొన్ని వివరాలను నమోదు చేయాలి, అవి:
a. ప్రారంభం నుండి క్లెయిమ్ స్థితి
B. బైక్ యొక్క నో క్లెయిమ్ బోనస్ (మునుపటి పాలసీలో అందించిన విధంగా)
c. మునుపటి పాలసీ గడువు తేదీ
d. మీరు ఎంచుకున్న ప్లాన్ రకం, అవి:
i. సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్
ii. థర్డ్-పార్టీ-మాత్రమే ఉన్న బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్
iii. మీకు చెల్లుబాటు అయ్యే థర్డ్-పార్టీ-ఓన్లీ ప్లాన్ ఉంటే, స్టాండ్అలోన్ ఓన్-డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్.
గమనిక: కొత్త బైక్ యజమానులు 5-సంవత్సరాల థర్డ్-పార్టీ కవరేజీని కొనుగోలు చేయవలసి ఉన్నందున, వారు తదుపరి నాలుగు రెన్యూవల్స్ కోసం ఓన్-డ్యామేజ్-ఓన్లీ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.
7. అప్పుడు మీరు మీ యమహా బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్ 1 సంవత్సరం, 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల అవధిని ఎంచుకోవాలి.
8. అలాగే, మీరు నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్, ఇంజిన్ ప్రొటెక్షన్ వంటి అదనపు కవర్లను ఎంచుకోవచ్చు:
a. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న బైక్ యజమానులకు పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ తప్పనిసరి.
b. చట్టపరమైన బాధ్యత కవర్, మొదలైనవి.
9. అన్ని వివరాలు ఖచ్చితంగా అందించి తనిఖీ చేయబడిన తర్వాత, మీరు నిర్ధారించాలి మరియు తరువాత ఆన్‌లైన్ చెల్లింపు చేయడాన్ని కొనసాగించాలి.
10. ప్రక్రియను పూర్తి చేయడానికి మీ పేరు, చిరునామా మరియు ఇతర వివరాలను మీరు నమోదు చేయాలి.
11. చెల్లింపు పూర్తయిన తర్వాత, మీరు మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ అడ్రస్‌లో ఇన్సూరెన్స్ పాలసీని అందుకుంటారు.