మీరు ఒక బైక్ యజమానికి వారి బైక్ విలువను అడిగితే, వారు ఖచ్చితంగా అది చాలా విలువైనది అని జవాబు చెబుతారు. అలాగే వారు దానితో ప్రయాణం చేస్తారు కావున, వాహనం అనేది ఆ వ్యక్తికి ఒక విలువైన ఆస్తిగా నిలిచిపోతుంది. ఒకవేళ బ్రాండ్ అనేది భారతీయ రోడ్లు, అవసరాలకు అనుగుణంగా రూపొందించిన మహీంద్రా వంటి అత్యున్నత-స్థాయి బ్రాండ్ అయితే, ఆ వాహనం మరింత విలువైనదిగా మారుతుంది మరియు దానిని తప్పనిసరిగా సురక్షితం చేయాలి. ఇక్కడ, ప్రజల వద్ద అందుబాటులో ఉన్న అనేక మహీంద్రా మోడళ్లను అనగా పాతవి/ వాడుకలో లేని మరియు కొత్తవి, ఈ రెండింటిని గురించి చర్చిస్తాము, అలాగే హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారందరి ఇన్సూరెన్స్ అవసరాలను ఎలా తీరుస్తుందో తెలుసుకుందాము.
ఒకవేళ, మీరు మహీంద్రా టూ-వీలర్ ఇన్సూరెన్స్ కోసం చూస్తున్నట్లయితే, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఉత్తమ ఎంపిక. ఎందుకనగా మా వద్ద చాలా ఉత్పత్తులు మరియు యాడ్-ఆన్‌లు ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అత్యంత ప్రాథమిక థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ కవరేజ్‌తో ప్రారంభమయ్యే వివిధ రకాల స్కూటర్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను అందిస్తుంది. మీరు ఒక సంవత్సరం లేదా బహుళ-సంవత్సర పాలసీ కోసం చూస్తున్నా, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మీకు అనువైన కవరేజీని అందిస్తుంది. కొత్త స్కూటర్ల కోసం ఐదు సంవత్సరాల థర్డ్-పార్టీ వారెంటీ కూడా అందించబడుతుంది. అంతేకాకుండా, మీరు ఒక సంవత్సరం లేదా బహుళ-సంవత్సర సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటే తప్ప, మీరు స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఎంచుకోవచ్చు.
మీ స్వంత బైక్‌కు మరియు థర్డ్-పార్టీ వ్యక్తికి లేదా ఆస్తికి నష్టం జరగకుండా సర్వత్రా రక్షణ కావాలని కోరుకుంటే ఇది మీకు ఒక అనువైన ప్యాకేజీ. మీరు ఒకటి, రెండు లేదా మూడు సంవత్సరాల వ్యవధి కోసం కవరేజీని ఎంచుకోవచ్చు. మహీంద్రా బైక్ ఇన్సూరెన్స్‌ను ప్రతి సంవత్సరం రెన్యూ చేసుకోవడంలోని అసౌకర్యాన్ని నివారించాలనుకుంటే, దానిని మూడు సంవత్సరాల పాటు సురక్షితం చేసుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము. ఈ పాలసీ వలన మరొక ప్రయోజనం ఏమిటంటే, అదనపు కవరేజ్ కోసం మీరు కావలసిన యాడ్-ఆన్‌లతో మీ మహీంద్రా టూ వీలర్ వెహికల్ ఇన్సూరెన్స్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు.
యాక్సిడెంట్, దొంగతనం, అగ్నిప్రమాదం మొదలైనవి.
పర్సనల్ యాక్సిడెంట్ కవర్
ప్రకృతి వైపరీత్యాలు
థర్డ్-పార్టీ లయబిలిటీ
యాడ్-ఆన్‌ల ఎంపిక
ఇది ఒక థర్డ్ పార్టీ వ్యక్తికి లేదా ఆస్తికి జరిగిన నష్టం, గాయం, వైకల్యం లేదా డ్యామేజ్ ఫలితంగా తలెత్తే ఏవైనా చట్టపరమైన బాధ్యతల నుండి మిమ్మల్ని ఆర్థికంగా రక్షిస్తుంది. భారతీయ రోడ్లపై వాహనం నడపడం కోసం ఇది ఒక చట్టపరమైన బాధ్యత లాంటిది, మీరు సరైన మహీంద్రా థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ లేకుండా రోడ్డుపై రైడ్ చేసినట్లయితే, మీకు ₹2000 వరకు జరిమానా విధించబడుతుంది.
పర్సనల్ యాక్సిడెంట్ కవర్
థర్డ్-పార్టీ ఆస్తి నష్టం
థర్డ్-పార్టీ వ్యక్తికి ఏర్పడిన గాయాలు
మీరు ప్రస్తుతం మహీంద్రా బైక్ థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉన్నట్లయితే ఈ ప్లాన్ అదనపు రక్షణను అందిస్తుంది.
యాక్సిడెంట్, దొంగతనం, అగ్నిప్రమాదం మొదలైనవి
ప్రకృతి వైపరీత్యాలు
యాడ్-ఆన్‌ల ఎంపిక
మీరు ఇప్పుడే ఒక కొత్త బైక్‌ను కొనుగోలు చేసినట్లయితే, ఈ ప్లాన్ మీ బైక్‌కు జరిగే ఏవైనా నష్టాలకు ఒక సంవత్సరం పాటు కవరేజీని అందిస్తుంది, అలాగే, మీ బైక్ కారణంగా థర్డ్ పార్టీకి జరిగిన నష్టాలకు లేదా గాయాలకు ఐదు సంవత్సరాల కవరేజిని అందిస్తుంది. ఇది కొత్త బైక్ యజమానులందరికీ ఒక గొప్ప పెట్టుబడి.
యాక్సిడెంట్, దొంగతనం, అగ్నిప్రమాదం మొదలైనవి
ప్రకృతి వైపరీత్యాలు
పర్సనల్ యాక్సిడెంట్
థర్డ్-పార్టీ లయబిలిటీ
యాడ్-ఆన్‌ల ఎంపిక
మీ మహీంద్రా మోటార్‌సైకిల్ కోసం మీరు ఎంచుకున్న పాలసీ ద్వారా కవరేజ్ పరిధి నిర్ణయించబడుతుంది. పాలసీ థర్డ్-పార్టీ లయబిలిటీ కోసం అయితే, అది థర్డ్-పార్టీ వ్యక్తికి లేదా ఆస్తికి జరిగిన హానిని మాత్రమే కవర్ చేస్తుంది. మరోవైపు, ఒక సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ పాలసీ, ఈ క్రింది వాటిని కవర్ చేస్తుంది:
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఒక యాక్సిడెంట్ కారణంగా తలెత్తే ఏవైనా ఆర్థిక నష్టాలను కవర్ చేస్తుంది, కావున మీ పొదుపులు సురక్షితం చేయబడతాయి.
అగ్నిప్రమాదం లేదా పేలుళ్ల కారణంగా మీ బైక్ డ్యామేజ్ అయినా లేదా పనికిరాకుండా పోయినా దాని విలువ రీయంబర్స్ చేయబడుతుంది.
మీ మహీంద్రా బైక్ దొంగిలించబడితే, బైక్ యొక్క ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV) కోసం మేము మీకు రీయింబర్స్ చేస్తాము.
వరదలు, భూకంపాలు, తుఫానులు, అల్లర్లు మరియు విధ్వంసం వంటి వైపరీత్యాల కారణంగా మీ బైక్‌కు జరిగిన నష్టం కవర్ చేయబడుతుంది.
యాక్సిడెంట్ జరిగినప్పుడు, మీ మెడికల్ బిల్లులను చెల్లించడానికి ₹15 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ మీకు అందుబాటులో ఉంటుంది.
మీరు థర్డ్ పార్టీ వ్యక్తికి లేదా ఆస్తికి నష్టం కలిగించినట్లయితే లేదా గాయపరచినట్లయితే, మేము వారికి ఆర్థిక నష్టపరిహారం కోసం భద్రత కల్పిస్తాము.
నిరంతర కవరేజీని నిర్ధారించడానికి మీ మహీంద్రా బైక్ ఇన్సూరెన్స్ పాలసీని షెడ్యూల్ ప్రకారం రెన్యూ చేయడం చాలా కీలకం. మీరు కేవలం కొన్ని క్లిక్‌లతో మీ స్వంత ఇంటి సౌలభ్యం నుండి మీ పాలసీని సులభంగా రెన్యూ చేసుకోవచ్చు. తక్కువ సమయంలో మీ బైక్‌ను సురక్షితం చేసుకోవడానికి దిగువ ఇవ్వబడిన నాలుగు-దశలను అనుసరించండి!
భారతదేశంలో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో టూ-వీలర్ ఇన్సూరెన్స్ అనేది, ప్రఖ్యాత ఇన్సూరెన్స్ ప్రొవైడర్లలో ఒకటి. మార్కెట్లో అనేక సంస్థలు మహీంద్రా బైక్ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నాయి, కానీ మేము అందించే ఫీచర్లు, ప్రయోజనాలకు సాటి వచ్చేవి కొన్ని మాత్రమే. బైక్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అనేది AI మరియు యాప్ ఆధారిత క్లెయిమ్‌ల నుండి నగదురహిత గ్యారేజీల విస్తృత నెట్‌వర్క్, ఎమర్జెన్సీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ మరియు ఇంజిన్ ప్రొటెక్టర్ కవర్ వంటి నిర్దిష్ట యాడ్-ఆన్‌ల వరకు అనేక ఫీచర్లు అందిస్తూ ఇతరులతో పోలిస్తే ఒక అడుగు ముందుంటుంది. మమ్మల్ని ఎంచుకోవడానికి ఇక్కడ మరికొన్ని కారణాలు ఉన్నాయి:
బ్రేక్‌డౌన్ సమయంలో మేము కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉన్నాము. మీరు ఎక్కడ చిక్కుకుపోయారనే దానితో సంబంధం లేకుండా, మా 24-గంటల రోడ్ సైడ్ అసిస్టెన్స్ బ్రేక్‌డౌన్ సమస్యలను పరిష్కరించడంలో మీకు సహాయం చేస్తుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్లెయిమ్స్ పాలసీ చాలా సరళమైనది మరియు సులభమైనది. మేము స్వీకరించే దాదాపు 50% క్లెయిమ్‌లను అదే రోజున ప్రాసెస్ చేస్తాము. అలాగే, మేము పేపర్‌లెస్ క్లెయిమ్ ఆప్షన్ మరియు సెల్ఫ్-ఇన్స్పెక్షన్ ఆప్షన్‌ను కూడా కలిగి ఉన్నాము.
చిన్న ప్రమాదాల కోసం మా ఓవర్‌నైట్ రిపేర్ సర్వీస్‌తో మీ బైక్‌ను రిపేర్ చేయించుకోవడానికి తెల్లవారుజాము వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీరు రాత్రిపూట నిద్రను కోల్పోకుండా, మరుసటి ఉదయాన్నే మీ రిపేర్ చేయబడిన వాహనాన్ని తిరిగి మంచి స్థితిలో స్వీకరించవచ్చు.
భారతదేశ వ్యాప్తంగా ఉన్న హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి 2000+ నెట్‌వర్క్ గ్యారేజీలతో, మీ బైక్‌ను యథా స్థితిలో పొందడానికి మీరు ఎల్లప్పుడూ మీ సమీప ప్రాంతంలోని ఒక నెట్‌వర్క్ గ్యారేజీని గుర్తించవచ్చు.